parliement
-
రాష్ట్రపతి ఎన్నికల కౌంటింగ్ ప్రారంభం
-
Uganda: ఆత్మాహుతి బాంబు దాడులు.. ముగ్గురు మృతి
కంపాలా: ఉగాండలో ఉగ్రమూకలు రెచ్చిపోయారు. రాజధాని నగరం కంపాలాలో ఆత్మాహుతి బాంబు దాడులకు తెగబడ్డారు. పార్లమెంట్ భవనాన్ని లక్ష్యంగా చేసుకుని ఆత్మహుతి దాడులకు పాల్పడ్డారు. ఈ ఘటనలో ముగ్గురు పౌరులు మృతి చెందగా, మరో 33 మంది పౌరులు తీవ్రంగా గాయపడ్డారు. -
నెల్లూరు బీజేపీ పార్లమెంటరీ సెక్రటరీ కిడ్నాప్ కలకలం
కృష్ణాజిల్లా: విజయవాడ పెనమలూరు పీఎస్ పరిధిలో బీజేపీ పార్లమెంటరీ సెక్రటరీ వినోద్‌ను కిడ్నాప్ చేసి తీసుకెళ్లడం కలకలం రేపింది. తన భర్తను నిన్నరాత్రి (ఆదివారం) కొందరు గుర్తు తెలియని వ్యక్తులు కిడ్నాప్ చేశారని ప్రశాంతి అనే మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నెల్లూరు బీజేపీ పార్లమెంటరీ సెక్రటరీగా వ్యవహరిస్తున్న వినోద్ అనే వ్యక్తి నిన్న రాత్రి ఇంటి నుంచి బయటకు వెళ్లాడు. ఈ క్రమంలో కొందరు గుర్తుతెలియని వ్యక్తులు ఇన్నోవా సిల్వర్ కలర్ కారులో వినోద్‌ను బలవంతంగా ఎత్తుకెళ్లారు. వ్యాపార లావాదేవీల నేపథ్యంలో తన భర్తను కిడ్నాప్ చేశారని వినోద్ భార్య.. ప్రశాంతి పోలీసులకు తెలిపింది. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు సీసీ ఫుటేజీని పరిశీలిస్తున్నట్లు తెలిపారు. చదవండి: ఆటో ఎక్కిన పాపానికి సామూహికంగా ఆమెపై.. -
‘తెలంగాణకు రావాల్సిన ప్రతి అంశంపై పార్లమెంట్లో చర్చిస్తాం’
న్యూఢిల్లీ: పార్లమెంట్లో జరిగే వర్షాకాల సమావేశంలో తెలంగాణ సమస్యలపై ప్రశ్నలు లేవనెత్తుతామని టీఆర్ఎస్ లోక్‌సభాపక్ష నేత ఎంపీ నాగేశ్వర్ రావు తెలిపారు. కాగా, ఆదివారం పార్లమెంట్ సమావేశంలో చర్చించాల్సిన అంశాల గురించి అఖిల పక్షం ఆధ్వర్యంలో చర్చలు జరిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దేశ ఆర్థిక వ్యవస్థ, ధరల పెరుగుదలపై చర్చలు జరపాలని పేర్కొన్నారు. అదేవిధంగా, 48 గంటల ముందే బిల్లుల వివరాలను సభకు తెలపాలని కోరినట్టు నాగేశ్వర్రావు తెలిపారు. తెలంగాణకు రావాల్సిన ప్రతి అంశంపై పార్లమెంట్లో చర్చిస్తామని వివరించారు. -
'ఇక చాలు ఆపండి.. లేదంటే ఒంటరవుతారు'
-
'ఇక చాలు ఆపండి.. లేదంటే ఒంటరవుతారు'
న్యూఢిల్లీ: 'ఇక చాలు ఆపండి లేదంటే ఒంటరిగా మిగిలిపోతారు' అని సమాజ్ వాది పార్టీ అధినేత ములాయం సింగ్ యాదవ్ కాంగ్రెస్ పార్టీని హెచ్చరించారు. పార్లమెంటు సభల్లో ఆందోళనను విరమించి ప్రజా సమస్యలు చర్చించేందుకు అవకాశం ఇప్పించాలని లేదంటే తాము మద్ధతు ఉపసంహరించుకుంటామని అల్టిమేటం జారీ చేశారు. అంతకుముందు 25మంది కాంగ్రెస్ పార్టీ నేతలను సస్పెండ్ చేయడంపట్ల సానుభూతి వ్యక్తం చేశారు. 'ఇక చాలు చాలు. మీరు ఇలాగే ఆందోళన కొనసాగిస్తూ వెళితే ఏ మాత్రం మద్దతివ్వలేం' అని ములాయం అన్నారు. పార్లమెంటు సమావేశాలు ప్రారంభమైనప్పటి నుంచి కూడా కాంగ్రెస్ పార్టీ అధికార పక్షానికి వ్యతిరేకంగా సభలను స్తంభింపజేస్తున్న విషయం తెలిసిందే. కేంద్ర మంత్రి సుష్మాస్వరాజ్, రాజస్థాన్ ముఖ్యమంత్రి వసుంధర రాజేలను తొలగించాలని వారు డిమాండ్ చేస్తుండగా అందుకు ససేమిరా అంటూ బీజేపీ తెగేసి చెప్పడంతో వారు ఆందోళన కొనసాగిస్తున్నారు. దీనివల్ల పార్లమెంటులో చర్చకు రావాల్సిన ఎన్నోవిలువైన అంశాలు అసలు వేదిక మీదకు రాకుండానే పోయాయి. ఈ నేపథ్యంలోనే ములాయం కాంగ్రెస్ పార్టీ తీరుపట్ల తన నిరసన గళం తొలిసారి వినిపించారు. అంతకుముందు సమాజ్ వాది పార్టీ కూడా కాంగ్రెస్ పార్టీతో జతకట్టి ఉండటం గమనార్హం. -
'అప్పటి వరకు వేచి చూస్తాం'
న్యూఢిల్లీ: హైకోర్టు విభజన అంశంపై కోర్టు తీర్పు వచ్చే వరకు వేచి చూస్తామని టీఆర్ఎస్ ఎంపీ కవిత అన్నారు. గురువారం ఆమె పార్లమెంటు వద్ద విలేకరులతో మాట్లాడుతూ ఉద్యోగుల విభజన త్వరగా పూర్తి చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర స్థాయి ఉద్యోగులకు మార్గదర్శకాలున్నాయని, జిల్లా, మండల స్థాయి ఉద్యోగులకు లేవని కవిత చెప్పారు. నేడు కేంద్ర హోమంత్రి రాజ్ నాథ్ సింగ్ ను కలిసి అన్ని అంశాలు వివరిస్తామని చెప్పారు. -
ప్రతిదానికి బ్లాక్ మెయిల్ వద్దు
న్యూఢిల్లీ: దేశ అభివృద్ధికి కాంగ్రెస్ పార్టీ మోకాలడ్డుతోందని కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు ఆరోపించారు. 130 ఏళ్ల చరిత్ర తనకు ఉందని కాంగ్రెస్ పార్టీ గొప్పలు చెప్పుకుంటోందని, లోక్ సభ స్పీకర్‌ను బెదిరించడం ఏ విలువలకు నిదర్శనం అని ఆయన ప్రశ్నించారు. ప్రతి పక్షమంటే ప్రభుత్వానికి సరైన సూచనలు ఇవ్వాలని హితవు పలికారు. అయినదానికి, కాని దానికి బ్లాక్ మెయిల్ చేయడం సరికాదని అన్నారు. పార్లమెంటు విలువలు కాపాడాల్సిన బాధ్యత ప్రతిపక్షానికి ఉందని, ప్రజల సమస్యలను చర్చించేందుకు అవకాశం ఇవ్వాలని చెప్పారు. -
విభజన హామీలు త్వరలో నెరవేరుస్తాం..
