సాక్షి, న్యూఢిల్లీ:నగరంలో నర్సరీ అడ్మిషన్లకు ఎట్టకేలకు మార్గం సుగమమైంది. ప్రైవేటు పాఠశాలల్లో నర్సరీ అడ్మిషన్లపై విధించిన స్టేను సుప్రీంకోర్టు బుధవారం ఎత్తివేసింది. దీంతో గత ఐదునెలలుగా అయోమయంలో కొట్టుమిట్టాడుతున్న విద్యార్థుల తల్లిదండ్రులు హాయిగా ఊపిరి పీల్చుకున్నారు. నర్సరీ అడ్మిషన్లలో అంతర్రాష్ట్ర బదిలీ కేటగిరీని రద్దు చేస్తూ ఢిల్లీ ప్రభుత్వం ఫిబ్రవరి 27న జారీ చేసిన నోటిఫికేషన్‌ను సుప్రీంకోరు ్టకొట్టివేసింది. ఈ విషయమై తనను అశ్రయించిన 24 మంది విద్యార్థులకు సీట్లు ఇవ్వాలని, ఇందుకోసం అవసరమైతే సీట్ల సంఖ్యను పెంచాలంటూ సుప్రీంకోర్టు ఢిల్లీ సర్కారును ఆదేశించింది. డిసెంబర్ 18న ప్రభుత్వం జారీచేసిన నోటిఫికేషన్ ప్రకారం నర్సరీలో ప్రవేశాలు చేపట్టొచ్చని న్యాయస్థానం పేర్కొంది. సుప్రీంకోర్టు పచ్చజెండా ఊపడంతో నర్సరీ అడ్మిషన్లపై గడచిన ఐదు నెలలుగా నెలకొన్న ప్రతిష్టంభన తొలగిపోయి అడ్మిషన్ ప్రక్రియకు దారులు తెరుచుకున్నాయి.
అంత ర్రాష్ట్ర బదిలీ కేటగిరీ ఆధారంగా తమ పిల్లలకు అడ్మిషన్ ఇవ్వాలని కోరుతూ 24 మంది విద్యార్థుల తల్లిదండ్రులు దాఖలు చేసిన పిటిషన్‌పై సోమవారం నిలిపిఉంచిన తీర్పును సుప్రీంకోర్టు బుధవారం ప్రకటించింది. అంతర్రాష్ట్ర బదిలీ కేట గిరీ కింద అడ్మిషన్ ఇవ్వాలని కోరుతూ కేవలం 24 మంది విద్యార్థుల తల్లిదండ్రులే సుప్రీంకోర్టును, ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారని సీనియర్ న్యాయవాది నితేష్ గుప్తా తెలియజేయడంతో న్యాయమూర్తులు హెచ్.ఎల్.దత్, ఎం.వై.ఇక్బాల్, ఎస్‌ఏ బాబ్డేల నేతృత్వంలోని ధర్మాసనం రెండు రోజుల పాటు తీర్పును నిలిపి ఉంచుతున్నట్లు సోమవారం ప్రకటించింది. తమ పిల్లల అడ్మిషన్ కోసం సుప్రీం కోర్టుకు, ఢిల్లీ హైకోర్టుకు వెళ్లిన తల్లిదండ్రుల జాబి తా ఇవ్వాల్సిందిగా ధర్మాసనం ఈ కేసు విచారణ ఆఖరి దశలో ఆదేశించింది.
అంతర్రాష్ట్ర బదిలీ కేట గిరీకి సంబంధించిన కేసులపై తాను విచారణ జరుపుతానని, ఈ కేసులను మినహాయించి మిగతా అన్ని కేటగిరీలకు నర్సరీ అడ్మిషన్ల ప్రక్రియను కొనసాగించాలని ఢిల్లీ హైకోర్టు ఏప్రిల్ మూడో తేదీన ఉత్తర్వు జారీ చేసింది. కానీ సుప్రీంకోర్టు దీనిపై ఏప్రిల్ 11వ తేదీనస్టే విధించింది. అంతర్రాష్ట్ర బదిలీ కేటగిరీ కింద పాఠశాలలు అక్రమంగా అడ్మిషన్లు జరుపుతున్నాయంటూ ఫిర్యాదులు రావడంతో ఈ కేటగిరీ అడ్మిషన్లపై సర్వత్రా సందేహాలు తలెత్తాయి. అంతర్రాష్ట్ర బదిలీ కేటగిరీ కింద అడ్మిషన్లు అధికంగా జరుగుతున్నట్లు ఓ సర్వేలో కూడా తేలింది.
ఈ కేటగిరీ విద్యార్థులకు చివరలో అధిక పాయింట్లు రావడం వల్ల పాఠశాల పరిసరాలలో నివసించే విద్యార్థులు కూడా నైబర్‌హుడ్ కేటగిరీ కింద ప్రవేశాలు పొందలేకపోతున్నారని సదరు సర్వే తెలిపింది. ఈ నేపథ్యంలో ఈ కేటగిరీని రద్దు చేయాలని లెఫ్టినెంట్ గవర్నర్ ఆదేశించారు. దీంతో ప్రభుత్వం కొత్త నోటిఫికేషన్ జారీ చేసింది. దీనిని సవాలుచేస్తూ కొందరు విద్యార్థుల తల్లిదండ్రులు కోర్టును ఆశ్రయించారు. ప్రభుత్వం డిసెంబర్ 18న జారీ చేసిన నోటిఫికేషన్ ప్రకారం తమ పిల్లలు అడ్మిషన్‌లకు ఎంపికయ్యారని, అందువల్ల అడ్మిషన్ ఇవ్వాలని వారు కోరారు. అంతర్రాష్ట్ర కేటగిరీ కింద వివిధ పాఠశాలలకు వచ్చిన దరఖాస్తుల్లో 7,238 నిజమైనవి కాగా, 2,209 దరఖాస్తులు అసత్యమైనవని తేలింది. దీంతో తనను ఆశ్రయిం చిన 24 మంది విద్యార్థులకు అడ్మిషన్ ఇవ్వాలం టూ అత్యున్నత న్యాయస్థానం బుధవారం ఆదేశించింది.
స్టే ఎత్తివేత
Published Wed, May 7 2014 10:50 PM | Last Updated on Sun, Sep 2 2018 5:20 PM
Advertisement