
సాక్షి, గుంటూరు : జనచైతన్య వేదిక ఆధ్వర్యంలో బుధవారం గుంటూరులో నిర్వహించిన కార్పొరేట్ విద్య ప్రక్షాళన సదస్సుకు ఏపీ ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ హేమచంద్రారెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కేవలం ర్యాంకుల కోసమే ఇప్పటి పేరెంట్స్ కార్పొరేట్ విద్యపై దృష్టి పెడుతున్నారని, ఇది మంచి నిర్ణయం కాదని పేర్కొన్నారు.
ఏపీలో ఈ ఏడాది ఏడు లక్షల మంది ఇంటర్ విద్యార్థులు ఉన్నారని తెలిపారు. వారిలో కేవలం 1.2 లక్షల మంది మాత్రమే ప్రభుత్వ కాలేజీల్లో చదువుతున్నారని, మిగతా 5.8లక్షల మంది ప్రైవేటు సంస్థల్లోనే తమ చదువును కొనసాగిస్తున్నట్లు స్పష్టం చేశారు. పిల్లల భవిష్యత్తును కార్పొరేట్ సంస్థల చేతిలో పెట్టవద్దని పేర్కొన్నారు. ఈ మేరకు ప్రభుత్వ సంస్థలను మరింత బలోపేతం చేయాల్సిన అవసరం ఉందని హేమచంద్రారెడ్డి వెల్లడించారు.
Comments
Please login to add a commentAdd a comment