కార్పొరేట్ కాలేజీలో ప్రిన్సిపల్ వీరంగం | Principal beats up students by iron rod, studens hospitalized | Sakshi
Sakshi News home page

కార్పొరేట్ కాలేజీలో ప్రిన్సిపల్ వీరంగం

Published Thu, May 22 2014 8:39 AM | Last Updated on Sat, Sep 2 2017 7:42 AM

Principal beats up students by iron rod, studens hospitalized

విజయవాడ : విజయవాడలోని ఓ కార్పొరేట్ కళాశాల ప్రిన్సిపల్ వీరంగం సృష్టించాడు. దాంతో  ఎంసెట్ పరీక్ష రాయాల్సిన విద్యార్థులు ఆస్పత్రి పాలయ్యారు. వివరాల్లోకి వెళితేపెనమలూరు తాడిగడపలోని ఓ కళాశాలలో విద్యార్థులను గదిలో బంధించి ఐరన్ రాడ్తో విద్యార్థులను చితకబాదాడు. ఈ ఘటనలో సుమారు 20మంది విద్యార్థులు తీవ్రంగా గాయపడ్డారు.

స్టడీ అవర్లో అరగంట ముందే నిద్ర పోయారనే నెపంతో ప్రిన్సిపల్ ఈ ఘాతుకానికి పాల్పడ్డాడు. విద్యార్థుల కాళ్లు, చేతులకు తీవ్ర గాయాలై ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. దాంతో నేడు జరగనున్న ఎంసెట్ ప్రవేశ పరీక్షకు విద్యార్థులు హాజరు కాలేని స్థితిలో ఉన్నారు. విద్యార్థుల తల్లిదండ్రులు ప్రిన్సిపల్ దుశ్చర్యపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement