nursery admissions
-
సర్కార్‌కు రెండేళ్ల పిల్లాడి సవాల్!
న్యూఢిల్లీ: దేశ రాజధాని హస్తినలో నర్సరీలో ప్రవేశాల కోసం అరవింద్ కేజ్రీవాల్ ప్రభుత్వం కనీస వయసు పరిమితిని విధించడాన్ని సవాల్ చేస్తూ ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. ప్రాథమిక విద్యలో భాగమైన ప్రి-స్కూల్లో ప్రవేశాల కోసం నాలుగేళ్లు, ప్రైమరీ స్కూల్‌కి ఐదేళ్లు, ఒకటో తరగతికి ఆరేళ్లు కనీస వయస్సుగా నిర్ధారిస్తూ ఢిల్లీ డైరెక్టరేట్ ఆఫ్ ఎడ్యుకేషన్ (డీవోఈ) డిసెంబర్ 18న సర్క్యులర్ జారీచేసింది. జనవరి 1 నుంచి 22 తేదీ వరకు హస్తినలో ప్రాథమిక పాఠశాలల్లో ప్రవేశాల ప్రక్రియ కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో ఢిల్లీ సర్కార్ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ రెండున్నరేళ్ల బాలుడు ఉదయ్‌ప్రతాప్ సింగ్ కపూర్ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించాడు. బాలుడి తరఫున న్యాయవాది అఖిల్ సచార్ వాదనలు వినిపిస్తూ డీవోఈ జారీచేసిన సర్క్యులర్‌ను కొట్టివేయాలని, ఈ సర్క్యులర్ వల్ల 2017 వరకు తన క్లయింట్ ప్రి-స్కూల్లో ప్రవేశం పొందే అవకాశం ఉండదని కోర్టుకు తెలిపారు. అంతేకాకుండా మార్చి 31లోపు మూడేళ్ల వయస్సు పూర్తి చేసుకోని పిల్లలకు కూడా ప్రి-స్కూల్లో అడ్మిషన్స్ పొందకుండా ఈ సర్క్యులర్ అడ్డుకుంటోందని ఆయన కోర్టుకు వివరించారు. దీనిపై స్పందించిన జస్టిస్ రాజీవ్ శక్ధర్ నేతృత్వంలోని ధర్మాసనం ఢిల్లీ ప్రభుత్వం, డీవోఈ, లెఫ్టినెంట్ గవర్నర్‌కు నోటీసులు జారీచేసింది. పదిరోజుల్లో సమాధానం ఇవ్వాలని వారిని ఆదేశిస్తూ ఈ కేసు విచారణను ఫిబ్రవరి 1కి వాయిదా వేసింది. -
నర్సరీలో మేనేజ్మెంట్ కోటా రద్దు
నర్సరీ అడ్మిషన్లలో 'మేనేజ్మెంట్ కోటా'కు ఢిల్లీ మంత్రివర్గం స్వస్తి పలికింది. ఆర్థికంగా వెనకబడిన తరగతులకు చెందిన కుటుంబాల్లో పిల్లలకు ఇచ్చే 25 శాతం కోటా తప్ప.. నర్సరీ అడ్మిషన్లలో మరే కోటా ఉండకూడదని ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ స్పష్టం చేశారు. మిగిలిన సీట్లన్నీ అందరికీ అందుబాటులో ఉండాలన్నారు. ఒకవేళ దీనికి స్కూలు యాజమాన్యాలు అభ్యంతరం చెబితే తాము కోర్టుకు వెళ్లేందుకు కూడా సిద్ధమన్నారు. మేనేజ్మెంట్ కోటా అనేది విద్యావ్యవస్థలో అతిపెద్ద స్కాం అని, వాళ్లు దీన్ని ఆపకపోతే గుర్తింపు రద్దుచేయడం లేదా ప్రభుత్వమే వాటిని టేకోవర్ చేయడం తప్పదని హెచ్చరించారు. చదువును వ్యాపారం చేసేస్తామంటే ప్రభుత్వం చూస్తూ ఊరుకోదని స్పష్టం చేశారు. పిల్లలకు అడ్మిషన్లు ఎలా ఇస్తున్నారో బహిరంగంగా చెప్పాలని, ఇప్పుడు మాత్రం వాళ్లు అవలంబిస్తున్న విధానాలు చాలా షాకింగ్‌గా ఉన్నాయని కేజ్రీవాల్ అన్నారు. వెబ్సైట్లలో వాళ్లు పెట్టిన ప్రమాణాలు చూస్తే తానే షాక్ తిన్నానని చెప్పారు. పొగతాగే తల్లిదండ్రులు, నాన్ వెజ్ తినేవాళ్లు, మద్యం తాగేవాళ్ల పిల్లలకు కొన్ని స్కూళ్లలో ప్రవేశం లేదు. పెయింటింగ్ వేసేవాళ్లు, సంగీతం తెలిసిన వాళ్ల పిల్లలకు అదనపు రిజర్వేషన్ ఉంటుంది. ఇవన్నీ చాలా దారుణంగా ఉన్నాయని ఢిల్లీ సీఎం మండిపడ్డారు. -
మూడేళ్లు దాటితేనే నర్సరీలో ప్రవేశం
* వయోపరిమితిపై జీఆర్ విడుదల * ఐదేళ్లు దాటిన వారికే ఒకటో తరగతిలో ప్రవేశం సాక్షి, ముంబై: నర్సరీ, ప్లే గ్రూప్ విభాగాల్లో పిల్లలను చేర్పించేందుకు ప్రభుత్వం నియమ నిబంధనలు ప్రకటించింది. వయో పరిమితి విషయంలో ఈ నియమాలను కచ్చితంగా పాటించాలని ఆదేశించింది. ఈ నిబంధనలు వచ్చే విద్యా సంవత్సరం (2015-16) నుంచి అమలులోకి వస్తాయని ప్రభుత్వం స్పష్టం చేసింది. ప్రస్తుతం ప్లే గ్రూప్ లేదా నర్సరీలో అడ్మిషన్ ఇవ్వడానికి పాఠశాల యాజమాన్యాలు నిర్దిష్టమైన వయో పరిమితిని అనుసరించడం లేదు. ఈ విభాగంలో అడ్మిషన్లు ప్రైవేటు విద్యా సంస్థల ఇష్టారాజ్యంగా మారిపోయింది. దీనిపై అనేక ఫిర్యాదులు వచ్చాయి. దీంతో ప్రభుత్వం చొరవ తీసుకుని పాఠశాల యాజమాన్యాల మధ్య ఏకాభిప్రాయం తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు చేసింది. పాఠశాలల్లో ప్రవేశం పొందే పిల్లల వయో పరిమితిని నిశ్చయించేందుకు ప్రాథమిక విద్యా శాఖ డెరైక్టర్ అధ్యక్షతన ఏకసభ్య కమిటీని ఏర్పాటు చేశారు. ఈ కమిటీ ఇచ్చిన సిఫార్సుల మేరకు కొత్త నియమాలతో ప్రభుత్వం జీఆర్ విడుదల చేసింది. ప్లే గ్రూప్, నర్సరీ పిల్లలు ప్రవేశం పొందాలంటే మూడేళ్లు పూర్తిగా నిండాలి. ఐదేళ్లు పూర్తయిన తరువాత ఒకటో తరగతి ప్రవేశం ఇవ్వాలని జీఆర్‌లో స్పష్టం చేశారు. ఇదివరకు నాలుగేళ్లు పూర్తయిన వారికి ఒకటో తరగితిలో ప్రవేశం లభించేది. కాని ఈ విద్యా సంవత్సరం నుంచి ఐదేళ్లు నిండితేనే ప్రవేశం