ఏయూక్యాంపస్(విశాఖ): రాష్ట్రవ్యాప్తంగా ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించిన సంయుక్త ప్రవేశ పరీక్ష ఐసెట్-2015 ఫలితాలు విడుదలయ్యాయి. 88.33 శాతం మంది విద్యార్థులు అర్హత సాధించారు. మొత్తం 78,755 మంది దరఖాస్తు చేయగా.. 72,195 మంది విద్యార్థులు పరీక్ష రాశారు. వీరిలో 63,768 మంది ఉత్తీర్ణులయ్యారు. అబ్బాయిల్లో 88.42 శాతం, అమ్మాయిల్లో 88.15 శాతం మంది అర్హత సాధించారు. రాష్ట్ర స్థాయిలో 6, 10 ర్యాంకులను తెలంగాణ రాష్ట్రానికి చెందిన విద్యార్థులు కైవసం చేసుకోవడం విశేషం. మంగళవారం ఏయూ వైవీఎస్ మూర్తి ఆడిటోరియంలో జరిగిన కార్యక్రమంలో అనకాపల్లి ఎంపీ ఎం.శ్రీనివాసరావు ఫలితాల సీడీని విడుదల చేశారు. ఆయన మాట్లాడుతూ.. ఎంసెట్ కౌన్సెలింగ్ అనంతరం ఐసెట్ కౌన్సెలింగ్ జరుగుతుందన్నారు.
ర్యాంకర్లు వీరే...
కొడాలి భార్గవ్-తూర్పుగోదావరి(మొదటి ర్యాంక్), యెల్లా ప్రశాంత్-విశాఖ(రెండోర్యాంక్), వి.రాఘవేంద్ర-నెల్లూరు(మూడవ), బి.ఆనంద్-కృష్ణా(నాల్గవ), జె.రుషికా కుమారి జైన్-నెల్లూరు(ఐదవ), వై.వి.కె.షణ్ముఖకుమార్-హైదరాబాద్(ఆరవ), ఎన్.వెంకటరామిరెడ్డి-వైఎస్సార్ కడప(ఏడవ), డి.శ్రీవత్సవ-శ్రీకాకుళం(ఎనిమిదవ), జి.ప్రశాంత్‌కుమార్‌రెడ్డి-కర్నూలు(తొమ్మిదివ), వెంకట సాయిచైతన్య-రంగారెడ్డిజిల్లా(పదో ర్యాంకు)ను సాధించారు.
ఐసెట్‌లో 88.33% మంది అర్హత
Published Wed, May 27 2015 1:55 AM | Last Updated on Sun, Sep 3 2017 2:44 AM
Advertisement