న్యూఢిల్లీ: నర్సరీ అడ్మిషన్ల కోసం తల్లిదండ్రులు ముందుచూపుతో వ్యహరిస్తున్నారు. ఢిల్లీలోని పాఠశాలల్లో ప్రవేశాలు దొరక్కపోతే కనీసం శివారు ప్రాంతమైన ఎన్సీఆర్‌లోని మంచి పాఠశాలల్లోనైనా తమ పిల్లల కోసం సీట్లు రిజర్వు చేసుకునే ఆలోచనలో ఉన్నారు. ప్రతి సంవత్సరం తల్లిదండ్రులు ఎన్సీఆర్ స్కూళ్లవైపు చూడడం సాధారణమే. అయితే ఈ సంవత్సరం నర్సరీ అడ్మిషన్లలో నెలకొ న్న గందరగోళం నేపథ్యంలో మరింతమంది అటువైపే చూస్తున్నారు.
ఈ విషయమై ప్రీత్‌విహార్ ప్రాం తానికి చెందిన ఆయూషీ జైన్ మాట్లాడుతూ... ‘నాకు తెలుసు చాలామంది పిల్లలు ప్రవేశాలు దొరక్క ఇంకా అయోమయ స్థితిలోనే ఉన్నారు. తమ బిడ్డకు కనీసం ఢిల్లీ పాఠశాలల్లో నర్సరీలో ప్రవేశం లభిస్తుందో తెలియని గందరగోళంలో ఉన్నారు. ఇలా జరుగుతుందని నాకు ముందే తెలు సు. అందుకే ఎన్సీఆర్‌లోని ఓ మంచి పాఠశాలలో అడ్మిషన్ కోసం దరఖాస్తు చేసుకున్నాం. ఒకవేళ అక్కడ సీటు దొరికితే మా బాబును అక్కడికే పంపుతాం. అలాకాకుండా ఢిల్లీలోని పాఠశాలలో సీటు వస్తే ఇక్కడికి పంపేందుకే తొలి ప్రాధాన్యతనిస్తాం. అంతేగానీ ఇక్కడ సీటు వస్తుందో? లేదో? చూస్తూ కూర్చోవడం మూర్ఖత్వమే అవుతుంద’ని అభిప్రాయపడ్డారు.
వచ్చే ఏడాదీ ఇదే పరిస్థితి..?
ఈ ఏడాది అడ్మిషన్ల ప్రక్రియపై జరిగేదేదో జరుగుతుందనే అభిప్రాయంలో ఉన్నా వచ్చే ఏడాది అడ్మిషన్ల ప్రక్రియ సజావుగా సాగాలని తల్లిదండ్రులు కోరుతున్నారు. ్చఛీఝజీటటజీౌటఠటట్ఛటడ.ఛిౌఝ వెబ్‌సైట్‌ను ఆశ్రయిస్తున్న తల్లిదండ్రుల్లో చాలామంది ఈ విషయమై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అయితే ఈ సంవత్సరం చోటుచేసుకున్న గందరగోళమే వచ్చే ఏడాది కూడా చోటుచేసుకునే అవకాశముందని విద్యావేత్తలు చెబుతున్నారు.ఈ సంవత్సరం లెఫ్టినెంట్ గవర్నర్ చొరవతో, కోర్టు మార్గదర్శకాలతో దొరికినవారికి సీట్లు దొరకడం, దొరకనివారు శివారు ప్రాంతాల్లోని పాఠశాలల్లో తమ పిల్లలను చేర్చడం జరిగినా మార్గదర్శకాల విషయంలో ఇంకా అస్పష్టత నెలకొందని చెబుతున్నారు. ఇప్పటి నుంచే కసరత్తు చేస్తేగానీ వచ్చే ఏడాది అడ్మిషన్ల ప్రక్రియ సజావుగా సాగదని సూచిస్తున్నారు.
అడ్మిషన్లలో ముందు జాగ్రత్త
Published Wed, Aug 13 2014 10:06 PM | Last Updated on Sat, Sep 2 2017 11:50 AM
Advertisement