జిల్లాలో 10 జెడ్పీ హైస్కూళ్ల ఎంపిక
2,275 మంది విద్యార్థులకు శిక్షణ
బి.కొత్తకోట: గ్రామీణ ప్రాంతాల విద్యార్థులను ట్రిపుల్ ఐటీ ప్రవేశ పరీక్షకు సిద్ధం చేసేందుకు చర్యలు మొదలయ్యాయి. ఇందులో భాగంగా జిల్లాలోని పది జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలను ఎంపిక చేశారు. అందులో చదువుతున్న 2,275 మంది విద్యార్థులను ఎంపిక చేశారు. వీరికి సంబంధిత పాఠశాలకు చెందిన ఉపాధ్యాయులే శిక్షణ ఇస్తారు. విధివిధానాలను పాఠశాలలకు పంపించారు. ఇంటర్ విద్య పూర్తయ్యాక త్రిబుల్ ఐటీ ప్రవేశ పరీక్ష రాస్తారు. గ్రామీణ విద్యార్థులు ఈ పరీక్షకు హాజరయ్యేందుకు, అర్హత సాధించేందుకు సరైన శిక్షణ, మార్గదర్శకం లేదు. ఈ మేరకు వారికి శిక్షణ ఇచ్చి ఇంటర్ తర్వాత పరీక్షలకు హాజరయ్యేలా కృషి చేస్తారు.
ఆ పాఠశాలలు ఇవే..
జిల్లాలో బి.కొత్తకోట బాలుర ఉన్నత పాఠశాలకు చెందిన 139 మంది, కుప్పం బాలుర ఉన్నత పాఠశాలకు చెందిన 184 మంది, శాంతిపురం ఉన్నత పాఠశాలలో 244 మంది, రేణిగుంట బాలిక ఉన్నత పాఠశాలలో 133 మంది, సత్యవేడు బాలుర ఉన్నత పాఠశాలలో 227 మంది, నరహరిపేట ఉన్నత పాఠశాలలో 252 మంది, రంగంపేట ఉన్నత పాఠశాలలో 129 మంది, ముత్యాలరెడ్డిపల్లె ఉన్నత పాఠశాలలో 201 మంది, శ్రీకాళహస్తి బాలుర ఉన్నత పాఠశాలలో 665 మంది, తుమ్మింద ఉన్నత పాఠశాలలో 104 మంది విద్యార్థులను శిక్షణకు ఎంపిక చేశారు.
స్థానిక ఉపాధ్యాయులతో శిక్షణ..
విద్యార్థులకు ఆయా పాఠశాలల ఉపాధ్యాయులే శిక్షణ ఇస్తారు. ఈనెల 26న శిక్షణ కేంద్రాలను ప్రారంభిస్తారు. పాఠశాలల సమయం ముగిశాక విద్యార్థులకు శిక్షణ ఇవ్వాల్సి ఉంటుంది. మ్యాథ్స్, ఫిజిక్స్, బయాలజీ, కెమిస్ట్రీ సబ్జెక్టుల్లో బోధించేందుకు సంబంధిత పాఠశాలకు చెందిన ఐదుగురు ఉపాధ్యాయులను ఎంపిక చేశారు.
పది నుంచే ట్రిపుల్ ఐటీ శిక్షణ
Published Wed, Feb 3 2016 6:33 AM | Last Updated on Sun, Mar 10 2019 8:23 PM
Advertisement
Advertisement