లభిస్తుంది. దీన్ని అన్ని విద్యా బోర్డులు అమలు చేయాలని జీఆర్‌లో ప్రభుత్వం ఆదేశించింది. నర్సరీలో ప్రవేశం తీసుకునే పిల్లలకు ఆ సంవత్సరం జూలై 31 నాటికి కనీసం మూడేళ్లు పూర్తిగా ఉండాలి. అదేవిధంగా ఒకటో తరగతిలో ప్రవేశం పొందేవారు ఆ సంవత్సరం జూలై 31 నాటికి ఐదేళ్లు పూర్తిగా ఉండాలి. ప్రస్తుతం కొన్ని పాఠశాలల యాజమాన్యాలు ఇప్పటికే అడ్మిషన్ల ప్రక్రియను పూర్తిచేశాయి. సాధ్యమైనంత వరకు కొత్త జీఆర్ ప్రకారం వారికి అడ్మిషన్లు ఇవ్వాలని విద్యా శాఖ కార్యదర్శి అశ్విని బిడే అన్నారు. -
అడ్మిషన్లలో ముందు జాగ్రత్త
న్యూఢిల్లీ: నర్సరీ అడ్మిషన్ల కోసం తల్లిదండ్రులు ముందుచూపుతో వ్యహరిస్తున్నారు. ఢిల్లీలోని పాఠశాలల్లో ప్రవేశాలు దొరక్కపోతే కనీసం శివారు ప్రాంతమైన ఎన్సీఆర్లోని మంచి పాఠశాలల్లోనైనా తమ పిల్లల కోసం సీట్లు రిజర్వు చేసుకునే ఆలోచనలో ఉన్నారు. ప్రతి సంవత్సరం తల్లిదండ్రులు ఎన్సీఆర్ స్కూళ్లవైపు చూడడం సాధారణమే. అయితే ఈ సంవత్సరం నర్సరీ అడ్మిషన్లలో నెలకొ న్న గందరగోళం నేపథ్యంలో మరింతమంది అటువైపే చూస్తున్నారు. ఈ విషయమై ప్రీత్‌విహార్ ప్రాం తానికి చెందిన ఆయూషీ జైన్ మాట్లాడుతూ... ‘నాకు తెలుసు చాలామంది పిల్లలు ప్రవేశాలు దొరక్క ఇంకా అయోమయ స్థితిలోనే ఉన్నారు. తమ బిడ్డకు కనీసం ఢిల్లీ పాఠశాలల్లో నర్సరీలో ప్రవేశం లభిస్తుందో తెలియని గందరగోళంలో ఉన్నారు. ఇలా జరుగుతుందని నాకు ముందే తెలు సు. అందుకే ఎన్సీఆర్లోని ఓ మంచి పాఠశాలలో అడ్మిషన్ కోసం దరఖాస్తు చేసుకున్నాం. ఒకవేళ అక్కడ సీటు దొరికితే మా బాబును అక్కడికే పంపుతాం. అలాకాకుండా ఢిల్లీలోని పాఠశాలలో సీటు వస్తే ఇక్కడికి పంపేందుకే తొలి ప్రాధాన్యతనిస్తాం. అంతేగానీ ఇక్కడ సీటు వస్తుందో? లేదో? చూస్తూ కూర్చోవడం మూర్ఖత్వమే అవుతుంద’ని అభిప్రాయపడ్డారు. వచ్చే ఏడాదీ ఇదే పరిస్థితి..? ఈ ఏడాది అడ్మిషన్ల ప్రక్రియపై జరిగేదేదో జరుగుతుందనే అభిప్రాయంలో ఉన్నా వచ్చే ఏడాది అడ్మిషన్ల ప్రక్రియ సజావుగా సాగాలని తల్లిదండ్రులు కోరుతున్నారు. ్చఛీఝజీటటజీౌటఠటట్ఛటడ.ఛిౌఝ వెబ్‌సైట్‌ను ఆశ్రయిస్తున్న తల్లిదండ్రుల్లో చాలామంది ఈ విషయమై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అయితే ఈ సంవత్సరం చోటుచేసుకున్న గందరగోళమే వచ్చే ఏడాది కూడా చోటుచేసుకునే అవకాశముందని విద్యావేత్తలు చెబుతున్నారు.