న్యూఢిల్లీ: కేంద్ర సాధారణ బడ్జెట్, రైల్వే బడ్జెట్లోని సానుకూల అంశాలను ప్రజల్లోకి తీసుకువెళ్లడానికి కేంద్ర ప్రభుత్వం సిద్ధమవుతోంది. పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ఎం.వెంకయ్యనాయుడు నేతృత్వంలో పార్లమెంట్‌లోని ఆయన కార్యాలయంలో శుక్రవారం సమావేశమైన కేంద్ర మంత్రులు పలు అంశాలపై చర్చించారు. అందులో ప్రధానంగా ఆంధ్రప్రదేశ్ పునర్ వ్యవస్థీకరణ చట్టం-2014లోని హామీలపై సుదీర్ఘంగా చర్చించారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు ఈ చట్టం ద్వారా ఇచ్చిన హామీలను త్వరితగతిన నెరవేర్చేందుకు కృషిచేస్తామని మంత్రులు వెంకయ్యనాయుడికి హామీ ఇచ్చారు. ఈ సమావేశానికి.. సుష్మాస్వరాజ్, నితిన్ గడ్కారీ, రాంవిలాస్ పాశ్వాన్, సదానందగౌడ, రవిశంకర్ ప్రసాద్, జేపీ నడ్డా, బీరేంద్ర సింగ్ చౌదరి, సురేశ్‌ప్రభు, అనంత్ కుమార్, హర్షవర్ధన్, జుయల్ ఓరం, అనంత్ గీతే, నజ్మా హెప్తుల్లా, స్మృతీ ఇరానీ, అశోక్ గజపతి రాజు, పీయూష్ గోయల్, ప్రకాశ్ జవదేకర్, డాక్టర్ జితేంద్ర సింగ్, వై.ఎస్.చౌదరి తదితరులు హాజరయ్యారు. సాధారణ బడ్జెట్, రైల్వే బడ్జెట్లోని అంశాలతోపాటు భూసేకరణ సవరణ చట్టం వల్ల ఉపయోగాలను, 14వ ఆర్థిక సంఘం సిఫారసుల కారణంగా రాష్ట్రాలకు పెరిగిన పన్నుల వాటా తదితర అంశాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని వెంకయ్యనాయుడు మంత్రులకు సూచించారు. మార్చి 20 నుంచి ఏప్రిల్ 20 వరకు పార్లమెంట్‌కు సెలవులు ఉన్నందున ఆ సమయంలో వీటిపై దృష్టిపెట్టాలని సూచించారు. విశాఖ జోన్ పరిశీలనలో ఉంది: సురేశ్ ప్రభు విశాఖపట్నంలో రైల్వే జోన్ ఏర్పాటు పరిశీలనలో ఉందని ఈ సందర్భంగా రైల్వే మంత్రి సురేశ్‌ప్రభు చెప్పారు. ఉభయ తెలుగు రాష్ట్రాలు ఇచ్చిన ప్రతిపాదనలన్నింటినీ పూర్తిచేశామని, త్వరలోనే ఏపీ, తెలంగాణల్లో సమీక్ష సమావేశాలు నిర్వహిస్తామని రోడ్డు రవాణా, రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కారీ తెలిపారు. అలాగే పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి తమ పూర్తి సహకారం ఉంటుందని కేంద్ర జలవనరుల శాఖ మంత్రి ఉమాభారతి.. వెంకయ్యకు హామీ ఇచ్చారు. తిరుపతిలో ఐఐటీ కోసం ప్రతిపాదించిన స్థలానికి అనుమతి ఇచ్చామని హెచ్ఆర్డీ మంత్రి స్మృతి చెప్పారు. ఐఐటీ, ఐఐఎస్ఈఆర్ సంస్థల శంకుస్థాపనకు తాను ఏపీకి వెళుతున్నానని, ఇతర సంస్థల పనులు కూడా పురోగతిలో ఉన్నాయని వివరించారు. ఏపీలో ఎయిమ్స్‌కు కేంద్ర ఆరోగ్య శాఖ ఆమోదం తెలిపిందని ఆ శాఖ మంత్రి జేపీ నడ్డా వివరించారు. ఎరువులు, రసాయనాల శాఖ మంత్రి అనంత్‌కుమార్ మాట్లాడుతూ.. రామగుండం ఫెర్టిలైజర్స్ యూనిట్‌ను పునరుద్ధరించేందుకు ఆయా సంస్థలు ఎంవోయూ కుదుర్చుకున్నాయని వివరించారు. కడప స్టీలు ప్లాంటుపై అధ్యయనం.. కడపలో స్టీలు ప్లాంటు ఏర్పాటుపై అధ్యయనం జరుగుతోందని గనులు, ఉక్కు శాఖ మంత్రి నరేంద్రసింగ్ తోమర్ వెంకయ్యకు వివరించారు. ఎంపిక ప్రక్రియ పూర్తయితే పెట్రోలియం వర్సిటీ పనులు ప్రారంభిస్తామని పెట్రోలియం, సహజవాయు మంత్రి ధర్మేంద్ర ప్రదాన్ వివరించారు. విద్యుత్తు, బొగ్గు శాఖ మంత్రి పీయూష్ గోయల్ మాట్లాడుతూ కేటాయింపులు జరపగా మిగిలిన విద్యుత్తును ఇరు రాష్ట్రాలకు పంపిణీ చేస్తామన్నారు. అలాగే తెలంగాణలో 800 మెగావాట్ల చొప్పున రెండు విద్యుత్తు ప్లాంట్లను తొలివిడతలో రామగుండం ప్రాజెక్టు పరిధిలోని ఎంజీఆర్ ప్రాంతంలో అభివృద్ధిపరుస్తామని వివరించారు. రెండు రాష్ట్రాలకు హైకోర్టు ఏర్పాటు విషయంలో కేంద్రం సిద్ధంగా ఉందని, ఉమ్మడి హైకోర్టు, రెండు రాష్ట్రాల ప్రభుత్వాలు ఈ ప్రక్రియను ముందుకు తీసుకెళ్లాల్సి ఉందని అన్నారు. సమావేశంలో బీజేపీ ఏపీ అధ్యక్షుడు, విశాఖ ఎంపీ కంభంపాటి హరిబాబు కూడా పాల్గొన్నారు. -
'కర్నూలును రాజధాని చేయకపోతే మరో ఉద్యమం'
కర్నూలు: ఆంధ్రప్రదేశ్ పునర్ వ్యవస్థీకరణ(తెలంగాణ) బిల్లుకు పార్లమెంట్ ఆమోదం తెలిపిన నేపథ్యంలో సీమాంధ్ర నేతల్లో భిన్న స్వరాలు వినిపిస్తున్నాయి. తమ ప్రాంతాలను రాజధానిగా చేయాలంటే నాయకులు డిమాండ్ చేస్తున్నారు. రాజధాని అంశానికి సంబంధించి కేంద్రం ఏ వైపు అడుగులు వేసినా సీమాంధ్రలో మాత్రం అలజడి మొదలైంది. తాజాగా కేంద్రమంత్రి కోట్ల సూర్య ప్రకాశ్ రెడ్డి కాస్త స్వరం పెంచారు. గత ఆంధ్ర రాష్ట్రానికి రాజధానిగా ఉన్న కర్నూల్ ను సీమాంధ్ర రాజధానిగా చేయాలని కోట్ల డిమాండ్ చేస్తున్నారు. కాని పక్షంలో ప్రత్యేక రాయలసీమ ఉద్యమం మొదలవుతుందని హెచ్చరిస్తున్నారు. కాంగ్రెస్ ను వీడిన వారు వచ్చే ఎన్నికల్లో గెలిచే పరిస్థితి లేదన్నారు. పార్టీలు మారే వారిని ప్రజలు ఆదరించరని కోట్ల అభిప్రాయపడ్డారు.