దేశ రాజధాని నగరంలో నర్సరీ అడ్మిషన్లపై ఉన్న సస్పెన్షన్ను సుప్రీంకోర్టు బుధవారం ఎత్తేసింది. దీంతో పిల్లల తల్లిదండ్రులకు ఊపిరి పీల్చుకున్నట్లు అయింది. అంతర్రాష్ట్ర కోటా కింద తమ పిల్లలకు అడ్మిషన్లు ఇవ్వాలంటూ కొంతమంది పిల్లల తల్లిదండ్రులు కోర్టుకు వెళ్లగా, వాళ్లు దరఖాస్తు చేసుకున్న పాఠశాలల్లో అడ్మిషన్లు ఇవ్వొచ్చని కోర్టు తెలిపింది.
ఒకవేళ ఆ 24 మంది పిల్లలకు ఎక్కడా సీట్లు దొరక్కపోతే, ఆయా స్కూళ్లలో అదనపు సీట్లు సృష్టించి వారిని చేర్చుకోవాలని కోర్టు రూలింగ్ ఇచ్చింది. జస్టిస్ హెచ్ఎల్ దత్తు, జస్టిస్ ఎంవై ఇక్బాల్, జస్టిస్ ఎస్ఏ బోబ్డేలతో కూడిన ధర్మాసనం ఈ మేరకు తన తీర్పు వెలువరించింది. దీంతో పిల్లలు నర్సరీలో చేరడానికి మార్గం సుగమమైంది.
ఢిల్లీలో నర్సరీ అడ్మిషన్లకు సుప్రీం ఓకే
Published Wed, May 7 2014 12:33 PM | Last Updated on Sun, Sep 2 2018 5:20 PM
Advertisement