ఈ సంవత్సరం లెఫ్టినెంట్ గవర్నర్ చొరవతో, కోర్టు మార్గదర్శకాలతో దొరికినవారికి సీట్లు దొరకడం, దొరకనివారు శివారు ప్రాంతాల్లోని పాఠశాలల్లో తమ పిల్లలను చేర్చడం జరిగినా మార్గదర్శకాల విషయంలో ఇంకా అస్పష్టత నెలకొందని చెబుతున్నారు. ఇప్పటి నుంచే కసరత్తు చేస్తేగానీ వచ్చే ఏడాది అడ్మిషన్ల ప్రక్రియ సజావుగా సాగదని సూచిస్తున్నారు. -
స్టే ఎత్తివేత
సాక్షి, న్యూఢిల్లీ:నగరంలో నర్సరీ అడ్మిషన్లకు ఎట్టకేలకు మార్గం సుగమమైంది. ప్రైవేటు పాఠశాలల్లో నర్సరీ అడ్మిషన్లపై విధించిన స్టేను సుప్రీంకోర్టు బుధవారం ఎత్తివేసింది. దీంతో గత ఐదునెలలుగా అయోమయంలో కొట్టుమిట్టాడుతున్న విద్యార్థుల తల్లిదండ్రులు హాయిగా ఊపిరి పీల్చుకున్నారు. నర్సరీ అడ్మిషన్లలో అంతర్రాష్ట్ర బదిలీ కేటగిరీని రద్దు చేస్తూ ఢిల్లీ ప్రభుత్వం ఫిబ్రవరి 27న జారీ చేసిన నోటిఫికేషన్‌ను సుప్రీంకోరు ్టకొట్టివేసింది. ఈ విషయమై తనను అశ్రయించిన 24 మంది విద్యార్థులకు సీట్లు ఇవ్వాలని, ఇందుకోసం అవసరమైతే సీట్ల సంఖ్యను పెంచాలంటూ సుప్రీంకోర్టు ఢిల్లీ సర్కారును ఆదేశించింది. డిసెంబర్ 18న ప్రభుత్వం జారీచేసిన నోటిఫికేషన్ ప్రకారం నర్సరీలో ప్రవేశాలు చేపట్టొచ్చని న్యాయస్థానం పేర్కొంది. సుప్రీంకోర్టు పచ్చజెండా ఊపడంతో నర్సరీ అడ్మిషన్లపై గడచిన ఐదు నెలలుగా నెలకొన్న ప్రతిష్టంభన తొలగిపోయి అడ్మిషన్ ప్రక్రియకు దారులు తెరుచుకున్నాయి. అంత ర్రాష్ట్ర బదిలీ కేటగిరీ ఆధారంగా తమ పిల్లలకు అడ్మిషన్ ఇవ్వాలని కోరుతూ 24 మంది విద్యార్థుల తల్లిదండ్రులు దాఖలు చేసిన పిటిషన్‌పై సోమవారం నిలిపిఉంచిన తీర్పును సుప్రీంకోర్టు బుధవారం ప్రకటించింది. అంతర్రాష్ట్ర బదిలీ కేట గిరీ కింద అడ్మిషన్ ఇవ్వాలని కోరుతూ కేవలం 24 మంది విద్యార్థుల తల్లిదండ్రులే సుప్రీంకోర్టును, ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారని సీనియర్ న్యాయవాది నితేష్ గుప్తా తెలియజేయడంతో న్యాయమూర్తులు హెచ్.ఎల్.దత్, ఎం.వై.