‘అసహనం’ శతాబ్దపు జోక్ | Venkaiah criticized the Congress | Sakshi
Sakshi News home page

‘అసహనం’ శతాబ్దపు జోక్

Published Tue, Nov 3 2015 6:17 AM | Last Updated on Fri, Mar 29 2019 9:31 PM

‘అసహనం’ శతాబ్దపు జోక్ - Sakshi

‘అసహనం’ శతాబ్దపు జోక్

కాంగ్రెస్‌పై వెంకయ్య విమర్శలు
 
 సాక్షి, న్యూఢిల్లీ: దేశంలో సహనశీలత తగ్గిందని ఆరోపిస్తూ కాంగ్రెస్.. రాష్ట్రపతికి ఫిర్యాదు చేస్తాననడం  శతాబ్దపు జోక్ అని కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు ఎద్దేవా చేశారు. సహనశీలతపై బీజేపీకి కాంగ్రెస్ బోధించడం దెయ్యాలు వేదాలు వల్లించినట్లుందని సోమవారమిక్కడ అన్నారు. కులమతాలను ఉపయోగించి దేశంలో విభజన రాజకీయాలకు కాంగ్రెస్ బీజం వేసిందని, మతోన్మాదశక్తులను పోషించిన కాంగ్రెస్ సహనశీలతను ప్రశ్నించడం హాస్యాస్పదమన్నారు. ఎమర్జెన్సీ విధించి, ప్రతిపక్షాన్ని జైల్లో నిర్భంధించి, సిక్కుల ఊచకోతకు పాల్పడిందెవరో చెప్పాక సహనశీలతపై ప్రవచనాలు చేస్తే బాగుంటుందని వ్యాఖ్యానించారు. సమగ్ర అభివృద్ధి అజెండాతో మోదీ ప్రభుత్వం ముందుకు వెళుతోందన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement