corporate college
-
హాస్టల్ మూసివేసినా మెస్ బిల్ కట్టాలట!
ఓ ప్రైవేటు కార్పొరేట్ కళాశాల కరోనా సమయంలోనూ విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి వివిధ రకాల ఫీజులు పేరుతో వసూళ్లకు తెగబడుతోంది. నీట్ పరీక్షలు సమీపిస్తుండడంతో ఆ కళాశాల యాజమాన్యం విద్యార్థులకు మెస్సేజ్‌లు పంపి బ్లాక్మెయిల్ చేస్తోంది. హాస్టల్ మూసివేసినా మెస్ బిల్ కట్టాలని, లేకపోతే మెటీరియల్, బట్టలు, సర్టిఫికెట్లు ఇవ్వమంటూ బెదరగొడుతుండడంతో విద్యార్థులు ఆందోళన చెందుతున్నారు. సాక్షి, తిరుపతి : తెలుగుదేశం పార్టీ నాయకునికి చెంది జిల్లావ్యాప్తంగా ఉన్న ప్రముఖ కార్పొరేట్ కళాశాల శాఖల్లో సుమారు 12వేల మంది విద్యార్థులు ఇంటర్ ద్వితీయ సంవత్సరం పూర్తి చేసుకున్నారు. కరోనా కేసుల నేపథ్యంలో మార్చి 22 నుంచి కళాశాల, వసతి గృహాలను మూసివేసి విద్యార్థులను వారి ఇళ్లకు పంపేశారు. హాస్టల్లో ఉన్న మెటీరియల్, వివిధ సర్టిఫికెట్స్, బట్టలు తీసుకెళ్లాల్సిన అవసరం లేదని చెప్పి పంపేశారు. కరోనా ఉధృతి తగ్గకపోవడంతో కళాశాలలు తెరుచుకోలేదు. విద్యార్థులు ఇళ్ల వద్దే ఉండిపోవడంతో కొన్ని రోజుల తరువాత ఆన్లైన్ క్లాసులు నిర్వహించారు.ఇందుకు ప్రత్యేకంగా ఫీజులు కూడా వసూలు చేశారు. భోజనం పెట్టకపోయినా మెస్ బిల్లులు కట్టాలట! లాక్ డౌన్ నేపథ్యంతో కళాశాలలు, వసతి గృహాలు ఇప్పటివరకు తెరుచుకోలేదు. అయినా ఆ కళాశాల యాజమాన్యం లాక్డౌన్ సమయంలో కూడా మెస్ బిల్లులు చెల్లించాలంటూ విద్యార్థుల సెల్ఫోన్లకు మెసేజ్‌లు పంపడంతో బిత్తరపోయారు. అంతేకాకుండా మెస్ బిల్లు చెల్లిస్తే తప్ప హాస్టల్లో ఉన్న మెటీరియల్, గదుల్లోని బట్టలు, సర్టిఫికెట్లు తిరిగి ఇచ్చేది లేదని మెస్సేజ్ ఇవ్వడంతో హడలిపోయారు. నీట్ పరీక్షలకు స్టడీ మెటీరియల్ కోసం కళాశాల వద్దకెళితే హాస్టల్‌కి తాళాలు వేసి లోనికి వెళ్లనివ్వకుండా అడ్డుకుంటున్నారని విద్యార్థులు లబోదిబోమంటున్నారు. నాలుగు నెలలుగా ప్రదక్షిణలు చేస్తున్నా కళాశాల యాజమాన్యం తాను పట్టిన కుందేలుకు మూడే కాళ్లు అన్న చందాన తమను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తోందని వాపోయారు. మెస్ బిల్లులు చెల్లిస్తే తప్ప హాస్టల్లో ఉన్న వస్తువులు తిరిగి ఇచ్చేది లేదని తేల్చి చెబుతున్నారని ఆందోళన చెందుతున్నారు. సంబంధిత అధికారులు స్పందించి, ఆ కళాశాల యాజమాన్యంపై చర్యలు తీసుకుని తమకు న్యాయం చేయాలని విద్యార్థులు, వారి తల్లిదండ్రులు కోరుతున్నారు. -
ఎంసెట్ కేసులో మళ్లీ కదలిక
సాక్షి, హైదరాబాద్: ఎంసెట్ ప్రశ్నపత్రం లీకేజీ కేసులో సీఐడీ కీలక మందడుగు వేసినట్లు తెలిసింది. రెండు కార్పొరేట్ కాలేజీల కోసమే ప్రశ్నపత్రం లీకేజీ జరిగిందన్న విషయం వాసుబాబు (ఓ కాలేజీడీన్), శివనారాయణ (బ్రోకర్)ల అరెస్ట్‌తో ఇప్పటికే బయటపడగా రాగా దీనికి బలం చేకూర్చేలా ఇద్దరు వ్యక్తులకు సంబంధించిన ఆధారాలను సీఐడీ గుర్తించింది! ప్రముఖ కార్పొరేట్ కాలేజీకి చెందిన ఆ ఇద్దరు డైరెక్టర్లకు నోటీసులు జారీ చేసింది!! మీరు వస్తారా.. మమ్మల్నే రమ్మంటారా? ఈ కేసులో వాసుబాబు, శివనారాయణలతో లింకున్న మరో ముగ్గురు బ్రోకర్ల పాత్ర వెలుగులోకి రావడంతో చార్జిషీట్ దాఖలు చేసేందుకు సిద్ధమవుతున్న దశలో సీఐడీకి కీలక సమాచారం అందింది. బ్రోకర్ల కాల్ లిస్టులో ఓ కార్పొరేట్ కాలేజీకి చెందిన ఇద్దరి ఫోన్ నంబర్లు ఉండటం, ప్రశ్నపత్రం లీకేజీకి ముందు, ఆ తర్వాత కూడా వారి మధ్య సంబంధాలు కొనసాగినట్లు పక్కా ఆధారాలు లభించడంతో వారిద్దరికీ తాఖీదులు జారీ చేసి ఐదు రోజుల్లోగా విచారణకు హాజరు కావాల్సిందిగా ఆదేశించింది. అయితే ఈ కేసుతో తమకేం సంబంధం లేదంటూ తొలుత ఆ ఇద్దరు డైరెక్టర్లు బుకాయించేం దుకు ప్రయత్నించారు. ‘మీరు వస్తారా.. లేక మమ్మ ల్నే రమ్మంటారా’ అని అధికారులు స్పష్టం చేయడంతో విచారణకు హాజరయ్యేందుకు సమయం కావాలని వారు కోరినట్లు సీఐడీ వర్గాలు వెల్లడించాయి. అంతా వారిద్దరి కనుసన్నల్లోనే... ఆ కార్పొరేట్ సంస్థను ఏడేళ్ల నుంచీ ఆ ఇద్దరు డైరెక్టర్లే పర్యవేక్షిస్తున్నారు. అడ్మిషన్ల నుంచి ఫలితాల దాకా.. ఆపై సెలబ్రిటీలతో ఫొటోలకు పోజుల అపాయింట్మెంట్ల వరకు అన్నీ వారిద్దరి నేతృత్వంలోనే జరుగుతున్నాయి. ఆ సంస్థలో పేరుకు మరికొందరు డైరెక్టర్లు ఉన్నా పెత్తనం మాత్రం వారిద్దరిదే. వాసుబాబు, శివనారాయణలతోపాటు మరో ఇద్దరు బ్రోకర్లు... ఆ ఇద్దరి డైరెక్టర్లతో పదే పదే ప్రశ్నపత్రం లీకేజీ వ్యవహారం, బేరం కుదుర్చుకున్న రెండు కాలేజీలకు చెందిన 175 మంది విద్యార్థులను క్యాంపులకు తరలించడం వంటి అంశాలపై సంప్రదింపులు జరిపినట్లు సీఐడీ గుర్తించింది. వారిని విచారిస్తే మొత్తం స్కాం దర్యాప్తు పూర్తయినట్లేనని సీఐడీ భావిస్తోంది. 2013 నుంచే బ్రోకర్లతో లింకులు! కార్పొరేట్ కాలేజీ సంస్థకు చెందిన ఆ ఇద్దరికి, బ్రోకర్లకు మధ్య 2013 నుంచి లింకులున్నట్లు సీఐడీ గుర్తించింది. 2015లో ఎంసెట్–1, ఎంసెట్–2 ప్రశ్నపత్రం స్కాం బయటకు వచ్చినప్పటికీ అంతకుముందు ఒకే ఎంసెట్ పరీక్ష కావడంతో పేపర్ లీక్ వ్యవహారం బయటపడకపోయి ఉండొచ్చ ని అధికారులు అనుమానిస్తున్నారు. దీంతో ఇద్దరు డైరెక్టర్లను ప్రశ్నిస్తే అసలు కథ వెలుగులోకి వస్తుందని చెబుతున్నారు. దర్యాప్తుకు బ్రేక్ వేయాలంటూ ఒత్తిళ్లు? ఎంసెట్ పేపర్ లీకేజీ కేసులో ఇద్దరి పేర్లు బయటపడటంతో పవర్ సెంటర్ల నుంచి తీవ్ర ఒత్తిడి వస్తున్నట్లు సీఐడీ వర్గాలు పేర్కొన్నాయి. ఆ ఇద్దరు కాలేజీ డైరెక్టర్లను విచారణకు హాజరుకావాలని ఆదేశించిన మర్నాటి నుంచి పోలీసు ఉన్నతాధికారులు, పలువురు ఐపీఎస్‌ల నుంచి దర్యాప్తు అధికారులకు ఫోన్లు వస్తున్నట్లు తెలుస్తోంది. గుడ్డు మీద ఈకలు ఏరడం ఆపాలంటూ ఓ ఐపీఎస్ చిందులు తొక్కినట్లు సీఐడీలో చర్చ జరుగుతోంది. దర్యాప్తు ఆపేసి చార్జిషీట్ వేసే ప్రక్రియ చూసుకోవాలని వార్నింగ్ సైతం ఇచ్చినట్లు ఆ వర్గాలు స్పష్టం చేశాయి. మరోవైపు ఈ కేసు దర్యాప్తు చేస్తున్న అధికారిని బదిలీ చేసేందుకు కార్పొరేట్ కాలేజీల మాఫియా ప్రయత్నాలు ముమ్మరం చేసినట్లు తెలిసింది. ఈ విషయంలో ప్రభుత్వ పెద్దలతోపాటు ఉన్నతాధికారులపై ఒత్తిడి తెస్తున్నట్లు పోలీస్‌శాఖలో చర్చ జరుగతోంది. జేఎన్టీయూలో పనిచేసిన అధికారిపైనా అనుమానం జేఎన్టీయూలో కీలకంగా పనిచేసిన ఓ అధికారిని సైతం సీఐడీ అనుమానిస్తోంది. ఇందులో భాగంగానే గత వారంలో రెండుసార్లు ఆయన్ను సీఐడీ కార్యాలయానికి పిలిపించి ప్రశ్నించింది. ప్రశ్నపత్రం రూపొందించిన వారి జాబితా, ప్రశ్నపత్రం ప్రింటింగ్‌కు ఇచ్చే సమయంలో తీసుకున్న జాగ్రత్తలు, కమిటీలో ఉన్న సభ్యులు, టెండర్ తదితర వివరాలన్నింటిపై సుదీర్ఘంగా వివరాలు సేకరించినట్లు దర్యాప్తు అధికారి ఒకరు ‘సాక్షి’కి చెప్పారు. ఢిల్లీ సెక్యూరిటీ ప్రింటింగ్ ప్రెస్‌లో ప్రశ్నపత్రం ముద్రణ జరుగుతున్న విషయం ఎలా లీకైందన్న అంశంపైనే తాము దృష్టి సారించామని, అది తేలితే దర్యాప్తులో కీలక దశను చేరుకున్నట్లేనని అధికారులు భావిస్తున్నారు. -
అమ్మ, చెల్లి జాగ్రత్త నాన్నా..!
సాక్షి, విజయవాడ : విజయవాడ గురునానక్ కాలనీలో విషాదం చోటుచేసుకుంది. ఓ ఇంటర్ విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. వివరాలివి.. నితిన్ కుమార్ శ్రీచైతన్య కాలేజీలో జూనియర్ ఇంటర్ చదువుతున్నాడు. అతను కాలేజీలో ఉరివేసుకుని తనువు చాలించాడు. ఈ ఘటన మయూరీ కాంప్లెక్స్‌లోని శ్రీ చైతన్య కాలేజీలో శుక్రవారం జరిగింది. నితిన్ ఆత్మహత్యకి ముందు సూసైడ్ లెటర్ కూడా రాసినట్లు తెలుస్తోంది. అమ్మ, చెల్లిని జాగ్రత్తగా చూసుకోమని తండ్రికి లేఖ రాశాడు. విద్యార్థి స్వస్థలం కృష్ణా జిల్లాలోని మొగల్రాజుపురం అని సమాచారం. కార్పొరేట్ కాలేజీల్లో వరుసగా విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. విద్యార్థులపై ఒత్తిడి కారణంగా ఈ విధమైన నిర్ణయాలు తీసుకుంటున్నారని విశ్లేషకులు భావిస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
సారీ మమ్మీ.. సారీ డాడీ
-
సారీ మమ్మీ.. సారీ డాడీ
సారీ మమ్మీ... సారీ డాడీ.. ఐ మిస్ యూ సోమచ్.. బై సన్నీ.. టెన్త్‌లో మంచి మార్కులు తెచ్చుకో..బై అక్కా.. బాగా చదివి గ్రూప్స్ సాధించి నాన్నకు మంచి పేరు తీసుకురా.. నాకోసం వెతకొద్దు ప్లీజ్..వేస్ట్ నారాయణ కాలేజీ... క్లోజ్ ది నారాయణ కాలేజీ... నారాయణ కాలేజీ కిల్లింగ్ ద స్టూడెంట్స్ టు రీడ్... సో ప్లీజ్ హెల్ప్ ద స్టూడెంట్స్ ఫ్రం నారాయణ. దే ఆర్ ఆర్ సఫరింగ్ ఇన్ దిస్ కాలేజీ, హాస్టల్... సారీ మమ్మీడాడీ .’ ఇది హైదరాబాద్ నారాయణ కాలేజీలో చదువుతూ తాజాగా అదృశ్యమైన విద్యార్థిని సాయి ప్రజ్వల వేదన.. కార్పొరేట్ కాలేజీల ఒత్తిడికి తట్టుకోలేక ఇంటర్ విద్యార్థులు ఎలా రాలిపోతున్నారో ప్రత్యక్ష నిదర్శనం ఈ లేఖ. ఈ మూడేళ్లలో ఏకంగా 60 మంది విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడటం నారాయణ తదితర కార్పొరేట్ కాలేజీల్లో నెలకొన్న తీవ్ర ఒత్తిళ్లను స్పష్టం చేస్తోంది. సాక్షి, అమరావతి: కార్పొరేట్ కాలేజీల ధనదాహానికి, చదువుల ఒత్తిడికి అమాయక విద్యార్థులు నేల రాలిపోతున్నారు. నారాయణ, చైతన్య కాలేజీల్లో భరించలేనంత ఒత్తిడికి గురై నిండు నూరేళ్ల జీవితాలను అర్థంతరంగా ముగిస్తున్నారు. మొన్న కృష్ణా జిల్లా గూడవల్లిలో... నిన్న విజయవాడలో... నేడు హైదరాబాద్‌లో ఓ విద్యార్థిని ఒత్తిడికి తట్టుకోలేక అదృశ్యమైంది. హైదరాబాద్ సమీపంలోని బండ్లగూడ నారాయణ కాలేజీలో బైపీసీ లాంగ్ టర్మ్ కోచింగ్ తీసుకుంటున్న విద్యార్థిని సాయి ప్రజ్వల కొద్ది రోజులుగా కనిపించటం లేదు. కరీంనగర్ జిల్లా గోదావరి ఖని మండలం అడ్డగుంటపల్లికి ఆమె తల్లిదండ్రులు ప్రజ్వల తీవ్ర ఒత్తిడికి గురవుతున్నట్లు గుర్తించి కొద్ది రోజుల క్రితం నగరంలోని బంధువుల ఇంటికి తీసుకెళ్లారు. అనంతరం విద్యార్థిని నారాయణ కాలేజీలో తీవ్ర ఒత్తిడికి గురవుతున్నట్లు లేఖ రాసి కనిపించకుండా పోయింది. కాలేజీలో ఏదో జరగటం వల్లే తమ బిడ్డ వెళ్లిపోయిందని విద్యార్థిని తండ్రి విద్యాగిరి శ్రీనివాస్ ఆరోపించారు. ఇటీవల కడప నారాయణ కాలేజీలో పావని అనే విద్యార్థిని ఆత్మహత్య చేసుకోవడం తెలిసిందే. ఒక్క ఈ వారం పది రోజుల్లోనే 8 మంది ఆత్మహత్య చేసుకున్నారంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో బోధపడుతోంది. ఈ మూడేళ్లలో ఒక్క ఏపీలోనే 60 మంది ఇంటర్ విద్యార్ధులు ఆత్మహత్యలకు పాల్పడినా ప్రభుత్వంలో చలనం లేదు. కార్పొరేట్ కాలేజీలకు ప్రభుత్వం వంత పాడుతుండడమే పరిస్థితి ఇంతగా దిగజారడానికి కారణం. అడ్మిషన్ల నుంచే అవకతవకలు కార్పొరేట్ కాలేజీల్లో ఇంటర్ విద్యార్ధుల ఆత్మహత్యలు రోజురోజుకూ పెరిగిపోవడానికి ప్రధాన కారణం విచ్చలవిడిగా అడ్మిషన్లు చేపట్టటమే. విద్యార్థుల సంఖ్యకు తగ్గట్టుగా మౌలిక సదుపాయాలు, బోధించే వారిని నియమించకుండా ధన దాహంతో వ్యవహరిస్తున్నాయి. కాసుల కక్కుర్తితో ఇరుకు గదుల్లో విద్యార్ధులను కుక్కుతున్నాయి. ఇద్దరు లేదా ముగ్గురికి మాత్రమే సరిపోయే గదిలో ఏకంగా 8 నుంచి 10 మందిని కూర్చోబెడుతున్నాయి. కాలేజీలకు అడ్మిషన్ల సమయంలో సైన్సు, ఆర్ట్స్ తరగతులకు రెండేసి సెక్షన్లకు మాత్రమే అనుమతిస్తారు. నిబంధనల ప్రకారం ఒక్కో తరగతిలో 80 మందిని చేర్చుకోవచ్చు. ఇలా తొలుత నాలుగు సెక్షన్లకు 320 మంది విద్యార్థుల కోసం వసతులు చూపించి అనుమతులు పొందుతున్న కార్పొరేట్ కాలేజీలు ఆ తరువాత 10 శాతం వెసులుబాటును ఆసరాగా చేసుకొని మరింత మందిని చేర్చుకుంటున్నాయి. అవే వసతుల్లో అదనపు విద్యార్థులను కుక్కుతున్నాయి. వసతులు లేకుండా మరో 9 సెక్షన్లను ఏర్పాటు చేసి ప్రవేశాలు కల్పిస్తున్నాయి. ఇలా మరో 720 మందితో పాటు అదనంగా మరో 10 శాతం నిబంధనతో విద్యార్థులను ఇబ్బడి ముబ్బడిగా చేర్చుకుంటున్నాయి. దీనికితోడు మరి కొంత మందిని పరీక్షల సమయంలో వేరే కాలేజీ విద్యార్ధుల కింద చూపించి పరీక్షలు రాయిస్తున్నాయి. కార్పొరేట్ కాలేజీల్లో ఒక్కో క్యాంపస్‌లో ఇరుకిరుకు గదుల్లో 2,500 మంది నుంచి 3 వేల మంది వరకు విద్యార్థులు ఉంటున్నారు. ముందు చూపించిన కొద్ది మంది బోధకులతోనే ఈ వేలాది మంది పిల్లలకు బోధన చేయిస్తున్నారు. మరోవైపు నిబంధనల ప్రకారం ఒక్కో విద్యార్థి నుంచి ఏడాదికి ట్యూషన్ ఫీజు కింది రూ.2,800 వరకు వసూలు చేయాల్సి ఉండగా రూ. 40,000 నుంచి రూ. లక్ష వరకూ గుంజుతున్నారు. హాస్టల్లో ఉంటే దీనికి మరో రూ. లక్ష అదనం. ఇంటర్ బోర్డుపై కార్పొరేట్‌దే పెత్తనం గాలి వెలుతురు లేని ఇరుకు గదులు, అపరిశుభ్ర వాతావరణంలో విద్యార్ధులు మగ్గిపోతున్నారు. ఈ వ్యవహారాలన్నీ తెలిసినా కార్పొరేట్ కాలేజీల యాజమాన్యాలు, ప్రభుత్వ పెద్దలకు ఉన్న సంబంధ బాంధవ్యాలతో ఇంటర్ బోర్డు ఏమీ చేయలేని పరిస్థితి నెలకొంది. స్వయంగా నారాయణ విద్యాసంస్థల అధిపతి పి.నారాయణ కేబినెట్ మంత్రిగా ఉండగా ఆయన వియ్యంకుడు గంటా శ్రీనివాసరావు విద్యాశాఖ మంత్రిగా వ్యవహరిస్తున్నారు. దీంతో ఉన్నతాధికారులు ఏమీ చేయలేకపోతున్నారు. రాష్ట్రంలో 3,500 వరకు జూనియర్ కాలేజీలు ఉండగా ఇందులో 525 మాత్రమే ప్రభుత్వ కాలేజీలు. తక్కిన కాలేజీలన్నీ కార్పొరేట్, ప్రైవేట్ యాజమాన్యాల చేతుల్లో ఉన్నవే. ప్రభుత్వ కాలేజీల్లో 3 లక్షల మంది విద్యార్ధులు చదువుతుండగా ప్రైవేట్ కాలేజీల్లో 7 లక్షల మంది చదువుతున్నారు. ఇంటర్మీడియెట్ బోర్డులో ఈ కాలేజీలదే పెత్తనంగా మారింది. సొంత సిలబస్... కార్పొరేట్ కాలేజీలు ప్రభుత్వం రూపొందించిన సిలబస్‌ను పట్టించుకోకుండా తమ సొంత సిలబస్‌ను బోధిస్తున్నాయి. జేఈఈ మెయిన్స్, అడ్వాన్సుడ్, ఎంసెట్, నీట్ సహా ఇతర పరీక్షలకు వాటి దారి వాటిదే. పరీక్షలకు నెలన్నర ముందు మాత్రమే ఇంటర్ సిలబస్‌ను బోధిస్తున్నాయి. పదో తరగతి పాసై వచ్చిన విద్యార్థికి ఇంటర్ పాఠాలతో బోధన ప్రారంభిస్తే కొంతమేర అవగాహన ఏర్పడుతుంది. కానీ ప్రారంభంలోనే జేఈఈ, నీట్ లాంటి పోటీ పరీక్షల సిలబస్‌ను బోధిస్తుండడంతో విద్యార్ధులు బెంబేలెత్తిపోతున్నారు. రోజువారీ... వారాంతపు పరీక్షలతో ఒత్తిడి పదో తరగతి వరకు ఆటపాటలతోనో, ఒకింత స్వేచ్ఛగా చదివిన విద్యార్ధులు ఒక్కసారిగా పెరిగిన సిలబస్, ఆపై పోటీ పరీక్షల బోధనతో తీవ్ర ఒత్తిడికి లోనవుతున్నారు. కార్పొరేట్ కాలేజీల్లో రోజువారీ, వారాంతపు పరీక్షలు నిర్వహిస్తున్నాయి. అందులో వచ్చే మార్కులను అనుసరించి విద్యార్ధులను వేర్వేరు సెక్షన్లలోకి మార్పులు చేస్తున్నారు. ఒకవారం ఒక సెక్షన్లో ఉంటే మరో వారం మరో సెక్షన్లోకి వెళ్లాల్సి స్తోంది. దీంతో బోధకులు కూడా మారిపోతుండడం, పాఠ్యాంశాలు కూడా మారిపోతుండడంతో తీవ్ర గందరగోళానికి గురవుతున్నారు. అర్హతలు లేని వారిని లెక్చరర్లుగా, వైస్ ప్రిన్సిపాళ్లుగా... సరైన అర్హతలు లేని వారిని లెక్చరర్లు, వైస్‌ప్రిన్సిపాళ్లుగా నియమిస్తున్నారు. కనీసం సబ్జెక్టు గురించి అవగాహన లేని వారిని తీసుకోవటంతో విద్యార్ధులకు వచ్చే సందేహాలు కూడా తీర్చలేకపోతున్నారు. కొన్ని సందర్భాల్లో తమ బలహీనతలు బయటపడకుండా ఉండడానికి ఇతరుల ముందే విద్యార్ధులను తిట్టడం, కొట్టడం ఇతర విపరీత చేష్టలకు లెక్చరర్లు దిగుతున్నారు. ఇది కూడా విద్యార్ధుల్లో అవమానానికి, ఆత్మన్యూనతకు దారితీస్తోంది. ఆయా లెక్చరర్లకు ఇచ్చే వేతనాలు రూ.9 వేల లోపే ఉండడంతో యాజమాన్యంపై కోపాన్ని విద్యార్ధులపై చూపిస్తున్నారు. ఇంటర్బోర్డులో అరకొరగా సిబ్బంది.... కార్పొరేట్ కాలేజీలపై పర్యవేక్షణకు ఇంటర్ బోర్డులో తగినంత మంది సిబ్బంది లేరు. జిల్లాకొక ఆర్ఐవో పోస్టు ఉన్నా అందులో చాలావరకు ఖాళీగానో, ఇన్‌ఛార్జులతోనో నడుస్తున్నాయి. వారికింద సిబ్బంది లేరు. ఇక ఇంటర్ సగానికి పైగా పోస్టులు భర్తీ కాకుండా ఖాళీగా ఉన్నాయి. రాష్ట్ర విభజన అనంతరం బోర్డులో ఎక్కువ శాతం మంది తెలంగాణకు వెళ్లిపోగా ఏపీలో నియామకాలు మాత్రం చేపట్టలేదు. దీంతో బోర్డులో ఒక్కో అధికారి నాలుగైదు బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. ఈ నేపథ్యంలో పర్యవేక్షణ పూర్తిగా కరువైంది. కాలకృత్యాలూ తీర్చుకోలేకపోతున్న విద్యార్ధులు చదువుల ఒత్తిడితో దొరికిన కొద్ది సమయంలోనే కాలకృత్యాలు తీర్చుకోవలసిన దుర్గతిలో విద్యార్ధులుంటున్నారు. ఇక హాస్టళ్లలో యాజమాన్యాలు అందించే ఆహారం చాలా నాసిరకం. దాదాపు ఏకబిగిన రెండు గంటలసేపు సాగే స్టడీ అవర్‌లో వారు సూచించిన సబ్జెక్టును మాత్రమే విద్యార్ధులు చదవాలి. ఇష్టం లేకున్నా అవే పుస్తకాలు పట్టుకొని తీవ్ర మనస్తాపంతో జీవితంపై అనాసక్తి ఏర్పరచుకుంటున్నారు. వారానికో, నెలకో వచ్చే తల్లిదండ్రులను నిమిషాల వ్యవధిలోనే హడావుడిగా పంపేస్తున్నారు. -
కార్పోరేట్ కాలేజీలో ఇంటర్ విద్యార్ధిని ఆత్మహత్య
-
విధుల్లో ఉన్నట్టా..లేనట్టా..?
►అయోమయంలో కాంట్రాక్ట్ అధ్యాపకులు ►నేటికీ అందని రెన్యువల్ ఉత్తర్వులు ►వేతనాల పెంపు, క్రమబద్ధీకరణపై లేని స్పష్టత ►ప్రభుత్వ కళాశాలల్లో కుంటుపడుతున్న విద్యాబోధన ►పట్టించుకోని పాలక పక్షం కందుకూరు రూరల్: విద్యార్థి దశలో కీలకమైన ఇంటర్మీడియెట్ విద్య ఇప్పటికే కార్పొరేట్ కళాశాలల గుప్పిట్లోకి వెళ్లింది. ఉత్తమ ఫలితాలతో విద్యార్థుల ఆదరణతో ప్రైవేటు కళాశాలల పోటీని తట్టుకొని నిలబడిన ప్రభుత్వ కళాశాలలను ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో విద్య కుంటుపడుతోంది. బోధకుల నియామకంలో నెలకొన్న జాప్యం ప్రభావం విద్యార్థుల చదువులపై తీవ్రంగా పడుతోంది. కాంట్రాక్ట్ అధ్యాపకులు ఈ విద్యా సంవత్సరం కూడా కొనసాగేలా నేటికీ రెన్యువల్ ఉత్తర్వులు విడుదల కాలేదు. విద్యా సంవత్సరం ప్రారంభమైన రెండు నెలలు గడుస్తున్నా జీవో రాని కారణంగా కాంట్రాక్ట్ అధ్యాపకులు అయోమయంలో పడ్డారు. తాము విధులకు వెళ్లాలా..? వెళ్ల కూడదా...? ప్రభుత్వం వేతనాలు ఇస్తుందా...? ఇవ్వదా..? క్రమబద్ధీకరణ కొలిక్కి తెస్తుందో...? లేదో..? తెలియని అయోమయ స్థితిలో ఉన్నారు. ప్రైవేటు జూనియర్ కళాశాలలు పశుపక్షాదులకు కూడా విద్యుత్ షాక్ తప్పటం లేదు. నెలలో జిల్లాలో ఏదోఒక మూల విద్యుత్ షాక్‌కు పశువులు మృతి చెందాయనో...లేక విద్యుత్ సిబ్బంది, ప్రైవేటు ఎలక్ట్రీషియన్లు ప్రమాదాలకు గురై చనిపోతూనే ఉన్నారు. ఒక్కమాటలో చెప్పాలంటే విద్యుత్ లైన్లు యమపాశాలుగా మారాయి. ఏళ్ల తరబడి ఒకే లైన్లు: జిల్లాలో విద్యుత్ లైన్లు ఏళ్ల తరబడి మార్చకుండా పాత కండక్టర్‌తోనే కాలం గడుపుతున్నారు. దీంతో చిన్నపాటి గాలికే విద్యుత్ తీగలు ఎక్కడికక్కడ తెగి నేలపడుతున్నాయి. ఏళ్ల తరబడి విద్యుత్ స్తంభాలు మార్చకుండా ఉండటంతో ఎప్పుడు పడితే అప్పుడు విరిగి కిందపడుతున్నాయి. అయితే విద్యుత్ అధికారులు మాత్రం విద్యుత్ స్తంభాలు, వైర్లు మార్చినట్లు కాగితాల్లో చూపించి పాతవాటినే కొనసాగిస్తున్నారు. మరీ తప్పదనుకుంటే కండక్టర్‌ను మార్చి పాతకండక్టర్ను బయట మార్కెట్లో అమ్ముకొని జేబులు నింపుకుంటున్నారు. పట్టణాలే కాదు గ్రామాల్లోనూ విద్యుత్ సిబ్బంది చేతివాటం పెరిగిపోయింది. చేతికందేటంత ఎత్తులో వైర్లు వెళుతున్నా, ప్రజలు వాటిని సక్రమంగా సరిచేయాలని మొత్తుకున్నా పట్టించుకునే నాథుడే కరువయ్యాడు. విద్యుత్ తీగలు తెగిపడితే సమాచారం ఇచ్చినా వాటిని పునరుద్ధరించాలంటే రోజులు గడవాల్సిందే. గిద్దలూరు, యర్రగొండపాలెం, మార్కాపురం ప్రాంతాల్లో పొలాల్లోకి వెళ్లాలంటేనే పశువుల కాపరులు భయపడే పరిస్థితి. ఎప్పుడు తీగలు(కండక్టర్) తెగి మీద పడతాయోనన్న భయం. ఇక రాత్రి వేళల్లో రైతులు విద్యుత్ మోటార్లు వేసుకోవాలంటేనే భీతిల్లుతున్నారు. ఎప్పుడు హై ఓల్టేజి వచ్చి మోటార్లకు విద్యుత్ షాక్ కొడుతుందోనన్న అనుమానం. ఇక సముద్ర తీర ప్రాంతంలో ఉప్పుగాలులకు వైర్లు బలహీనపడి ఎప్పుడు పడితే అప్పుడు తెగి కిందపడుతుంటాయి. ఇనుప విద్యుత్ స్తంభాలు తుప్పుపట్టి చిన్నపాటి గాలికే నేలకొరుగుతున్నాయి. ట్రాన్స్ఫార్మర్ల పరిస్థితి మరీ భయానకం. జనావాసాల్లో కూడా ట్రాన్స్ఫార్మర్లకు రక్షణ చర్యలు లేవు. ఇళ్ల మధ్యలో, రోడ్ల వెంట ప్రజలు సంచరిస్తూనే ఉంటారు... ట్రాన్స్ఫార్మర్లలో రెండు వైర్ల మధ్య మంటలు వస్తూనే ఉంటాయి. ఒక్కోసారి పేలిపోతుంటాయి. ప్రజలు ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని బిక్కుబిక్కు మంటూ తిరుగుతూ ఉంటారు. కానీ బిల్లులు నెల ఆలస్యమైతే మాత్రం వెంటనే సర్వీస్ కట్ చేస్తారు. సమస్య వచ్చినప్పుడు సరిచేయడంలో తీవ్ర జాప్యం చేస్తున్నారు. -
అంత డబ్బెక్కడిది?