ఇక్బాల్, ఎస్ఏ బాబ్డేల నేతృత్వంలోని ధర్మాసనం రెండు రోజుల పాటు తీర్పును నిలిపి ఉంచుతున్నట్లు సోమవారం ప్రకటించింది. తమ పిల్లల అడ్మిషన్ కోసం సుప్రీం కోర్టుకు, ఢిల్లీ హైకోర్టుకు వెళ్లిన తల్లిదండ్రుల జాబి తా ఇవ్వాల్సిందిగా ధర్మాసనం ఈ కేసు విచారణ ఆఖరి దశలో ఆదేశించింది. అంతర్రాష్ట్ర బదిలీ కేట గిరీకి సంబంధించిన కేసులపై తాను విచారణ జరుపుతానని, ఈ కేసులను మినహాయించి మిగతా అన్ని కేటగిరీలకు నర్సరీ అడ్మిషన్ల ప్రక్రియను కొనసాగించాలని ఢిల్లీ హైకోర్టు ఏప్రిల్ మూడో తేదీన ఉత్తర్వు జారీ చేసింది. కానీ సుప్రీంకోర్టు దీనిపై ఏప్రిల్ 11వ తేదీనస్టే విధించింది. అంతర్రాష్ట్ర బదిలీ కేటగిరీ కింద పాఠశాలలు అక్రమంగా అడ్మిషన్లు జరుపుతున్నాయంటూ ఫిర్యాదులు రావడంతో ఈ కేటగిరీ అడ్మిషన్లపై సర్వత్రా సందేహాలు తలెత్తాయి. అంతర్రాష్ట్ర బదిలీ కేటగిరీ కింద అడ్మిషన్లు అధికంగా జరుగుతున్నట్లు ఓ సర్వేలో కూడా తేలింది. ఈ కేటగిరీ విద్యార్థులకు చివరలో అధిక పాయింట్లు రావడం వల్ల పాఠశాల పరిసరాలలో నివసించే విద్యార్థులు కూడా నైబర్‌హుడ్ కేటగిరీ కింద ప్రవేశాలు పొందలేకపోతున్నారని సదరు సర్వే తెలిపింది. ఈ నేపథ్యంలో ఈ కేటగిరీని రద్దు చేయాలని లెఫ్టినెంట్ గవర్నర్ ఆదేశించారు. దీంతో ప్రభుత్వం కొత్త నోటిఫికేషన్ జారీ చేసింది. దీనిని సవాలుచేస్తూ కొందరు విద్యార్థుల తల్లిదండ్రులు కోర్టును ఆశ్రయించారు. ప్రభుత్వం డిసెంబర్ 18న జారీ చేసిన నోటిఫికేషన్ ప్రకారం తమ పిల్లలు అడ్మిషన్లకు ఎంపికయ్యారని, అందువల్ల అడ్మిషన్ ఇవ్వాలని వారు కోరారు. అంతర్రాష్ట్ర కేటగిరీ కింద వివిధ పాఠశాలలకు వచ్చిన దరఖాస్తుల్లో 7,238 నిజమైనవి కాగా, 2,209 దరఖాస్తులు అసత్యమైనవని తేలింది. దీంతో తనను ఆశ్రయిం చిన 24 మంది విద్యార్థులకు అడ్మిషన్ ఇవ్వాలం టూ అత్యున్నత న్యాయస్థానం బుధవారం ఆదేశించింది. -
ఢిల్లీలో నర్సరీ అడ్మిషన్లకు సుప్రీం ఓకే
దేశ రాజధాని నగరంలో నర్సరీ అడ్మిషన్లపై ఉన్న సస్పెన్షన్‌ను సుప్రీంకోర్టు బుధవారం ఎత్తేసింది. దీంతో పిల్లల తల్లిదండ్రులకు ఊపిరి పీల్చుకున్నట్లు అయింది. అంతర్రాష్ట్ర కోటా కింద తమ పిల్లలకు అడ్మిషన్లు ఇవ్వాలంటూ కొంతమంది పిల్లల తల్లిదండ్రులు కోర్టుకు వెళ్లగా, వాళ్లు దరఖాస్తు చేసుకున్న పాఠశాలల్లో అడ్మిషన్లు ఇవ్వొచ్చని కోర్టు తెలిపింది. ఒకవేళ ఆ 24 మంది పిల్లలకు ఎక్కడా సీట్లు దొరక్కపోతే, ఆయా స్కూళ్లలో అదనపు సీట్లు సృష్టించి వారిని చేర్చుకోవాలని కోర్టు రూలింగ్ ఇచ్చింది. జస్టిస్ హెచ్ఎల్ దత్తు, జస్టిస్ ఎంవై ఇక్బాల్, జస్టిస్ ఎస్ఏ బోబ్డేలతో కూడిన ధర్మాసనం ఈ మేరకు తన తీర్పు వెలువరించింది. దీంతో పిల్లలు నర్సరీలో చేరడానికి మార్గం సుగమమైంది. -
అడ్మిషన్లకు కొత్త షెడ్యూలు
న్యూఢిల్లీ: నర్సరీ అడ్మిషన్లకు సంబంధించి అంతర్రాష్ట్ర బదిలీ కేసుల్లో ఐదు పాయింట్ల విధానాన్ని రద్దు చేసి గురువారం కొత్త షెడ్యూలును ప్రకటిస్తామని లెఫ్టినెంట్ గవర్నర్ (ఎల్జీ) హైకోర్టుకు బుధవారం తెలిపారు. ఎల్జీ తాజా ప్రకటనతో ప్రస్తుతం అన్ఎయిడెడ్ పాఠశాలల్లో కొనసాగుతున్న నర్సరీ అడ్మిషన్ల ప్రక్రియ స్తంభించే అవకాశాలున్నాయి. అంతర్రాష్ట్ర బదిలీలకు ఐదు పాయింట్ల విధానాన్ని రద్దు చేయడంతోపాటు పాయింట్ల కేటాయింపు విధానాన్ని సమీక్షిస్తామని ప్రభుత్వం న్యాయమూర్తి మన్మోహన్‌కు తెలిపింది. ప్రస్తుత మార్గదర్శకాల ప్రకారం మొత్తం 100 పాయింట్లలో స్థానిక విద్యార్థులకు (నైబర్‌హుడ్) 70 కేటాయిస్తారు. ఇది వరకే స్కూల్లో చదువుతున్న విద్యార్థి తోబుట్టువులు దరఖాస్తు చేసుకుంటే వారికి 20 పాయింట్లు ఇస్తారు. తల్లిదండ్రుల్లో ఎవరో ఒకరు సదరు పాఠశాల పూర్వ విద్యార్థులు అయితే దరఖాస్తుదారుడికి ఐదు పాయింట్లు ఇస్తారు. ఇతర రాష్ట్రాల నుంచి ఢిల్లీకి (అంతర్రాష్ట్ర బదిలీలు) వచ్చి అడ్మిషన్లకు దరఖాస్తు చేసుకునే వారికి కూడా ఐదు పాయింట్లు కేటాయిస్తారు. 75 నుంచి 100 మధ్య పాయింట్లు వచ్చిన వారి పేర్లు మాత్రమే అడ్మిషన్ల కోసం తీసే డ్రాలో ఉంచుతారు. 90 పాయింట్లు వచ్చిన వారికి కచ్చితంగా అడ్మిషన్ ఇస్తారు. ఇతర రాష్ట్రాల నుంచి ఢిల్లీకి బదిలీ అయిన తల్లిదండ్రుల పిల్లలకు ఐదు పాయింట్లు కేటాయించడాన్ని సవాల్ చేస్తూ సుధాంశు జైన్ అనే వ్యక్తి పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై ఎల్జీ పైవిధంగా వివరణ ఇచ్చారు. ప్రధాన న్యాయమూర్తి బీడీ అహ్మద్ నేతృత్వంలోని బెంచ్‌కు కూడా ఇదే తరహా కేసు వచ్చింది. అంతర్రాష్ట బదిలీలకు పాయింట్లు కేటాయించడంపై వివరణ ఇవ్వాలని బెంచ్ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది ఇదిలా ఉంటే వికలాంగుల కోటాల్లో అందుబాటులో ఉన్న సీట్ల సంఖ్య ఎంతో చెప్పాలని కోర్టు ప్రభుత్వాన్ని ఆదేశించింది. మొత్తం సీట్లలో మూడుశాతం సీట్లను వారికి కేటాయించా ల్సిందేనని హైకోర్టు ద్విసభ్య బెంచ్ స్పష్టం చేసింది. -
రెండోస్సారి...ఎల్జీ మార్గదర్శకాలే ఫైనల్!
న్యూఢిల్లీ: నర్సరీ అడ్మిషన్లపై కోర్టుకెక్కిన ప్రైవేటు స్కూళ్ల యాజమాన్యాలకు రెండోసారీ చుక్కెదురైంది. లెఫ్టినెంట్ గవర్నర్ మార్గదర్శకాలే ఫైనల్ అంటూ మొదట ఏకసభ్య ధర్మాసనం ఇచ్చిన తీర్పునే ద్విసభ్య ధర్మాసనం కూడా వెలువరించింది. వివరాల్లోకెళ్తే... నర్సరీ అడ్మిషన్లకు సంబంధించి లెఫ్టినెంట్ గవర్నర్ జారీ చేసిన మార్గదర్శకాలను సవాలుచేస్తూ నగరంలోని ప్రైవేటు స్కూళ్లు దాఖలు చేసిన పిటిషన్‌ను ఢిల్లీ హైకోర్టు సోమవారం కొట్టివేసింది. లెఫ్టినెంట్ గవర్నర్ మార్గదర్శకాల ప్రకారమే నర్సరీ అడ్మిషన్లు జరుగుతాయని హైకోర్టు ద్విసభ్య ధర్మాసనం తీర్పు ఇచ్చింది. దీంతో నర్సరీ అడ్మిషన్ల ప్రక్రియకు మార్గం సుగమమైంది. విద్యాశాఖ డైరక్టరేట్ త్వరలోనే అడ్మిషన్ల షెడ్యూల్‌ను ప్రకటించనుంది. ముందుగా ప్రకటించిన ప్రకారం జనవరి 15 నుంచి నర్సరీ అడ్మిషన్ ప్రక్రియ ప్రారంభం కావలసిఉంది. కానీ ప్రైవేటు స్కూళ్లు కోర్టుకు వెళ్లాయి. నర్సరీ అడ్మిషన్ల ప్రక్రియపై మార్గదర్శకాలను జారీచేసే అధికారం లెఫ్టినెంట్ గవర్నర్‌కు లేదని స్కూళ్లు వాదించాయి. ఈ పిటిషన్‌ను మొదట ఢిల్లీ హైకోర్టు ఏకసభ్య ధర్మాసనం కొట్టివేసింది. దాంతో స్కూళ్లు ద్విసభ్య ధర్మాసనాన్ని ఆశ్రయించాయి. ఈసారి కూడా అదే తీర్పు వెలువడడంతో హైకోర్టు ఇచ్చిన తీర్పు తల్లిదండ్రులకు సంతోషాన్ని కలిగించింది. లెప్టినెంట్ గవర్నర్ మార్గదర్శకాల ప్రకారం.. అన్ని స్కూళ్లలో మేనేజ్మెంట్ కోటాను రద్దు చేయాలి. అన్ని పాఠశాలలు 100 పాయింట్ల ప్రాతిపదికన అడ్మిషన్ల ప్రక్రియను చేపట్టాలి. వాటిలో అత్యధికంగా 70 పాయింట్లను పాఠశాలకు సమీపంలో నివసించే వారికే అడ్మిషన్లలో ప్రాధాన్యతనివ్వాలనే ‘నైబర్‌హుడ్ క్రైటీరియా’కు కేటాయించారు. అంటే స్కూలుకు 8 కిలోమీటర్ల పరిధిలో నివసించే పిల్లలకు ‘నైబర్‌హుడ్ క్రైటీరియా’ వర్తిస్తుంది. మార్గదర్శకాల ప్రకారం 5 శాతం కోటా స్టాఫ్ పిల్లలు, మనవలు, మనుమరాళ్ల కోసం, 5 శాతం ఆడపిల్లల కోసం, 25 శాతం ఆర్థికంగా వెనుకబడిన వర్గాల పిల్లల కోసం రిజర్వ్ చేస్తారు.