eligible students
-
ఇన్సర్విస్ డాక్టర్ల ‘పీజీ’ ఆశలు అడియాసలేనా?
సాక్షి, హైదరాబాద్: నీట్– పీజీ వైద్య ప్రవేశాలకు సంబంధించిన గందరగోళానికి తెరపడడం లేదు. స్టేట్‌పూల్ కోటాలోని పీజీ సీట్లు పూర్తిస్థాయిలో తెలంగాణ వాళ్లకే చెందాలనే ఉద్దేశంతో ప్రభుత్వం తెచ్చిన జీవోలు 148, 149పై మొదలైన అలజడి ఆగడం లేదు. జీవో 148(అల్లోపతి), 149 (ఆయుర్వేదం, హోమియోపతి) ద్వారా మెడికల్ పీజీలో అడ్మిషన్లు పొందేందుకు నిర్ణయించిన స్థానికత అంశంపై పలువురు హైకోర్టును ఆశ్రయించారు. దీంతో ‘తెలంగాణలో ఎంబీబీఎస్, బీఏఎంఎస్, బీహెచ్ఎంఎస్ చదివిన వారంతా ప్రెసిడెన్షియల్ ఆర్డర్–1974 ప్రకారం ‘లోకల్ ఏరియా’ పరిధిలోకి వస్తారని, వారు పీజీ కోర్సుల్లో అడ్మిషన్లు పొందేందుకు అర్హులేనని హైకోర్టు తీర్పు చెప్పింది. ఈ తీర్పును ప్రభుత్వం సుప్రీంకోర్టులో సవాల్ చేయగా, జనవరి 7న విచారణకు రానుంది.ఈ వివాదం కొనసాగుతుండగానే... తెలంగాణ స్థానికులుగా ఉండి ఇతర రాష్ట్రాల్లో ఎంబీబీఎస్ చదివి... ఇన్‌సర్వీస్ డాక్టర్లుగా రాష్ట్రంలో సేవలందిస్తున్న డాక్టర్ల అంశం తెరపైకి వచ్చింది. తెలంగాణలో పుట్టి పెరిగి ఇంటర్మీడియెట్ వరకు సొంత ప్రాంతంలో చదివినప్పటికీ... ఎంసెట్ ర్యాంకు ద్వారా ఇతర రాష్ట్రాల్లోనో, వేరే దేశంలోనో వైద్యవిద్య అభ్యసించి, సొంత రాష్ట్రంలో పనిచేస్తున్న డాక్టర్లు పీజీ కోర్సుల్లో అడ్మిషన్లు పొందేందుకు అనర్హులుగా మారడం పట్ల ఆందోళన వ్యక్తమవుతోంది. తెలంగాణలో 6వ తరగతి నుంచి ఇంటర్ వరకు వరుసగా నాలుగేళ్లు చదివి, అనంతరం రాష్ట్రంలోనే ఎంబీబీఎస్/ బీఏఎంఎస్/ బీహెచ్ఎంఎస్ చదివిన వారే పీజీ అడ్మిషన్లలో స్టేట్ పూల్‌లో రాష్ట్రంలో చదివేందుకు అర్హులని ప్రభుత్వం 148, 149 జీవోల్లో స్పష్టం చేసింది. ఈ అంశంపై హైకోర్టు తన తీర్పులో ప్రస్తావించలేదు.దీంతో ఇంటర్ వరకు ఏపీ లేదా ఇతర రాష్ట్రాల్లో చదివి తెలంగాణలో ఎంబీబీఎస్ చేసిన వారు ప్రెసిడెన్షియల్ ఆర్డర్–1974 ప్రకారం ‘లోకల్ ఏరియా’ కిందికి వచ్చి పీజీ కోర్సులకు అర్హులవుతుండగా... ఇంటర్ వరకు తెలంగాణలో చదివినప్పటికీ... వైద్య విద్యను ఇతర రాష్ట్రాల్లో అభ్యసించి సొంత రాష్ట్రంలో పనిచేస్తున్న వారు అనర్హులుగా మారారు. ప్రభుత్వం ఎంబీబీఎస్ తెలంగాణలో చదివిన వారంతా స్థానికులే అన్న హైకోర్టు తీర్పును మాత్రమే సవాల్ చేసిన నేపథ్యంలో.. ఇతర రాష్ట్రాల్లో ఎంబీబీఎస్ చదివి ఇన్సర్విస్ డాక్టర్లుగా ఉన్న వారి పరిస్థితి ఎటూ తేలకుండా పోతోంది. దీంతో వారు తమ స్థానికత అంశాన్ని పరిగణనలోకి తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు. బలయ్యేది ఇన్సర్విస్ డాక్టర్లే.. తెలంగాణ ఏర్పాటయ్యేంత వరకు ఎంసెట్‌లో వచ్చిన ర్యాంకును బట్టి నాన్‌లోకల్ కేటగిరీలో మెరిట్ ఆధారంగా ఆంధ్ర, రాయలసీమలోని కళాశాలల్లో ఎంబీబీఎస్ విద్యనభ్యసించిన రాష్ట్రానికి చెందిన వారు వందలాది మంది ఉన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణేతర ప్రాంతాల్లో వైద్యవిద్య పూర్తి చేసినప్పటికీ... ప్రభుత్వ సర్విసులో చేరి గిరిజన, గ్రామీణ ప్రాంతాల్లో ఉద్యోగం చేసి, స్టేట్ పూల్ కింద 15 శాతం నాన్‌లోకల్ కోటాలో పీజీ అడ్మిషన్లు పొందేవారు.148, 149 జీవోల ప్రకారం తెలంగాణలో వైద్యవిద్య అభ్యసించిన స్థానికులకే స్టేట్పూల్లో పీజీలో అడ్మిషన్లకు అర్హులని ప్రభుత్వం స్పష్టం చేయడంతో... ఇతర రాష్ట్రాల్లో ఎంబీబీఎస్, ఇతర కోర్సులు చదివి ఇన్సర్విస్లో ఉన్న వైద్యులకు పీజీకి అర్హత లేకుండా పోయింది. ఈ సంవత్సరం కాళోజీ యూనివర్సిటీ విడుదల చేసిన నోటిఫికేషన్లోనూ వీరికి దరఖాస్తు చేసుకునే ఆప్షన్ కూడా ఇవ్వలేదు. పట్టించుకోని ప్రభుత్వం ఇన్సర్విస్ కోటాలో తెలంగాణలో ఉద్యోగం చేస్తున్న వైద్యులు తమకు జరిగిన అన్యాయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు. హైకోర్టును కూడా ఆశ్రయించారు. కానీ హైకోర్టు ఇచ్చిన 106 పేజీల తీర్పులో ఇన్సర్విస్ డాక్టర్ల అంశాన్ని ప్రస్తావించలేదు. దీంతో తమకు సర్వీస్ మొత్తం ఎంబీబీఎస్ అర్హతతోనే పదవీ విరమణ వరకు ఉద్యోగం చేసే పరిస్థితి తలెత్తిందని వైద్యులు వాపోతున్నారు. ఇన్సర్విస్ డాక్టర్లకు న్యాయం జరిగేలా పీజీ అడ్మిషన్లలో అవకాశం లభించేలా కృషి చేయాలని, న్యాయస్థానం దృష్టికి తీసుకెళ్లాలని తెలంగాణ పబ్లిక్ హెల్త్ డాక్టర్స్ అసోసియేషన్ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు డాక్టర్ కత్తి జనార్ధన్, డాక్టర్ పూర్ణచందర్ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. -
నీట్ యూజీ రాష్ట్ర అర్హుల జాబితా విడుదల
సాక్షి, అమరావతి: ఎంబీబీఎస్, బీడీఎస్, ఇతర వైద్య విద్య కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన నీట్ యూజీ–2023లో అర్హత సాధించిన రాష్ట్ర విద్యార్థుల జాబితాను డాక్టర్ వైఎస్సార్ ఆరోగ్య విశ్వవిద్యాలయం శుక్రవారం విడుదల చేసింది. నీట్లో మొత్తం 720 మార్కులకు 720 మార్కులు సాధించి జాతీయ స్థాయిలో మొదటి ర్యాంక్ పొందిన బోరా వరుణ్ చక్రవర్తి స్టేట్ టాపర్‌గా నిలిచాడు. 711 మార్కులతో ఆల్ ఇండియా 25వ ర్యాంకర్ వైఎల్ ప్రవర్ధన్ రెడ్డి రెండో స్థానంలో, 38 ర్యాంకర్ వి.