‘స్మార్ట్’ బాదుడు..!
కార్పొరేట్ కళాశాలల మాయ
ఆకర్షణీయ కోర్సుల పేరుతో విద్యార్థులకు వల
ఇంటర్‌లో ఏడాదికి రూ. 3 లక్షలు వసూలు
సిటీబ్యూరో: ఎంపీఎల్, ఐపీఎల్, ఎన్‌పీఎల్, ఐసీసీ, ఎంసీసీ, ఐకాన్, స్పార్క్... ఇవే వో క్రికెట్ లీగ్ పోటీలు అనుకుంటున్నారా? అయితే పొర పాటుపడ్డట్లే. ఇంటర్మీడియెట్ విద్యనందించే పలు కార్పొరేట్ కళాశాలలు అందించే ఆయూ కోర్సులకు వాటి యాజమాన్యాలు ఆక ర్షణీయంగా పెట్టుకున్న పేర్లివి. ఎంపీఎల్-మెడిసిన్ ప్రీమియర్ లీగ్, ఐపీఎల్ - ఐఐటీ ప్రీమియర్ లీగ్, ఎన్‌పీఎల్-ఏఐఈఈఈ.. ఇలా సంక్షిప్త పేర్లతో విద్యార్థులకు వల వేస్తున్నారు. ఆ పేర్ల మాదిరిగానే.. ఆయా కోర్సుల్లో చేరే విద్యార్థుల నుంచి భారీగా ఫీజులు దండుకుంటున్నారు. కోర్సుని బట్టి ఏడాదికి వసూలు చేస్తున్న ఫీజు ఎంతో తెలిస్తే.. దిమ్మ తిరగాల్సిందే. ఏడాదికి గరిష్టంగా రూ. 2.50 లక్షల నుంచి రూ. 3 లక్షల వరకు లాగుతున్నారు. ఇంటర్‌తో సహా ఐఐటీ, ఎంసెట్, ఎయిమ్స్, జిప్‌మర్, సీఏ సీపీటీ.. తదితర ప్రవేశ పరీక్షలకు కలిపి ప్యాకేజీలుగా విభజిస్తున్నారు. ఇంటర్‌తోపాటు కాంబినేషన్ ప్రవేశ పరీక్షను బట్టి ఫీజుల్లో స్వల్ప మార్పులు ఉంటారుు. ఆ మాత్రం చెల్లించగలిగే వారికే సీట్లు ఇస్తున్నారు. లేదంటే.. నిర్మొహమాటంగా సీట్లు నిండుకున్నాయని, లేదంటే కావాల్సిన బ్రాంచ్‌లో సీట్లు లేవని చెప్పేస్తున్నారు. తద్వారా కృత్రిమ పోటీని సృష్టించి అధికంగా డబ్బు దండుకునేందుకు జిమ్మిక్కులు చేస్తున్నారు. ఈ క్రమంలో వచ్చే విద్యా సంవత్సరానికిగాను ఇప్పటికే సింహభాగం సీట్లు భర్తీ అరుునట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగామొదట రూ. 5 వేలు నుంచి రూ. 15 వేల వరకు వసూలు చేసి విద్యార్థి పేరు నమోదు చేసుకుంటున్నారు. అదనపు బాదుడు...
ట్యూషన్ ఫీజుతో సహా హాస్టల్ వసతికి కలిపి రూ. 2.50 లక్షల చొప్పున వసూలు చేస్తున్నారు. ఈ మొత్తం చెల్లిస్తే ఏసీ వసతి కూడా కల్పిస్తున్నారు. ఆ ఏసీ కూడా తరగతి గదులకే పరిమితం. ఈ మొత్తంలో హాస్టల్ వసతికి రూ. 1.50 లక్షలు తీసుకుంటున్నారు. అరుుతే ఇంతటితో ఈ చదివింపులు ఆగిపోవు. అదనపు ఖర్చుల జాబితా కూడా చేంతాడంత ఉంటుంది. దుస్తులు ఉతకడం, ఇస్త్రీ దోబీకి ఇచ్చే డబ్బులు కూడా విద్యార్థుల నెత్తినే వేస్తున్నారు. అంతేగాక స్టెషనరీ బిల్లులు, ఫోన్ బిల్స్ కూడా అదనం. ఈ మొత్తం కలుపుకుంటే ఏడాదికి మరో రూ. 10 వేలు ఖర్చు తప్పట్లేదని తల్లిదండ్రులు చెబుతున్నారు.
నాణ్యత గాలికి
ఫీజులు భారీగానే తీసుకుంటున్నా... మెనూ పాటించడం లేదని విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కాలేజ్‌లో చేర్పించే సమయంలో ఉన్న నాణ్యత.. కొన్ని నెలల తర్వాత కనిపించడం లేదన్నారు. మరోపక్క విద్యార్థికి అస్వస్థత చేకూరితే.. అత్యవసరంగా ఆస్పత్రికి తీసుకెళ్లేందుకు కనీసం ఒక్క అంబులెన్స్, ప్రత్యేక వాహనాలు కూడా అందుబాటులో ఉండడం లేదన్నారు. కొన్ని కళాశాలలు ప్రధాన బ్రాంచ్‌లుగా చెప్పుకునే ప్రాంతాల్లోనూ ఏర్పాటు చే యడం లేదు. తావుు ఫీజులు రూ. లక్షల్లో చెల్లిస్తున్నా.. విద్యార్థులు క్షేవుంపై సంతృప్తికరంగా లేమని, గదికి నలుగురు చొప్పున విద్యార్థులే ఉంటారని చెబుతూ ఐదారుగురిని కుక్కేస్తున్నారని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు.