
న్యూఢిల్లీ: పార్లమెంటే సుప్రీం అంటూ ఉప రాష్ట్రపతి, రాజ్య సభ చైర్మన్ జగదీప్ ధన్‌ఖడ్ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై సుప్రీంకోర్టు బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్, ఎంపీ కపిల్ సిబాల్ పరోక్షంగా కౌంటరిచ్చారు. ఇక్కడ పార్లమెంట్ సుప్రిమా.. లేక కార్యనిర్వాహక శాఖ సుప్రిమా అనేది ప్రశ్నే కాదని, కేవలం రాజ్యాంగం మాత్రమే ఇక్కడ సుప్రీం అంటూ సిబాల్ తెలిపారు. ఈ మేరకు ‘ఎక్స్’ వేదికగా కపిల్ సిబాల్ స్పందించారు. భారతదేశంలో చట్టాన్ని ఎలా అర్ధం చేసుకుంటందనే దానికి కపిల్ సిబాల్ వివరణ ఇచ్చారు. ‘ పార్లమెంట్, కార్యనిర్వహాక శాఖ సుప్రీం కాదు.. రాజ్యాంగమే మన దేశంలో సుప్రీం. ఇప్పటివరకూ దేశం చట్టాన్ని ఇలానే అర్ధం చేసుకుంది’ అని స్సష్టం చేశారు.
The law :
Neither Parliament
Nor the Executive is supreme
The Constitution is supreme
The provisions of the Constitution are interpreted by the Supreme Court
That’s how this country has understood the law so far !— Kapil Sibal (@KapilSibal) April 22, 2025
కాగా, రాజ్యాంగపరమైన అంశాల్లో ఎన్నికైన ప్రజాప్రతినిధులే ‘అల్టిమేట్ మాస్టర్స్’ అని జగదీప్ ధన్‌ఖడ్ వ్యాఖ్యానించారు. . రాష్ట్ర గవర్నర్ పంపిన బిల్లులకు రాష్ట్రపతి నిర్ణీత గడువులోపు సమ్మతి తెలపాలని సుప్రీంకోర్టు గడువు విధించడంపై ధన్‌ఖడ్ తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేసిన ధన్ ఖడ్.. మంగళవారం ఢిల్లీ యూనివర్సిటీలో ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన మరోసారి అదే తరహా వ్యాఖ్యలు చేశారు
‘‘ఎన్నికైన ప్రజాప్రతినిధులు జవాబుదారీతనంగా ఉండాలి. అది ఎమర్జెన్సీ విధించిన ప్రధాని అయినా సరే!. ప్రజలకు రక్షణ కల్పించేందుకే ప్రజాస్వామ్యం. రాజ్యాంగపరమైన అంశాల్లో ప్రజాప్రతినిధులే అల్టిమేట్ మాస్టర్స్. పార్లమెంట్ కంటే అత్యుత్తమమైనది ఉందని రాజ్యాంగంలో ఎక్కడా లేదు. కాబట్టి పార్లమెంటే సుప్రీం అని పేర్కొన్నారు.