విధుల్లో ఉన్నట్టా..లేనట్టా..? | Confused Contract faculty | Sakshi
Sakshi News home page

విధుల్లో ఉన్నట్టా..లేనట్టా..?

Published Mon, Jul 24 2017 1:27 AM | Last Updated on Tue, Sep 5 2017 4:43 PM

విధుల్లో ఉన్నట్టా..లేనట్టా..?

విధుల్లో ఉన్నట్టా..లేనట్టా..?

అయోమయంలో కాంట్రాక్ట్‌ అధ్యాపకులు
నేటికీ అందని  రెన్యువల్‌ ఉత్తర్వులు
వేతనాల పెంపు,  క్రమబద్ధీకరణపై   లేని స్పష్టత
ప్రభుత్వ కళాశాలల్లో కుంటుపడుతున్న విద్యాబోధన
పట్టించుకోని  పాలక పక్షం


కందుకూరు రూరల్‌: విద్యార్థి దశలో కీలకమైన ఇంటర్మీడియెట్‌ విద్య ఇప్పటికే కార్పొరేట్‌ కళాశాలల గుప్పిట్లోకి వెళ్లింది. ఉత్తమ ఫలితాలతో విద్యార్థుల ఆదరణతో ప్రైవేటు కళాశాలల పోటీని తట్టుకొని నిలబడిన ప్రభుత్వ కళాశాలలను ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో విద్య కుంటుపడుతోంది. బోధకుల నియామకంలో నెలకొన్న జాప్యం ప్రభావం విద్యార్థుల చదువులపై తీవ్రంగా పడుతోంది. కాంట్రాక్ట్‌ అధ్యాపకులు ఈ విద్యా సంవత్సరం కూడా కొనసాగేలా నేటికీ రెన్యువల్‌ ఉత్తర్వులు విడుదల కాలేదు. విద్యా సంవత్సరం ప్రారంభమైన రెండు నెలలు గడుస్తున్నా జీవో రాని కారణంగా కాంట్రాక్ట్‌ అధ్యాపకులు అయోమయంలో పడ్డారు.

తాము విధులకు వెళ్లాలా..? వెళ్ల కూడదా...? ప్రభుత్వం వేతనాలు ఇస్తుందా...? ఇవ్వదా..? క్రమబద్ధీకరణ కొలిక్కి తెస్తుందో...? లేదో..? తెలియని అయోమయ స్థితిలో ఉన్నారు. ప్రైవేటు జూనియర్‌ కళాశాలలు  పశుపక్షాదులకు కూడా విద్యుత్‌ షాక్‌ తప్పటం లేదు. నెలలో జిల్లాలో ఏదోఒక మూల విద్యుత్‌ షాక్‌కు పశువులు మృతి చెందాయనో...లేక విద్యుత్‌ సిబ్బంది, ప్రైవేటు ఎలక్ట్రీషియన్లు  ప్రమాదాలకు గురై చనిపోతూనే ఉన్నారు. ఒక్కమాటలో చెప్పాలంటే విద్యుత్‌ లైన్లు యమపాశాలుగా మారాయి.  

ఏళ్ల తరబడి ఒకే లైన్లు:
జిల్లాలో విద్యుత్‌ లైన్లు ఏళ్ల తరబడి మార్చకుండా పాత కండక్టర్‌తోనే కాలం గడుపుతున్నారు. దీంతో చిన్నపాటి గాలికే విద్యుత్‌ తీగలు ఎక్కడికక్కడ తెగి నేలపడుతున్నాయి. ఏళ్ల తరబడి విద్యుత్‌ స్తంభాలు మార్చకుండా ఉండటంతో ఎప్పుడు పడితే అప్పుడు విరిగి కిందపడుతున్నాయి. అయితే విద్యుత్‌ అధికారులు మాత్రం విద్యుత్‌ స్తంభాలు, వైర్లు మార్చినట్లు కాగితాల్లో చూపించి పాతవాటినే కొనసాగిస్తున్నారు. మరీ తప్పదనుకుంటే కండక్టర్‌ను మార్చి పాతకండక్టర్‌ను బయట మార్కెట్‌లో అమ్ముకొని జేబులు నింపుకుంటున్నారు. పట్టణాలే కాదు గ్రామాల్లోనూ విద్యుత్‌ సిబ్బంది చేతివాటం పెరిగిపోయింది. చేతికందేటంత ఎత్తులో వైర్లు వెళుతున్నా, ప్రజలు వాటిని సక్రమంగా సరిచేయాలని మొత్తుకున్నా పట్టించుకునే నాథుడే కరువయ్యాడు. విద్యుత్‌ తీగలు తెగిపడితే సమాచారం ఇచ్చినా వాటిని పునరుద్ధరించాలంటే రోజులు గడవాల్సిందే.

గిద్దలూరు, యర్రగొండపాలెం, మార్కాపురం ప్రాంతాల్లో పొలాల్లోకి వెళ్లాలంటేనే పశువుల కాపరులు భయపడే పరిస్థితి. ఎప్పుడు తీగలు(కండక్టర్‌) తెగి మీద పడతాయోనన్న భయం. ఇక రాత్రి వేళల్లో రైతులు విద్యుత్‌ మోటార్లు వేసుకోవాలంటేనే భీతిల్లుతున్నారు. ఎప్పుడు హై ఓల్టేజి వచ్చి మోటార్లకు విద్యుత్‌ షాక్‌ కొడుతుందోనన్న అనుమానం. ఇక సముద్ర తీర ప్రాంతంలో ఉప్పుగాలులకు వైర్లు బలహీనపడి ఎప్పుడు పడితే అప్పుడు తెగి కిందపడుతుంటాయి. ఇనుప విద్యుత్‌ స్తంభాలు తుప్పుపట్టి చిన్నపాటి గాలికే నేలకొరుగుతున్నాయి. ట్రాన్స్‌ఫార్మర్ల పరిస్థితి మరీ భయానకం. జనావాసాల్లో కూడా ట్రాన్స్‌ఫార్మర్లకు రక్షణ చర్యలు లేవు. ఇళ్ల మధ్యలో, రోడ్ల వెంట ప్రజలు సంచరిస్తూనే ఉంటారు... ట్రాన్స్‌ఫార్మర్లలో రెండు వైర్ల మధ్య మంటలు వస్తూనే ఉంటాయి. ఒక్కోసారి పేలిపోతుంటాయి. ప్రజలు ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని బిక్కుబిక్కు మంటూ తిరుగుతూ ఉంటారు. కానీ బిల్లులు నెల ఆలస్యమైతే మాత్రం వెంటనే సర్వీస్‌ కట్‌ చేస్తారు. సమస్య వచ్చినప్పుడు సరిచేయడంలో తీవ్ర జాప్యం చేస్తున్నారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement