Intermediate Education
-
విలువలు, అవసరాలే లక్ష్యంగా..
సాక్షి, హైదరాబాద్: విద్యార్థుల్లో విలువలు పెంచడం.. మారుతున్న పరిస్థితులు, అవసరాలకు తగినట్టుగా కోర్సులు/సబ్జెక్టులను తీర్చిదిద్దడం లక్ష్యంగా ఇంటర్ విద్యలో కీలక మార్పులకు విద్యాశాఖ సిద్ధమైంది. బోధన ప్రణాళికను సమూలంగా మార్చాలని, ఇందుకోసం ఒక కమిటీ ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. దీనికి సంబంధించి శుక్రవారం విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి నేతృత్వంలో జరిగిన ఇంటర్ బోర్డు సమావేశంలో పలు ప్రతిపాదనలు చేశారు. భేటీలో సుమారు 111 అంశాలపై క్షుణ్నంగా చర్చించారు. ప్రధానంగా ప్రైవేటు కాలేజీలకు అనుబంధ గుర్తింపు, కోర్సుల్లో తీసుకురావాల్సిన మార్పులు, పాలనాపరమైన జాప్యాన్ని నివారించే అంశాలపై ప్రధానంగా దృష్టిపెట్టారు. కోవిడ్ పరిణామాల నేపథ్యంలో ఇంటర్ విద్యలో చోటు చేసుకున్న మార్పులను పరిశీలించిన మంత్రి.. ఈ ఏడాది ఇంటర్ ఫలితాలు మెరుగయ్యేందుకు తీసుకోవాల్సిన చర్యలను సూచించారు. కోర్సులపై నిపుణుల కమిటీ కాలానికి అనుగుణంగా ఇంటర్ విద్య కోర్సుల్లో మార్పులు తేవాల్సిన అవసరం ఉందని సమావేశంలో మంత్రి, అధికారులు అభిప్రాయపడ్డారు. ఇప్పటికీ పలు కోర్సుల్లో సంబంధం లేని/అవసరం లేని సబ్జెక్టులు ఉన్నాయని.. వాటిని మార్చాల్సిన అవసరం ఉందని ఇంటర్ బోర్డు అధ్యయన నివేదికలలో వెల్లడైన అంశాలు, ఆ దిశగా చేపట్టాల్సిన చర్యలపై చర్చించారు. ఈ క్రమంలో వచ్చే ఏడాది నుంచి ఇంటర్ గ్రూపుల నవీకరణ కోసం నిపుణులతో కూడిన కమిటీ ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. గుర్తింపుపై ఆలస్యమెందుకు? ప్రైవేటు ఇంటర్ కాలేజీలకు బోర్డు గుర్తింపు ప్రక్రియపై కొన్నేళ్లుగా విమర్శలు వస్తుండటంపై సమావేశంలో చర్చించారు. కాలేజీలు తెరిచి నెలలు గడుస్తున్నా అనుబంధ గుర్తింపు పెండింగ్‌లో పెట్టడం, తర్వాత అన్ని కాలేజీలకు ఇవ్వడం సాధారణమైపోయిందని కొందరు అధికారులు ప్రస్తావించారు. గుర్తింపు ఇచ్చే క్రమంలో గతంలో ముడుపులు చేతులు మారుతున్నాయన్న ఆరోపణలనూ గుర్తుచేశారు. వీటన్నింటికీ పరిష్కారంగా కాలేజీలు తెరిచే నాటికే అనుబంధ గుర్తింపు ప్రక్రియ పూర్తి చేయాలని, మేలోనే గుర్తింపు ఇచ్చేదీ లేనిదీ తెలపాల్సిన అవసరం ఉందని మంత్రి అధికారు లకు సూచించారు. ఇక వచ్చే ఏడాది నుంచి ప్రభుత్వ, ప్రైవేటు కాలేజీల్లో బయోమెట్రిక్ హాజరు విధానాన్ని తప్పనిసరిగా అమలు చేసేందుకు చర్యలు చేపట్టాలని సమావేశంలో నిర్ణయించారు. దివ్యాంగ విద్యార్థులకు పరీక్ష రాసే అదనపు సమయాన్ని అరగంట నుంచి గంటకు పెంచాలని తీర్మానించారు. ఈ సమావేశంలో విద్యాశాఖ కార్యదర్శి వాకాటి కరుణ, కాలేజీ విద్య కమిషనర్ నవీన్ మిట్టల్, ఉస్మానియా, జేఎన్టీయూహెచ్, కాకతీయ, తెలంగాణ వర్సిటీల వైస్ చాన్సలర్లు, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. కాలేజీలు తెరిచే నాటికే పుస్తకాలు: మంత్రి సబిత ఇంటర్ కాలేజీలు తెరిచే నాటికే విద్యార్థులకు పుస్తకాలు అందుబాటులో ఉండాలని బోర్డు భేటీలో నిర్ణయించినట్టు విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. సమావేశం తర్వాత ఆమె మీడియాతో మాట్లాడారు. పేపర్ సకాలంలో అందని కారణంగా పాఠ్య పుస్తకాల ముద్రణ ఈ ఏడాది ఆలస్యమైందని.. వచ్చే ఏడాదికి కావాల్సిన పుస్తకాల కోసం టెన్త్ పరీక్షలు ముగిసిన వెంటనే ఆర్డర్ ఇవ్వాలని నిర్ణయించామని తెలిపారు. ప్రైవేటు కాలేజీలకు అనుబంధ గుర్తింపు విషయంలో జాప్యం తగదని సూచించినట్టు తెలిపారు. మార్పుల ప్రతిపాదనలు ఇవీ.. ►ఇంటర్లో ఉండే తెలుగు, హిందీ, ఇతర భాషా సబ్జెక్టుల్లో నైతిక విలువలు పెంపొందించే దిశగా సిలబస్‌లో మార్పులు తేవాలని బోర్డు సమావేశంలో తీర్మానించారు. ►ఎంఈసీ, ఎంపీసీ గ్రూపులకు ఒకే విధమైన గణిత సబ్జెక్టులు ఉన్నాయని.. వాస్తవానికి మేథ్స్ విద్యార్థులతో సమానంగా ఎంఈసీ విద్యార్థులకు మేథ్స్ ఉండాల్సిన అవసరం లేదని బోర్డు భావనకు వచ్చింది. కామర్స్‌కు ఉపయోగపడే మేథమేటిక్స్‌కు సబ్జెక్టులో ప్రాధాన్యం ఇవ్వాల్సిన అవసరం ఉందని నిర్ణయించింది. ►సీఈసీ గ్రూపులో సివిక్స్ కన్నా అకౌంటెన్సీకి ప్రాధాన్యం ఇవ్వాలని.. హెచ్ఈసీలో సివిక్స్ స్థానంలో పొలిటికల్ సైన్స్ సబ్జెక్టులో లోతైన అవగాహన పెంచేలా మార్పు చేయాలని ప్రతిపాదించింది. ►వచ్చే ఏడాది నుంచి ఆన్లైన్లో జవాబు పత్రాల మూల్యాంకనం చేపట్టాలని, తొలుత భాషా సబ్జెక్టులను ప్రయోగాత్మకంగా మూల్యాంకనం చేయాలని నిర్ణయించారు. -
'ప్రభుత్వ విద్యా సంస్థలను మరింత బలోపేతం చేయాలి'
సాక్షి, గుంటూరు : జనచైతన్య వేదిక ఆధ్వర్యంలో బుధవారం గుంటూరులో నిర్వహించిన కార్పొరేట్ విద్య ప్రక్షాళన సదస్సుకు ఏపీ ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ హేమచంద్రారెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కేవలం ర్యాంకుల కోసమే ఇప్పటి పేరెంట్స్ కార్పొరేట్ విద్యపై దృష్టి పెడుతున్నారని, ఇది మంచి నిర్ణయం కాదని పేర్కొన్నారు. ఏపీలో ఈ ఏడాది ఏడు లక్షల మంది ఇంటర్ విద్యార్థులు ఉన్నారని తెలిపారు. వారిలో కేవలం 1.2 లక్షల మంది మాత్రమే ప్రభుత్వ కాలేజీల్లో చదువుతున్నారని, మిగతా 5.8లక్షల మంది ప్రైవేటు సంస్థల్లోనే తమ చదువును కొనసాగిస్తున్నట్లు స్పష్టం చేశారు. పిల్లల భవిష్యత్తును కార్పొరేట్ సంస్థల చేతిలో పెట్టవద్దని పేర్కొన్నారు. ఈ మేరకు ప్రభుత్వ సంస్థలను మరింత బలోపేతం చేయాల్సిన అవసరం ఉందని హేమచంద్రారెడ్డి వెల్లడించారు. -
బీసీ గురుకులాలదే అగ్రస్థానం
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ఇంటర్మీడియెట్ ఫలితాల్లో ఈసారి బీసీ గురుకులాల విద్యార్థులు సత్తా చాటారు. ఏకంగా 89.8 శాతం ఉత్తీర్ణత సాధించి అగ్రభాగాన నిలిచారు. ఆ తరువాతి స్థానంలో విద్యాశాఖ గురుకులాలు 88.8 శాతం ఉత్తీర్ణత సాధించాయి. ఎయిడెడ్ కాలేజీలు మాత్రం 50.1 శాతం ఉత్తీర్ణతతో చివరి స్థానంలో నిలిచాయి. తెలంగాణ ఇంటర్మీడియెట్ ప్రథమ, ద్వితీయ సంవత్సర ఫలితాలను విద్యాశాఖ కార్యదర్శి బి. జనార్దన్‌రెడ్డి గురువారం సాయంత్రం 5 గంటలకు హైదరాబాద్‌లో విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో ఇంటర్ బోర్డు కార్యదర్శి అశోక్, ఇతర అధికారులు పాల్గొన్నారు. ఎప్పటిలాగే బాలికలు అత్యధిక ఉత్తీర్ణత సాధించారు. తగ్గిన ఉత్తీర్ణత శాతం... రాష్ట్రంలో ఫిబ్రవరి 27 నుంచి మార్చి 18 వరకు జరిగిన ఇంటర్ పరీక్షలకు ప్రథమ, ద్వితీయ సంవత్సరాల రెగ్యులర్ విద్యార్థులు 8,70,924 మంది హాజరయ్యారు. అందులో ప్రథమ సంవత్సర విద్యార్థులు 4,52,653 మంది పరీక్షలకు హాజరవగా 2,70,575 మంది (59.8 శాతం) ఉత్తీర్ణులయ్యారు. ద్వితీయ సంవత్సరం విద్యార్థులు 4,18,271 మంది పరీక్షలకు హాజరవగా వారిలో 2,71,949 మంది (65 శాతం) ఉత్తీర్ణులయ్యారు. ప్రథమ సంవత్సరం జనరల్‌లో బాలికలు 66.2 శాతం ఉత్తీర్ణత సాధిస్తే బాలురు 55 శాతం మంది ఉత్తీర్ణులయ్యారు. ద్వితీయ సంవత్సరం జనరల్ రెగ్యులర్ విద్యార్థుల్లో బాలికలు 70.8 శాతం మంది ఉత్తీర్ణులు కాగా, బాలురు 58.2 శాతం మంది ఉత్తీర్ణులయ్యారు. గతేడాదితో పోల్చితే ఈసారి ఉత్తీర్ణత శాతం తగ్గిపోయింది. గతేడాది ద్వితీయ సంవత్సరంలో 67.06 శాతం మంది ఉత్తీర్ణులవగా ఈసారి 65 శాతం మంది ఉత్తీర్ణులయ్యారు. ప్రథమ సంవత్సరంలో 1,18,455 మంది బాలురు ఉత్తీర్ణత సాధించగా 1,52,120 మంది బాలికలు ఉత్తీర్ణులయ్యారు. ద్వితీయ సంవత్సరంలో 1,18,591 మంది బాలురు ఉత్తీర్ణులుకాగా 1,53,358 మంది బాలికలు ఉత్తీర్ణులయ్యారు. ద్వితీయ సంవత్సరం ప్రైవేటు విద్యార్థులు 72,365 మంది పరీక్షలకు హాజరుకాగా 18,365 మంది (25.8 శాతం) ఉత్తీర్ణులయ్యారు. మేడ్చల్ టాప్.. మెదక్ లాస్ట్ ఇంటర్ ఫలితాల్లో మేడ్చల్ జిల్లా తొలిస్థానంలో నిలిచింది. ప్రథమ సంవత్సరం జనరల్‌లో మేడ్చల్ జిల్లా 76 శాతం ఉత్తీర్ణత సాధించగా 71 శాతం ఉత్తీర్ణతతో రంగారెడ్డి జిల్లా రెండో స్థానంలో నిలించింది. మెదక్ జిల్లా మాత్రం 29 శాతం ఉత్తీర్ణతతో చివరి స్థానానికి పరిమితమైంది. ద్వితీయ సంవత్సరం జనరల్‌లో మేడ్చల్ జిల్లా 76 శాతం ఉత్తీర్ణతతో ప్రథమ స్థానంలో నిలవగా 75 శాతం ఉత్తీర్ణతతో కొమురం భీం జిల్లా రెండో స్థానంలో నిలిచింది. కేవలం 35 శాతం ఉత్తీర్ణతతో మెదక్ జిల్లా చివరి స్థానంలో ఉంది. ద్వితీయ సంవత్సరం వొకేషనల్‌లో 87 శాతం ఉత్తీర్ణతతో ఆదిలాబాద్ ప్రథమ స్థానంలో నిలవగా, కొమురం భీం జిల్లా 83 శాతం ఉత్తీర్ణతతో రెండో స్థానంలో నిలిచింది. 51 శాతం ఉత్తీర్ణతతో జగిత్యాల జిల్లా చివరి స్థానంలో ఉంది. వచ్చే నెల 14 నుంచి అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు ఇంటర్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలను మే 14 నుంచి నిర్వహించాలని బోర్డు నిర్ణయించింది. అయితే ఎన్నికలనుబట్టి ఈ తేదీల్లో మార్పులు ఉండే అవకాశం ఉందని పేర్కొంది. పరీక్షలకు హాజరు కావాలనుకునే విద్యార్థులతోపాటు రీ కౌంటింగ్, రీ వెరిఫికేషన్ కావాలనుకునే విద్యార్థులు ఈ నెల 25లోగా ఫీజు చెల్లించాలని బోర్డు కార్యదర్శి అశోక్ తెలిపారు. ప్రథమ సంవత్సరంలో అన్ని పేపర్లు ఉత్తీర్ణులైన విద్యార్థులు పరీక్ష ఫీజుకు అదనంగా ఒక్కో పేపరుకు రూ. 150 చొప్పున చెల్లించి ఇంప్రూవ్మెంట్ రాసుకోవచ్చని పేర్కొన్నారు. రెండింటిలో ఎందులో ఎక్కువ మార్కులుంటే వాటిని పరిగణనలోకి తీసుకుంటామని వెల్లడించారు. ద్వితీయ సంవత్సరం విద్యార్థులు రీ కౌంటింగ్, రీ వెరిఫికేషన్ కమ్ స్కాన్డ్ జవాబు పత్రాల కాపీ కోసం దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు. విద్యార్థులు రీ కౌంటింగ్ కోసం ప్రతి పేపరుకు రూ. 100 చొప్పున చెల్లించాలని, ఇందుకోసం ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. అలాగే రీ వెరిఫికేషన్ కమ్ స్కాన్డ్ జవాబు పత్రాల కాపీ కోసం ఒక్కో పేపరుకు రూ. 600 చొప్పున చెల్లించాలని సూచించారు. విద్యార్థులు ఈ నెల 19 నుంచి 25లోగా ఆన్లైన్లో ( ఠీఠీఠీ. bజ్ఛీ. ్ట్ఛl్చnజ్చn్చ. జౌఠి. జీn) దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. సాఫ్ట్వేర్ ఇంజనీర్‌నవుతా.. వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చిన నేను అధ్యాపకుల స్ఫూర్తి, తల్లిదండ్రుల ప్రోత్సాహంతో ఎంపీసీలో 993 మార్కులు సాధించి రాష్ట్రస్థాయిలో మొదటి ర్యాంకు సాధించా. సాఫ్ట్వేర్ ఇంజనీర్ కావాలనేది నా లక్ష్యం. బిట్స్ పిలానీలో సీఎస్సీలో సీటు సంపాదిస్తా. -ఎన్. శశిధర్‌రెడ్డి, ఎంపీసీ స్టేట్ ఫస్ట్ ర్యాంకర్ (993 మార్కులు), అల్పోర్స్ కళాశాల(ద్వితీయ), కరీంనగర్ ఫలితాల తగ్గుదలకు ప్రధాన కారణాలు.. ఇంటర్మీడియెట్ ఫలితాలు గతేడాది కంటే ఈసారి 2 శాతం తగ్గిపోయాయి. గతేడాది ప్రథమ సంవత్సరంలో 62.73 శాతం మంది ఉత్తీర్ణులుకాగా ఈసారి 60.5 శాతం మందే ఉత్తీర్ణులయ్యారు. అలాగే గతేడాది ద్వితీయ సంవత్సరం 67.06 శాతం మంది ఉత్తీర్ణులుకాగా ఈసారి 65 శాతం మంది మాత్రమే ఉత్తీర్ణులయ్యారు. ద్వితీయ సంవత్సరంలో గత రెండేళ్లతో పోల్చుకున్నా ఈసారి ఫలితాలు తగ్గిపోవడం ఆందోళన కలిగిస్తోంది. ఇందుకు అనేక కారణాలు ఉన్నాయి. 2018–19 విద్యా సంవత్సరం జూన్‌లో పూర్తి కావాల్సిన మొదటి దశ ప్రవేశాలు ఆగస్టు చివరి వరకు కొనసాగడం. ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో జూన్‌లో తరగతులు ప్రారంభమైనా 1,200 మంది గెస్ట్ ఫ్యాకల్టీని ఆగస్టులో నియమించడం. జూన్, జూలైలలో అధ్యాపకుల బదిలీలతో పాఠ్యాంశాల బోధనకు ఆటంకం ఏర్పడటం. గ్రామ పంచాయతీ ఎన్నికలు, ముందస్తు అసెంబ్లీ ఎన్నికల వల్ల పాఠ్యాంశాల బోధన సకాలంలో పూర్తికాకపోవడం. ఎంపీసీలో 993.. బైపీసీలో 992.. ఇంటర్మీడియెట్ ఫలితాల్లో టాప్ మార్కులివే తెలంగాణ ఇంటర్మీడియట్ ఫలితాల్లో ఈసారి అత్యధిక మార్కులు 993. ఈ మార్కులను ఇంటర్ ద్వితీయ సంవత్సరం ఎంపీసీలో ఒకే ఒక్క విద్యార్థి నల్ల శశిధర్‌రెడ్డి సాధించగా ఆ తరువాత 992 మార్కులను బి. ఉమామహేశ్వర్‌రెడ్డి, ఎస్. దినేశ్‌రెడ్డి సాధించారు. బైపీసీలో 992 మార్కులతో చల్లా దీపికారెడ్డి టాపర్‌గా నిలవగా ఆ తరువాత 991 మార్కులతో బింగి సాయితేజ రెండో ర్యాంకు సాధించాడు. ఎంఈసీలో 987 మార్కులతో వి. వంశీ తొలి ర్యాంకు సాధించగా ఆ తరువాత 985 మార్కులతో డి. వైష్ణవి రెండో ర్యాంకు సాధించింది. హెచ్ఈసీలో అత్యధిక మార్కులు 964 పీఎస్ఎన్ సౌగంధికకు లభించాయి. సీఈసీలో అత్యధిక మార్కులు 979 దివాన్ శివానీకి లభించాయి. చల్లా దీపికారెడ్డి, నల్ల శశిధర్‌రెడ్డి ప్రథమ సంవత్సరంలో.. ప్రథమ సంవత్సరం ఎంపీసీలో నలుగురికి అత్యధికంగా 467 మార్కులు లభించగా 33 మందికి 466 మార్కులు వచ్చాయి. బైపీసీలో ముగ్గురికి అత్యధికంగా 437 మార్కులు లభించాయి. ఎంఈసీలో ముగ్గురికి అత్యధికంగా 494 మార్కులు రాగా హెచ్ఈసీలో ఒక్కరికే అత్యధికంగా 486 మార్కులు లభించాయి. సీఈసీలో ఇద్దరికి అత్యధికంగా 492 మార్కులు లభించాయి. పరీక్షకు హాజరైనా ఆబ్సెంట్? ఇంటర్ పరీక్షల ప్రాసెసింగ్‌లో లోపాలు తలెత్తినట్లు తెలిసింది. సాఫ్ట్వేర్ సమస్యలతో వందలాది మంది విద్యార్థులకు తప్పుల తడకగా మార్కులు వచ్చాయని విద్యార్థి సంఘాలు ఆరోపిస్తున్నాయి. పరీక్షలకు హాజరైనా పలువురు విద్యార్థులను ఆబ్సెంట్ అయినట్లు చూపించి ఫెయిల్ చేసినట్లు సమాచారం. ముఖ్యంగా మేడ్చల్ జిల్లాలోని ఓ కార్పొరేట్ కాలేజీకి చెందిన విద్యార్థులు పరీక్షకు హాజరైనా ఫలితాల్లో ఫెయిల్ చేసినట్లు విద్యార్థి సంఘాలు పేర్కొన్నాయి. ఒక్క సబ్జెక్ట్ మినహా అన్ని సబ్జెక్టుల్లో 831 మార్కులు వచ్చిన ఒక విద్యార్థి ఇంగ్లీష్ పేపర్–2 పరీక్షకు హాజరుకానట్లుగా మెమోల్లో ఆబ్సెంట్ వచ్చింది. అయితే ఆ విద్యార్థి పరీక్షకు హాజరయ్యారని సదరు కాలేజీ వర్గాలు పేర్కొన్నాయి. 810 మార్కులు వచ్చిన మరో విద్యార్థికి మాథ్స్ పేపర్–2బీలో 17 మార్కులే వచ్చినట్లు చూపించారని, బాగా చదివే ఆ విద్యార్థికి అంత తక్కువ మార్కులు వచ్చే అవకాశమే లేదని చెప్పారు. 841 మార్కులు వచ్చిన మరో విద్యార్థిని సంస్కృతం పేపర్–2లో ఆబ్సెంట్గా చూపించి ఫెయిల్ చేశారన్నారు. మరోవైపు వందల మంది విద్యార్థులకు ఫలితాలే ఇవ్వలేదని విద్యార్థి సంఘాల నేతలు ఆరోపించారు. అనేక మంది విద్యార్థులు తమ హాల్ టికెట్ నంబర్‌తో ఫలితాలు చూసుకోగా ఇన్వ్యాలిడ్ హాల్ టికెట్ నంబర్ అని వస్తోందని, దీంతో వారంతా తీవ్ర ఆందోళనకు గురవుతున్నారని పేర్కొన్నారు. సామర్థ్యంలేని సాఫ్ట్వెర్ సంస్థకు ఫలితాల ప్రాసెస్ పనులను అప్పగించడం వల్లే ఇలాంటి తప్పిదాలు దొర్లాయని అధ్యాపకులు పేర్కొంటున్నారు. సమస్యలపై మొదటి నుంచీ మొత్తుకుంటున్నా బోర్డు అధికారులు పాటించకుండా విద్యార్థుల జీవితాలతో చెలగాటం ఆడారని అధ్యాపకులు మండిపడుతున్నారు మేడ్చల్‌లోని సదరు కార్పొరేటు కాలేజీ యాజమాన్యానికి బోర్డు ఉన్నతాధికారుల నుంచి అందిన ఆదేశాల మేరకు విద్యార్థులను కూడా బయటకు రాకుండా కాలేజీ క్యాంపస్ గదుల్లోనే పెట్టినట్లు విద్యార్థి సంఘాలు ఆరోపిస్తున్నాయి. -
కేజీబీవీల్లో ఇంటర్ విద్య
బాలికా విద్యకు ప్రాధాన్యమిస్తున్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు.. పదో తరగతి తర్వాత డ్రాపౌట్లను తగ్గించడానికి చర్యలు తీసుకుంటున్నాయి. ఇందులో భాగంగా కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాలను అప్‌గ్రేడ్ చేయాలని నిర్ణయించాయి. వచ్చే విద్యాసంవత్సరం నుంచే కస్తూర్బాల్లో ఇంటర్మీడియట్ విద్యను ప్రారంభించడానికి చర్యలు తీసుకుంటున్నారు. దీనిపై విద్యార్థినులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. రెంజల్(బోధన్): కస్తూర్బాగాంధీ బాలికల విద్యాలయాలు నిరుపేద విద్యార్థినులకు వరంగా మారాయి. ప్రస్తుతం ఈ విద్యాలయాల్లో ఆరో తరగతినుంచి పదో తరగతి వరకు వసతితో కూడిన విద్య అందిస్తున్నారు. ఇంటర్ కూడా ప్రవేశపెట్టాలని నిర్ణయించడంతో ఉన్నత విద్యకు బాటలు పడుతున్నాయి. కేజీబీవీల్లో ఇంటర్ విద్య ప్రవేశపెట్టాలని వివిధ రాష్ట్రాల విద్యాశాఖ మంత్రులతో ఏర్పాటైన సబ్‌కమిటీ చేసిన ప్రతిపాదనలకు కేంద్ర మానవ వనరుల శాఖ మంత్రి అంగీకారం తెలిపినట్లు డిప్యూటీ సీఎం కడియం ప్రకటించారు. దీంతో పేద విద్యార్థినుల్లో ఆశలు చిగురిస్తున్నాయి. జిల్లాలో 25 కేజీబీవీలు.. పేద విద్యార్థినులు చదువు మధ్యలో మానేయకుండా ఉండేందుకుగాను ప్రభుత్వం కేజీబీవీలను ఏర్పాటు చేసింది. జిల్లాలో 25 కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాలున్నాయి. ఈ పాఠశాలల్లో ఆరో తరగతి నుంచి పదో తరగతి వరకు వసతితో కూడిన విద్య అందుతోంది. మధ్యలో బడిమానేసిన, అనాథ, నిరుపేద విద్యార్థినులకు ప్రవేశం కల్పించారు. ఎస్సీ, ఎస్టీ విద్యార్థినులతోపాటు వెనుకబడిన తరగతులకు చెందిన విద్యార్థినులూ ఇందులో చదువుతున్నారు. జిల్లాలోని కేజీబీవీల్లో 3,855 మంది విద్యార్థినులు చదువుతున్నారు. అయితే పదో తరగతి వరకే విద్య అందుతుండడం పేద విద్యార్థినులకు శాపంగా మారింది. చదువుకోవాలని ఉన్నా.. వసతితో కూడిన విద్య అందించే కళాశాలలు లేకపోవడంతో చాలామంది పదో తరగతితోనే చదువుకు ఫుల్స్టాప్ పెట్టేస్తున్నారు. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కేజీబీవీలను అప్‌గ్రేడ్ చేయాలని యోచిస్తోంది. వివిధ రాష్ట్రాల విద్యాశాఖ మంత్రులతో ఏర్పాటైన సబ్ కమిటీ కూడా ఇదే సిఫారసు చేయడంతో వచ్చే విద్యాసంవత్సరం నుంచే ఇంటర్ ప్రవేశపెట్టడానికి చర్యలు తీసుకుంటున్నారు. ప్రయోజనాలు.. కేజీబీవీలలో ఇంటర్ ప్రవేశపెట్టడం వల్ల ఎన్నో ప్రయోజనాలున్నాయి. పదో తరగతి తర్వాత డ్రాపౌట్లు తగ్గుతాయి. పదో తరగతి తర్వాత చదువుకోవడానికి వసతితో కూడిన కళాశాలలు లేకపోవడంతో కొందరు తల్లిదండ్రులు తమ ఆడపిల్లలకు త్వరగా వివాహం జరిపిస్తున్నారు. ఇంటర్ ప్రవేశపెట్టడం వల్ల అలాంటి విద్యార్థులు చదువుకోవడానికి అవకాశం ఉంటుంది. తద్వారా బాల్య వివాహాలను నియంత్రించవచ్చు. డ్రాపవుట్లు తగ్గుతాయి.. పదో తరగతి తర్వాత చాలామంది బాలికలు ఆర్థిక పరిస్థితుల కారణంగా ఉన్నత విద్యకు దూరమవుతున్నారు. ఫలితంగా డ్రాపవుట్లు పెరుగుతున్నాయి. కేజీబీవీల్లో ఇంట ర్ వరకు అప్‌గ్రేడ్ చేయడం వల్ల డ్రాపవుట్లు తగ్గుతాయి. కేజీబీవీల్లో పదో తరగతి తర్వాత ఇంటర్ వరకు విద్యనభ్యసించవచ్చు. పై చదువులకు భరోసా ఏర్పడుతుంది. – మమత, ప్రిన్సిపాల్, కేజీబీవీ, రెంజల్ మంచి అవకాశం.. కేజీబీవీల్లో ఇప్పటి వరకు పదో తరగతి వరకే తరగ తులు ఉండేవి. వచ్చే విద్యాసంవత్సరం నుంచి ఇంటర్ వరకు కూడా తరగతులు నిర్వహిస్తే మాలాం టి వారికి మంచి అవకాశం లభించినట్లే. బాగా చదువకుని తల్లిదండ్రుల ఆశయాలను నెరవేరుస్తాం. పేదరికం వల్ల మధ్యలో చదువు మానేసిన నాకు కేజీబీవీలో చదువుకునే అవకాశం లభించింది. – సమత, పదో తరగతి విద్యార్థిని ఆర్థికభారం తగ్గుతుంది.. కేజీబీవీల్లో ఇంటి కంటే మంచి వాతావరణం ఉంటుంది. నాణ్యమైన భోజనంతో పాటు ఉన్నతమైన విద్య లభిస్తుంది. వచ్చే విద్యా సంవత్సరం నుంచి ఇంటర్ విద్య ప్రవేశపెట్టాలనే నిర్ణయం మంచిది. మాలాంటి నిరుపేద విద్యార్థులకు చక్కటి అవకాశం. నేను నా చెల్లెలు కస్తూర్బాలో చదువుకుంటు న్నాం. తల్లిదండ్రులకు ఆర్థిక భారం తగ్గుతుంది. – స్వాతి, పదో తరగతి విద్యార్థిని -
విధుల్లో ఉన్నట్టా..లేనట్టా..?
►అయోమయంలో కాంట్రాక్ట్ అధ్యాపకులు ►నేటికీ అందని రెన్యువల్ ఉత్తర్వులు ►వేతనాల పెంపు, క్రమబద్ధీకరణపై లేని స్పష్టత ►ప్రభుత్వ కళాశాలల్లో కుంటుపడుతున్న విద్యాబోధన ►పట్టించుకోని పాలక పక్షం కందుకూరు రూరల్: విద్యార్థి దశలో కీలకమైన ఇంటర్మీడియెట్ విద్య ఇప్పటికే కార్పొరేట్ కళాశాలల గుప్పిట్లోకి వెళ్లింది. ఉత్తమ ఫలితాలతో విద్యార్థుల ఆదరణతో ప్రైవేటు కళాశాలల పోటీని తట్టుకొని నిలబడిన ప్రభుత్వ కళాశాలలను ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో విద్య కుంటుపడుతోంది. బోధకుల నియామకంలో నెలకొన్న జాప్యం ప్రభావం విద్యార్థుల చదువులపై తీవ్రంగా పడుతోంది. కాంట్రాక్ట్ అధ్యాపకులు ఈ విద్యా సంవత్సరం కూడా కొనసాగేలా నేటికీ రెన్యువల్ ఉత్తర్వులు విడుదల కాలేదు. విద్యా సంవత్సరం ప్రారంభమైన రెండు నెలలు గడుస్తున్నా జీవో రాని కారణంగా కాంట్రాక్ట్ అధ్యాపకులు అయోమయంలో పడ్డారు. తాము విధులకు వెళ్లాలా..? వెళ్ల కూడదా...? ప్రభుత్వం వేతనాలు ఇస్తుందా...? ఇవ్వదా..? క్రమబద్ధీకరణ కొలిక్కి తెస్తుందో...? లేదో..? తెలియని అయోమయ స్థితిలో ఉన్నారు. ప్రైవేటు జూనియర్ కళాశాలలు పశుపక్షాదులకు కూడా విద్యుత్ షాక్ తప్పటం లేదు. నెలలో జిల్లాలో ఏదోఒక మూల విద్యుత్ షాక్‌కు పశువులు మృతి చెందాయనో...లేక విద్యుత్ సిబ్బంది, ప్రైవేటు ఎలక్ట్రీషియన్లు ప్రమాదాలకు గురై చనిపోతూనే ఉన్నారు. ఒక్కమాటలో చెప్పాలంటే విద్యుత్ లైన్లు యమపాశాలుగా మారాయి. ఏళ్ల తరబడి ఒకే లైన్లు: జిల్లాలో విద్యుత్ లైన్లు ఏళ్ల తరబడి మార్చకుండా పాత కండక్టర్‌తోనే కాలం గడుపుతున్నారు. దీంతో చిన్నపాటి గాలికే విద్యుత్ తీగలు ఎక్కడికక్కడ తెగి నేలపడుతున్నాయి. ఏళ్ల తరబడి విద్యుత్ స్తంభాలు మార్చకుండా ఉండటంతో ఎప్పుడు పడితే అప్పుడు విరిగి కిందపడుతున్నాయి. అయితే విద్యుత్ అధికారులు మాత్రం విద్యుత్ స్తంభాలు, వైర్లు మార్చినట్లు కాగితాల్లో చూపించి పాతవాటినే కొనసాగిస్తున్నారు. మరీ తప్పదనుకుంటే కండక్టర్‌ను మార్చి పాతకండక్టర్ను బయట మార్కెట్లో అమ్ముకొని జేబులు నింపుకుంటున్నారు. పట్టణాలే కాదు గ్రామాల్లోనూ విద్యుత్ సిబ్బంది చేతివాటం పెరిగిపోయింది. చేతికందేటంత ఎత్తులో వైర్లు వెళుతున్నా, ప్రజలు వాటిని సక్రమంగా సరిచేయాలని మొత్తుకున్నా పట్టించుకునే నాథుడే కరువయ్యాడు. విద్యుత్ తీగలు తెగిపడితే సమాచారం ఇచ్చినా వాటిని పునరుద్ధరించాలంటే రోజులు గడవాల్సిందే. గిద్దలూరు, యర్రగొండపాలెం, మార్కాపురం ప్రాంతాల్లో పొలాల్లోకి వెళ్లాలంటేనే పశువుల కాపరులు భయపడే పరిస్థితి. ఎప్పుడు తీగలు(కండక్టర్) తెగి మీద పడతాయోనన్న భయం. ఇక రాత్రి వేళల్లో రైతులు విద్యుత్ మోటార్లు వేసుకోవాలంటేనే భీతిల్లుతున్నారు. ఎప్పుడు హై ఓల్టేజి వచ్చి మోటార్లకు విద్యుత్ షాక్ కొడుతుందోనన్న అనుమానం. ఇక సముద్ర తీర ప్రాంతంలో ఉప్పుగాలులకు వైర్లు బలహీనపడి ఎప్పుడు పడితే అప్పుడు తెగి కిందపడుతుంటాయి. ఇనుప విద్యుత్ స్తంభాలు తుప్పుపట్టి చిన్నపాటి గాలికే నేలకొరుగుతున్నాయి. ట్రాన్స్ఫార్మర్ల పరిస్థితి మరీ భయానకం. జనావాసాల్లో కూడా ట్రాన్స్ఫార్మర్లకు రక్షణ చర్యలు లేవు. ఇళ్ల మధ్యలో, రోడ్ల వెంట ప్రజలు సంచరిస్తూనే ఉంటారు... ట్రాన్స్ఫార్మర్లలో రెండు వైర్ల మధ్య మంటలు వస్తూనే ఉంటాయి. ఒక్కోసారి పేలిపోతుంటాయి. ప్రజలు ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని బిక్కుబిక్కు మంటూ తిరుగుతూ ఉంటారు. కానీ బిల్లులు నెల ఆలస్యమైతే మాత్రం వెంటనే సర్వీస్ కట్ చేస్తారు. సమస్య వచ్చినప్పుడు సరిచేయడంలో తీవ్ర జాప్యం చేస్తున్నారు. -
ప్రాక్టికల్స్‌లో తొలిసారి జంబ్లింగ్!
3 నుంచి ఇంటర్ ప్రాక్టికల్స్ జిల్లాలో 69 సెంటర్ల ఏర్పాటు ప్రైవేటు కాలేజీలకు ప్రత్యేక అధికారులు నర్సీపట్నం: ఎట్టకేలకు ఈ ఏడాది నుంచి ఇంటర్మీడియట్ ప్రాక్టికల్స్ పరీక్షలను జంబ్లింగ్ విధానంలో నిర్వహించేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. గత పదేళ్లుగా ప్రాక్టికల్స్ సైతం థియరీ పరీక్షల మాదిరిగానే నిర్వహించేందుకు ప్రభుత్వం యోచిస్తున్నా, వాటిని నిలుపుదల చేసేందుకు కార్పొరేట్ కాలేజీలు ఒత్తిడి చేసేవి. ఈ విధంగా ప్రతి ఏటా ఈ విధానం వాయిదా పడుతూ వచ్చింది. చివరకు ప్రభుత్వం ఈ ఏడాది దీనిపై గట్టి నిర్ణయం తీసుకొని, జంబ్లింగ్ విధానంలోనే నిర్వహించేందుకు ఏర్పాట్లు చేసింది. ఈ నెల 3 నుంచి 21 వరకు ఈ పరీక్షలు నిర్వహించనున్నారు. ప్రభుత్వ కళాశాలల్లో పరీక్షల నిర్వహణకు అవసరమైన పరికరాలు లేనిచోట సమీపంలోని వేరే కళాశాలల నుంచి రప్పించేందుకు ఏర్పాట్లు చేశారు. దీంతో ప్రాక్టికల్స్ పరీక్షలు జం బ్లింగ్ విధానంలో నిర్వహించేందుకు తొలి అడుగు పడింది. వీటి నిర్వహణకు గాను జిల్లాలో 69 సెంటర్లను ఏర్పాటు చేశారు. వీటిలో 24 ప్రభుత్వ కళాశాలలు, 11 ఎయిడెడ్, 3 ట్రైబల్, 3 సాంఘిక సంక్షేమంతోపాటు 28 ప్రైవేటు కళాశాలలను ఎంపిక చేశారు. వీటిలో ఈ ఏడాది 36,616మంది విద్యార్థులు ప్రాక్టికల్స్‌కు హాజరు కానున్నారు. వీరిలో ఎంపీసీ నుంచి 29,140మంది, బైపీసీ నుంచి 7515 మంది విద్యార్థులున్నారు. జిల్లాలో మొత్తం 263 కాలేజీల నుంచి విద్యార్థులు ఈ పరీక్షలకు హాజరు కానున్నారు. ఈ పరీక్షల్లో ఎటువంటి అవకతవకలకు తావు లేకుండా ఉండేందుకు ప్రత్యేక అధికారులను నియమించారు. స్క్వాడ్లను ఏర్పాటు చేయడమే కాకుండా ప్రైవేటు కళాశాలల్లో నిర్వహించే ప్రాక్టికల్స్‌కు ప్రత్యేకంగా ఒక్కో దానికి ఒక డిపార్ట్మెంటల్ అధికారిని నియమిస్తున్నారు. ఈ విధంగా తొలిసా రి జంబ్లింగ్ విధానంలో జరిగే ఇంటర్ ప్రాక్టికల్స్‌ను పక్కాగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తిచేసినట్టు ఇంటర్మీడియట్ విద్యామండలి ప్రాంతీయ పర్యవేక్షణాధికారి టి.నగేష్ కుమార్ పేర్కొన్నారు. ఇదీ మతలబు.. ఇంతవరకు జేఈఈ మెయిన్స్, ఎంసెట్ రాసే విద్యార్థులకు వారి ర్యాంకుల్లో ఇంటర్ మార్కులు వెయిటే జీ ఉండేది. జేఈఈ మెయిన్స్ 40 శాతం, ఎంసెట్‌కు 25 శాతం ఉండేది. దీంతో ఇంటర్మీడియట్లో ఎక్కువ మార్కులు అవసరమయ్యేవి. దీంతో ప్రైవేటు కళాశాలలు తమ విద్యార్థులకు ఎక్కువ మార్కులు వచ్చేందుకు గాను పరోక్షంగా ఈ ప్రాక్టికల్స్ దోహదపడేవి. దీంతో కార్పోరేట్ కాలేజీ యాజమాన్యాలు ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి, జంబ్లింగ్ విధానం అమల్లోకి రాకుండా చేసేవారు. ఈ ఏడాది జేఈఈ మెయిన్స్‌లో ఇంటర్ వెయిటేజీ తీసేయ్యడంతో కార్పొరేట్ కాలేజీలు వెనక్కు తగ్గాయి. దీంతో ప్రభుత్వం జంబ్లింగ్ విధానాన్ని అడ్డంకులు లేకుండా అమల్లోకి తీసుకొచ్చింది. ఏది ఏమైనా ఈ పరీక్షలు కచ్చితంగా ఎటువంటి అవకతవకల్లేకుండా జరిగితే గ్రామీణ విద్యార్థులకు వరంగా మారనుంది. -
బోర్డు ఆదేశాలు పాటించాల్సిందే..
- నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు -ఉత్తమ ఫలితాలు సాధిస్తాం - సాక్షితో డీఐఈవో ఏ. ప్రభాకర్ రెడ్డి మంచిర్యాల సిటీ : ఇంటర్మీడియట్ బోర్డు ఆదేశాలను ప్రభుత్వ, ప్రైవేటు యాజమాన్యాలు తప్పనిసరిగా పాటించాల్సిందేనని, బోర్డు నిబంధనలు అతిక్రమిస్తే శాఖాపరంగా కఠిన చర్యలు తప్పవని మంచిర్యాల జిల్లా ఇంటర్మీడియట్ విద్యాశాఖ అధికారి ఏ ప్రభాకర్‌రెడ్డి అన్నారు. 2016-17 విద్యా సంవత్సరంలో ఉత్తమ ఫలితాలు సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు. ప్రైవేటు యాజమాన్యాలు కొందరు అర్హతలు లేని వారితో తరగతులు నిర్వహిస్తున్నారనే సమాచారం ఉందని, ఇప్పటికే ఒకసారి విజిలెన్స్ అధికారులు తనిఖీ చేసినట్లు మరోసారి తనిఖీ చేసే అవకాశాలున్నాయన్నారు. తనిఖీలో బోర్డు ఉత్తర్వులు పక్కకు పెట్టిన వారు గుర్తించిన నేపథ్యంలో కఠిన చర్యలు ఎంతటివారికైనా తప్పవని స్పష్టం చేశారు. మంచిర్యాల జిల్లా ఇంటర్మీడియట్ విద్యాశాఖ అధికారిగా ప్రభాకర్‌రెడ్డి బాధ్యతలు చేపట్టిన అనంతరం ఆయన ‘సాక్షి’తో మాట్లాడారు. సాక్షి : జిల్లాలో కళాశాలలు ఎన్ని? అధికారి : 10 ప్రభుత్వ, 32 ప్రైవేటు కళాశాలలు ఉన్నాయి. వీటిలో పదివేల మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. ప్రభుత్వ పరిధిలో మూడు సంక్షేమ, మూడు మోడల్ పాఠశాలలు ఉన్నాయి. ఏడు కళాశాలల్లో సైన్స్ తరగతులు, మూడింటిలో ఆర్ట్స్ తరగతులు నిర్వహిస్తున్నాం సాక్షి : సౌకర్యాల పరిస్థితి ఎలా ఉంది? అధికారి : అన్ని కళాశాలలకు బోధన సిబ్బందితోపాటు ప్రయోగశాలలు, గ్రంథాలయం, ఆటస్థలం ఉంది. భోధనేతర సిబ్బందితోపాటు ప్రహారీ లేదు. ప్రహారీ నిర్మాణం కోసం నిధులు కొద్ది రోజుల్లోనే మంజూరు కానున్నాయి. ఫిజికల్ డెరైక్టర్ కూడా ఒక్క కళాశాలకు మాత్రమే ఉన్నారు. విద్యార్థులు ఆటలకు దూరమవుతున్న మాట వాస్తవమే. సాక్షి : ఫలితాలు ఎంత శాతం సాధిస్తారు..? అధికారి : ప్రస్తుత విద్యాసంవత్సరంలో ఉత్తమ ఫలితాలు సాధిస్తామనే నమ్మకం ఉంది. అర్హతగల అధ్యాపకులు ఉన్నారు కాబట్టి ప్రతి కళాశాలలో 80 శాతం పైబడి ఫలితాలు సాధిస్తాం. వెనుకబడిన విద్యార్థులకు ప్రత్యేక తరగతులు సాయంత్రంపూట నిర్వహించడానికి