Penetration Testing
-
పాలీసెట్ ప్రశాంతం
97 శాతం మంది హాజరు నిమిషం ఆలస్యం నిబంధనతో పరీక్ష రాయలేకపోయిన పలువురు విద్యార్థులు సిటీబ్యూరో: ప్రభుత్వ, ప్రైవేట్ పాలిటెక్నిక్ కళాశాలల్లో డిప్లొమా కోర్సుల్లో ప్రవేశాల కోసం గురువారం నిర్వహించిన పాలీసెట్-2016 ప్రవేశ పరీక్ష ప్రశాంతంగా జరిగింది. జంట నగరాల్లో 30,444 మందికి గాను 30,010 (97 శాతం) మంది అభ్యర్థులు పరీక్షకు హాజరైనట్లు అధికారులు తెలిపారు. మొత్తం 65 కేంద్రాల్లో పరీక్ష నిర్వహించారు. పరీక్ష ప్రారంభ సమయం ఉదయం 11 గంటలకు ముందే పరీక్ష కేంద్రాలకు చేరుకోవాలని అధికారులు ముందే చెప్పినా... పలుచోట్ల అభ్యర్థులు ఆలస్యంగా వెళ్లారు. ఫలితంగా వారిని అధికారులు పరీక్షా కేంద్రంలోకి అనుమతించలేదు. దీంతో అభ్యర్థులు కన్నీటి పర్యంతమవుతూ ఇంటి దారి పట్టారు. నిరాశ.. కంటోన్మెంట్: నిమిషం ఆలస్యం నిబంధన ఓ విద్యార్థి పరీక్ష రాసే అవకాశం కోల్పోయేలా చేసింది. మారేడ్‌పల్లిలోని ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలోని పరీక్షా కేంద్రానికి అఖిల్ అనే విద్యార్థి ఆలస్యంగా రావడంతో అధికారులు లోపలికి అనుమతించలేదు. అఖిల్ ఎంత వేడుకున్నా నిబంధనలకు విరుద్ధంగా తాము పరీక్షకు అనుమతించేది లేదని అధికారులు తేల్చి చెప్పడంతో నిరాశతో వెనుదిరగాల్సి వచ్చింది. -
విద్యార్థులకు పరీక్షల ఓఎంఆర్ కాపీ
ఎంసెట్, ఐసెట్, పీజీ ఈసెట్లలో అమలు పరీక్ష రాశాక ఓఎంఆర్ కార్బన్‌లెస్ కాపీ తీసుకెళ్లే సౌలభ్యం హైదరాబాద్: ఎంసెట్, ఐసెట్, పీజీ ఈసెట్లలో పారదర్శకతకు పెద్దపీట వేస్తూ తెలంగాణ ఉన్నత విద్యామండలి కీలక నిర్ణయం తీసుకుంది. ఆయా ప్రవేశ పరీక్షలకు హాజర య్యే విద్యార్థులకు వారి ఓఎంఆర్ జవాబుల పత్రం ప్రతి (కార్బన్‌లెస్ కాపీ) ఇవ్వాలని నిర్ణయించింది. ఈ మేరకు ఉన్నత విద్యా మండలి ఏర్పాటు చేసిన సెట్స్ హైపవర్ కమిటీ గురువారం వెల్లడించింది. 2016 మే 2న జరిగే ఎంసెట్‌తోపాటు ఐసెట్, పీజీ ఈసెట్ ఉమ్మడి ప్రవేశ పరీక్షల్లో 1+1 ఓఎంఆర్ జవాబు పత్రాల విధానాన్ని ప్రవేశపెట్టాలని నిర్ణయించింది. దీని ప్రకారం పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులు ఓఎంఆర్ జవాబు పత్రంలో జవాబులు రాసినప్పుడు (బబుల్ చేసినప్పుడు) దాని కిందే ఉండే మరో ఓఎంఆర్ జవాబు పత్రం (కార్బన్‌లెస్ కాపీ)పైనా బబుల్ ముద్ర పడుతుంది. పరీక్ష పూర్తయ్యాక విద్యార్థి ఒరిజినల్ ఓఎంఆర్ షీటును ఇన్విజిలేటర్‌కు ఇచ్చి కిందనున్న కార్బన్‌లెస్ కాపీని ఇంటికి తీసుకువెళ్లవచ్చు. దీంతో తాము ఏయే ప్రశ్నలకు ఎటువంటి జవాబులు రాశామో విద్యార్థులకు స్పష్టత ఉంటుంది. అలాగే పరీక్షల ‘కీ’ ప్రకటించాక జవాబులను సరిచూసుకోవడం సుల భమవుతుంది. ఉమ్మడి ప్రవేశ పరీక్షల విధానంలో తెస్తున్న సంస్కరణల్లో భాగంగా పారదర్శకతకు పెద్దపీట వేస్తూ ఓఎంఆర్ జవాబు పత్రాల కాపీని విద్యార్థులకు అందించాలని నిర్ణయించినట్లు ఉన్నత విద్యా మండలి చైర్మన్ ప్రొఫెసర్ తుమ్మల పాపిరెడ్డి వెల్లడించారు. అన్ని ప్రవేశ పరీక్షల్లోనూ బయోమెట్రిక్ వివిధ వృత్తి విద్యా కోర్సుల్లో ప్రవేశాలకు 2016లో నిర్వహించే అన్ని ప్రవేశ పరీక్షల్లోనూ బయో మెట్రిక్ విధానం అమలు చేయాలని హైపవర్ కమిటీ నిర్ణయించింది. పరీక్ష సమయంలో విద్యార్థుల వేలి ముద్రలు సేకరించి సర్టిఫికెట్ల వెరిఫికేషన్, ప్రవేశాల కౌన్సెలింగ్ సమయంలో వాటిని పోల్చి చూడనుంది. అలాగే యూనివర్సిటీలు/ విద్యా సంస్థలు విద్యార్థులకు ప్రవేశాలు కల్పించే సమయంలోనూ పరీక్ష సందర్భంగా తీసుకున్న వేలిముద్రలతో సరిచూసుకోవాలని ఉన్నత విద్యా మండలి స్పష్టం చేసింది. ఫీజు రీయింబర్స్మెంట్/స్కాలర్‌షిప్‌ల మంజూరుకూ ఈ సమాచారాన్ని వినియోగించవచ్చని పేర్కొంది. వీటితోపాటు పీజీ ఈసెట్‌ను ఆన్లైన్లో నిర్వహించాలని నిర్ణయించింది. మెడికల్‌కు ఆన్లైన్, ఆఫ్‌లైన్ పరీక్షలు ఎంసెట్ దరఖాస్తుల గడువు ముగిసేనాటికి అగ్రికల్చర్ అండ్ మెడికల్ కోసం ఎంసెట్ రాసేందుకు దరఖాస్తు చేసుకునే వారి సంఖ్య ఈసారి లక్ష దాటుతుందని అధికారులు భావిస్తున్నారు. ఈ పరీక్షను ఆన్లైన్లోనే నిర్వహించాలని తొలుత భావించినా లక్ష మందికి ఒకేసారి నిర్వహించడం అసాధ్యమన్న భావనకు వచ్చారు. అందుకే ఎంసెట్ అగ్రికల్చర్ అండ్ మెడికల్ పరీక్షను ఆఫ్‌లైన్, ఆన్లైన్లలో నిర్వహించాలని నిర్ణయించారు. అయితే ఆఫ్‌లైన్‌లో పరీక్ష రాస్తారా? ఆన్లైన్ పరీక్ష రాస్తారా? అన్నది విద్యార్థులు ఎంచుకోవాల్సి ఉంటుంది. ఈ మేరకు దరఖాస్తుల్లో సవరణకు అవకాశం కల్పించనున్నారు. అయితే ఆన్లైన్ పరీక్ష హైదరాబాద్, వరంగల్ కేంద్రాల్లో మాత్రమే నిర్వహించాలని నిర్ణయించారు. ఆన్లైన్, ఆఫ్లైన్లలో పరీక్షను ఒకే సమయంలో నిర్వహిస్తారు. అలాగే పేపర్లలో కూడా ఎటువంటి మార్పు ఉండదు. ఆన్లైన్లో గరిష్టంగా 25 వేల మంది పరీక్ష రాసే అవకాశం ఉందని అంచనా వేస్తున్న అధికారులు ఆ మేరకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇంజనీరింగ్ కంటే మెడికల్‌కు ఎక్కువ ఇప్పటివరకు ఇంజనీరింగ్ కంటే అగ్రికల్చర్ అండ్ మెడికల్‌కే ఎక్కువ మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నారు. అందులోనూ బాలికలే ఎక్కువ మంది దరఖాస్తు చేశారు. ఈ రెండింటికి గురువారం వరకు 48,771 మంది దరఖాస్తు చేసుకున్నారు. -
‘స్మార్ట్’ బాదుడు..!
కార్పొరేట్ కళాశాలల మాయ ఆకర్షణీయ కోర్సుల పేరుతో విద్యార్థులకు వల ఇంటర్లో ఏడాదికి రూ. 3 లక్షలు వసూలు సిటీబ్యూరో: ఎంపీఎల్, ఐపీఎల్, ఎన్పీఎల్, ఐసీసీ, ఎంసీసీ, ఐకాన్, స్పార్క్... ఇవే వో క్రికెట్ లీగ్ పోటీలు అనుకుంటున్నారా? అయితే పొర పాటుపడ్డట్లే. ఇంటర్మీడియెట్ విద్యనందించే పలు కార్పొరేట్ కళాశాలలు అందించే ఆయూ కోర్సులకు వాటి యాజమాన్యాలు ఆక ర్షణీయంగా పెట్టుకున్న పేర్లివి. ఎంపీఎల్-మెడిసిన్ ప్రీమియర్ లీగ్, ఐపీఎల్ - ఐఐటీ ప్రీమియర్ లీగ్, ఎన్పీఎల్-ఏఐఈఈఈ.. ఇలా సంక్షిప్త పేర్లతో విద్యార్థులకు వల వేస్తున్నారు. ఆ పేర్ల మాదిరిగానే.. ఆయా కోర్సుల్లో చేరే విద్యార్థుల నుంచి భారీగా ఫీజులు దండుకుంటున్నారు. కోర్సుని బట్టి ఏడాదికి వసూలు చేస్తున్న ఫీజు ఎంతో తెలిస్తే.. దిమ్మ తిరగాల్సిందే. ఏడాదికి గరిష్టంగా రూ. 2.50 లక్షల నుంచి రూ. 3 లక్షల వరకు లాగుతున్నారు. ఇంటర్‌తో సహా ఐఐటీ, ఎంసెట్, ఎయిమ్స్, జిప్మర్, సీఏ సీపీటీ.. తదితర ప్రవేశ పరీక్షలకు కలిపి ప్యాకేజీలుగా విభజిస్తున్నారు. ఇంటర్‌తోపాటు కాంబినేషన్ ప్రవేశ పరీక్షను బట్టి ఫీజుల్లో స్వల్ప మార్పులు ఉంటారుు. ఆ మాత్రం చెల్లించగలిగే వారికే సీట్లు ఇస్తున్నారు. లేదంటే.. నిర్మొహమాటంగా సీట్లు నిండుకున్నాయని, లేదంటే కావాల్సిన బ్రాంచ్‌లో సీట్లు లేవని చెప్పేస్తున్నారు. తద్వారా కృత్రిమ పోటీని సృష్టించి అధికంగా డబ్బు దండుకునేందుకు జిమ్మిక్కులు చేస్తున్నారు. ఈ క్రమంలో వచ్చే విద్యా సంవత్సరానికిగాను ఇప్పటికే సింహభాగం సీట్లు భర్తీ అరుునట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగామొదట రూ. 5 వేలు నుంచి రూ. 15 వేల వరకు వసూలు చేసి విద్యార్థి పేరు నమోదు చేసుకుంటున్నారు. అదనపు బాదుడు... ట్యూషన్ ఫీజుతో సహా హాస్టల్ వసతికి కలిపి రూ. 2.50 లక్షల చొప్పున వసూలు చేస్తున్నారు. ఈ మొత్తం చెల్లిస్తే ఏసీ వసతి కూడా కల్పిస్తున్నారు. ఆ ఏసీ కూడా తరగతి గదులకే పరిమితం. ఈ మొత్తంలో హాస్టల్ వసతికి రూ. 1.50 లక్షలు తీసుకుంటున్నారు. అరుుతే ఇంతటితో ఈ చదివింపులు ఆగిపోవు. అదనపు ఖర్చుల జాబితా కూడా చేంతాడంత ఉంటుంది. దుస్తులు ఉతకడం, ఇస్త్రీ దోబీకి ఇచ్చే డబ్బులు కూడా విద్యార్థుల నెత్తినే వేస్తున్నారు. అంతేగాక స్టెషనరీ బిల్లులు, ఫోన్ బిల్స్ కూడా అదనం. ఈ మొత్తం కలుపుకుంటే ఏడాదికి మరో రూ. 10 వేలు ఖర్చు తప్పట్లేదని తల్లిదండ్రులు చెబుతున్నారు. నాణ్యత గాలికి ఫీజులు భారీగానే తీసుకుంటున్నా... మెనూ పాటించడం లేదని విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కాలేజ్‌లో చేర్పించే సమయంలో ఉన్న నాణ్యత.. కొన్ని నెలల తర్వాత కనిపించడం లేదన్నారు. మరోపక్క విద్యార్థికి అస్వస్థత చేకూరితే.. అత్యవసరంగా ఆస్పత్రికి తీసుకెళ్లేందుకు కనీసం ఒక్క అంబులెన్స్, ప్రత్యేక వాహనాలు కూడా అందుబాటులో ఉండడం లేదన్నారు. కొన్ని కళాశాలలు ప్రధాన బ్రాంచ్‌లుగా చెప్పుకునే ప్రాంతాల్లోనూ ఏర్పాటు చే యడం లేదు. తావుు ఫీజులు రూ. లక్షల్లో చెల్లిస్తున్నా.. విద్యార్థులు క్షేవుంపై సంతృప్తికరంగా లేమని, గదికి నలుగురు చొప్పున విద్యార్థులే ఉంటారని చెబుతూ ఐదారుగురిని కుక్కేస్తున్నారని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. -
పది నుంచే ట్రిపుల్ ఐటీ శిక్షణ
జిల్లాలో 10 జెడ్పీ హైస్కూళ్ల ఎంపిక 2,275 మంది విద్యార్థులకు శిక్షణ బి.కొత్తకోట: గ్రామీణ ప్రాంతాల విద్యార్థులను ట్రిపుల్ ఐటీ ప్రవేశ పరీక్షకు సిద్ధం చేసేందుకు చర్యలు మొదలయ్యాయి. ఇందులో భాగంగా జిల్లాలోని పది జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలను ఎంపిక చేశారు. అందులో చదువుతున్న 2,275 మంది విద్యార్థులను ఎంపిక చేశారు. వీరికి సంబంధిత పాఠశాలకు చెందిన ఉపాధ్యాయులే శిక్షణ ఇస్తారు. విధివిధానాలను పాఠశాలలకు పంపించారు. ఇంటర్ విద్య పూర్తయ్యాక త్రిబుల్ ఐటీ ప్రవేశ పరీక్ష రాస్తారు. గ్రామీణ విద్యార్థులు ఈ పరీక్షకు హాజరయ్యేందుకు, అర్హత సాధించేందుకు సరైన శిక్షణ, మార్గదర్శకం లేదు. ఈ మేరకు వారికి శిక్షణ ఇచ్చి ఇంటర్ తర్వాత పరీక్షలకు హాజరయ్యేలా కృషి చేస్తారు. ఆ పాఠశాలలు ఇవే.. జిల్లాలో బి.కొత్తకోట బాలుర ఉన్నత పాఠశాలకు చెందిన 139 మంది, కుప్పం బాలుర ఉన్నత పాఠశాలకు చెందిన 184 మంది, శాంతిపురం ఉన్నత పాఠశాలలో 244 మంది, రేణిగుంట బాలిక ఉన్నత పాఠశాలలో 133 మంది, సత్యవేడు బాలుర ఉన్నత పాఠశాలలో 227 మంది, నరహరిపేట ఉన్నత పాఠశాలలో 252 మంది, రంగంపేట ఉన్నత పాఠశాలలో 129 మంది, ముత్యాలరెడ్డిపల్లె ఉన్నత పాఠశాలలో 201 మంది, శ్రీకాళహస్తి బాలుర ఉన్నత పాఠశాలలో 665 మంది, తుమ్మింద ఉన్నత పాఠశాలలో 104 మంది విద్యార్థులను శిక్షణకు ఎంపిక చేశారు. స్థానిక ఉపాధ్యాయులతో శిక్షణ.. విద్యార్థులకు ఆయా పాఠశాలల ఉపాధ్యాయులే శిక్షణ ఇస్తారు. ఈనెల 26న శిక్షణ కేంద్రాలను ప్రారంభిస్తారు. పాఠశాలల సమయం ముగిశాక విద్యార్థులకు శిక్షణ ఇవ్వాల్సి ఉంటుంది. మ్యాథ్స్, ఫిజిక్స్, బయాలజీ, కెమిస్ట్రీ సబ్జెక్టుల్లో బోధించేందుకు సంబంధిత పాఠశాలకు చెందిన ఐదుగురు ఉపాధ్యాయులను ఎంపిక చేశారు. -
ఐసెట్‌లో 88.33% మంది అర్హత
ఏయూక్యాంపస్(విశాఖ): రాష్ట్రవ్యాప్తంగా ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించిన సంయుక్త ప్రవేశ పరీక్ష ఐసెట్-2015 ఫలితాలు విడుదలయ్యాయి. 88.33 శాతం మంది విద్యార్థులు అర్హత సాధించారు. మొత్తం 78,755 మంది దరఖాస్తు చేయగా.. 72,195 మంది విద్యార్థులు పరీక్ష రాశారు. వీరిలో 63,768 మంది ఉత్తీర్ణులయ్యారు. అబ్బాయిల్లో 88.42 శాతం, అమ్మాయిల్లో 88.15 శాతం మంది అర్హత సాధించారు. రాష్ట్ర స్థాయిలో 6, 10 ర్యాంకులను తెలంగాణ రాష్ట్రానికి చెందిన విద్యార్థులు కైవసం చేసుకోవడం విశేషం. మంగళవారం ఏయూ వైవీఎస్ మూర్తి ఆడిటోరియంలో జరిగిన కార్యక్రమంలో అనకాపల్లి ఎంపీ ఎం.శ్రీనివాసరావు ఫలితాల సీడీని విడుదల చేశారు. ఆయన మాట్లాడుతూ.. ఎంసెట్ కౌన్సెలింగ్ అనంతరం ఐసెట్ కౌన్సెలింగ్ జరుగుతుందన్నారు. ర్యాంకర్లు వీరే... కొడాలి భార్గవ్-తూర్పుగోదావరి(మొదటి ర్యాంక్), యెల్లా ప్రశాంత్-విశాఖ(రెండోర్యాంక్), వి.రాఘవేంద్ర-నెల్లూరు(మూడవ), బి.ఆనంద్-కృష్ణా(నాల్గవ), జె.రుషికా కుమారి జైన్-నెల్లూరు(ఐదవ), వై.వి.కె.షణ్ముఖకుమార్-హైదరాబాద్(ఆరవ), ఎన్.వెంకటరామిరెడ్డి-వైఎస్సార్ కడప(ఏడవ), డి.శ్రీవత్సవ-శ్రీకాకుళం(ఎనిమిదవ), జి.ప్రశాంత్‌కుమార్‌రెడ్డి-కర్నూలు(తొమ్మిదివ), వెంకట సాయిచైతన్య-రంగారెడ్డిజిల్లా(పదో ర్యాంకు)ను సాధించారు. -
నేడు ఎంసెట్ ఆల్ ది బెస్ట్
తొలగిన రవాణా కష్టాలు విద్యార్థుల్లో సంతోషం పరీక్ష కేంద్రాలకు 661 బస్సులు ఆర్టీసీ టోల్ ఫ్రీ నంబర్లు 040-23202813, 99592 26160 విద్యార్థి దశలో కీలకమైన మలుపుగా భావించే ఎంసెట్‌కు హాజరయ్యే విద్యార్థులకు తెలంగాణ ప్రభుత్వ హామీ.. ఆర్టీసీ కార్మికుల సమ్మె విరమణ నేపథ్యంలో ఎంసెట్‌కు హాజర వుతున్న విద్యార్థులు ఊపిరి పీల్చుకున్నారు. తమ డిమాండ్ల సాధనకు కొన్ని రోజులుగా కార్మికులు సమ్మె చేస్తుండడంతో విద్యార్థులు, తల్లిదండ్రులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. సమ్మె విరమిస్తున్నట్టు ప్రకటన రాగానే వారి మోముల్లో ఆనందం వెల్లివిరిసింది. గ్రేటర్‌లోని 8 రీజినల్ సెంటర్ల పరిధిలో మొత్తం 1,13,700 మంది విద్యార్థులు గురువారం నిర్వహించనున్న ఎంసెట్ పరీక్షకు హాజరుకానున్న విషయం తెలిసిందే. ఇందులో 67,686 మంది ఇంజినీరింగ్, 45,100 మంది మెడికల్ ప్రవేశ పరీక్ష రాయనున్నారు. మరో 457 మంది ఈ రెండు విభాగాలకూ దరఖాస్తు చేసుకున్నారు. నగరంలో మొత్తం 189 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేయగా.. అందులో ఇంజినీరింగ్‌కు 111, మెడికల్ కు 78 కేటాయించారు. ఉదయం 10 నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు ఇంజినీరింగ్, మధ్యాహ్నం 2.30 నుంచి 5.30 గంటల వరకు మెడికల్ ప్రవేశ పరీక్ష జరగనుంది. నిర్ణీత సమయానికి గంట ముందుగానే కేంద్రాలకు చేరుకోవాలని ఇప్పటికే అధికారులు పలుమార్లు సూచించారు. సమ్మె నేపథ్యంలో విద్యార్థులలో