కలగానే కార్పొరేట్ విద్య..!
ఇందూరు: పేద విద్యార్థులు సైతం కా ర్పొరేట్ కళాశాలల్లో చదవా లి.. ఉన్నతంగా ఎదగాలన్న ఉద్దేశంతో దివంగత ము ఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రవేశపెట్టిన కా ర్పొరేట్ కళాశాలల్లో ఉ చిత విద్య పథకం మ సకబారుతోంది. బ డుగు, బలహీనవర్గా ల విద్యార్థులకు వసతితో కూడిన ఉచిత విద్య అందని ద్రాక్షలా మారుతోంది. పదోతరగతిలో ప్రతిభ కనబర్చిన పేద విద్యార్థులకు ఇంటర్మీడియట్‌లో నాణ్యమైన విద్యను అం దించేందుకు ఈ పథకాన్ని ప్రవేశపెట్టారు.
వైఎస్ హయాంలో సకాలంలో విద్యార్థుల ను ఎంపిక చేసి కార్పొరేట్ కళాశాలల్లో చేర్పించేవారు. అనంతరం ఈ పథకం అమలులో జాప్యం పెరుగుతూ వస్తోంది. విద్యాసంవత్సరం ప్రారంభమై.. తరగతులు నడుస్తున్నా.. విద్యార్థుల ఎంపికను మాత్రం చేపట్టడం లేదు. ఓ వైపు తరగతులు కొనసాగుతుండటం.. కళాశాలల్లో సీట్లు నిండిపోతుండటంతో పేద విద్యార్థులు ఈ పథకానికి దూరమవుతున్నారు. చేసేది లేక ఏదో కళాశాలలో చేరుతున్నారు.
సమయానికి నోచుకోక
2014-15 విద్యాసంవత్సరానికి సంబంధించి జిల్లా లో ప్రభుత్వ, ప్రైవేటు కళాశాలలలో ఈపాటికే ప్రవేశాలు 80శాతం పూర్తయ్యాయి. తరగతులు కూడా ప్రారంభం కానున్నాయి. పేద విద్యార్థుల కోసం కా ర్పొరేట్ కళాశాలలల్లో కేటాయించిన సీట్లపై మాత్రం ఇంకా ఎలాంటి సమాచారం లేదు. ప్రతి సంవత్సరం జూన్ మొదటి వారంలో ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులకు నోటిఫికేషన్ జారీ చేసి, విద్యార్థుల దరఖాస్తులు ఆహ్వానించాలి. ఈవిషయంలో ప్రభుత్వం జాప్యం చేస్తుండటంతో నెలరోజులు ఆలస్యంగా పేద విద్యార్థులు తరగతి గదిలో కాలు పెట్టాల్సి పరిస్థితి.
మిగిలిపోతున్న సీట్లు
ఎస్సీ,ఎస్టీ,బీసీ,మైనార్టీ కలిపి జిల్లాకు మొత్తం 183 సీట్లు ఉన్నాయి. ఇందులో బాలికలకు 110, బాలురకు 73 సీట్లుగా విభజించారు. ప్రతిఏటా సకాలంలో నోటిఫికేషన్ ఇవ్వకపోవడంతో చాలామంది విద్యార్థులు తప్పనిసరి పరిస్థితుల్లో ఫీజులు వెచ్చించి ప్రైవేటు కళాశాలలో ప్రవేశాలు పొందుతున్నారు. దీంతో ఈ పథకానికి సంబంధించి పదుల సంఖ్యలో సీట్లు ఖాళీగానే మిగిలిపోతున్నాయి. ఈ పథకంపైనే ఆశలు పెట్టుకుని ఉన్న విద్యార్థులు తరగతులు ప్రారంభమైన నెలరోజులకు కళాశాలల్లో ప్రవేశిస్తున్నారు. దీంతో చాలా సబ్జెక్టుల్లో వారు వెనుకబడుతున్నారు. విద్యార్థులు ఆలస్యంగా ప్రవేశాలు పొందుతున్నా వసతికి అయ్యే ఖర్చును లెక్కకడుతూ సంబంధిత కళాశాలలు లబ్ధి పొందుతున్నాయి.
సాంకేతిక లోపంతోనే
విద్యార్థుల నుంచి ఆన్‌లైన్‌లో ఈ-పాస్ ద్వారా దరఖాస్తులను ఆహ్వానిస్తారు. ఈ సైట్‌లో సాంకేతిక లో పం తలెత్తడంతోనే కార్పొరేట్ ఉచిత విద్య పథకానికి బ్రేక్ పడిందని అధికారులు పేర్కొంటున్నారు. రాష్ట్రస్థాయి అధికారులు స్పందిస్తేనే సమస్య పరిష్కారమవుతుందని జిల్లా అధికారులు పేర్కొంటున్నారు. నో టిఫికేషన్ జారీ చేసిన పక్షం రోజుల్లో సీట్లు భర్తీ చే యాల్సి ఉంటుంది. జిల్లాలో పేదవిద్యార్థులకు కార్పొరేట్ విద్యను అందించేందుకు శ్రీ కాకతీయ, న్యూ కా కతీయ, శాంకరీ, నిర్మల హృదయ, క్షత్రియ జూని యర్ కళాశాలలను ఎంపిక చేసినట్లు అధికారులు తె లిపారు. ప్రభుత్వం త్వరగా నోటిఫికేషన్ జారీ చేయాలని లేదంటే తరగతులు కోల్పోవాల్సి వస్తుందని విద్యార్థులు, వారి తల్లిదండ్రులు కోరుతున్నారు.