ఏర్పాట్లు చేస్తున్నాం. సైన్స్ కళాశాలల్లో ఆసక్తి ఉన్నవారికి ఎంసెట్ ప్రవేశ పరీక్ష శిక్షణ తరగతులను కూడా ఉచితంగా నిర్వహించడానికి సిద్ధంగా ఉన్నాం. సాక్షి : ప్రైవేటులో అర్హతల్లేనివారు బోధిస్తున్నారనే ఆరోపణలున్నాయి? అధికారి : ప్రైవేటు విద్యాసంస్థల్లో ఈ పాటికే విజిలెన్స్‌శాఖ తనిఖీలు చేపట్టింది. తనిఖీల్లో అర్హతలు తక్కువ ఉన్నవారు తేలితే శాఖపరమైన చర్యలు తప్పవు. కొత్తగా బాధ్యతలు చేపట్టిన నేపథ్యంలో మరోసారి తనిఖీ చేసే అవకాశం కూడా ఉంది. అర్హతలు తప్పనిసరిగా ఉండాల్సిందే. సాక్షి : అధిక ఫీజు వసూలు ఎలా అరికడతారు..? అధికారి : ట్యూషన్ ఫీజుతోపాటు పరీక్ష ఫీజు కూడా అధికంగా తీసుకున్నట్టుగా ఫిర్యాదులు ఉన్నాయి. అటువంటి కళాశాలలను గుర్తించి తగిన చర్యలు తీసుకోవడం తప్పదు. ఎవరైనా నేరుగా నాకు ఫిర్యాదు చేయవచ్చు. ప్రభుత్వ, ప్రైవేటు కళాశాలల్లో ఎవరైనా ఇబ్బందులు పడుతుంటే నేరుగా నానెంబర్ 9440085109కు ఫోన్ చేస్తే సమస్య పరిష్కరించగలను. ప్రతి కళాశాల నిర్వహకులు సెలవులను పాటించాల్సిందే. సాక్షి : మూల్యాంకనానికి ప్రైవేటు అధ్యాపకులు ఎందుకు రావడంలేదు? అధికారి : ఇంటర్ జవాబు పత్రాల మూల్యాంకనంకు ప్రైవేటు అధ్యాపకులు గతంలో రాలేదు. ఇకనుంచి కుదరదు. తప్పనిసరిగా బోర్డు ఉత్తర్వుల ప్రకారంరావాల్సిందే. అధ్యాపకులను పంపించని కళాశాలల గుర్తింపును రద్దు చేయడానికి బోర్డుకు అధికారం ఉంది. అధ్యాపకులను మూల్యాంకనంకు పంపకుండా, వేసవి సెలవుల్లో అడ్మీషన్ల ప్రచారానికి వాడుకుంటున్నట్టుగా సమాచారం ఉంది. ఇలాంటి పద్ధతులను మానుకోవాలి. సాక్షి : పర్యవేక్షణలో రాజకీయ జోక్యం ఉంటుందా? అధికారి : ఇంటర్‌బోర్డు కమిషనర్ ఆదేశాల ప్రకారం పనిచేస్తాం. రాజకీయ జోక్యంతో పనిచేస్తే విద్యావ్యవస్థ నాశనం అవుతుంది. ప్రైవేటు కళాశాలల్లో విజిలెన్స్ తనిఖీలు చేపడితే ఎక్కడ కూడా రాజకీయ జోక్యం కనబడలేదు. అటువంటి వాటికి ఆస్కారం ఉండదు. అదే విధంగా కళాశాలల సంఘాల జోక్యం ఉండదు. ఫలితాలు రాకుంటే ప్రభుత్వం అడుగుతుంది. కా బట్టి రాజకీయ జోక్యం ఎక్కడ కూడా కనబడదు. ఎవరైనా పేద విద్యార్థుల భవిష్యత్ కోసం కట్టుబడి ఉండాల్సిందే. -
‘ఇంటర్’కు డిజిటల్ లెర్నింగ్ అవార్డు
సాక్షి, హైదరాబాద్: ఇంటర్మీడియెట్ విద్యలో (ప్లస్ టూ) ఐటీ, డిజిటల్ లెర్నింగ్ అమలు అవార్డు తెలంగాణ ఇంటర్మీడియెట్ బోర్డుకు లభించింది. ఎలెట్స్ టెక్నో మీడియా అనే సంస్థ శుక్రవారం ఢిల్లీలో వరల్డ్ ఎడ్యుకేషన్ సమ్మిట్ నిర్వహించింది. దీనిలో ఐదు దేశాలకు చెందిన విశ్వవిద్యాలయాలతోపాటు మన దేశంలోని వివిధ వర్సిటీలు, ఇంటర్మీడియెట్ బోర్డులు పాల్గొన్నాయి. డిజిటల్ లెర్నింగ్ విధానంలో భాగంగా తాము అమలు చేస్తున్న స్టూడెంట్స్ ఆన్లైన్ సర్వీసెస్, మొబైల్ యాప్ ద్వారా అందిస్తున్న సేవలు, ఆన్లైన్ ప్రవేశాలు, బయోమెట్రిక్ హాజరు విధానం, సీసీ కెమెరాల ఏర్పాటు, ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో కంప్యూటర్ విద్య తదితర అంశాలపై తెలంగాణ బోర్డు కార్యదర్శి డాక్టర్ అశోక్ ప్రజెంటేషన్ ఇచ్చారు. ఈ సందర్భంగా తెలంగాణ బోర్డును సమ్మిట్ ఈ అవార్డుకు ఏకగ్రీవంగా ఎంపిక చేసిందని అశోక్ వెల్లడించారు. ఈ అవార్డును జార్ఖండ్ సీఎం రఘువీర్ దాస్ చేతుల మీదుగా అందుకున్నట్లు తెలిపారు. తెలుగు వర్సిటీ వీసీకి టీఎస్పీఎస్సీ చైర్మన్ అభినందనలు తెలుగు విశ్వవిద్యాలయం వైస్ చాన్స్‌లర్‌గా నియమితులైన ప్రొఫెసర్ ఎస్వీ సత్యనారాయణకు టీఎస్పీఎస్సీ చైర్మన్ ప్రొఫెసర్ ఘంటా చక్రపాణి అభినందనలు తెలిపారు. వీసీగా సత్యనారాయణ తెలంగాణ చరిత్ర, సంస్కృతి, గొప్పదనాన్ని, హస్తకళలను ప్రపంచానికి చాటేలా చర్యలు చేపట్టాలన్నారు. ఈ కార్యక్రమంలో టీఎస్పీఎస్సీ సభ్యులు మతీనుద్దీన్‌ఖాద్రీ, వివేక్, మంగరి రాజేందర్, సాయిలు, మన్మధరెడ్డి, ప్రొఫెసర్ అడపా సత్యనారాయణ, ప్రొఫెసర్ రాములు పాల్గొన్నారు. -
కళాశాల విద్య పరిధిలోకి ఇంటర్మీడియెట్
అధికారులకు సీఎం ఆదేశం సాక్షి, హైదరాబాద్: ఇంటర్మీడియెట్ విద్యను కళాశాల విద్య పరిధిలోకి తీసుకురావాలని ముఖ్యమంత్రి కేసీఆర్ అధికారులను ఆదేశించారు. విద్యాశాఖ బడ్జెట్‌పై మంగళవారం సీఎం నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఈ అంశం చర్చకు వ చ్చినట్లు తెలిసింది. ఈ సందర్భంగా సీఎం... ఇంటర్మీడియెట్ విద్యను పాత విధానంలో భాగంగా కళాశాల విద్య డెరైక్టరేట్ పరిధిలోనే కొనసాగించాలని ఆదేశించినట్లు సమాచారం. 14 రకాల విభాగాలు అక్కర్లేదని, పలు విభాగాలను కుదించాలని సూచించారు. దివంగత మాజీ ప్రధాని పీవీ నర్సింహారావు 1969లో విద్యాశాఖ మంత్రిగా ఉండగా ఇంటర్మీడియెట్ విద్యా విధానాన్ని ప్రవేశపెట్టారు. అప్పట్లో ఐఏఎస్ అధికారి రాజగోపాల్ నేతృత్వంలో కమిటీ ఏర్పాటు చేసి, ఆ కమిటీ సిఫారసుల మేరకు ఇంటర్మీడియెట్ (+2) విద్యావిధానం అమల్లోకి తెచ్చారు. 1989 వరకు కళాశాల విద్య, ఇంటర్మీడియెట్ విద్య రెండూ కళాశాల విద్యా డెరైక్టరేట్ పరిధిలోనే కొనసాగాయి. 1989లో ఇంటర్మీడియెట్ విద్యను ఆ డెరైక్టరేట్ నుంచి వేరు చేశారు. గతంలో పాఠశాల విద్యా పరిధిలోకి ఇంటర్మీడియెట్‌ను తీసుకువచ్చి సీబీఎస్ఈ తరహాలో (11, 12 తరగతుల విధానం) కొనసాగించాలన్న చర్చలు జరిగాయి. కానీ అనూహ్యంగా పాత విధానాన్ని అనుసరించాలని సీఎం ఆదే శించారు. -
ఇంత నిర్లక్ష్యమా...?