హర్షిల్ సాయి మూడో స్థానంలో నిలిచారు. రాష్ట్రంలో మొదటి పది ర్యాంకులు పొందినవారిలో ఏడుగురు అబ్బాయిలు, ముగ్గురు అమ్మాయిలు ఉన్నారు. రాష్ట్రం నుంచి నీట్ యూజీకి 69,690 మంది దరఖాస్తు చేసుకోగా, 68,578 మంది పరీక్ష రాశారు. వీరిలో 42,836 మంది అర్హత సాధించారు. వారిలో అత్యధికంగా 28,471 మంది అమ్మాయిలు, 14,364 మంది అబ్బాయిలు, ఒక ట్రాన్స్‌జెండర్ ఉన్నారు. https:// drysr.uhsap.in వెబ్సైట్లో అర్హత సాధించిన విద్యార్థుల జాబితాను ఉంచారు. డైరెక్టర్ జనరల్ ఆఫ్ హెల్త్ సర్విసెస్(డీజీహెచ్ఎస్) అందించిన నీట్ అర్హుల వివరాల ఆధారంగా రాష్ట్ర జాబితాను ప్రదర్శించినట్లు డాక్టర్ వైఎస్సార్ హెల్త్ యూనివర్సిటీ రిజిస్ట్రార్ డాక్టర్ వేమిరెడ్డి రాధికరెడ్డి తెలిపారు. కేంద్ర ప్రభుత్వం నుంచి కౌన్సెలింగ్ షెడ్యూల్ విడుదల కాగానే నోటిఫికేషన్ జారీ చేసి దరఖాస్తులు స్వీకరిస్తామని వెల్లడించారు. -
ఐసెట్‌లో 88.33% మంది అర్హత
ఏయూక్యాంపస్(విశాఖ): రాష్ట్రవ్యాప్తంగా ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించిన సంయుక్త ప్రవేశ పరీక్ష ఐసెట్-2015 ఫలితాలు విడుదలయ్యాయి. 88.33 శాతం మంది విద్యార్థులు అర్హత సాధించారు. మొత్తం 78,755 మంది దరఖాస్తు చేయగా.. 72,195 మంది విద్యార్థులు పరీక్ష రాశారు. వీరిలో 63,768 మంది ఉత్తీర్ణులయ్యారు. అబ్బాయిల్లో 88.42 శాతం, అమ్మాయిల్లో 88.15 శాతం మంది అర్హత సాధించారు. రాష్ట్ర స్థాయిలో 6, 10 ర్యాంకులను తెలంగాణ రాష్ట్రానికి చెందిన విద్యార్థులు కైవసం చేసుకోవడం విశేషం. మంగళవారం ఏయూ వైవీఎస్ మూర్తి ఆడిటోరియంలో జరిగిన కార్యక్రమంలో అనకాపల్లి ఎంపీ ఎం.శ్రీనివాసరావు ఫలితాల సీడీని విడుదల చేశారు. ఆయన మాట్లాడుతూ.. ఎంసెట్ కౌన్సెలింగ్ అనంతరం ఐసెట్ కౌన్సెలింగ్ జరుగుతుందన్నారు. ర్యాంకర్లు వీరే... కొడాలి భార్గవ్-తూర్పుగోదావరి(మొదటి ర్యాంక్), యెల్లా ప్రశాంత్-విశాఖ(రెండోర్యాంక్), వి.రాఘవేంద్ర-నెల్లూరు(మూడవ), బి.ఆనంద్-కృష్ణా(నాల్గవ), జె.రుషికా కుమారి జైన్-నెల్లూరు(ఐదవ), వై.వి.కె.షణ్ముఖకుమార్-హైదరాబాద్(ఆరవ), ఎన్.వెంకటరామిరెడ్డి-వైఎస్సార్ కడప(ఏడవ), డి.శ్రీవత్సవ-శ్రీకాకుళం(ఎనిమిదవ), జి.ప్రశాంత్‌కుమార్‌రెడ్డి-కర్నూలు(తొమ్మిదివ), వెంకట సాయిచైతన్య-రంగారెడ్డిజిల్లా(పదో ర్యాంకు)ను సాధించారు. -
స్టే ఎత్తివేత
సాక్షి, న్యూఢిల్లీ:నగరంలో నర్సరీ అడ్మిషన్లకు ఎట్టకేలకు మార్గం సుగమమైంది. ప్రైవేటు పాఠశాలల్లో నర్సరీ అడ్మిషన్లపై విధించిన స్టేను సుప్రీంకోర్టు బుధవారం ఎత్తివేసింది. దీంతో గత ఐదునెలలుగా అయోమయంలో కొట్టుమిట్టాడుతున్న విద్యార్థుల తల్లిదండ్రులు హాయిగా ఊపిరి పీల్చుకున్నారు. నర్సరీ అడ్మిషన్లలో అంతర్రాష్ట్ర బదిలీ కేటగిరీని రద్దు చేస్తూ ఢిల్లీ ప్రభుత్వం ఫిబ్రవరి 27న జారీ చేసిన నోటిఫికేషన్‌ను సుప్రీంకోరు ్టకొట్టివేసింది. ఈ విషయమై తనను అశ్రయించిన 24 మంది విద్యార్థులకు సీట్లు ఇవ్వాలని, ఇందుకోసం అవసరమైతే సీట్ల సంఖ్యను పెంచాలంటూ సుప్రీంకోర్టు ఢిల్లీ సర్కారును ఆదేశించింది. డిసెంబర్ 18న