ఇది ఆందోళన పెంచింది. బస్సులు రోడ్డెక్కడంతో ఊరట చెందారు. మరోవైపు ట్రాఫిక్ కష్టాలు ఎదురుకాకుండా పోలీసులూ చర్యలు తీసుకుంటున్నారు. అందుబాటులో 661 బస్సులు రవాణా విషయంలో విద్యార్థులకు ఇబ్బందులు తలెత్తకుండా అధికారులు ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేశారు. నగరంలోని అన్ని రూట్లనూ కలుపుతూ పరీక్ష కేంద్రాలకు బస్సులు నడుపుతున్నారు. దీని కోసం 661 బస్సులను వినియోగిస్తున్నట్లు కలెక్టర్ కె.నిర్మల వెల్లడించారు. ఇందులో 200కు పైగా ఆర్టీసీవి ఉన్నాయి. వీటితోపాటు కళాశాలలు, స్కూళ్లు, ప్రైవేటు సంస్థలకు చెందిన 400కు పైగా బస్సులను వినియోగించనున్నారు. విద్యార్థులు సులువుగా గుర్తించేందుకు వీలుగా బస్సులన్నింటిపై ఎంసెట్ పరీక్ష కేంద్రానికి సంబంధించిన బ్యానర్ ఉంటుంది. టోల్ ఫ్రీ నంబర్లు... రవాణా సౌకర్యాలకు సంబంధించిన సమాచారాన్ని తెలుసుకునేందుకు వీలుగా కలెక్టరేట్లో అధికారులు టోల్ ఫ్రీ నంబర్ ఏర్పాటు చేశారు. 040-23202813 నంబరులో విద్యార్థులు, తల్లిదండ్రులు సంప్రదించవచ్చు. కోఠి బస్ టెర్మినల్‌లో మరో టోల్ ఫ్రీ నంబరు 99592 26160ను కూడా అందుబాటులోకి తెచ్చారు. గురువారం సాయంత్రం 6 గంటల వరకూ ఈ నెంబర్లలో సంప్రదించవచ్చు. విద్యార్థులు, తల్లిదండ్రులు ఆందోళన చెందవద్దని, ప్రత్యామ్నాయ ఏర్పాట్లను వినియోగించుకోవాలని కలెక్టర్ సూచించారు. మరోపక్క విద్యార్థులకు ఇబ్బందులు కలుగకుండా ప్రైవేటు కళాశాలల యాజమాన్యాలు ఉదారత కనబరుస్తున్నాయి. త మ కళాశాల కేంద్రంగా పరీక్ష రాసే విద్యార్థుల కోసం వివిధ ప్రాంతాల నుంచి బస్సులను నడుపుతున్నాయి. వీడియో కాన్ఫరెన్స్ జిల్లాలో గురువారం జరుగుతున్న ఎంసెట్ ఏర్పాట్లపై తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మ బుధవారం సచివాలయం నుంచి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ నిర్మల సీఎస్‌తో మాట్లాడుతూ జిల్లాలో 111 కేంద్రాల్లో 1.12 లక్షల మంది విద్యార్థులు పరీక్షలు రాస్తున్నట్టు తెలిపారు. వీరి సౌకర్యార్థం 661 బస్సులు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. డీఆర్కే కళాశాల ప్రత్యేక బస్సులు తమ కళాశాల కేంద్రంగా ఎంసెట్ రాసే విద్యార్థుల కోసం డీఆర్కే ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ ప్రత్యేక బస్సులు నడుపుతోంది. మియాపూర్-మేడ్చల్ దారిలో ఉన్న ఈ కళాశాలకు అమీర్‌పేట, కూకట్పల్లి, వీవీ నగర్, కేపీహెచ్‌బీ, జేఎన్టీయూ, మలేషియా టౌన్షిప్, లింగంపల్లి, సికింద్రాబాద్, బాలానగర్, గండిమైసమ్మ నుంచి బస్సులు అందుబాటులో ఉంటాయని యాజమాన్యం తెలిపింది. వివరాలకు 8790911899, 9849285621లో సంప్రదించవచ్చు.