సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ నల్లకుంటలోని ఓ కార్పొరేట్ కాలేజీ హాస్టల్‌లో ఇంటర్ విద్యార్థి ముత్యాల ప్రణీత్ కుమార్‌రెడ్డి(17) ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కరీంనగర్ జిల్లా హుస్నాబాద్‌కు చెందిన ముత్యాల సంజీవరెడ్డి కుమారుడు ప్రణీత్(17) నల్లకుంటలోని నారాయణ కళాశాలలో ఇంటర్ ఫస్టియర్ చదువుతున్నాడు. వైభవ్‌నగర్ కాలనీలోని కళాశాల హాస్టల్‌లో ఉంటున్నాడు. ఇటీవలే రెండో సంవత్సరం తరగతులు మొదలయ్యాయి. శుక్రవారం కళాశాలకు వెళ్లిన ప్రణీత్.. స్టడీ అవర్ ముగిశాక పదిగంటలకు హాస్టల్‌కు వచ్చాడు. అర్ధరాత్రి 12.30 సమయంలో ప్రణీత్ స్నేహితుడు సూర్యతేజ బాత్‌రూమ్‌కని వెళ్లాడు. బాత్‌రూమ్ తలుపులు తడితే ఎవరూ తెరవడం లేదు.
అనుమానం వచ్చి వెంటిలేటర్ నుంచి లోపలకు చూడగా గీజర్‌కు ప్రణీత్ టవల్‌తో ఉరివేసుకుని కనిపించాడు. వెంటనే బాత్‌రూమ్ తలుపులు విరగొట్టి ప్రణీత్‌ను ఆస్పత్రికి తీసుకెళ్లేందుకు ప్రయత్నిస్తుండగానే అతను మరణించాడు. అంబర్‌పేట పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని శవాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు.
వేధింపులే నా కుమారుడి చావుకు కారణం: నారాయణ కళాశాల యాజమాన్యం ఫీజులకోసం ఘోరంగా వేధిస్తోందని, తన కు మారుడ్నీ అలా వేధించారని ప్రణీత్ తండ్రి సంజీవరెడ్డి ఆరోపించా రు. విద్యార్థుల్ని నలుగురిలో అవమానిస్తున్నారని, తన కుమారుడ్నీ అలా అవమానించారని, అతని చావుకు కాలేజీ యాజమాన్యానిదే బాధ్యతని అంబర్‌పేట పోలీసులకిచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నాడు.