ప్రభుత్వం జారీచేసిన నోటిఫికేషన్ ప్రకారం నర్సరీలో ప్రవేశాలు చేపట్టొచ్చని న్యాయస్థానం పేర్కొంది. సుప్రీంకోర్టు పచ్చజెండా ఊపడంతో నర్సరీ అడ్మిషన్లపై గడచిన ఐదు నెలలుగా నెలకొన్న ప్రతిష్టంభన తొలగిపోయి అడ్మిషన్ ప్రక్రియకు దారులు తెరుచుకున్నాయి. అంత ర్రాష్ట్ర బదిలీ కేటగిరీ ఆధారంగా తమ పిల్లలకు అడ్మిషన్ ఇవ్వాలని కోరుతూ 24 మంది విద్యార్థుల తల్లిదండ్రులు దాఖలు చేసిన పిటిషన్‌పై సోమవారం నిలిపిఉంచిన తీర్పును సుప్రీంకోర్టు బుధవారం ప్రకటించింది. అంతర్రాష్ట్ర బదిలీ కేట గిరీ కింద అడ్మిషన్ ఇవ్వాలని కోరుతూ కేవలం 24 మంది విద్యార్థుల తల్లిదండ్రులే సుప్రీంకోర్టును, ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారని సీనియర్ న్యాయవాది నితేష్ గుప్తా తెలియజేయడంతో న్యాయమూర్తులు హెచ్.ఎల్.దత్, ఎం.వై.ఇక్బాల్, ఎస్ఏ బాబ్డేల నేతృత్వంలోని ధర్మాసనం రెండు రోజుల పాటు తీర్పును నిలిపి ఉంచుతున్నట్లు సోమవారం ప్రకటించింది. తమ పిల్లల అడ్మిషన్ కోసం సుప్రీం కోర్టుకు, ఢిల్లీ హైకోర్టుకు వెళ్లిన తల్లిదండ్రుల జాబి తా ఇవ్వాల్సిందిగా ధర్మాసనం ఈ కేసు విచారణ ఆఖరి దశలో ఆదేశించింది. అంతర్రాష్ట్ర బదిలీ కేట గిరీకి సంబంధించిన కేసులపై తాను విచారణ జరుపుతానని, ఈ కేసులను మినహాయించి మిగతా అన్ని కేటగిరీలకు నర్సరీ అడ్మిషన్ల ప్రక్రియను కొనసాగించాలని ఢిల్లీ హైకోర్టు ఏప్రిల్ మూడో తేదీన ఉత్తర్వు జారీ చేసింది. కానీ సుప్రీంకోర్టు దీనిపై ఏప్రిల్ 11వ తేదీనస్టే విధించింది. అంతర్రాష్ట్ర బదిలీ కేటగిరీ కింద పాఠశాలలు అక్రమంగా అడ్మిషన్లు జరుపుతున్నాయంటూ ఫిర్యాదులు రావడంతో ఈ కేటగిరీ అడ్మిషన్లపై సర్వత్రా సందేహాలు తలెత్తాయి. అంతర్రాష్ట్ర బదిలీ కేటగిరీ కింద అడ్మిషన్లు అధికంగా జరుగుతున్నట్లు ఓ సర్వేలో కూడా తేలింది. ఈ కేటగిరీ విద్యార్థులకు చివరలో అధిక పాయింట్లు రావడం వల్ల పాఠశాల పరిసరాలలో నివసించే విద్యార్థులు కూడా నైబర్‌హుడ్ కేటగిరీ కింద ప్రవేశాలు పొందలేకపోతున్నారని సదరు సర్వే తెలిపింది. ఈ నేపథ్యంలో ఈ కేటగిరీని రద్దు చేయాలని లెఫ్టినెంట్ గవర్నర్ ఆదేశించారు. దీంతో ప్రభుత్వం కొత్త నోటిఫికేషన్ జారీ చేసింది. దీనిని సవాలుచేస్తూ కొందరు విద్యార్థుల తల్లిదండ్రులు కోర్టును ఆశ్రయించారు. ప్రభుత్వం డిసెంబర్ 18న జారీ చేసిన నోటిఫికేషన్ ప్రకారం తమ పిల్లలు అడ్మిషన్లకు ఎంపికయ్యారని, అందువల్ల అడ్మిషన్ ఇవ్వాలని వారు కోరారు. అంతర్రాష్ట్ర కేటగిరీ కింద వివిధ పాఠశాలలకు వచ్చిన దరఖాస్తుల్లో 7,238 నిజమైనవి కాగా, 2,209 దరఖాస్తులు అసత్యమైనవని తేలింది. దీంతో తనను ఆశ్రయిం చిన 24 మంది విద్యార్థులకు అడ్మిషన్ ఇవ్వాలం టూ అత్యున్నత న్యాయస్థానం బుధవారం ఆదేశించింది.