- సర్కారీ కళాశాలల్లో భర్తీకాని అధ్యాపక పోస్టులు - జిల్లాలో 60పోస్టులు ఖాళీగా ఉన్నా పట్టించుకోని ప్రభుత్వం శ్రీకాకుళం న్యూకాలనీ: విద్యార్థులు జీవితంలో కీలకంగా భావించే ఇంటర్మీడియట్ విద్యపై ప్రభుత్వం శీతకన్ను వేస్తోంది. జిల్లాతోపాటు రాష్ట్రవ్యాప్తంగా సర్కారీ జూనియర్ కళాశాలల్లో వందలాది అధ్యాపక పోస్టులు ఖాళీగా ఉన్నాయి. రెండేళ్లుగా ఈ కళాశాలల్లో ఖాళీలను భర్తీచేయకపోవడంతో ఆయా సబ్జెక్టుల్లో విద్యార్థులు ఫెయిలవుతున్నారు. జిల్లాలో నాలుగేళ్ల క్రితం మంజూరైన కొయ్యాం, ఎల్.ఎన్.పేట, జి.సిగడాం, రాజాం జూనియర్ కళాశాలలతో కలిసి 43 ప్రభుత్వ జూనియర్ కళాశాలలున్నాయి. ఇందులో జనరల్ కోర్సులకు సంబంధించి వివిధ సబ్జెక్టుల్లో 47, ఒకేషనల్‌లో 13 మొత్తం 60 లెక్చరర్ పోస్టులు భర్తీకావాల్సి ఉంది. ఇంటర్‌విద్యలో అత్యధికశాతం ఫెయిలయ్యే ఇంగ్లిష్ పోస్టులు అత్యధికంగా 12 ఖాళీలు ఉన్నాయంటే ఆశ్చర్యం కలగక మానదు. కఠినమైన సైన్స్ సబ్జెక్టులతోపాటు, లాంగ్వేజ్ సబ్జెక్టులు, ఆర్ట్స్ గ్రూపులకు సంబంధించిన సబ్జెక్టులు సైతం భర్తీకావాల్సి ఉన్నాయి. జిల్లాలో టెక్కలి జూనియర్ కళాశాలలో అత్యధికంగా ఐదు పోస్టులు ఖాళీగా ఉన్నాయంటే అక్కడి ఫలితాలపై ఏమేరకు ప్రభావం చూపించి ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. గత ఏడాది విశ్రాంత లెక్చరర్స్‌తో పాఠాలు బోధించి మమ అనిపించారు. ఈ విద్యాసంవత్సరంలో సైతం అదే విధంగా విశ్రాంత లెక్చరర్లతోనే కాలక్షేపం చేసే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఉన్న ఖాళీలను కనీసం కాంట్రాక్ట్ లెక్చరర్స్‌తో భర్తీచేసేందుకైనా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని నిరుద్యోగులు డిమాండ్చేస్తున్నారు. ఇవీ ఖాళీలు.. జిల్లాలో ఇంగ్లిష్‌లో అత్యధికంగా 12 పోస్టులు ఖాళీ ఉన్నాయి. ఇక మాథ్స్ ఆరు, ఎకనామిక్స్ ఆరు, బాటనీ నాలుగు, హిస్టరీ నాలుగు, జువాలజీ మూడు, కామర్స్ మూడు, తెలుగు రెండు, ఫిజిక్స్ రెండు, ఒరియా రెండు, కెమిస్ట్రీ, జాగ్రఫీ, హిందీ చెరొక పోస్టులు ఖాళీలు ఉన్నాయి. ఇక్కడ ఫలితాలు ఆశించిన స్థాయిలో లేకపోవడంతో తప్పనిసరి పరిస్థితుల్లో పిల్లల ప్రైవేటు కళాశాలలను ఆశ్రయిస్తున్నారు. కమిషనర్‌కు నివేదించాం జిల్లాలో ప్రభుత్వ కళాశాలల్లో ఉన్న ఖాళీ పోస్టుల వివరాలను బోర్డు కమిషనర్‌కు నివేదించాం. గత ఏడాది విశ్రాంత లెక్చరర్స్‌తో క్లాసులు చెప్పించాలని బోర్డు ఆదేశించింది. ఈ ఏడాదికి సంబంధించి ఇంతవరకు ఎలాంటి ఉత్వర్వులు అందలేదు. త్వరలోనే దీనిపై ఓ స్పష్టత వస్తుందని ఆశిస్తున్నాం. ఖాళీలు భర్తీచేయకుంటే విద్యార్థులకు నష్టమే. - పాత్రుని పాపారావు, డీవీఈవో, ఇంటర్‌విద్య -
అరకొర సిబ్బంది.. అంతా ఇబ్బంది
శ్రీకాకుళం న్యూకాలనీ: జిల్లాలోని ఇంటర్మీడియెట్ విద్యామండలి ప్రాంతీయ పర్యవేక్షణాధికారి కార్యాలయం (ఆర్ఐవో)లో సిబ్బంది కొరత వెంటాడుతోంది. ఒకే ఒక్క అవుట్సోర్సింగ్ కంప్యూటర్ ఆపరేటర్ మినహా కార్యాలయ విధులు నిర్వహించే అధికారులు, సిబ్బంది లేకపోవడంతో పరిస్థితి దయనీయంగా మారింది. ఇంటర్మీడియెట్ బోర్డు అలసత్వంతో విద్యార్థులకు కూడా తిప్పలు తప్పడంలేదు. అంతేగాక కార్యాలయంలో ఫైళ్లు కూడా గుట్టలుగా పేరుకుపోతున్నాయి. వివిధ కాళాశాలల విద్యార్థులకు సంబంధించిన డేటా పూర్తి స్థాయిలో నమోదు కావడంలేదు. దీంతో ఏమి చేయూలో తెలియని పరిస్థితిలో అధికారులు ఉన్నారు. అటు ఇంటర్మీడియట్ బోర్డు, ఇటు కళాశాలల్లో విద్యార్థుల నమోదు ప్రక్రియలో పొరపాట్లు, సిబ్బంది లేమి కారణంగా అధికారులు ప్రేక్షకపాత్ర వహిస్తుండటంతో ఆ ప్రభావం విద్యార్థులపై పడుతోంది. వివరాల నమోదు పక్రియలో పొరపాట్లు చోటు జరుగుతున్నాయి. హాల్‌టిక్కెట్లు తప్పులు వస్తుండటంతో పరీక్షలు జరిగే సమయం వరకు విద్యార్థులకు అవస్థలు తప్పడంలేదు. ఒకే ఒక్క కంప్యూటర్ ఆపరేటర్తోనే.. జిల్లాలో 43 ప్రభుత్వ కళాశాలలు, 11 సాంఘీక కళాశాలలు, 4 గిరిజన కళాశాలలు, 14ఏపీ మోడల్ కళాశాలలు, మరో 97 ప్రవేట్ కళాశాలలు ఉండగా దీనిలో 12 కళాశాలల్లో అడ్మిషన్లు నమోదుకాలేదు. సెకండీయర్‌లో దాదాపు 30వేలు, ఫస్టియర్‌లో ఇంతవరకు సుమారు 28వేలకు పైగా అడ్మిషన్లు నమోదయ్యాయి. విద్యార్థుల అడ్మిషన్ల నమోదు, పరీక్షల పక్రియ అంతా ఆర్ఐవో పరిధిలోనే ఉంటుంది. కార్యాలయంలో అవుట్సోర్సింగ్ ద్వారా గత కొన్నేళ్ల నుంచి ఒక్క కంప్యూటర్ ఆపరేటర్ మాత్రమే విధులు నిర్వహిస్తున్నారు. ఇటీవలి వరకు సూపరింటెండెంట్‌గా విధులు నిర్వహించిన గోపాలరావు గుండెనొప్పి కారణంగా మెడికల్‌లీవ్ తీసుకోవడంతో కార్యాలయ పరిస్థితి మరింత దయనీయంగా మారింది. వాస్తవానికి ఇక్కడి ఆర్ఐవో కార్యాలయంలో ఏవో, సూపరింటెండెంట్, సీనియర్ అసిస్టెంట్, రికార్డ్ అసిస్టెంట్, టైపిస్ట్, ఇద్దరు ఆఫీస్ సబార్డినేటర్లు, ఒక నైట్ వాచ్‌మ్యాన్ ఉండాలి. అయితే ఇక్కడ మెడికల్ లీవ్‌లో ఉన్న సూపరింటెండెంట్ మినహా రెగ్యులర్ సిబ్బంది ఎవరూ అందుబాటులో లేకపోవడంతో కార్యాలయ విధులు నత్తనడకన సాగుతున్నాయి. అవుట్సోర్సింగ్ ద్వారా ఒక డాటా ఎంట్రీ ఆపరేటర్, ఇద్దరు అటెండర్లు, ఒక నైట్‌వాచ్‌మ్యాన్ పనిచేస్తున్నారు. విధిలేక కొన్నిసార్లు అటెండర్లు సైతం రికార్డుల నమోదు ప్రక్రియ చేపడుతుండటంతో అంతా తప్పులతడకగా సాగుతోంది. ఇబ్బందులు పడుతున్నాం.. ఆఫీసులో రోజువారీ విధులు నిర్వహించే సిబ్బంది లేకపోవడంతో చాలా ఇబ్బందులకు గురవుతున్నాం. వివిధ కళాశాలలకు చెందిన సిబ్బందిని బతిమాలి పనులు చేయించుకుంటున్నాం. ప్రభుత్వం చొరవ తీసుకుని కార్యాలయంలో సిబ్బందిని తక్షణమే నియమించకపోతే విధులు నిర్వర్తించలేం. - ఎ.అన్నమ్మ, జిల్లా ఆర్ఐవో, ఇంటర్మీడియెట్ బోర్డు -
ఉచిత ఇంటర్‌కు నెలాఖరులోగా దరఖాస్తు చేసుకోండి
విద్యార్థులకు సాంఘిక సంక్షేమ శాఖ డీడీ ఎంఎస్ శోభారాణి సూచన కర్నూలు(అర్బన్): కార్పొరేట్ కళాశాలల్లో ఉచితంగా ఇంటర్మీడియట్ విద్యను అభ్యసించేందుకు దరఖాస్తు చేసుకునేందుకు ఈ నెల 30వ తేదీ వరకు గడువును పొడిగించినట్లు సాంఘిక సంక్షేమశాఖ ఉప సంచాలకులు ఎంఎస్ శోభారాణి తెలిపారు. సోమవారం సాయంత్రం తన చాంబర్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో డీడీ మాట్లాడుతూ జిల్లాలోని జిల్లాపరిషత్, మున్సిపల్, ఎయిడెడ్, ప్రభుత్వ పాఠశాలల్లో 10వ తరగతి పూర్తి చేసిన అర్హులైన విద్యార్థులు ఆన్లైన్లోనే దరఖాస్తు చేసుకోవాలన్నారు. బీఏఎస్ పాఠశాలల్లో ఎస్సీ విద్యార్థులకు ప్రవేశం: జిల్లాలో ప్రభుత్వం ఎంపిక చేసిన 11 బెస్ట్ అవేలబుల్ స్కూల్స్‌లో 100 మంది ఎస్సీ బాల బాలికలకు 1వ తరగతి ఇంగ్లిషు మీడియంలో ప్రవేశం కల్పిస్తున్నట్లు సాంఘిక సంక్షేమశాఖ డీడీ శోభారాణి తెలిపారు. ఇందులో 33 సీట్లను బాలికలకు, 67 సీట్లను బాలురకు కేటాయిస్తున్నట్లు చెప్పారు. సోమవారం ఆమె విలేకరులతో మాట్లాడుతూ ఒక్కో విద్యార్థికి స్కూల్ ఫీజులు, పుస్తకాలు ఇతరత్రా ఖర్చుల కింద ఎంపికైన పాఠశాలలకు ఏడాదికి రూ.20 వేలను ప్రభుత్వం మంజూరు చేయనుందని తెలిపారు. 1వ తరగతిలో తమ చిన్నారులకు చేర్చబోయే తల్లిదండ్రుల నివాసం ఆయా పాఠశాలలకు సమీపంలో ఉండాలన్నారు. ఈ పాఠశాలలకు దరఖాస్తు చేసుకునే విద్యార్థులు నివాస, కుల, తల్లిదండ్రుల ఆదాయ, పుట్టిన తేదీ ధ్రువీకరణ పత్రాలతో పాటు ఆధార్‌కార్డు, రేషన్‌కార్డు జీరాక్స్ కాపీలు, రెండు పాస్‌పోర్టు సైజ్ ఫోటోలను దరఖాస్తుకు జతపరచాలన్నారు. ఈ పాఠశాలల్లో చేరే విద్యార్థులు 01-06-2008 నుంచి 01-06-2009 సంవత్సరాల మధ్య జన్మించి ఉండాలని, అలాగే పుట్టిన తేదీ సర్టిఫికెట్లు సంబంధిత మునిసిపల్‌కమిషనర్, తహశీల్దార్లు జారీ చేసినవై ఉండాలన్నారు. దరఖాస్తు ఫారాలు జిల్లా సాంఘిక సంక్షేమ శాఖ కార్యాలయంలో, జిల్లాలోని ఏడు సహాయ సంక్షేమాధికారుల కార్యాలయాల్లో లభ్యమవుతున్నట్లు ఆమె తెలిపారు. పూర్తి చేసిన దరఖాస్తులను ఈ నెల 28లోగా తమ కార్యాలయంలో అందించాలని పేర్కొన్నారు. ఈ నెల 30న ఉదయం 11 గంటలకు స్థానిక అంబేద్కర్ భవన్లో లాటరీ పద్ధతిన విద్యార్థులకు ఎంపిక చేస్తారని ఆమె తెలిపారు. బీఏఎస్గా ఎంపికైన పాఠశాలలు: జిల్లా కేంద్రంలోని సర్వేపల్లి విద్యాలయం క్రిష్ణానగర్, జీసస్ మేరీ జోసఫ్ ఇంగిషు మీడియం స్కూల్ చిల్డ్రన్స్ పార్కు సమీపంలో, కాకతీయ పబ్లిక్ స్కూల్ మద్దూర్‌నగర్, నందికొట్కూరు నవనంది హైస్కూల్, నంద్యాల సమతా విద్యానికేతన్, కాల్వబుగ్గ బుగ్గరామేశ్వర హైస్కూల్, డోన్ సుధ హైస్కూల్, ఎమ్మిగనూరు ఆదర్శ విద్యా పీఠం, నలంద హైస్కూల్, ఆళ్లగడ్డ శ్రీ రాఘవేంధ్ర పబ్లిక్ స్కూల్, కోవెలకుంట్ల సెయింట్ జోసఫ్ ఇంగ్లిషు మీడియం స్కూల్స్ ఎంపికైనట్లు డీడీ శోభారాణి తెలిపారు. -
రాష్ట్ర విభజనతో సీమాంధ్రకు తీరని నష్టం
ఒంగోలు ఒన్‌టౌన్, న్యూస్‌లైన్ : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన వల్ల సీమాంధ్ర ప్రాంతం తీవ్రంగా నష్టపోతుందని ప్రభుత్వ జూనియర్ అధ్యాపకుల సంఘ నాయకుడు తిప్పారెడ్డి వెంకటేశ్వరరెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. ఇంటర్మీడియట్ విద్యా సిబ్బంది జేఏసీ ఆధ్వర్యంలో స్థానిక ఇంటర్మీడియట్ బోర్డు ప్రాంతీయ పర్యవేక్షణాధికారి (ఆర్ఐఓ) కార్యాలయం ఎదుట కొనసాగిస్తున్న రిలే నిరాహారదీక్ష శిబిరాన్ని ఉద్దేశించి ఆయన మాట్లాడారు. ఐదో రోజు దీక్షను సోమవారం ఇంటర్మీడియట్ విద్య జేఏసీ కన్వీనర్ పీ రంగనాయకులు, విశ్రాంత అధ్యాపకులు కే గణపతి ప్రారంభించారు. ఈ సందర్భంగా తిప్పారెడ్డి వెంకటేశ్వరరెడ్డి మాట్లాడుతూ.. రాష్ట్ర విభజన వల్ల నదీ జలాల పంపిణీ విషయంలో సీమాంధ్రకు తీవ్ర అన్యాయం జరుగుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. విద్యా, ఉపాధి రంగాల్లో కూడా అన్యాయం జరిగే అవకాశం ఉందన్నారు. ఆదాయం, రుణాలు, హైదరాబాద్ లాంటి కీలక అంశాల పరిష్కారం, సీమాంధ్ర ప్రజలకు జరిగే అన్యాయం గురించి వెంకటేశ్వరరెడ్డి వివరించారు. విద్యార్థి జేఏసీ రాష్ట్ర కో కన్వీనర్ రాయపాటి జగదీష్.. విభజన వల్ల విద్య, ఉపాధి తదితర విషయాల్లో తలెత్తే సమస్యలను వివరించారు. సీమాంధ్ర విద్యార్థులందరూ చురుగ్గా పాల్గొనాలని పిలుపునిచ్చారు. ఆర్ఐఓ పి.మాణిక్యం దీక్షా శిబిరాన్ని సందర్శించి సంఘీభావం తెలిపారు. ఆంధ్రప్రదేశ్ సమైఖ్యంగా ఉంటేనే అన్ని ప్రాంతాల వారికి, అన్ని వర్గాల ప్రజలకు న్యాయం జరుగుతుందన్నారు. కార్యక్రమంలో బోధనేతర సిబ్బంది జిల్లా అధ్యక్షుడు యూ కోటేశ్వరరావు సమైక్యాంధ్ర ఆవశ్యకతను వివరించారు. జిల్లాలోని 30 ప్రభుత్వ జూనియర్ కళాశాలల బోధనేతర సిబ్బంది ఉద్యమంలో ఉన్న విషయాన్ని గుర్తు చేశారు. 5వ రోజు దీక్షలో దర్శి ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ జే సువర్ణబాబు, అధ్యాపకులు సీహెచ్ తారావాణి, వీ కోటయ్య, జీ మనోహర్‌రెడ్డి, రామాచారి, ఇతర కళాశాలలకు చెందిన బోధనేతర సిబ్బంది ఎం.మాల్యాద్రి, పీ వెంకటేశ్వర్లు, టీ ప్రవీణ్‌కుమార్, ఐవీ సుజాత, ఫాతిమా మేరి, అద్దంకి తెలుగు అధ్యాపకులు ఆనందబాబు కూర్చున్నారు. దీక్షా శిబిరాన్ని ప్రిన్సిపాళ్ల సంఘం నాయకులు డీఆర్ కే పరమహంస, ఎస్.సత్యనారాయణ, ఎయిడెడ్ కళాశాల సంఘ నాయకులు పోటు నాగేశ్వరరావు, వెంకటేశ్వరరెడ్డి, జీజేఎల్ఏ నాయకులు నారాయణరావు, టీ వెంకటేశ్వరరెడ్డి, పీడీ సంఘ నాయకులు ఎం.హరనాథబాబు, రిటైర్డ్ డిగ్రీ అధ్యాపకులు కంచర్ల సుబ్బారావు, ఎండీ రహమాన్, పీ వెంకటేశ్వర్లు, ప్రిన్సిపాళ్ల సంఘ మాజీ అధ్యక్షుడు పీ నరసింహారెడ్డి, ఎన్జీఓ నాయకులు గోవిందరావు, తిరుమలయ్య, ఆర్ఐఓ కార్యాలయం ఏవో ఆంజనేయులు, సిబ్బంది సందర్శించి సంఘీభావం తెలిపారు.