ప్రభుత్వ స్కూళ్లను బలోపేతం చేద్దాం: యూటీఎఫ్ | Will strengthen to Governement schools | Sakshi
Sakshi News home page

ప్రభుత్వ స్కూళ్లను బలోపేతం చేద్దాం: యూటీఎఫ్

Published Tue, Feb 18 2014 12:33 AM | Last Updated on Sat, Sep 15 2018 4:26 PM

Will strengthen to Governement schools

సాక్షి, హైదరాబాద్: పాఠశాల విద్యను బలోపేతం చేయాలనే నినాదంతో ఈ ఏడాది మార్చి నుంచి జూన్ 15 వరకు విద్యావికాస వేదిక పేరిట కార్యక్రమాలు నిర్వహించాలని యూటీఎఫ్ రాష్ట్ర కార్యవర్గం నిర్ణయించింది. ఇందుకోసం ఒక కార్యాచరణను ఖరారు చేసింది. సంఘం కార్యవర్గ సమావేశం సోమవారమిక్కడ సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో జరిగింది. సంఘం రాష్ట్ర గౌరవాధ్యక్షుడు నారాయణ, అధ్యక్షుడు నర్సిరెడ్డి, ప్రధాన కార్యదర్శి విజయగౌరి హాజరయ్యారు.
 
 సమావేశంలో చేసిన తీర్మానాలివీ: పాఠశాల నిర్వహణలో స్కూల్ మేనేజ్‌మెంట్ కమిటీ భాగస్వామ్యం పెంచాలి. ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలలు 40కి మించి ఉన్న మండలాలకు ఇద్దరు ఎంఈవోలను నియమించాలి. సక్సెస్ ఉన్నత పాఠశాలల్లో ఇంగ్లిష్ మీడియం బోధనకు ఏడుగురు సబ్జెక్ట్ టీచర్లను ప్రత్యేకంగా నియమించాలి. బడికి రాలేని పేద విద్యార్థుల కుటుంబాలకు ఆర్థికంగా చేయూతనివ్వాలి.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement