
ప్రతిదానికి బ్లాక్ మెయిల్ వద్దు
న్యూఢిల్లీ: దేశ అభివృద్ధికి కాంగ్రెస్ పార్టీ మోకాలడ్డుతోందని కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు ఆరోపించారు. 130 ఏళ్ల చరిత్ర తనకు ఉందని కాంగ్రెస్ పార్టీ గొప్పలు చెప్పుకుంటోందని, లోక్ సభ స్పీకర్ను బెదిరించడం ఏ విలువలకు నిదర్శనం అని ఆయన ప్రశ్నించారు.
ప్రతి పక్షమంటే ప్రభుత్వానికి సరైన సూచనలు ఇవ్వాలని హితవు పలికారు. అయినదానికి, కాని దానికి బ్లాక్ మెయిల్ చేయడం సరికాదని అన్నారు. పార్లమెంటు విలువలు కాపాడాల్సిన బాధ్యత ప్రతిపక్షానికి ఉందని, ప్రజల సమస్యలను చర్చించేందుకు అవకాశం ఇవ్వాలని చెప్పారు.