నెలాఖరు వస్తే.. నాన్న పర్స్, అమ్మ పోపు డబ్బా రెండూ కలిపి చూసినా.. చిల్లర తప్ప ఏం దొరకదు! నెలాఖరుదాకా ఎందుకులే.. ఫస్ట్ తారీఖున కటింగ్‌లన్నీ పోయి నెలఖర్చుల కోసం.. ఈఎమ్ఐలకు పోసిన తర్వాత సగటు మమ్మీడాడీ దగ్గరుండేది చిల్లరేగా? మరి వీడికి అంత డబ్బు ఎక్కడిది? ఈ గిప్ట్స్ ఎక్కడివి? వీడిలాగే మనోడు కూడానా...? రాత్రి పన్నెండు దాటింది! అరవింద్ పక్కమీద అస్థిమితంగా అటూ ఇటూ దొర్లుతున్నాడు. ఏం చేస్తాడు మరి! ఎంత ప్రయత్నించినా నిద్ర రావట్లేదు. ఇలా లాభం లేదనుకుని కాసేపు వరండాలోకి వెళ్లి అటూ ఇటూ నడిచాడు. అయినా కలవరం.. కంటిమీదకు కునుకు రానివ్వడంలేదు. తన అవస్థ చూసి పదిసార్లు అడిగింది పద్మ... ‘ఏమైందండీ’ అని! ఏం చెప్తాడు? పొద్దున న్యూస్ పేపర్లోని వార్త గురించి చెబితే.. ఎలా రిసీవ్ చేసుకుంటుంది? అప్పటికీ.. కొడుకు ప్రవర్తన గురించి తను చెప్తూనే ఉంది.. వాడిలో ఏదో మార్పు వచ్చిందని! టెన్త్ వరకు బాగా చదివాడు. బోర్డ్ ఎగ్జామ్‌లో వాడు తెచ్చుకున్న మార్కులు కార్పోరేట్ కాలేజ్‌లో ఫ్రీ సీట్‌ను తెచ్చిపెట్టాయి. నిజానికి వాడు ఆ మార్కులు సంపాదించలేకపోతే ఈ కొడుకును కార్పోరేట్ కాలేజ్‌లో చదివించేంత సీన్ ఉండేదా తనకి? వాడికి ఇంట్లో చదువుకోవడానికి ఓ స్టడీ రూమ్‌నైనా కేటాయిద్దామనే ఉద్దేశంతో డబుల్ బెడ్రూమ్ ఇల్లు అద్దెకు తీసుకున్నాడు... తనకు భారమైనా. వాడు కూడా ఇంటర్ ఫస్టియర్ వరకు బుద్ధిగానే ఉన్నాడు. సెకండియర్ వచ్చేసరికే కొద్దికొద్దిగా మారడం మొదలుపెట్టాడు. హెయిర్ స్టయిల్ నుంచి షూ వరకు అంతా కొత్తగా కనిపిస్తున్నాడు. అందుకే పద్మకూ బెంగ మొదలయింది.. వాడిలో రోజుకో రకంగా వస్తున్న మార్పును చూసి. మ్యానేజ్ చెయ్యి మమ్మీ! రాత్రి భోజనాలప్పుడు అడిగింది పద్మ... ‘ఏమండీ.. మధ్యాహ్నం వాడి గది సర్దుతుంటే కప్‌బోర్డ్‌లో కొత్త ట్యాబ్ దొరికింది. మీరేమైనా కొనిచ్చారా నాకు తెలియకుండా?’ అని. ‘లేదు.. రెండునెలల కిందట బాగానే వెంటపడ్డాడు కొనిమ్మని. నీకు తెలుసు కదా నా ఆర్థిక పరిస్థితి.. ఎక్కడ కొనగలను? అదేమాట వాడికీ చెప్పాను.. కొనలేను అని’.. పద్మకు సమాధానమైతే చెప్పాడు కాని.. అప్పటినుంచి అరవింద్ భయం, ఆందోళన ఇంకా ఎక్కువయ్యాయి. పద్మకూ మొదలైందేమో సేమ్ ఫీలింగ్... వంటిల్లు సర్దేసి బెడ్రూమ్లోకి వచ్చాకా.. ఆ టాపిక్కే కంటిన్యూ చేసింది.. ‘నేను ఇంతకుముందే చెప్పాను మీకు.. నెలకో కొత్త వస్తువు ఇంటికి తెస్తున్నాడు’ అని. ఒకసారి ఫ్రెండ్‌వాళ్ల అక్క అమెరికా నుంచి తెచ్చిందని రెండు లీ జీన్స్ పాంట్స్ పట్టుకొచ్చాడు. ఇంకోసారి ఫ్రెండ్ కొనిపెట్టాడు అంటూ నైకీ షూతో వచ్చాడు. ఇదివరకు ఒకసారి మీతో అన్నాను కూడా. ‘పోనీలే.. నా మీదైతే భారం పడట్లేదు కదా’ అని మీరూ తప్పించుకున్నారు. ఈరోజు ఈ ట్యాబ్.. ఏంటో నాకేం అర్థంకావట్లేదు. అదీగాక ఈ ఆరునెలల్లో నాలుగుసార్లు గోవా వెళ్లాడు. ఇదిగో మళ్లీ ఇప్పుడూ ఫ్రెండ్స్ తీసుకెళ్తున్నారంటూ మీకు తెలియకుండా నాకు ఫోన్ చేసి చెప్పాడు. ‘డాడీ అడిగితే మ్యానేజ్ చెయ్యి మమ్మీ’ అని చెప్పి అప్పటికప్పుడు బయలుదేరి వెళ్లాడు. నాలుగు రోజులవుతోంది.. ఈ ఉదయం మీరు ఫోన్ చేసి గట్టిగా చెబితే ఈ రాత్రికి బయలుదేరుతున్నాడు కాని.. లేకుంటే వచ్చేవాడా?’ అని సుదీర్ఘంగా చెప్పి నిట్టూర్చింది పద్మ. ఆ సంభాషణ అరవింద్‌లో దిగులును, గాభరాను మరింత పెంచింది. ‘రానీ.. పొద్దున రానీ.. చెప్తా..’ అనుకొని కళ్లు గట్టిగా మూసుకున్నాడే కాని.. ఆదమరచి నిద్రలోకి జారుకోలేకపోయాడు! అర్జెంటుగా ఓసారి వస్తావా? ఎప్పుడు తెల్లవారుతుందా అని ఎదురుచూస్తూ పడుకున్న అరవింద్ ఉదయం అయిదుగంటలకే పక్కమీద నుంచి లేచాడు. వాకింగ్‌కి వెళ్తూన్నట్టుగా బయటపడి.. ఎస్సై అయిన తన పోలీస్ బావ రఘుకి కాల్ చేశాడు.. ‘బావా.. నిన్ను అర్జంటుగా కలవాలి.. తొమ్మిదింటికల్లా ఇంటికి రాగలవా? టిఫిన్ చేస్తూ మాట్లాడుకుందాం?’ అని. ‘ఏంటీ బావా అంత అర్జెంట్? మా చెల్లి మీద ఏమైనా కంప్లయింట్సా ఏంటి కొంపదీసి? అయినా నేను మా చెల్లెలు సైడే... తెలుసు కదా..’ అంటూ చమత్కరించాడు రఘు. ‘అబ్బా... బావా! జోక్స్ కాదు... ఇది కొంచెం సీరియస్ విషయం... ప్రణవ్ గురించి మాట్లాడాలి’ అన్నాడు అరవింద్. ఆ మాట వినగానే స్వరాన్ని గంభీరం చేసుకుని ‘సరే బావా.. వస్తా’ అన్నాడు రఘు. ‘ఓకే’ అంటూ ఫోన్ కట్ చేశాడు అరవింద్. వాడికేమిటి సంబంధం? ‘ఏంటీ.. బావా.. అర్జెంట్ అని రమ్మన్నావు... విషయమేంటి?’ అని అడిగాడు దోసెముక్కతో కొబ్బరి చట్నీ తీసుకుంటూ రఘు. అంతకుముందు రోజు తనను కుదిపేసిన వార్త ఉన్న పేపర్ కటింగ్‌ను రఘు ముందుంచాడు అరవింద్. అందుకుని చూశాడు రఘు. ‘డ్రగ్స్ స్మగ్లింగ్‌లో టీనేజర్స్.. గోవా కేంద్రంగా సాగుతున్న ఈ డ్రగ్స్ స్మగ్లింగ్‌కు దేశంలోని అన్ని ప్రధాన నగరాలతోపాటు తెలుగురాష్ట్రాల్లోని హైదరాబాద్, వరంగల్, విజయవాడ, విశాఖపట్టణం, తిరుపతి వంటి పట్టణాల టీనేజ్ అబ్బాయిలను టార్గెట్ చేసుకుంటు న్నారని, ఈ పిల్లలకు గోవా పర్యటన, ఖరీదైన గాడ్జెట్స్, ట్యాబ్స్, బ్రాండెడ్ వాచెస్, దుస్తులు, కొన్నిసార్లు బైక్స్‌నీ ఎరగా చూపించి డ్రగ్స్‌ను స్మగ్లింగ్ చేయిస్తున్నారనీ... వార్త సారాంశం! ‘అవును బావా.. ఈ మధ్య చాలా ఎక్కువైంది. గోవా, ముంబై... ఔటింగ్‌లు, అక్కడ పబ్‌లు.. అంటూ ఆశపెట్టి.. అలవాటు చేసి వీళ్ల ద్వారా డ్రగ్స్‌ను ట్రాన్స్పోర్ట్ చేస్తున్నారు. అలాంటి ఎరలో పడొద్దని కాలేజ్ స్టూడెంట్స్‌కి కౌన్సెలింగ్ ఇస్తున్నాం. పేరెంట్స్ కూడా ఓ కంట కనిపెడు తుండాలి.. పిల్లలు ఆల్ ఆఫ్ సడెన్ గోవా, ముంబై అని టూర్లు పెట్టుకోవడం.. ఫ్రెండ్స్ గిఫ్ట్స్ ఇచ్చారంటూ ఖరీదైన వస్తువులను ఇంటికి తేవడం చేస్తుంటే.. తల్లిదండ్రులు అప్రమత్తం కావాలి. అలాగే కాలేజ్ అటెండెన్స్ ఎలా ఉందో కూడా చెక్ చేసుకోవాలి. అయినా ఈ వార్తతో ప్రణవ్‌కి ఏంటీ.. సం..బం..ధం...’ అంటూ అడుగుతుండగానే రఘుకు విషయం బోధపడింది.. ఈ లోపే బయట కాలింగ్ బెల్లూ మోగింది. ‘ప్రణవ్ అనుకుంటా..’ అంటూ తలుపు తీయడానికి గబగబా పరిగెత్తింది పద్మ. ‘వచ్చాడు.. ’ దవడలు బిగదీసుకుంటూ అన్నాడు అరవింద్. కొడుకుపై పట్టలేని కోపం ‘బావా.. కూల్.. వాడలాంటి పనులు చేయడనే నా నమ్మకం. అయినా నేనున్నాను కదా.. ఎలా దారిలోకి తేవాలో నాకు తెలుసు.. నువ్వు ఆవేశ పడకు’ అంటూ అరవింద్ ఆగ్రహాన్ని రఘు చల్లార్చే ప్రయత్నం చేస్తుండగానే ప్రణవ్ లోపలికి వచ్చాడు. వాడిని చూడగానే అరవింద్‌లో ఆగ్రహం, ఆవేశం కట్టలు తెంచుకున్నాయి. టేబుల్ దగ్గర్నుంచి ఒక్క ఉదుటన లేస్తూ.. ‘ఒరేయ్... ముందు ఆ బ్యాగ్ ఓపెన్ చెయ్’ అరిచాడు అరవింద్. తండ్రి అరుపుకి బిక్కచచ్చిపోయాడు ప్రణవ్. ‘నిన్నే... చూస్తూ నిలబడ్డావేం.. ఆ బ్యాగ్ ఓపెన్ చెయ్’ మళ్లీ అరిచాడు. నాన్న పక్కనే సీఐ మావయ్య.. నాన్న ఆవేశం... ప్రణవ్‌కి ఒక్క క్షణం అయోమయం.. అంతలోకే అనుమానం.. తన గురించి ఏమైనా తెలిసిందా? లేక సందేహమా? అని ఆలోచిస్తూనే.. వణుకుతున్న చేతులతో బ్యాగ్ ఓపెన్ చేశాడు. ఐఫోన్ కంట పడింది. ‘ఈ ఫోన్ ఎక్కడిదిరా..?’అంటూ కొడుకు చెంపను ఛెళ్లుమనిపించాడు అరవింద్. ఆయనను వెనక్కి తోస్తూ ప్రణవ్ను తీసుకొని పక్కగదిలోకి వెళ్లిపోయాడు రఘు.. కౌన్సెలింగ్ ఇవ్వడానికి. ⇒ తండ్రి అరుపుకి బిక్కచచ్చిపోయాడు ప్రణవ్. ‘నిన్నే... చూస్తూ నిలబడ్డావేం.. ఆ బ్యాగ్ ఓపెన్ చెయ్’ మళ్లీ అరిచాడు. నాన్న పక్కనే పోలీస్ మావయ్య.. నాన్న ఆవేశం... ప్రణవ్‌కి ఒక్క క్షణం అయోమయం.. ⇒ ప్రణవ్‌కి ఏంటీ.. సం..బం..ధం...’ అంటూ అడుగుతుండగానే రఘుకు విషయం అతనికి బోధపడింది.. ఈ లోపే బయట కాలింగ్ బెల్లూ మోగింది.‘ప్రణవ్ అనుకుంటా.. ’అంటూ తలుపు తీయడానికి గబగబా పరిగెత్తింది పద్మ. – శరాది -
ఇంటర్ బోర్డు కార్యాలయం వద్ద ఉద్రిక్తత
హైదరాబాద్: నాంపల్లిలోని ఇంటర్ బోర్డు కార్యాలయం వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది. వేసవి తరగతుల పేరిట విద్యార్థులను వేధిస్తున్న కార్పోరేట్ కళాశాలలకి ఇంటర్ బోర్డు కొమ్ముకాస్తుందని ఆరోపిస్తూ.. టీఎన్ఎస్ఎఫ్ కార్యకర్తలు సోమవారం నాంపల్లిలోని ఇంటర్ బోర్డు కార్యాలయాన్ని ముట్టిడికి యత్నించారు. ఇది గుర్తించిన పోలీసులు వారిని అడ్డుకోవడానికి యత్నించడంతో.. ఇరువర్గాల మధ్య తోపులాట జరిగి ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. -
విద్యార్థులను చితకబాదిన సిబ్బంది
గుంటూరు: ఓ కార్పొరేట్ కాలేజీలో సిబ్బంది ఇష్టరీతిన వ్యవహరించారు. పేరేచర్లలోని ప్రైవేట్ కాలేజీ విద్యార్థులు భోజనం బాగోలేదని ఫిర్యాదు చేసినందుకు సిబ్బంది వారిని చితకబాదారు. కాలేజీ సిబ్బంది దాడితో పలువురు విద్యార్థులకు గాయాలయ్యాయి. మేడికొండూరు పోలీసులను ఆశ్రయించి బాధిత విద్యార్థులు జరిగిన విషయంపై ఫిర్యాదుచేశారు. -
మియాపూర్ కార్పొరేట్ కాలేజీలో దారుణం
-
మియాపూర్ కార్పొరేట్ కాలేజీలో దారుణం
హైదరాబాద్: నగరంలోని మియాపూర్‌లో ఉన్న ఓ కార్పొరేట్ కాలేజీలో దారుణం జరిగింది. మంగళవారం కాలేజీలో ఇంటర్ విద్యార్థిని పెట్రోల్ పోసుకుని ఆత్మహత్య చేసుకుంది. మృతురాలిని నిజామాబాద్‌కు చెందిన సాత్వికగా గుర్తించారు. తీవ్ర ఒత్తిడి కారణంగానే ఈ అమ్మాయి ఆత్మహత్యకు పాల్పడిందని సహ విద్యార్థులు చెప్పారు. సాత్విక మృతదేహాన్ని గాంధీ ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సివుంది. -
ప్రగతి దారిలో..
సాక్షి ప్రతినిధి, కాకినాడ: ప్రభుత్వ కళాశాలల్లో మంచి ఫలితాలు రావని తీవ్ర విమర్శలొస్తున్న నేపథ్యంలో ఆ ముద్రను చెరిపేసుకొనే ప్రయత్నం మొదలైంది. కార్పొరేట్ కళాశాలలతో పోటీ పడలేవన్న భ్రమలను తొలగించే దిశగా అడుగులేస్తున్నాయి. గత ఏడాదితో పోల్చితే ఉత్తీర్ణత శాతంలో ప్రగతి కనబరిచాయి. సరైన మౌలిక సదుపాయాలు లేనిచోట.. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో కళాశాలలు సైతం ఉత్తీర్ణత శాతం పెంచుకున్నాయి. ఈ సాఫల్యతలో అధ్యాపకుల కృషి కూడా గణనీయమే. అదనపు తరగతుల నిర్వహణ, వెనుకబడిన విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ, పరీక్షలపై ప్రత్యేక తర్ఫీదు వంటివన్నీ ప్రభావాన్ని చూపించాయి. అయితే అద్దె భవనాల్లో అరకొర సౌకర్యాల మధ్య గత ఏడాది వంద శాతం ఉత్తీర్ణతతో జిల్లాలో గుర్తింపు పొందిన గొల్లప్రోలు జూనియర్ కళాశాల ఈ సంవత్సరం ఫలితాల్లో 80 శాతం ఉత్తీర్ణతకే పరిమితమైంది. ఇందుకు.. సౌకర్యాల మాటెలా ఉన్నా అన్ని సబ్జెక్టులకూ బోధనా సిబ్బంది లేకపోవడమే కారణం. ఇక విలీన మండలాల్లోని కళాశాలలపై రాష్ట్ర విభజన ప్రభావం తీవ్రంగా ప్రస్ఫుటమైంది. అప్పటివరకూ ఇక్కడ పనిచేస్తున్న తెలంగాణ సిబ్బంది సొంత రాష్ట్రానికి వెళ్లిపోయారు. ఆ పోస్టుల్లో మన రాష్ట్రానికి చెందిన అధ్యాపకులను నియమించడానికి నాలుగు నెలలు పట్టింది. ప్రభుత్వం ఉదాసీనత కారణంగా విద్యార్థులు విలువైన సమయాన్ని కోల్పోయారు. తర్వాత కొత్తవారిని నియమించినా వారు పాఠ్యాంశాలను ఆకళింపు చేసుకోవడానికే పుణ్యకాలం కాస్త గడిచిపోయింది. ఫలితమేమిటో వీఆర్ పురం ప్రభుత్వ జూనియర్ కళాశాలే ప్రత్యక్ష నిదర్శనం. ఇక్కడ గత ఏడాది 72.5 శాతం ఉన్న ఉత్తీర్ణత ఈసారి 28 శాతానికి పడిపోయింది. ప్రభుత్వ నిర్లక్ష్యానికి విద్యార్థులు మూల్యం చెల్లించుకోవాల్సి వచ్చింది. జిల్లా కేంద్రమైన కాకినాడలోని పీఆర్ జూనియర్ కళాశాలలో ఈ ఏడాది ప్రథమ సంవత్సరం ఇంటర్ పరీక్షలు రాసిన 218 మందిలో కేవలం 120 మాత్రమే (58 శాతం) ఉత్తీర్ణులయ్యారు. గత ఏడాది 42 శాతం ఉన్న ఉత్తీర్ణత శాతం ఈసారి కాస్త పెరిగింది. ద్వితీయ సంవత్సర పరీక్షలు రాసిన 162 మందిలో 113 మంది గట్టెక్కారు. ఉత్తీర్ణత శాతం 50 నుంచి 70కి పెరిగింది. ఒకేషనల్ కళాశాలలో ఫస్టియర్ విద్యార్థులు 61.36 శాతం, సెకండియర్ 77 శాతం ఉత్తీర్ణులయ్యారు. గత ఏడాదికన్నా ఇది 27 శాతం అధికం. అలాగే అన్నవరం సత్యవతీదేవి కళాశాలలో ఫస్టియర్ 367 మందికి 247 మంది (67 శాతం) ఉత్తీర్ణులయ్యారు. సెకండియర్‌లో 289 మందికి 213 మంది పాసయ్యారు. కాకినాడ రూరల్ నియోజకవర్గం వేళంగిలో మెర్లాస్ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో గత ఏడాది మొదటి సంవత్సరం 70 శాతం ఉత్తీర్ణత సాధించగా ఈ ఏడాది 83.3 శాతం నమోదైంది. సెకండియర్‌లో గత ఏడాది జిల్లాస్థాయిలో ద్వితీయ స్థానం సాధించగా, ఈ ఏడాది 76 శాతం సాధించింది. రాజమహేంద్రవరంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల నుంచి 481 మంది ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సర పరీక్షలకు హాజరైతే వారిలో 287 మంది ఉత్తీర్ణులయ్యారు. ఉత్తీర్ణత శాతం గత ఏడాది నమోదైన 53.88 కన్నా కాస్త మెరుగుపడి 59.67 శాతం దగ్గర నిలిచింది. కడియంలోని పిచ్చుక కోటయ్య జూనియర్ కళాశాల సెకండియర్ ఫలితాల్లో గత ఏడాది సాధించిన 76 శాతం నుంచి మెరుగుపడి ఈ ఏడాది 85 శాతం సాధించింది. కోరుకొండ మండలంలోని రాజబాబు ప్రభుత్వ జూనియర్ కళాశాలలోగత ఏడాది సెకండియర్‌లో 72 శాతంగా ఉన్న ఉత్తీర్ణత శాతం 75 శాతానికి పెరిగింది. మండపేటలోని వేగుళ్ల సూర్యారావు ప్రభుత్వ జూనియర్ కళాశాలలో గత ఏడాది సీనియర్ ఇంటర్లో 76 శాతం మంది ఉత్తీర్ణత సాధించగా ఈ ఏడాది 80.35 శాతం మంది ఉత్తీర్ణులయ్యారు. రాయవరం మండలంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో గతేడాది 74 శాతం ఉత్తీర్ణత సాధించగా, ఈ ఏడాది 84.8 శాతం నమోదైంది. రామచంద్రపురం కృత్తివెంటి పేర్రాజు పంతులు జూనియర్ కళాశాలలో సీనియర్ ఇంటర్లో మొత్తం 179 మంది పరీక్షలకు హాజరు కాగా 113 మంది ఉత్తీర్ణులయ్యారు. కాజులూరు ప్రభుత్వ జూనియర్ కళాశాలో 80 శాతం ఉత్తీర్ణత సాధించారు. సీనియర్ ఇంటర్లో 106 మంది పరీక్షలకు హాజరు కాగా 84 మంది ఉత్తీర్ణులయ్యారు. కె.గంగవరం మండలం పామర్రులో నూతనంగా ఏర్పాటు చేసిన జూనియర్ కళాశాలలో మొదటి సంవత్సరం ఫలితాలలో మొత్తం 58 మంది విద్యార్దులు హాజరు కాగా 57 మంది, ద్వితీయ సంవత్సరంలో 42 మంది హాజరు కాగా 41 మంది ఉత్తీర్ణులయ్యారు. ద్రాక్షారామ పీవీఆర్ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో సీనియర్ ఇంటర్లో 56 మంది హాజరు కాగా 28 మంది ఉత్తీర్ణులయ్యారు. ఏలేశ్వరం ప్రభుత్వ జూనియర్ కళాశాల సెకండియర్ ఫలితాల్లో ఉత్తీర్ణత శాతం 72 నుంచి ఈసారి 89కి పెరిగింది. ఫస్టియర్ 64 శాతం నుంచి 73 శాతానికి పెరిగింది. గత ఏడాది సెకండియర్ ఫలితాల్లో 70 శాతం ఉత్తీర్ణత సాధించిన గురుకుల బాలికల కళాశాల ఈసారి 98 శాతం ఉత్తీర్ణత సాధించింది. ఫస్టియర్‌లో 77 శాతం నుంచి 85 శాతానికి పెరిగింది. సామర్లకోట ప్రభుత్వ జూనియర్ కళాశాల సెకండియర్ ఫలితాల్లో 51 శాతం నుంచి కేవలం 0.9 శాతం మాత్రమే ఉత్తీర్ణత పెంచగలిగింది. ఫస్టియర్ ఫలితాల్లో 36 శాతం నుంచి 45 శాతానికి మెరుగుపడింది. మామిడికుదురు ప్రభుత్వ జూనియర్ కళాశాల సెకండియర్ ఫలితాల్లో గత ఏడాది 65 శాతం ఉత్తీర్ణత సాధించగా ఈ ఏడాది 72 శాతం సాధించింది. పిఠాపురం ఆర్ఆర్బీహెచ్ఆర్ కళాశాలలో సెకండియర్ ఫలితాల్లో గత ఏడాది 45.5 శాతం మాత్రమే నమోదైన ఉత్తీర్ణత శాతం ఈసారి 75 శాతానికి పెరిగింది. గొల్లప్రోలు కళాశాలలో గత ఏడాది వంద శాతం ఉత్తీర్ణత రాగా, ఈ ఏడాది 80 శాతం మాత్రమే వచ్చింది. కొత్తపేట ప్రభుత్వ జూనియర్ కళాశాలలో గత ఏడాది సెకండియర్ ఫలితాల్లో 69 శాతం ఉత్తీర్ణత రాగా ఈసారి పది శాతం మెరుగుపరచుకుంది. ఒకేషనల్ కోర్సుల్లో గత ఏడాది 70 శాతం కాగా ఈసారి 96 శాతం ఉత్తీర్ణత సాధించింది. ఆలమూరు జూనియర్ కళాశాలలో గత ఏడాది సెకండియర్‌లో 61.16 ఉత్తీర్ణత నమోదు కాగా ఈ ఏడాది 89 శాతానికి పెరిగింది. ముమ్మిడివరం ఎంజీఆర్ ప్రభుత్వ జూనియర్ కళాశాల సెకండియర్ ఫలితాల్లో గత ఏడాది 60 శాతం ఉత్తీర్ణత సాధించగా ఈ ఏడాది 75 శాతం సాధించింది. రంగంపేట ప్రభుత్వ జూనియర్ కళాశాల మాత్రం ఫస్టియర్ ఫలితాల్లో 67 శాతం నుంచి 71 శాతానికి మెరుగుపడినప్పటికీ సెకండియర్‌లో మాత్రం 80 శాతంతో కేవలం 0.1 శాతమే మెరుగు సాధించగలిగింది. రాజోలు ప్రభుత్వ జూనియర్ కళాశాల సెకండియర్ ఫలితాల్లో 49 శాతం నుంచి 75 శాతానికి పురోగమించింది. జగ్గంపేట కాలేజీ 49 నుంచి 59 శాతానికి, గోకవరం కాలేజీ 60.5 నుంచి 65 శాతానికి, కిర్లంపూడి కాలేజీ 52 శాతం నుంచి 72 శాతానికి ఉత్తీర్ణతను పెంచగలిగాయి. విలీన మండలాల్లో కూనవరం జూనియర్ కాలేజీలో గత ఏడాది సెకండియర్ ఫలితాల్లో 46 శాతమైన ఉత్తీర్ణత ఈ ఏడాది 23 శాతానికి పడిపోయింది. వీఆర్ పురం కళాశాలలో గత ఏడాది 72.5 శాతం కాగా, ఈ ఏడాది 28 శాతమే వచ్చింది. -
ఇప్పుడైతేనే సీటు!
♦ పది విద్యార్థులకు ఆఫర్ల పేరుతో ‘కార్పొరేట్’ ప్రలోభాలు ♦ పీఆర్ఓలను ఏర్పాటు చేసి మరీ అడ్మిషన్లు చేస్తున్న వైనం ♦ ఇప్పుడే రిజిష్టర్ చేసుకోవాలంటూ ఒత్తిడి ♦ ఇదేం గోల అని వాపోతున్న తల్లిదండ్రులు వైవీయూ : పదో తరగతి పరీక్షలు పూర్తయి రెండు రోజులు కూడా గడవక ముందే విద్యార్థుల వద్దకు కార్పొరేట్ గద్దలు వాలిపోయాయి. పది పరీక్షా కేంద్రాల వద్దనే కరపత్రాలతో విద్యార్థులను ఆకట్టుకునే ప్రయత్నం చేసిన కళాశాలల ప్రతినిధులు.. అనంతరం విద్యార్థుల ఇళ్ల చుట్టూ జోరీగల్లా తిరుగుతున్నారు. పది ఫలితాల్లో 10కి 10 జీపీఏ సాధిస్తే మా కళాశాలలో హాస్టల్ ఉచితమని ఓ కళాశాల.. స్వల్ప మొత్తంతో హాస్టల్ వసతి కూడా కల్పిస్తామంటూ మరో కళాశాల.. ఇలా ఆఫర్లతో మభ్యపెడుతున్నాయి. 9.0 పైన, అంతకంటే తక్కువ వచ్చిన వారికి కూడా కాస్తో కూస్తో తగ్గిస్తాం... అదీ ఇప్పుడు రిజిష్టర్ చేసుకుంటేనే అంటూ చెప్పిందే చెబుతూ పదే పదే ఇళ్ల చుట్టూ చక్కర్లు కొడుతున్నారు. పది పరీక్షలు రాసిన విద్యార్థుల చిరునామాలు, వారి తల్లిదండ్రుల సెల్ నెంబర్లు తెలుసుకుని మరీ విసిగిస్తుండటంతో తల్లిదండ్రులు ఇదేం గోలరా బాబూ అంటూ జుట్టు పీక్కుంటున్నారు. దీనికి తోడు ప్రస్తుతం రిజిష్టర్ చేయించుకుంటే ఫీజులో 10 శాతం రాయితీ కల్పిస్తామని తర్వాత అయితే ఏమీ చేయలేమంటూ విద్యార్థుల తల్లిదండ్రుల్లో లేనిపోని ఆందోళన సృష్టిస్తున్నారు. విజయవాడ, నెల్లూరు, హైదరాబాద్‌కు చెందిన కార్పొరేట్ కళాశాలల యాజమాన్యాలు సైతం ఇక్కడ పీఆర్ఓలను ఏర్పాటు చేసుకుని అడ్మిషన్లు నిర్వహించేందుకు ముమ్మరంగా ప్రయత్నాలు చేస్తుండటం విశేషం. దీంతో పాటు ఓ కార్పొరేట్ కళాశాల తమ బ్రాంచ్‌లో పదోతరగతి విద్యార్థులకు పది రోజుల పాటు డిజిటల్ బోధన ఉచితంగా నిర్వహిస్తామని.. విద్యార్థులు ఈ అవకాశాన్ని వినియోగించుకుని ప్రవేశాలు పొందవచ్చని పేర్కొనడం విశేషం. ‘విజయవాడలోని ఓ ప్రముఖ కార్పొరేట్ కళాశాల మహిళా బ్రాంచ్‌లో హాస్టల్లో సీటు రావడం మామూలు విషయం కాదు. ఈ వారంలో అడ్మిషన్ పొందితే అక్కడ హాస్టల్ సీటు గ్యారెంటీ’ అంటూ విద్యార్థుల తల్లిదండ్రుల్లో ఆందోళన రేకెత్తిస్తున్నారు. ఇంటెన్సివ్ బ్యాచ్, స్పెషల్ బ్యాచ్, ఐఐటీ బ్యాచ్, మెడికల్ అకాడ మి.. ఇలా వేర్వేరు పేర్లతో నిర్వహించే తరగతులకు లక్షలాది రూపాయల ఫీజు నిర్ధారించి.. ప్రవేశాలకు ఆఫర్లు చూపుతూ తల్లిదండ్రులను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారు. దీనికి తోడు స్థానిక కళాశాలలు, ప్రైవేట్ పాఠశాలల్లో పనిచేసే ఉపాధ్యాయులు సైతం అడ్మిషన్లు చేయిస్తే వారికి ప్రోత్సాహకంగా కమీషన్ ముట్టచెబుతుండటం గమనార్హం. మీ పిల్లలు పరీక్షలు బాగా రాశారని తెలిసిందని.. ఎలాగూ మంచి ఫలితాలు వస్తాయి కాబట్టి త్వరగా ప్రవేశాలు పొందాలని.. ఫలితాల కంటే ముందుగానే తరగతులు సైతం నిర్వహిస్తామని పేర్కొంటుండం చూస్తుంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. ప్రలోభాలకు గురిచేస్తే చర్యలు విద్యార్థులను ప్రలోభాలకు గురిచేసేలా అడ్మిషన్లు నిర్వహించడం తగదు. ఇంటర్ మూల్యాంకనంలో ఉన్న మా దృష్టికి ఈ క్యాంపెయిన్ సమస్య రాలేదు. దీనిపై దృష్టి సారించి తగిన చర్యలు చేపడతాం. కళాశాలల్లో ప్రవేశాలు, తరగతులు ముందుగా చేపడితే చర్యలకు ఉపక్రమిస్తాం. - రవి, ఆర్ఐఓ, కడప -
లేడీస్ హాస్టల్లోకి విద్యార్థుల చొరబాటు
♦ విద్యార్థినులతో ఏపీ మంత్రి కళాశాల విద్యార్థుల అసభ్య ప్రవర్తన ♦ విశాఖలోని ఓ హాస్టల్లో ఘటన ♦ పోకిరీలకు దేహశుద్ధి చేసిన అమ్మాయిలు... పోలీసులకు అప్పగింత ♦ కేసు మాఫీకి మంత్రి ఒత్తిడి? గాజువాక/అక్కిరెడ్డిపాలెం: విశాఖపట్నంలోని షీలానగర్‌లో ఉన్న ఓ లేడీస్ హాస్టల్లోకి ఓ కార్పొరేట్ జూనియర్ కళాశాలకు చెందిన కొందరు విద్యార్థులు గురువారం అర్ధరాత్రి చొరబడి వెకిలిచేష్టలు చేశారు. అక్కడున్న అమ్మాయిల పట్ల అసభ్యంగా ప్రవర్తించారు. దీంతో అమ్మాయిలు తిరగబడి వారిని తరిమికొట్టారు. ముగ్గురు పోకిరీలను పట్టుకుని దేహశుద్ధి చేయడమేగాక పోలీసులకు అప్పగించారు. అయితే కార్పొరేట్ జూనియర్ కళాశాల ఏపీకి చెందిన ఓ మంత్రిది కావడంతో ఈ ఘటనను బయటకు పొక్కకుండా, ఎలాంటి కేసూ లేకుండా చేసేం దుకు సదరు మంత్రి ప్రయత్నించి.. అధికారులపై తీవ్ర ఒత్తిడి తేవడంతో హైడ్రామా చోటు చేసుకుంది. అయితే హాస్టల్ విద్యార్థినులు పట్టువిడవకపోవడంతో చివరకు పోలీసులకు కేసు నమోదు చేయక తప్పలేదు. అయినప్పటికీ కళాశాలకు చెందిన ముగ్గురు విద్యార్థుల అరెస్టు చూపించకుండా గోప్యత పాటిస్తున్నా రు. హాస్టల్ విద్యార్థినులు, ప్రత్యక్ష సాక్షులు తెలిపిన మేరకు వివరాలివి... అర్ధరాత్రివేళ విద్యార్థుల ఆగడం.. విశాఖపట్నం షీలానగర్‌లో కృషి ఆస్పత్రి పక్కన ఓ కార్పొరేట్ జూనియర్ కళాశాల, దాని పక్కనే మనీషా నర్సింగ్ విద్యార్థినుల హాస్టల్ ఉన్నాయి. కార్పొరేట్ కళాశాలకు చెందిన కొంద రు విద్యార్థులు గురువారం అర్ధరాత్రి సమయంలో గోడ దూకి నర్సింగ్ హాస్టల్లోకి ప్రవేశించారు. గమనించిన విద్యార్థినులు భయంతో పెద్దగా కేకలేశారు. బయటకు వెళ్లిపోవాలంటూ హెచ్చరించారు. పట్టించుకోని జూనియర్ కళాశాల విద్యార్థులు మరింతగా రెచ్చిపోతూ.. అమ్మాయిలపట్ల అసభ్యంగా ప్రవర్తిస్తూ పైపైకి వెళ్లారు. దీంతో విద్యార్థినులు తిరగబడ్డారు. అంతా ఏకమై వారిని తరిమికొట్టారు. ఈ క్రమంలో దొరికిన ముగ్గురు విద్యార్థులకు దేహశుద్ధి చేసి గాజువాక పోలీసులకు అప్పగించారు. నర్సింగ్ హాస్టల్ ప్రిన్సిపాల్, వార్డెన్లు.. కార్పొరేట్ కళాశాల ప్రిన్సిపాల్‌ను కలసి జరిగిన విషయాన్ని వివరించారు. ఈలోగా విషయం తెలుసుకున్న కార్పొరేట్ జూనియర్ కళాశాల యజమాని అయిన మంత్రితోపాటు స్థానిక మంత్రి ఒకరు అటు పోలీసులు.. ఇటు నర్సింగ్ హాస్టల్ సిబ్బందిపైఒత్తిడి తెచ్చి విషయాన్ని గోప్యంగా ఉంచేందుకు ప్రయత్నించారు. శుక్రవారం ఉదయం ఈ విషయం తెలుసుకున్న మీడియా.. నర్సింగ్ హాస్టల్, కార్పొరేట్ కళాశాల వద్దకెళ్లినా అక్కడి సిబ్బంది నోరువిప్పలేదు. మరోవైపు సౌత్ ఏసీపీ జి.బి.ఆర్.మధుసూదనరావు, గాజువాక సీఐ మళ్ల అప్పారావు తదితరులు కార్పొరేట్ కళాశాల సిబ్బందితో సమావేశమయ్యారు. తర్వాత మనీషా నర్సింగ్ హాస్టల్లో వివరాలు సేకరించారు. అయితే విలేకరులకు వెల్లడించేందుకు మాత్రం నిరాకరించారు. కాగా, జూనియర్ కళాశాల మంత్రికి చెందింది కావడంతో అటు పోలీసు లు.. ఇటు నర్సింగ్ కళాశాల యాజమాన్యం, విద్యార్థినులపై తీవ్రస్థాయిలో ఒత్తిళ్లు వచ్చాయి. దీంతో పోలీసులు శుక్రవారం సాయంత్రందాకా కేసు నమోదు చేయలేదు. అయితే బాధిత విద్యార్థినులు వెనక్కి తగ్గలేదు. ఎంత ఒత్తిడి తెచ్చినా ఫలితం లేకపోవడంతో చివరకు కేసు నమోదు చేశారు. దీనిపై వివరణ కోరగా.. విచారణ జరుగుతోందని, ఇప్పుడే ఏమీ చెప్పలేమని సీఐ మళ్ల అప్పారావు తెలిపారు. -
‘స్మార్ట్’ బాదుడు..!
కార్పొరేట్ కళాశాలల మాయ ఆకర్షణీయ కోర్సుల పేరుతో విద్యార్థులకు వల ఇంటర్లో ఏడాదికి రూ. 3 లక్షలు వసూలు సిటీబ్యూరో: ఎంపీఎల్, ఐపీఎల్, ఎన్పీఎల్, ఐసీసీ, ఎంసీసీ, ఐకాన్, స్పార్క్... ఇవే వో క్రికెట్ లీగ్ పోటీలు అనుకుంటున్నారా? అయితే పొర పాటుపడ్డట్లే. ఇంటర్మీడియెట్ విద్యనందించే పలు కార్పొరేట్ కళాశాలలు అందించే ఆయూ కోర్సులకు వాటి యాజమాన్యాలు ఆక ర్షణీయంగా పెట్టుకున్న పేర్లివి. ఎంపీఎల్-మెడిసిన్ ప్రీమియర్ లీగ్, ఐపీఎల్ - ఐఐటీ ప్రీమియర్ లీగ్, ఎన్పీఎల్-ఏఐఈఈఈ.. ఇలా సంక్షిప్త పేర్లతో విద్యార్థులకు వల వేస్తున్నారు. ఆ పేర్ల మాదిరిగానే.. ఆయా కోర్సుల్లో చేరే విద్యార్థుల నుంచి భారీగా ఫీజులు దండుకుంటున్నారు. కోర్సుని బట్టి ఏడాదికి వసూలు చేస్తున్న ఫీజు ఎంతో తెలిస్తే.. దిమ్మ తిరగాల్సిందే. ఏడాదికి గరిష్టంగా రూ. 2.50 లక్షల నుంచి రూ. 3 లక్షల వరకు లాగుతున్నారు. ఇంటర్‌తో సహా ఐఐటీ, ఎంసెట్, ఎయిమ్స్, జిప్మర్, సీఏ సీపీటీ.. తదితర ప్రవేశ పరీక్షలకు కలిపి ప్యాకేజీలుగా విభజిస్తున్నారు. ఇంటర్‌తోపాటు కాంబినేషన్ ప్రవేశ పరీక్షను బట్టి ఫీజుల్లో స్వల్ప మార్పులు ఉంటారుు. ఆ మాత్రం చెల్లించగలిగే వారికే సీట్లు ఇస్తున్నారు. లేదంటే.. నిర్మొహమాటంగా సీట్లు నిండుకున్నాయని, లేదంటే కావాల్సిన బ్రాంచ్‌లో సీట్లు లేవని చెప్పేస్తున్నారు. తద్వారా కృత్రిమ పోటీని సృష్టించి అధికంగా డబ్బు దండుకునేందుకు జిమ్మిక్కులు చేస్తున్నారు. ఈ క్రమంలో వచ్చే విద్యా సంవత్సరానికిగాను ఇప్పటికే సింహభాగం సీట్లు భర్తీ అరుునట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగామొదట రూ. 5 వేలు నుంచి రూ. 15 వేల వరకు వసూలు చేసి విద్యార్థి పేరు నమోదు చేసుకుంటున్నారు. అదనపు బాదుడు... ట్యూషన్ ఫీజుతో సహా హాస్టల్ వసతికి కలిపి రూ. 2.50 లక్షల చొప్పున వసూలు చేస్తున్నారు. ఈ మొత్తం చెల్లిస్తే ఏసీ వసతి కూడా కల్పిస్తున్నారు. ఆ ఏసీ కూడా తరగతి గదులకే పరిమితం. ఈ మొత్తంలో హాస్టల్ వసతికి రూ. 1.50 లక్షలు తీసుకుంటున్నారు. అరుుతే ఇంతటితో ఈ చదివింపులు ఆగిపోవు. అదనపు ఖర్చుల జాబితా కూడా చేంతాడంత ఉంటుంది. దుస్తులు ఉతకడం, ఇస్త్రీ దోబీకి ఇచ్చే డబ్బులు కూడా విద్యార్థుల నెత్తినే వేస్తున్నారు. అంతేగాక స్టెషనరీ బిల్లులు, ఫోన్ బిల్స్ కూడా అదనం. ఈ మొత్తం కలుపుకుంటే ఏడాదికి మరో రూ. 10 వేలు ఖర్చు తప్పట్లేదని తల్లిదండ్రులు చెబుతున్నారు. నాణ్యత గాలికి ఫీజులు భారీగానే తీసుకుంటున్నా... మెనూ పాటించడం లేదని విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కాలేజ్‌లో చేర్పించే సమయంలో ఉన్న నాణ్యత.. కొన్ని నెలల తర్వాత కనిపించడం లేదన్నారు. మరోపక్క విద్యార్థికి అస్వస్థత చేకూరితే.. అత్యవసరంగా ఆస్పత్రికి తీసుకెళ్లేందుకు కనీసం ఒక్క అంబులెన్స్, ప్రత్యేక వాహనాలు కూడా అందుబాటులో ఉండడం లేదన్నారు. కొన్ని కళాశాలలు ప్రధాన బ్రాంచ్‌లుగా చెప్పుకునే ప్రాంతాల్లోనూ ఏర్పాటు చే యడం లేదు. తావుు ఫీజులు రూ. లక్షల్లో చెల్లిస్తున్నా.. విద్యార్థులు క్షేవుంపై సంతృప్తికరంగా లేమని, గదికి నలుగురు చొప్పున విద్యార్థులే ఉంటారని చెబుతూ ఐదారుగురిని కుక్కేస్తున్నారని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. -
ర్యాగింగ్ రోగ్ గేమ్
ఒక స్టూడెంట్‌ని ఎవరైనా కొడితే మొత్తం స్టూడెంట్ ప్రపంచం తిరగబడుతుంది. అదీ యూత్‌లో ఉన్న యూనిటీ. ఒకరికోసం ఒకరు ప్రాణం కూడా ఖాతరు చేయకుండా ఫైట్ చేస్తారు. మరి ఆ స్టూడెంట్సే... ఫ్రెషర్స్ మీద రెచ్చిపోతుంటే..! కాపాడాల్సిన చేతులే గొంతు పిసికేస్తుంటే... ఏం చెయ్యాలి? పేరెంట్స్ ఏం చెయ్యాలి? సీనియర్లను పేరెంట్స్ మందలించాలా? ఫ్రెషర్లకు పేరెంట్స్ ధైర్యం చెప్పాలా? ర్యాగింగ్ ఆటగా మొదలైనా... క్రైమ్ గానే ఎండ్ అవుతుంది. ర్యాగింగ్ ఈజ్ ఫర్ క్రిమినల్స్. నాట్ ఫర్ స్టూడెంట్స్. శృతి మించి ఇటీవల విశాఖ నగరంలోని ఓ కార్పొరేట్ కాలేజీలో సీనియర్, జూనియర్ విద్యార్థులు అర్ధరాత్రి కొట్లాటకు దిగారు. ఈ గొడవ మొదట ఓ సీనియర్ విద్యార్థి జూనియర్ని ర్యాగింగ్ చేయడంతో మొదలైంది. ఈ ఘటనలో పదిమంది విద్యార్థులకు గాయాలయ్యాయి. అంతకు మించి వరంగల్ జిల్లా హన్మకొండకు చెందిన రిషితేశ్వరి గుంటూరు జిల్లాలోని నాగార్జున యూనివర్శిటీలో డిగ్రీ (ఆర్కిటెక్చర్) ఫస్టియర్‌లో చేరింది. ఇద్దరు తోటి విద్యార్థినులతో కలిసి వర్సిటీలోని హాస్టల్లోనే ఉంటోంది. కాలేజీకి వెళ్లి వచ్చే సమయంలో సీనియర్ స్టూడెంట్ తన పట్ల అసభ్యంగా ప్రవర్తించడం తట్టుకోలేక ఎదురు తిరిగింది. సీనియర్‌కు ఎదురు తిరిగినందుకు అదే గ్రూప్‌లో ఉన్న ఓ సీనియర్ విద్యార్థిని ఆమెకు సరైన పనిష్మెంట్ ఇవ్వాలనుకుంది. హాస్టల్ గదిలో రిషితేశ్వరిని అర్ధనగ్నంగా తిప్పి, ఆ దృశ్యాలను వీడియో తీసిందని, వాటిని సీనియర్స్‌కి చూపించిందని, ఆ అవమానం భరించలేకే రిషితేశ్వరి ఆత్మహత్య చేసుకుందని తెలుస్తోంది. ర్యాగింగ్ చేసినవారికి తన మరణం కనువిప్పు కావాలని సూసైడ్ నోట్లో పేర్కొంది రిషితేశ్వరి. నిన్నమొన్న జరిగిన ఈ సంఘటన తెలుగు రాష్ట్రాల విద్యార్థులను, తల్లిదండ్రులను ఉలిక్కిపడేలా చేసింది. రాష్ట్రవ్యాప్త నిరసనలూ మొదలయ్యాయి. కాలేజీ వర్సెస్ కాలేజీ పది రోజుల కిందట విశాఖలో రెండు ప్రైవేట్ కళాశాలకు చెందిన విద్యార్థులు ఈవ్‌టీజింగ్ ఇష్యూతో రోడ్డు మీదకెక్కారు. మా కాలేజీవారినే ర్యాగింగ్ చేస్తారా...!! అంటూ గొడవకు దిగారు. పరిచయాలతో మొదలైన ర్యాగింగ్... చివరికి వేర్వేరు కళాశాలల విద్యార్థుల మధ్య ఆధిపత్య పోరుగా మారింది. నిజానికి విద్యాలయాలలో ర్యాగింగ్ అన్నది కొన్నేళ్లుగా కనుమరుగైందని అటు విద్యార్థులు, ఇటు తల్లిదండ్రులూ నిశ్చింతగా ఉన్నారు. కానీ, తాజాగా ఇప్పుడు చోటుచేసుకున్న ఈ సంఘటనలు అందరినీ మళ్లీ భయంలో, ఆవేదనలో ముంచెత్తాయి. ఆ రోజుకు కాలేజీ నుంచి తమ బిడ్డ క్షేమంగా ఇంటికి చేరుకుంటే చాలని ఫ్రెషర్స్ పేరెంట్స్ భయపడే పరిస్థితి మళ్లీ వచ్చింది! పలకరింపులు... పరిచయాలు ఫ్రెషర్స్ వేర్వేరు ప్రాంతాల నుంచి వస్తుంటారు కాబట్టి వారికీ, సీనియర్లకు సమన్వయం ఉండాలని అధ్యాపకులు చెప్పే సూచనల మేరకు పరిచయాలు, పలకరింపులు ఒక సంప్రదాయం అయ్యాయి. ఇంజినీరింగ్ విద్యా సంస్థలు పెరిగిన తర్వాత ఈ సంప్రదాయం మరింత విస్తరించింది. సీనియర్లకి జూనియర్లు ఇచ్చే గౌరవం క్రమంగా వారికి అవకాశంగా మారింది. దీంతో కొందరు ఆకతాయి సీనియర్లు అసభ్యంగా ప్రవర్తించడం, జూనియర్లతో అన్ని పనులు చేయించుకోవడం, చెప్పినట్టు వినకుంటే బెదిరించడం చేస్తున్నారు. చివరికి మానసికంగా, శారీరకంగా హింసించే స్థాయికీ వెళుతున్నారు. ఈ నేపథ్యంలో ఎదురయ్యే వేధింపులు భరించలేక ఎంతో మంది విద్యార్థులు తమ జీవితాలను బలి చేసుకుంటున్నారు. పదేళ్లుగా... సీరియస్ యాక్షన్! కేంద్ర ప్రభుత్వం కళాశాలలో జరిగే అకృత్యాలను సీరియస్‌గా తీసుకొని ర్యాంగింగ్ నిరోధక చట్టం అమల్లోకి తీసుకొచ్చింది. దీంతో ర్యాగింగ్ భూతం తన ఉనికి కోల్పోతూ వచ్చింది. చట్టానికి భయపడి సీనియర్లు ర్యాగింగ్, ఈవ్‌టీజింగ్‌లు చేయడం తగ్గించారు. అయితే, మళ్లీ కొన్ని రోజుల కిందట తెలుగు రాష్ట్రాలలో ర్యాగింగ్ రూపం మార్చుకొని కలత చెందేలా చేస్తోంది. తిరుగుబాటు... పరిచయాల పేరుతో సీనియర్స్ ర్యాగింగ్ చేస్తే కొత్తగా కళాశాలల్లో చేరే విద్యార్థులు భరించే స్థితిలో లేరు. సీనియర్లు అయితే ఏంటి? వేధిస్తే సహించాలా? అని ఎదురు తిరుగుతున్నారు. దీనిని భరించలేని సీనియర్లు వారి మీద దాడులకు దిగుతున్నారు. అదే సమయంలో జూనియర్స్ కూడా సీనియర్స్ మీద తిరగబడుతున్నారు. ఈ నేపథ్యంలో వారి మధ్య ఆధిపత్య పోరు పెరుగుతోంది. కొన్ని ప్రాంతాలలో అయితే కాలేజీలు ఒకే చోట ఉంటున్నాయి. దీంతో వేర్వేరు కళాశాల విద్యార్థుల మధ్య మాటల యుద్ధం, ఈవ్ టీజింగ్‌లు చోటు చేసుకుంటున్నాయి. ఇలాంటి ఘటనల్లో కళాశాల విద్యార్థులు గొడవలకు దిగుతూ రోడ్ల మీదనే కొట్లాడుకుంటున్నారు. మా కాలేజీ అమ్మాయిని కామెంట్ చేసావని ఒకరు, మా కాలేజీ స్టూడెంట్‌ని కొడతావా అంటూ మరొకరు... గొడవలకు దిగుతూ భవిష్యత్‌ను నాశనం చేసుకుంటున్నారు. ఇవన్నీ ‘రోగ్ గేమ్’లో భాగమే ► అశ్లీల పాటలు పాడించడం, అశ్లీల నృత్యాలు చేయించడం, ముద్దుపెట్టుకోమనడం... వంటివి. ► శారీరకంగా, మానసికంగా హింసించడం.. హింసకు సహ విద్యార్థులను ప్రేరేపించడం. ► విద్యార్థి చదువుపై ప్రభావం చూపిస్తూ అకడమిక్ యాక్టివిటీస్‌కు అంతరాయం కల్గించడం. ► జూనియర్స్ని సీనియర్ విద్యార్థులు తమ అకడమిక్ టాస్క్‌ని పూర్తి చేయాలని బలవంతం చేయడం. ► బలవంతంగా ఆర్థిక భారం పడేట్టు చేయడం. ► మాటల ద్వారా గానీ, మెయిల్స్, సందేశాల రూపంలోగాని, ఫోన్ ద్వారా గానీ టార్చర్ పెట్టడానికి ప్రయత్నించడం. పేరెంట్స్... ఇవి మీ కోసం ►ఇంట్లో సీనియర్ విద్యార్థి ఉంటే కాలేజీ అడ్మిషన్స్‌కు నెల రోజుల ముందు నుంచే వారితో- వేధించడం వల్ల జూనియర్స్‌కి కలిగే ఆవేదన, దాని వల్ల ఎదురయ్యే దుష్పరిణామాలను వివరించాలి. ►కొత్తగా కాలేజీకి వెళ్లే విద్యార్థి ఉంటే సీనియర్స్ నుంచి ఎదురయ్యే పరిణామాలు, వాటి నుంచి ఎలా బయటపడాలో జాగ్రత్తలు తెలియజేయాలి. ►సినిమాలలో ర్యాగింగ్ సన్నివేశాలు ఆనందాన్ని కలిగించవచ్చు. కానీ నిజజీవితాల్లో మాత్రం అలాంటి ఆనందాలు విషాదాలు నింపుతున్నాయి. చదువు మనిషిని ఉన్నతంగా మార్చాలి. అందుకు ఆటంకంగా నిలిచే ర్యాగింగ్ విషసంస్కృతికి నేడే చెక్ పెడదాం. - నిర్మలారెడ్డి, సాక్షి ఫీచర్స్ ప్రతినిధి రేప్‌తో సమానమైన కేసు! 1980 నుంచి ర్యాగింగ్ కేసులు నమోదు అవుతున్నా 1995 తర్వాత ఎక్కువ అవడంతో... డాక్టర్ రాఘవన్, యు.జి.సి ప్రొఫెసర్ కె.టి.ఎస్ ఉన్ని కమిటీ ఆధ్వర్యంలో... రేప్, అట్రాసిటీకి సమానమైన కేసుగా ర్యాగింగ్‌ను పరిగణించాలన్నారు. కోర్టులో నేరం రుజువైతే ఆ నేరాన్ని బట్టి 3 ఏళ్లకు పైగా జైలు శిక్ష, 25 వేల రూపాయలు ఆపైన జరిమానా ఉంటాయి. ఏడాది-నాలుగేళ్ల వరకు కాలేజీ నుంచి సస్పెండ్ చేయడం, ఇతర కాలేజీలలో ఎక్కడా అడ్మిషన్ ఇవ్వకపోవడం జరుగుతుంది. స్కాలర్షిప్ కూడా రద్దు చేస్తారు. పాస్‌పోర్ట్, వీసా.. వంటివీ క్యాన్సిల్ చేస్తారు. - నిశ్చల సిద్ధారెడ్డి, అడిషనల్ గవర్నమెంట్ ప్లీడర్ విజిలెన్స్ కమిటీలు జూనియర్లను స్వాగతించే సంస్కృతి సీనియర్ విద్యార్థుల్లో పెరగాలి. తోటి విద్యార్థులను గౌరవించడం నేర్చుకోవాలి. ర్యాగింగ్ నిరోధించేందుకు మా కళాశాల ప్రాంగణంలో, ప్రతి బ్లాక్‌లో కంట్రోల్ రూమ్ ప్రారంభించాం. హాస్టళ్ల వద్ద విజిలెన్స్ కమిటీలు ఏర్పాటు చేశాం. ప్రత్యేక విచారణ కమిటీ వే శాం. ర్యాగింగ్‌కు పాల్పడితే ఎలాంటి శిక్షలు ఉంటాయో విద్యార్థులకు అవగాహన కల్పిస్తున్నాం. నిత్యం పర్యవేక్షిస్తున్నాం. - జి. ఏసురత్నం, ప్రిన్సిపాల్ జేఎన్‌టియూ, విజయనగరం కౌన్సెలింగ్ మేలు! గతంలో సీనియర్స్ చేత వేధింపబడిన, మానసిక అపసవ్యత కలిగిన విద్యార్థులు తమకంటే చిన్నవారిని వేధించి, ఆనందించాలనుకుంటారు. వారు పెరిగిన వాతావరణం కూడా ఇందుకు దోహదం చేస్తుంది. ర్యాగింగ్ చేస్తారేమో అని జూనియర్స్ భయపడకుండా, ర్యాగింగ్ చేయాలనే తలంపు సీనియర్స్‌లో కలగకుండా కౌన్సెలింగ్ ద్వారా పరిస్థితిని చక్కదిద్దవచ్చు. - డా. సూర్యనారాయణ, సైకాలజిస్ట్ మిమ్మల్ని ర్యాగింగ్ చేస్తున్నారా? కళాశాలలో ర్యాగింగ్ కారణంగా ఎన్నో దారుణ సంఘటనలు, మరణాలను గుర్తించిన సుప్రీం కోర్టు భారత ప్రభుత్వ ఆధ్వర్యంలో 2009లో నేషనల్ యాంటీ-ర్యాగింగ్ హెల్ప్‌లైన్‌ను ప్రారంభించింది. ర్యాగింగ్‌కు గురయ్యే విద్యార్థులు... helpline@antiragging.in కు లాగిన్ అయ్యి, కంప్లైంట్ చేయవచ్చు. హెల్ప్‌లైన్ నెంబర్: 1800-180-5522 {పతి 15 నిమిషాలకు ఒక ఫిర్యాదు అందుతున్నట్టు హెల్ప్‌లైన్ ద్వారా తెలుస్తోంది. 2012లో antiragging.in అనే మరో పోర్టల్‌ను ప్రారంభించారు. ిఫిర్యాదు అందిన 24 గంటల నుంచి 48 గంటల్లోగా సదరు విద్యార్థికి న్యాయం జరిగేలా చర్యలు చేపడతారు. ఉన్నత విద్యాసంస్థల బాధ్యతలు ► {పతి కళాశాల యాజమాన్యం విద్యార్థిని చేర్చుకునేముందు తప్పక ఇన్స్ట్రక్షన్ బుక్లెట్/బ్రోచర్ అందజేయాలి. ► యాంటీ-ర్యాగింగ్ హెల్ప్‌లైన్ నెంబర్, మెయిల్ ఐడి, ఇతర ఫోన్ నెంబర్లు విధిగా ఆ నిబంధనల బుక్‌లెట్‌లో ఉండాలి. ► ఆ నెంబర్లను బుక్‌లో నోట్ చేసుకోమని విద్యార్థులకు తెలియజేయాలి. ఏ చిన్న అవాంతరం ఎదురైనా సమాచారాన్ని చేరవేయమని సూచించాలి. ► ర్యాగింగ్‌కు పాల్పడితే చట్టపరమైన చర్య తీసుకోవచ్చని విద్యార్థి తల్లిదండ్రుల చేత ఒక అఫిడవిట్‌ను తీసుకోవాలి. ► ర్యాగింగ్‌కు పాల్పడితే జరగబోయే నష్టాలు, తీసుకునే చట్టపరమైన శిక్షలను సూచిస్తూ కాలేజీల్లో డిస్ప్లే పోస్టర్లను అతికించాలి. ► కాలేజీల్లోనూ, హాస్టళ్లలోనూ ముందు కొన్ని నెలల పాటు యాంటీ-ర్యాగింగ్ స్క్వాడ్‌ను తప్పక నియమించాలి. తప్పనిసరి... ► జూనియర్స్-సీనియర్స్‌కి మధ్య కాలేజీ టైమింగ్స్ కనీసం 30 నిమిషాలైనా తేడా ఉండాలి. బస్‌స్టాప్స్, టీ స్టాల్స్ దగ్గర విద్యార్థులు గుమికూడుతుంటారు. కాలేజీ స్టార్ట్ అవడానికి అరగంట ముందు, కాలేజీ వదలిన అరగంట వరకు స్క్వాడ్స్ అక్కడ ఉండాలి. ► ముగ్గురు నలుగురు స్టూడెంట్స్ గుమిగూడకుండా చూడాలి. ► కాలేజీలో డ్రాప్‌బాక్స్ తప్పక ఉంచాలి. ► {పతి ఐదుగురికి ఒక లీడర్ని పెట్టి, వారితో ఫ్యాకల్టీ టచ్‌లో ఉండాలి. ► వేధింపులకు లోనైన సీనియర్స్ చేత జూనియర్ మీట్ పెట్టించాలి. ర్యాగింగ్ కమిటీలో సీనియర్ లీడర్స్, జూనియర్ లీడర్స్ తప్పక ఉండాలి. ► హాస్టల్లో అయితే సీనియర్స్ ప్రమేయం లేకుండా ఫ్రెషర్స్ కోసం సెపరేట్ బ్లాక్‌ను కేటాయించాలి. -
కార్పొరేట్ కాలేజీ పై నుంచి పడి విద్యార్థిని మృతి
తిరుపతి : చిత్తూరు జిల్లా తిరుపతిలోని ఓ కార్పొరేట్ కాలేజీ నాలుగో అంతస్తు పైనుంచి కిందపడి రేవతి(16) అనే విద్యార్థిని శుక్రవారం మృతిచెందింది. రేవతి ప్రస్తుతం బైపీసీ మొదటి సంవత్సరం చదువుతోంది. ఆమె స్వస్థలం పులిచర్ల మండలం బాలిరెడ్డిగారిపల్లె. అయితే కాలేజీ పై నుండి పడినప్పుడు ఆమె కొనఊపిరితో ఉండటంతో ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలోనే తనువు చాలించింది. ఈ విషయం తెలిసిన రేవతి తల్లిదండ్రులు వెంకట్‌రెడ్డి, లక్ష్మీదేవి కన్నీరుమున్నీరవుతున్నారు. ఇంటర్ పరీక్షలు జరుగుతున్న నేపథ్యంలో శుక్రవారం ఉమెన్స్ కాలేజీలో ఫిజిక్స్ పరీక్ష రాసి మధ్యాహ్నం తను చదువుతున్న కాలేజీకి వచ్చింది. ఇంతలోనే నాలుగో అంతస్తు మీద నుంచి కింద పడింది. రేవతి ఆత్మహత్య చేసుకుందా లేక ప్రమాదవశాత్తూ కింద పడిందా అనే విషయం తెలాల్సి ఉంది. కాగా కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఇదిలా ఉండగా... కాలేజీ యాజమాన్యం వేధింపులే తమ బిడ్డ మృతికి కారణమని రేవతి తల్లిదండ్రులు ఆరోపించారు. విద్యార్థిని మృతికి కళాశాల యాజమాన్యం బాధ్యత వహించాలని, మృతికి కారకులను వెంటనే అరెస్ట్ చేయాలంటూ కాలేజీ ఎదుట విద్యార్థి సంఘాలు ఆందోళనకు దిగడంతో వివాదం ముదిరిపోతోంది. -
కార్పొరేట్ కాలేజీ విద్యార్థుల జంప్!
పోలీసుల గాలింపు ఆందోళన చెందుతున్న తల్లిదండ్రులు విజయవాడ సిటీ : వారిద్దరూ ఆర్థికంగా స్థితిమంతుల కుటుంబాలకు చెందిన వారు. తల్లిదండ్రులు కోరినంత డబ్బు ఇవ్వడంతో విలాసంగా ఖర్చులు పెట్టేవారు. ఈ క్రమంలోనే ఒకరికొకరు పరిచయమై ప్రేమగా మారింది. అంతే నాలుగు రోజుల కిందట తాము చదివే కార్పొరేట్ కాలేజీ నుంచి అదృశ్యమయ్యారు. వారి ఆచూకీ కోసం పోలీసులు అన్ని చోట్లా గాలిస్తుంటే..ఏమయ్యారో తెలియక కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు. వివరాల్లోకి వెళితే..అనంతపురం జిల్లా తాడిపత్రికి చెందిన యువకుడు, గుంటూరు జిల్లా మంగళగిరికి చెందిన యువతి ఈస్ట్‌జోన్ పరిధిలోని ఓ కార్పొరేట్ కాలేజీలో ఇంటర్ ద్వితీయ సంవత్సరం చదువుతున్నారు. వీరి కుటుంబాలు ఆర్థికంగా బలమైనవి కావడంతో డబ్బును లెక్కలేకుండా ఖర్చు చేసేవారు. ఈ క్రమంలోనే వీరిద్దరికీ పరిచయం ఏర్పడింది. దీంతో నాలుగు రోజుల కిందట కాలేజీ నుంచి వారు కనిపించకుండా పోయారు. కాలేజీ నిర్వాహకుల సమాచారంతో ఇక్కడకు వచ్చిన కుటుంబ సభ్యులు.. తమ పిల్లలు కనిపించడం లేదంటూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు రంగంలోకి దిగిన పోలీసులు గుంటూరు, అనంతపురం, ఖమ్మం, హైదరాబాద్ తదితర ప్రాంతాల్లో గాలింపు జరిపారు. ఎక్కడా వీరి ఆచూకీ దొరకలేదు. మొబైల్ ఫోన్లు కూడా స్విచాఫ్ చేసి ఉండటంతో తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. తమ పిల్లల ఆచూకీ తెలపాలంటూ పోలీసులపై తీవ్రస్థాయిలో ఒత్తిళ్లు తెస్తున్నారు. వీరి అదృశ్యం వెనుక కాలేజీ నిర్వాహకుల నిర్లక్ష్యం ఉందంటూ పోలీసులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పిల్లలేం చేస్తున్నారో తెలుసుకోవాల్సిన నిర్వాహకులు పట్టించుకోకపోవడం వలనే ఇలాంటి ఘటనలు పునరావృతం అవుతున్నాయని వీరు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వారి వద్ద ఉన్న డబ్బులు ఖర్చయితే తప్ప కాలేజీ, ఇల్లు గుర్తుకు రావనే అభిప్రాయం పోలీసుల్లో వ్యక్తమవుతోంది. -
మరో విద్యార్థి బలవన్మరణం
పునాదిపాడు పరిధిలోని కార్పొరేట్ కాలేజీలో ఘటన మృతుడి స్వస్థలం చిత్తూరు జిల్లా పీలేరు సహచరులు పరీక్ష రాస్తుండగా గదికి వచ్చి ఆత్మహత్య కంకిపాడు : మండలంలోని పునాదిపాడు పరిధిలోగల ఓ కార్పొరేట్ కళాశాల హాస్టల్లో గురువారం ఓ ఇంటర్ విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. ఇందుకు కారణాలు తెలియలేదు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. చిత్తూరు జిల్లా పీలేరుకు చెందిన తరికొండ అశోక్‌కుమార్(17) పునాదిపాడు పరిధిలోని ఓ కార్పొరేట్ కళాశాలలో ఇంటర్ బైపీసీ రెండో సంవత్సరం చదువుతున్నాడు. ఇదే సంస్థకు చెందిన గొల్లపూడి శాఖలో జూని యర్ ఇంటర్ చదివి, రెండో సంవత్సరం ఇక్కడకు వచ్చాడు. కళాశాల ప్రాంగణంలోని హాస్టల్లో ఉంటున్నాడు. రోజూ మాదిరి గానే అశోక్ నిద్ర లేచాక స్నానాదికాలు ముగించుకుని రూమ్మేట్స్తో కలిసి బయటకు వచ్చాడు. కొంతసేపటి తరువాత రూమ్‌కు తిరిగి వచ్చాడు. అతడి రూమ్మేట్స్ కళాశాలలో జరి గే వారాంతపు పరీక్షకు హాజరయ్యారు. అశోక్ దీనికి హాజరు కా లేదు. దీంతో అధ్యాపకులు, సహచర విద్యార్థులకు అనుమానం వచ్చి ప్రాంగణంలో వెదికారు. రూమ్‌కు వచ్చి చూడగా.. దుప్పటితో సీలింగ్‌ఫ్యాన్‌కు ఉరివేసుకుని చనిపోయి ఉన్నాడు. డీన్ రవీంద్రకుమార్ అందజేసిన సమాచారం తో కంకిపాడు సర్కిల్ ఇన్స్పెక్టర్ ఆర్.జె.రవికుమార్, ఎస్ఐ జి.శ్రీనివాస్ సిబ్బందితో వచ్చి ఘటనాస్థలిని పరిశీలించారు. అశోక్‌కుమార్‌తో కలిసి రూమ్‌లో ఉం టున్న ఐదుగురు విద్యార్థుల నుంచి వివరాలు సేకరించారు. అశోక్ తండ్రి మల్లికార్జున్‌కు సమాచారం అందించారు. కన్నీరు మున్నీరైన సోదరి అశోక్ చదువుతున్న కళాశాలకు సమీపంలోని మరో శాఖలో అతడి అక్క లీలావతి ఎంసెట్ లాంగ్‌టర్మ్ కోచింగ్ తీసుకుంటోంది. కళాశాల సిబ్బంది ఈ ఘటన గురించి ఆమెకు తెలియజేసి, ఘటనాస్థలికి తీసుకువచ్చారు. తమ్ముడి మృతదేహాన్ని చూసి ఆమె గుండెలవిసేలా రోదించింది. తమ్ముడి బలవన్మరణంతో లీలావతి పడుతున్న వేదన చూపరుల కంటతడి పెట్టించింది. ఘటనాస్థలిని పరిశీలించిన ఏసీపీ అశోక్ ఆత్మహత్య చేసుకున్న గదిని ఈస్ట్‌జోన్ ఏసీపీ ఉమామహేశ్వరరాజు పరిశీలించారు. కాలేజీ సిబ్బంది నుంచి ఘటన వివరాలు అడిగి తెలుసుకున్నారు. గదిలో ఉన్న వస్తువులను స్వాధీనం చేసుకుని సమగ్ర పరిశీలన చేసి తగిన చర్యలు తీసుకోవాలని సిబ్బందిని ఆదేశించారు. ఈ ఘటన స్థానికంగా కలకలం సృష్టించింది. చదువులో ఒత్తిడి భరించలేకేనా? అశోక్ ఆత్మహత్య వెనుక కారణాలు తెలియడం లేదు. ఇంటర్ మొదటి సంవత్సరంలో 400 మార్కులు సాధించాడు. చదువులో విపరీతమైన ఒత్తిడి ఆత్మహత్యకు కారణమై ఉంటుందా? అనే అనుమానం ప్రధానంగా వ్యక్తమవుతోంది. లేక ఇంకేదైనా కారణం ఉందా? అని కూడా అనుమానిస్తున్నారు. ఘటనాస్థలిలో ఓ పెన్ను, నలిపి వేసిన పేపర్ పడి ఉన్నాయి. అయితే అందు లో ఏమీ రాయలేదు. ఆత్మహత్యకు కార ణం పుస్తకాల్లో రాసి ఉండవచ్చని పోలీసులు భావిస్తున్నారు. ఈ సందర్భంగా సీఐ రవికుమార్ విలేకరులతో మాట్లాడుతూ ఈ ఘటనపై కేసు నమోదు చేశామని చెప్పారు. ఆత్మహత్యకు కారణాలపై విచారణ చేస్తున్నామన్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం విజయవాడ ప్రభుత్వాస్పత్రికి తరలించామని తెలిపారు. -
కలగానే కార్పొరేట్ విద్య..!
ఇందూరు: పేద విద్యార్థులు సైతం కా ర్పొరేట్ కళాశాలల్లో చదవా లి.. ఉన్నతంగా ఎదగాలన్న ఉద్దేశంతో దివంగత ము ఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రవేశపెట్టిన కా ర్పొరేట్ కళాశాలల్లో ఉ చిత విద్య పథకం మ సకబారుతోంది. బ డుగు, బలహీనవర్గా ల విద్యార్థులకు వసతితో కూడిన ఉచిత విద్య అందని ద్రాక్షలా మారుతోంది. పదోతరగతిలో ప్రతిభ కనబర్చిన పేద విద్యార్థులకు ఇంటర్మీడియట్లో నాణ్యమైన విద్యను అం దించేందుకు ఈ పథకాన్ని ప్రవేశపెట్టారు. వైఎస్ హయాంలో సకాలంలో విద్యార్థుల ను ఎంపిక చేసి కార్పొరేట్ కళాశాలల్లో చేర్పించేవారు. అనంతరం ఈ పథకం అమలులో జాప్యం పెరుగుతూ వస్తోంది. విద్యాసంవత్సరం ప్రారంభమై.. తరగతులు నడుస్తున్నా.. విద్యార్థుల ఎంపికను మాత్రం చేపట్టడం లేదు. ఓ వైపు తరగతులు కొనసాగుతుండటం.. కళాశాలల్లో సీట్లు నిండిపోతుండటంతో పేద విద్యార్థులు ఈ పథకానికి దూరమవుతున్నారు. చేసేది లేక ఏదో కళాశాలలో చేరుతున్నారు. సమయానికి నోచుకోక 2014-15 విద్యాసంవత్సరానికి సంబంధించి జిల్లా లో ప్రభుత్వ, ప్రైవేటు కళాశాలలలో ఈపాటికే ప్రవేశాలు 80శాతం పూర్తయ్యాయి. తరగతులు కూడా ప్రారంభం కానున్నాయి. పేద విద్యార్థుల కోసం కా ర్పొరేట్ కళాశాలలల్లో కేటాయించిన సీట్లపై మాత్రం ఇంకా ఎలాంటి సమాచారం లేదు. ప్రతి సంవత్సరం జూన్ మొదటి వారంలో ఆన్లైన్ ద్వారా దరఖాస్తులకు నోటిఫికేషన్ జారీ చేసి, విద్యార్థుల దరఖాస్తులు ఆహ్వానించాలి. ఈవిషయంలో ప్రభుత్వం జాప్యం చేస్తుండటంతో నెలరోజులు ఆలస్యంగా పేద విద్యార్థులు తరగతి గదిలో కాలు పెట్టాల్సి పరిస్థితి. మిగిలిపోతున్న సీట్లు ఎస్సీ,ఎస్టీ,బీసీ,మైనార్టీ కలిపి జిల్లాకు మొత్తం 183 సీట్లు ఉన్నాయి. ఇందులో బాలికలకు 110, బాలురకు 73 సీట్లుగా విభజించారు. ప్రతిఏటా సకాలంలో నోటిఫికేషన్ ఇవ్వకపోవడంతో చాలామంది విద్యార్థులు తప్పనిసరి పరిస్థితుల్లో ఫీజులు వెచ్చించి ప్రైవేటు కళాశాలలో ప్రవేశాలు పొందుతున్నారు. దీంతో ఈ పథకానికి సంబంధించి పదుల సంఖ్యలో సీట్లు ఖాళీగానే మిగిలిపోతున్నాయి. ఈ పథకంపైనే ఆశలు పెట్టుకుని ఉన్న విద్యార్థులు తరగతులు ప్రారంభమైన నెలరోజులకు కళాశాలల్లో ప్రవేశిస్తున్నారు. దీంతో చాలా సబ్జెక్టుల్లో వారు వెనుకబడుతున్నారు. విద్యార్థులు ఆలస్యంగా ప్రవేశాలు పొందుతున్నా వసతికి అయ్యే ఖర్చును లెక్కకడుతూ సంబంధిత కళాశాలలు లబ్ధి పొందుతున్నాయి. సాంకేతిక లోపంతోనే విద్యార్థుల నుంచి ఆన్లైన్లో ఈ-పాస్ ద్వారా దరఖాస్తులను ఆహ్వానిస్తారు. ఈ సైట్లో సాంకేతిక లో పం తలెత్తడంతోనే కార్పొరేట్ ఉచిత విద్య పథకానికి బ్రేక్ పడిందని అధికారులు పేర్కొంటున్నారు. రాష్ట్రస్థాయి అధికారులు స్పందిస్తేనే సమస్య పరిష్కారమవుతుందని జిల్లా అధికారులు పేర్కొంటున్నారు. నో టిఫికేషన్ జారీ చేసిన పక్షం రోజుల్లో సీట్లు భర్తీ చే యాల్సి ఉంటుంది. జిల్లాలో పేదవిద్యార్థులకు కార్పొరేట్ విద్యను అందించేందుకు శ్రీ కాకతీయ, న్యూ కా కతీయ, శాంకరీ, నిర్మల హృదయ, క్షత్రియ జూని యర్ కళాశాలలను ఎంపిక చేసినట్లు అధికారులు తె లిపారు. ప్రభుత్వం త్వరగా నోటిఫికేషన్ జారీ చేయాలని లేదంటే తరగతులు కోల్పోవాల్సి వస్తుందని విద్యార్థులు, వారి తల్లిదండ్రులు కోరుతున్నారు. -
కార్పొరేట్ కళాశాల హాస్టల్లో ఇంటర్ విద్యార్థి ఆత్మహత్య
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ నల్లకుంటలోని ఓ కార్పొరేట్ కాలేజీ హాస్టల్లో ఇంటర్ విద్యార్థి ముత్యాల ప్రణీత్ కుమార్‌రెడ్డి(17) ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కరీంనగర్ జిల్లా హుస్నాబాద్‌కు చెందిన ముత్యాల సంజీవరెడ్డి కుమారుడు ప్రణీత్(17) నల్లకుంటలోని నారాయణ కళాశాలలో ఇంటర్ ఫస్టియర్ చదువుతున్నాడు. వైభవ్‌నగర్ కాలనీలోని కళాశాల హాస్టల్లో ఉంటున్నాడు. ఇటీవలే రెండో సంవత్సరం తరగతులు మొదలయ్యాయి. శుక్రవారం కళాశాలకు వెళ్లిన ప్రణీత్.. స్టడీ అవర్ ముగిశాక పదిగంటలకు హాస్టల్‌కు వచ్చాడు. అర్ధరాత్రి 12.30 సమయంలో ప్రణీత్ స్నేహితుడు సూర్యతేజ బాత్రూమ్కని వెళ్లాడు. బాత్రూమ్ తలుపులు తడితే ఎవరూ తెరవడం లేదు. అనుమానం వచ్చి వెంటిలేటర్ నుంచి లోపలకు చూడగా గీజర్‌కు ప్రణీత్ టవల్‌తో ఉరివేసుకుని కనిపించాడు. వెంటనే బాత్రూమ్ తలుపులు విరగొట్టి ప్రణీత్‌ను ఆస్పత్రికి తీసుకెళ్లేందుకు ప్రయత్నిస్తుండగానే అతను మరణించాడు. అంబర్‌పేట పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని శవాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. వేధింపులే నా కుమారుడి చావుకు కారణం: నారాయణ కళాశాల యాజమాన్యం ఫీజులకోసం ఘోరంగా వేధిస్తోందని, తన కు మారుడ్నీ అలా వేధించారని ప్రణీత్ తండ్రి సంజీవరెడ్డి ఆరోపించా రు. విద్యార్థుల్ని నలుగురిలో అవమానిస్తున్నారని, తన కుమారుడ్నీ అలా అవమానించారని, అతని చావుకు కాలేజీ యాజమాన్యానిదే బాధ్యతని అంబర్‌పేట పోలీసులకిచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నాడు. -
కార్పొరేట్ కళాశాలలో రెచ్చిపోయిన లెక్చరర్
నల్లకుంట: నగరంలోని ఓ కార్పొరేట్ కళాశాలలో తరగతుల పునః ప్రారంభమైన రోజే జూనియర్ లెక్చరర్ ఓ విద్యార్థి పట్ల అమానుషంగా ప్రవర్తించాడు. పేపర్లు కింద పడేశాడంటూ ఆగ్రహంతో ఊగిపోయిన సదరు లెక్చరర్ అతణ్ణి చెప్పుతో చితక బాదాడు. అంతటితో ఆగకుండా తలను గోడకేసి కొట్టిన సంఘటన నల్లకుంట పోలీస్‌స్టేషన్ పరిధిలో సోమవారం జరగ్గా మంగళవారం వెలుగు చూసింది. బాధిత విద్యార్థి రాహుల్, అతని బంధువులు కె.ఆంజనేయులు, మనోజ్‌కుమార్, టీఆర్ఎస్ నగర ప్రధాన కార్యదర్శి సురేందర్గౌడ్ల కథనం ప్రకారం వివరాలు ఇలా... హబ్సిగూడకు చెందిన కె.వెంకటనారాయణ, శ్రీలలిత దంపతుల కుమారుడు కె.రాహుల్(17) నల్లకుంట మెయిన్ రోడ్డులోగల నారాయణ జూనియర్ కళాశాలలో ఇంటర్ (ఎంపీసీ) మొదటి సంవత్సరంలో చేరాడు. సోమవారం తరగతులు ప్రారంభం కావడంతో రాహుల్ ఉద యం 9 గంటలకు కళాశాలకు వచ్చాడు. మొద టి రోజే కళాశాలకు అరగంట ఆలస్యంగా రావడంతో అతణ్ణి తరగతిలోకి వెళ్లనీయకుండా ఓ అధ్యాపకుడు రెండు గంటలపాటు బయటే కూర్చోబెట్టారు. ఆ తరువాత తరగతి గదిలోకి వెళ్లిన రాహుల్ అక్కడ టేబుల్‌పై ఉన్న పేపర్లు కిందపడి ఉండగా వాటిని తీసి టేబుల్‌పై పెట్టా డు. అదే సమయంలో గదిలోకి వచ్చిన సునిల్ పురువార్ అనే లెక్చరర్ ‘నా పేపర్లు కింద పడేస్తావా?’ అంటూ కోపంతో రాహుల్‌పై చేయిచేసుకున్నాడు. అంతటితో ఆగకుం డా చెప్పుతో కొట్టి తలను గోడకేసి బాదాడు. మరో తరగతి గదిలోకి తీసుకు వెళ్లి విద్యార్థుల ముందు మరోమారు విచక్షణా రహితంగా కొట్టాడు. దీంతో తోటి విద్యార్థులు భయంతో వణికిపోయారు. సాయంత్రం ఇంటికి వెళ్లిన రాహుల్ విషయా న్ని తల్లిదండ్రులకు చెప్పాడు. దీంతో మంగళవారం ఉదయం విద్యార్థి తల్లిదండ్రులు, బంధువులు కళాశాల వద్దకు చేరుకుని ఆందోళనకు దిగారు. విషయం తెలుసుకున్న నల్లకుంట ఇన్స్పెక్టర్ జయపాల్‌రెడ్డి కళాశాల వద్దకు చేరుకుని పరిస్థితిని చక్కదిద్దారు. ఆ తరువాత ప్రిన్సి పాల్ తన కార్యాలయంలో సీఐతోపాటు విద్యా ర్థి తల్లిదండ్రులు, బంధువులు, విద్యార్థిపై చేయిచేసుకున్న లెక్చరర్‌తో చర్చలు జరిపారు. సదరు లెక్చరర్‌తో క్షమాపణ చెప్పించారు. సదరు లెక్చరర్‌ను ఉద్యోగంలో నుంచి తొలగి స్తున్నట్టు ప్రిన్సిపాల్ ప్రకటించడంతో గొడవ సద్దుమణిగింది. విద్యార్థిపై దాడి జరిగిన విషయాన్ని తెలుసుకున్న ఏబీవీపీ రాష్ర్ట కార్యవర్గ సభ్యుడు శ్రీకాంత్ కళాశాల వద్దకు చేరుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సదరు లెక్చరర్‌ను ఇతర బ్రాంచ్‌ల్లో ఎక్కడా తీసుకోకూడదని యాజమాన్యాన్ని డిమాండ్ చేశారు. -
పేద విద్యార్థులకు ఉచిత విద్య
మంచిర్యాల సిటీ, న్యూస్‌లైన్ : పదో తరగతి వరకు విద్యాశాఖ ఆధ్వర్యంలో నవోదయ, కేజీబీవీ, ఆశ్రమ, గురుకుల, ఎయిడెడ్ పాఠశాలల్లో పేద విద్యార్థులకు ఉచితం వసతులతోపాటు చదువును అందిస్తోంది. దీనికి తోడుగా విద్యార్థి జీవితాన్ని మలుపుతిప్పేది ఇంటర్మీడియెట్ విద్య కూడా కావడంతో ప్రభుత్వ విద్యాసంస్థల్లో పదోతరగతి చదివి ఉత్తీర్ణులైన విద్యార్థులకు కార్పొరేట్ కళాశాలల్లో ఉచితంగా చదువు చెప్పించడానికి విద్యాశాఖ తాజాగా ఆదేశాలు జారీ చేసింది. ఇందుకు 2014-2015 విద్యాసంవత్సరానికి సంబంధించిన జీవో.ఎంఎస్.సంఖ్య. 235. ఎస్.డ బ్ల్యూ,(ఎడ్యుకేషన్-2), తేదీ: 28-03-2011 ద్వారా ఉత్తర్వులు జారీ చేసింది. జిల్లాలో అర్హులైన వారిలో నుంచి 260 మంది విద్యార్థులకు కార్పొరేట్ కళాశాలల్లో ఇంటర్ చదువుతోపాటు ఎంసెట్ శిక్షణ, వసతి కూడా ఉచితంగా లభిస్తుంది. విద్యార్థుల ఎంపిక, కళాశాలల్లో ప్రవేశం, ఫీజుల చెల్లింపు సౌకర్యాలను ఏర్పర్చడానికి సాంఘిక సంక్షేమ శాఖ అధికారులు బాధ్యత వ హిస్తారు. హైదరాబాద్‌లోని చైతన్య, నారాయణ, శ్రీగాయత్రి వంటి కార్పొరేట్ కళాశాలల్లో చేరడానికి కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తుల స్వీకరణ ఈనెల 5వ తేదీ నుంచి 14వ తేదీ వరకు పదో తరగతి ఉత్తీర్ణులైన విద్యార్థులు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి. తెలంగాణ రాష్ట్రంలోని పది జిల్లాలోని విద్యార్థికి నచ్చిన కార్పొరేట్ కళాశాలలో చేరడానికి దరఖాస్తు చేసుకోడానికి అవకాశం ఉంది. పదో తరగతిలో విద్యార్థి సాధించిన ప్రతిభ ఆధారంగా ఈ నెల 16తేదీన అధికారులు కళాశాలను ఎంపిక చేసి ప్రవేశం కల్పిస్తారు. అర్హులు ప్రభుత్వ సంక్షేమ, ఆశ్రమ, కేజీబీవీ పాఠశాలల్లో చదివిన వారికి 50 శాతం, రెసిడెన్సియల్, ప్రభుత్వ ఉన్నత పాఠశాలల్లో చదివిన విద్యార్థులకు 20 శాతం, జిల్లా పరిషత్, ఎయిడెడ్ పాఠశాలల్లో చదివిన వారికి 25 శాతం, అత్యుత్తమ ప్రైవేటు పాఠశాలల్లో చదివిన వారికి 5 శాతం చొప్పున సీట్లు కేటాయిస్తారు. బీసీ, ఈబీసీ, మైనార్టీ విద్యార్థుల తలితండ్రుల వార్షికాదాయం రూ.లక్ష, ఎస్సీ, ఎస్టీ విద్యార్థుల తల్లిదండ్రుల ఆదాయం రూ.2 లక్షల వరకు ఉండాలి. పదో త రగతిలో సాధించిన ప్రగతి కూడా పరిగణలోకి తీసుకొని ఎంపిక చేస్తారు. దరఖాస్తు విధానం ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోడానికి ముందు విద్యార్థి కులం, ఆదాయం, ఆధార్‌కార్డు, ఐఈడీ, రేషన్ కార్డు, పదో తరగతి గ్రేడింగ్, పదో తరగతి హాల్‌టికెట్టు, పుట్టిన తేదీ, తల్లిదండ్రుల చిరునామా వివరాలను సిద్ధం చేసుకోవాలి. వీటి ఆధారాలతో ఆన్లైన్లో దర ఖాస్తు చేసుకోడానికి వీలు క లుగుతుంది. -
కార్పొరేట్ కాలేజీలో ప్రిన్సిపల్ వీరంగం
-
కార్పొరేట్ కాలేజీలో ప్రిన్సిపల్ వీరంగం
విజయవాడ : విజయవాడలోని ఓ కార్పొరేట్ కళాశాల ప్రిన్సిపల్ వీరంగం సృష్టించాడు. దాంతో ఎంసెట్ పరీక్ష రాయాల్సిన విద్యార్థులు ఆస్పత్రి పాలయ్యారు. వివరాల్లోకి వెళితేపెనమలూరు తాడిగడపలోని ఓ కళాశాలలో విద్యార్థులను గదిలో బంధించి ఐరన్ రాడ్‌తో విద్యార్థులను చితకబాదాడు. ఈ ఘటనలో సుమారు 20మంది విద్యార్థులు తీవ్రంగా గాయపడ్డారు. స్టడీ అవర్‌లో అరగంట ముందే నిద్ర పోయారనే నెపంతో ప్రిన్సిపల్ ఈ ఘాతుకానికి పాల్పడ్డాడు. విద్యార్థుల కాళ్లు, చేతులకు తీవ్ర గాయాలై ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. దాంతో నేడు జరగనున్న ఎంసెట్ ప్రవేశ పరీక్షకు విద్యార్థులు హాజరు కాలేని స్థితిలో ఉన్నారు. విద్యార్థుల తల్లిదండ్రులు ప్రిన్సిపల్ దుశ్చర్యపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. -
పేద విద్యార్థులకు వరం
కడు పేదరికం ముందు ఆ కుటుంబాల్లోని విద్యార్థులకు కార్పొరేట్ విద్య గగన కుసుమం అవుతున్న తరుణంలో మహానేత... మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ వై.ఎస్.రాజశేఖరరెడ్డి ప్రవేశపెట్టిన ఫీజు రీయింబర్స్‌మెంటు పథకం పేద విద్యార్థుల చదువులకు ప్రాణం పోసింది. ఉన్నత చదువు చదివి తర్వాత ఉద్యోగమొస్తే అది బతుకు తెరువు అవుతుంది. అయితే చదువుకునేటప్పడే ఫీజు రీయింబర్స్‌మెంటును డాక్టర్ వై.ఎస్. ఇచ్చి పేద పిల్లల చదువుకు ఓ తెరువును చూపించిన దేవుడు. ఫీజు రీయింబర్స్‌మెంటు వల్ల నాలాంటి సామాన్య కుటుంబాలకు చెందిన ఆడపిల్లలే కాదు..పేద కుటుంబాలకు చెందిన అనేకమంది విద్యార్థులు కార్పొరేట్ కళాశాలల మెట్లు ఎక్కి గౌరవప్రదంగా చదువుకుంటున్నారు. ఇదంతా మహనేత వై.ఎస్.పుణ్యమే. - ఆచంట సౌందర్య. ఎంసీఏ విద్యార్థిని, భట్లపాలెం బీవీసీ ఇంజనీరింగ్ కళాశాల -
కార్పొరేట్ వల
మంచిర్యాల సిటీ, న్యూస్‌లైన్ : 2014-15 విద్యా సంవత్సరం ప్రారంభానికి నాలుగు నెలల ముందే కార్పొరేట్ కళాశాలలు ప్రవేశాలకు తెరలేపాయి. ‘పది’ పరీక్షలే పూర్తికాలేదు కార్పొరేట్ కళాశాల ప్రచారం జోరందుకుంది. ముందస్తుగానే పది చదువుతున్న విద్యార్థుల తల్లిదండ్రులను, పాఠశాలల యాజమన్యాలను కలుస్తూ ‘బుక్’ చేసుకుంటున్నాయి. ఇందుకోసం పాఠశాలల నిర్వాహకులకు నజరానాలు ఇస్తామని ప్రకటిస్తున్నాయి. విద్యార్థుల తల్లిదండ్రులకు ఫీజులో రాయితీ ఇస్తామని నమ్మ బలుకుతున్నారు. ఇక పాఠశాలల యాజమాన్యాలకు విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా డబ్బులు లేదా బహుమతులు ఇస్తామని చెబుతున్నారు. జిల్లాలోని కళాశాలతోపాటు కరీంనగర్, వరంగల్లు, హైదరాబాద్, విజయవా డ, నెల్లూరు, గుంటూరు ప్రాంతాలకు చెందిన పలు కా ర్పొరే టు కళాశాలల యాజమాన్యాలు పబ్లిక్ రిలేషన్ ఆఫీసర్స్(పీఆర్వో)లను రంగంలోకి దింపాయి. నిబంధనల కు విరుద్ధంగా అడ్మిషన్లు తీసుకుంటున్నా అధికార యం త్రాంగం చూసీ చూడనట్లు వ్యవహరిస్తోంది. నిబంధనల ప్రకారం పదో తరగతి ఫలితాలు విడుదలయ్యాక జూన్ లో ప్రవేశాలు తీసుకోవాలి. ఇందుకోసం ఎలాంటి ప్రచారాలు చేయకూడదు. పీఆర్వోల ద్వారా నియామకాలు చేసుకోకూడదు. పీఆర్వోలు ఏం చేస్తారు.. కార్పొరేట్ కళాశాలలు ప్రజలతో సంబంధాలు అధికంగా ఉన్న వివిధ సంస్థల ఇన్సూరెన్స్ ఏజెంట్లు, ప్రభుత్వ, ప్రైవేట్ ఉపాధ్యాయులు, లెక్చరర్లు, ట్యూషన్ సెంటర్ల నిర్వాహకులను నియమించుకుంటున్నాయి. వీరు మొదట ప్రైవేటు పాఠశాలలను ఎంపిక చేసుకుంటారు. ఆ పాఠశాలల యాజమాన్యానికి రూ.3 వేల నుంచి రూ.10 వేల వరకు కళాశాలలో చేరిన ఒక్కొక్క విద్యార్థికి కళాశాలల స్థాయిని బట్టి ఇవ్వడానికి ఒప్పందం చేసుకుంటారు. విద్యార్థి వివరాలు, ఇంటి ఫోన్ నంబర్ తీసుకుంటారు. కళాశాల బాగుంటుందని మాయమాటలు చెప్పి విద్యార్థును అడ్మిషన్ చేసుకునే ప్రయత్నం చేస్తారు. అయితే ఈ పీఆర్వోలకు, ఏజెంట్లకు కళాశాల యాజమాన్యాలు నెలకు రూ.8 వేల వరకు ఏడాది పొడవునా జీతం రూపంలో చెల్లిస్తున్నాయి. లేకపోతే విద్యార్థి చొప్పున కమిషన్ ఇస్తున్నారు. కోల్‌బెల్ట్ ప్రాంతంలోనే పీఆర్వోలు అధికంగా ఉన్నారు. దాదాపు పదికిపైగా మహిళలు, 50 మందికిపైగా పురుషులు పీఆర్వోలుగా పనిచేస్తున్నారు. వీరిలో ఎక్కువ మంది స్థానిక ప్రైవేటు పాఠశాలల్లో పనిచేసే వారే. అడ్మిషన్ పూర్తయ్యిందంటే మళ్లీ ఏడాది వరకు కనిపించరు. ఏటా జిల్లాదాటుతున్న 5 వేల మంది విద్యార్థులు జిల్లా నుంచి ఏటా సుమారు 40 వేల మంది విద్యార్థులు పదో తరగతి పరీక్షకు హాజరైతే 35 వేలకు పైగా ఉత్తీర్ణులు అవుతున్నారు. వీరిలో దాదాపు ఐదు వేల మంది విద్యార్థులు కార్పొరేటు బాట పడుతున్నారు. అయితే వీరిలో కళాశాల నచ్చకనో దాదాపు 20 శాతం మంది విద్యార్థులు ఇంటిబాట పడుతున్నారు. వీరి పేరిట చెల్లించిన ఫీజు మాత్రం యాజమాన్యాలు ఇవ్వవు. మాయమాటలకు మోసపోవద్దు.. కళాశాలల్లో పిల్లలను చేర్చేటప్పుడు విశాలమైన తరగతి, పడక గదులు, భోజనం, అవసరాలకు, తాగడానికి నీటి సరఫరా, బాలికల కళాశాలల్లో మహిళా నిర్వహకులు, ప్రయోగశాల, అధ్యాపక బృందం, కళాశాల గుర్తింపు, ప్రతి సెక్షనుకు విద్యార్థుల సంఖ్య, మైదానం వంటి అవసరాలను ప్రత్యేకంగా తల్లిదండ్రులు వెళ్లి చూసుకోవాలి. పలు కళాశాలలు ఇంటర్ మొదటి ఏడాది చదువును ఒక బ్రాంచిలో పూర్తిచేసి, రెండో సంవత్సరం చదువును మరో బ్రాంచిలో చెబుతారు. ప్రత్యక్షంగా చూసిన తర్వాతనే నిర్ణయం తీసుకోవాలి. -
నా చావుకు కళాశాల యాజమాన్యమే కారణం
=మలుపు తిరిగిన ఆత్మహత్య కేసు =సూసైడ్‌నోట్‌లో విద్యార్థిని వేదన పెనమలూరు, న్యూస్‌లైన్ : కానూరులోని ఓ కార్పొరేట్ కళాశాలలో నాలుగు రోజుల క్రితం విద్యార్థిని ఆత్మహత్య ఘటన మలుపు తిరిగింది. తన మరణానికి కారణం కాలేజీలో ఒత్తిడి, అనారోగ్యం అని పేర్కొంటూ ఆమె రాసిన సూసైడ్‌నోట్ గురువారం దొరికింది. దీనిపై న్యాయ వి చారణ చేయాలని మృతురాలి తండ్రి డిమాండ్ చేస్తున్నారు. కానూరులోని కార్పొరేట్ కళాశాలలో ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతున్న గుత్తికొండ విద్య ఈ నెల 23న ఉరివేసుకుని మృ తి చెందింది. చిల్లకల్లులో ఉంటున్న తల్లిదండ్రుల వద్ద నుంచి వచ్చిన రెండురోజులకే ఆమె చనిపోవటంతో కుటుంబసభ్యులు అనుమానం వ్యక్తం చేశారు. కాలేజీ హాస్టల్లో ఉన్న ఆమె వస్తువులు తీసుకు వెళ్లటానికి తండ్రి పూర్ణచంద్రరావు, బంధువులు గురువారం వచ్చారు. ఆమె పుస్తకాలు సర్దుతుండగా నోట్‌బుక్‌లో రాసిన రెండు పేజీల సూసైడ్ నోట్ కనిపించింది. ‘నేను మెంటల్‌గా చాలా టార్చర్ ఫేస్ చేస్తున్నాను, భవిష్యత్తును ఎదుర్కొనే ధైర్యం లేదు. ర్యాంక్ రాకపోతే మిమ్ములను బాధ పెట్టడం ఇష్టంలేదు. నాలాంటి చాలామంది ఆడపిల్లలు కాలేజీలో ఉండలేక వారిలో వారే ఏడుస్తున్నారు. నా తల లో ఏదో పెద్ద గడ్డ ఉన్నట్లు ఉంది. చాలా నొప్పి గా ఉంది. బాగా చదువుతున్న అక్కను మంచి యూనివర్శిటీలో చదివించండి. నేను చచ్చి పో దామని డిసైడ్ అయ్యాను. నా చావుకు కాలేజీ యా జ మాన్యమే కారణం’ అని అం దులో ఉంది. దీనిపై మృతురాలి తండ్రి ఫిర్యాదు మేరకు సీఐ ధర్మేంద్ర వచ్చి సూసైడ్ నోట్‌ను స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా విద్య తండ్రి పూర్ణచంద్రరావు మీ డియాతో మాట్లాడుతూ కా లేజీ యాజమాన్యం వైఖ రితోనే తన కుమార్తె చనిపోయిందని అన్నారు. తమకున్న సమాచారం ప్రకారం విద్య చనిపోయినప్పుడు సూసైడ్ నోట్ ఆమె చేతిలో ఉందని, దానిని కాలేజీ యా జమాన్యం దాచిందని ఆరోపించారు. సూసైడ్ నోట్ పోలీసులకు చిక్కకుండా యాజమాన్యం జాగ్రత్తలు తీసుకుందని, ఈ ఘటనపై న్యాయ విచారణ చేయాలని డిమాండ్ చేశారు. -
విజయవాడలో ఇంటర్ విద్యార్థిని ఆత్మహత్య
విజయవాడ: ఇంటర్ విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన సోమవారం స్థానికంగా కలకలం రేపింది. విజయవాడ శివారులోని ఓ కార్పొరేట్ కాలేజీలో ఇంటర్ చదువుతున్న విజయ అనే విద్యార్థిని ఆత్మహత్య పాల్పడింది. విజయ కృష్ణాజిల్లాలోని జగ్గయపేట చిల్లకల్లు మండలానికి చెందిన విద్యార్థినిగా పోలీసులు గుర్తించారు. విజయ ఆత్మహత్యకు గల కారణాలు తెలియరాలేదు.