ప్రాక్టికల్స్‌లో తొలిసారి జంబ్లింగ్‌! | In the first jambling practical! | Sakshi
Sakshi News home page

ప్రాక్టికల్స్‌లో తొలిసారి జంబ్లింగ్‌!

Published Wed, Feb 1 2017 11:54 PM | Last Updated on Tue, Sep 5 2017 2:39 AM

ప్రాక్టికల్స్‌లో తొలిసారి జంబ్లింగ్‌!

ప్రాక్టికల్స్‌లో తొలిసారి జంబ్లింగ్‌!

3 నుంచి ఇంటర్‌ ప్రాక్టికల్స్‌  
జిల్లాలో 69 సెంటర్ల ఏర్పాటు ప్రైవేటు కాలేజీలకు ప్రత్యేక అధికారులు


నర్సీపట్నం: ఎట్టకేలకు ఈ ఏడాది నుంచి ఇంటర్మీడియట్‌ ప్రాక్టికల్స్‌ పరీక్షలను జంబ్లింగ్‌ విధానంలో నిర్వహించేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. గత పదేళ్లుగా ప్రాక్టికల్స్‌ సైతం థియరీ పరీక్షల మాదిరిగానే నిర్వహించేందుకు ప్రభుత్వం యోచిస్తున్నా, వాటిని నిలుపుదల చేసేందుకు కార్పొరేట్‌ కాలేజీలు ఒత్తిడి చేసేవి. ఈ విధంగా ప్రతి ఏటా ఈ విధానం వాయిదా పడుతూ వచ్చింది. చివరకు ప్రభుత్వం ఈ ఏడాది దీనిపై గట్టి నిర్ణయం తీసుకొని, జంబ్లింగ్‌ విధానంలోనే నిర్వహించేందుకు ఏర్పాట్లు చేసింది. ఈ నెల 3 నుంచి 21 వరకు ఈ పరీక్షలు నిర్వహించనున్నారు. ప్రభుత్వ కళాశాలల్లో పరీక్షల నిర్వహణకు అవసరమైన పరికరాలు లేనిచోట సమీపంలోని వేరే కళాశాలల నుంచి రప్పించేందుకు ఏర్పాట్లు చేశారు. దీంతో ప్రాక్టికల్స్‌ పరీక్షలు జం బ్లింగ్‌ విధానంలో నిర్వహించేందుకు తొలి అడుగు పడింది. వీటి నిర్వహణకు గాను జిల్లాలో 69 సెంటర్లను ఏర్పాటు చేశారు.

వీటిలో 24 ప్రభుత్వ కళాశాలలు, 11 ఎయిడెడ్, 3 ట్రైబల్, 3 సాంఘిక సంక్షేమంతోపాటు 28 ప్రైవేటు కళాశాలలను ఎంపిక చేశారు. వీటిలో ఈ ఏడాది 36,616మంది విద్యార్థులు ప్రాక్టికల్స్‌కు హాజరు కానున్నారు. వీరిలో ఎంపీసీ నుంచి 29,140మంది, బైపీసీ నుంచి 7515 మంది విద్యార్థులున్నారు. జిల్లాలో మొత్తం 263 కాలేజీల నుంచి విద్యార్థులు ఈ పరీక్షలకు హాజరు కానున్నారు. ఈ పరీక్షల్లో ఎటువంటి అవకతవకలకు తావు లేకుండా ఉండేందుకు ప్రత్యేక అధికారులను నియమించారు. స్క్వాడ్‌లను ఏర్పాటు చేయడమే కాకుండా ప్రైవేటు కళాశాలల్లో నిర్వహించే ప్రాక్టికల్స్‌కు ప్రత్యేకంగా ఒక్కో దానికి ఒక డిపార్ట్‌మెంటల్‌ అధికారిని నియమిస్తున్నారు. ఈ విధంగా తొలిసా రి జంబ్లింగ్‌ విధానంలో జరిగే ఇంటర్‌ ప్రాక్టికల్స్‌ను పక్కాగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తిచేసినట్టు ఇంటర్మీడియట్‌ విద్యామండలి ప్రాంతీయ పర్యవేక్షణాధికారి టి.నగేష్‌ కుమార్‌ పేర్కొన్నారు.  

ఇదీ మతలబు..
ఇంతవరకు జేఈఈ మెయిన్స్, ఎంసెట్‌ రాసే విద్యార్థులకు వారి ర్యాంకుల్లో ఇంటర్‌ మార్కులు వెయిటే జీ ఉండేది. జేఈఈ మెయిన్స్‌ 40 శాతం, ఎంసెట్‌కు 25 శాతం ఉండేది. దీంతో ఇంటర్మీడియట్‌లో ఎక్కువ మార్కులు అవసరమయ్యేవి. దీంతో ప్రైవేటు కళాశాలలు తమ విద్యార్థులకు ఎక్కువ మార్కులు వచ్చేందుకు గాను పరోక్షంగా ఈ ప్రాక్టికల్స్‌ దోహదపడేవి. దీంతో కార్పోరేట్‌ కాలేజీ యాజమాన్యాలు ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి, జంబ్లింగ్‌ విధానం అమల్లోకి రాకుండా చేసేవారు. ఈ ఏడాది జేఈఈ మెయిన్స్‌లో ఇంటర్‌ వెయిటేజీ తీసేయ్యడంతో కార్పొరేట్‌ కాలేజీలు వెనక్కు తగ్గాయి. దీంతో ప్రభుత్వం జంబ్లింగ్‌ విధానాన్ని అడ్డంకులు లేకుండా అమల్లోకి తీసుకొచ్చింది. ఏది ఏమైనా ఈ పరీక్షలు కచ్చితంగా ఎటువంటి అవకతవకల్లేకుండా జరిగితే గ్రామీణ విద్యార్థులకు వరంగా మారనుంది.    
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement