Jambling policy
-
ప్రాక్టికల్స్‌లో తొలిసారి జంబ్లింగ్!
3 నుంచి ఇంటర్ ప్రాక్టికల్స్ జిల్లాలో 69 సెంటర్ల ఏర్పాటు ప్రైవేటు కాలేజీలకు ప్రత్యేక అధికారులు నర్సీపట్నం: ఎట్టకేలకు ఈ ఏడాది నుంచి ఇంటర్మీడియట్ ప్రాక్టికల్స్ పరీక్షలను జంబ్లింగ్ విధానంలో నిర్వహించేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. గత పదేళ్లుగా ప్రాక్టికల్స్ సైతం థియరీ పరీక్షల మాదిరిగానే నిర్వహించేందుకు ప్రభుత్వం యోచిస్తున్నా, వాటిని నిలుపుదల చేసేందుకు కార్పొరేట్ కాలేజీలు ఒత్తిడి చేసేవి. ఈ విధంగా ప్రతి ఏటా ఈ విధానం వాయిదా పడుతూ వచ్చింది. చివరకు ప్రభుత్వం ఈ ఏడాది దీనిపై గట్టి నిర్ణయం తీసుకొని, జంబ్లింగ్ విధానంలోనే నిర్వహించేందుకు ఏర్పాట్లు చేసింది. ఈ నెల 3 నుంచి 21 వరకు ఈ పరీక్షలు నిర్వహించనున్నారు. ప్రభుత్వ కళాశాలల్లో పరీక్షల నిర్వహణకు అవసరమైన పరికరాలు లేనిచోట సమీపంలోని వేరే కళాశాలల నుంచి రప్పించేందుకు ఏర్పాట్లు చేశారు. దీంతో ప్రాక్టికల్స్ పరీక్షలు జం బ్లింగ్ విధానంలో నిర్వహించేందుకు తొలి అడుగు పడింది. వీటి నిర్వహణకు గాను జిల్లాలో 69 సెంటర్లను ఏర్పాటు చేశారు. వీటిలో 24 ప్రభుత్వ కళాశాలలు, 11 ఎయిడెడ్, 3 ట్రైబల్, 3 సాంఘిక సంక్షేమంతోపాటు 28 ప్రైవేటు కళాశాలలను ఎంపిక చేశారు. వీటిలో ఈ ఏడాది 36,616మంది విద్యార్థులు ప్రాక్టికల్స్‌కు హాజరు కానున్నారు. వీరిలో ఎంపీసీ నుంచి 29,140మంది, బైపీసీ నుంచి 7515 మంది విద్యార్థులున్నారు. జిల్లాలో మొత్తం 263 కాలేజీల నుంచి విద్యార్థులు ఈ పరీక్షలకు హాజరు కానున్నారు. ఈ పరీక్షల్లో ఎటువంటి అవకతవకలకు తావు లేకుండా ఉండేందుకు ప్రత్యేక అధికారులను నియమించారు. స్క్వాడ్లను ఏర్పాటు చేయడమే కాకుండా ప్రైవేటు కళాశాలల్లో నిర్వహించే ప్రాక్టికల్స్‌కు ప్రత్యేకంగా ఒక్కో దానికి ఒక డిపార్ట్మెంటల్ అధికారిని నియమిస్తున్నారు. ఈ విధంగా తొలిసా రి జంబ్లింగ్ విధానంలో జరిగే ఇంటర్ ప్రాక్టికల్స్‌ను పక్కాగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తిచేసినట్టు ఇంటర్మీడియట్ విద్యామండలి ప్రాంతీయ పర్యవేక్షణాధికారి టి.నగేష్ కుమార్ పేర్కొన్నారు. ఇదీ మతలబు.. ఇంతవరకు జేఈఈ మెయిన్స్, ఎంసెట్ రాసే విద్యార్థులకు వారి ర్యాంకుల్లో ఇంటర్ మార్కులు వెయిటే జీ ఉండేది. జేఈఈ మెయిన్స్ 40 శాతం, ఎంసెట్‌కు 25 శాతం ఉండేది. దీంతో ఇంటర్మీడియట్లో ఎక్కువ మార్కులు అవసరమయ్యేవి. దీంతో ప్రైవేటు కళాశాలలు తమ విద్యార్థులకు ఎక్కువ మార్కులు వచ్చేందుకు గాను పరోక్షంగా ఈ ప్రాక్టికల్స్ దోహదపడేవి. దీంతో కార్పోరేట్ కాలేజీ యాజమాన్యాలు ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి, జంబ్లింగ్ విధానం అమల్లోకి రాకుండా చేసేవారు. ఈ ఏడాది జేఈఈ మెయిన్స్‌లో ఇంటర్ వెయిటేజీ తీసేయ్యడంతో కార్పొరేట్ కాలేజీలు వెనక్కు తగ్గాయి. దీంతో ప్రభుత్వం జంబ్లింగ్ విధానాన్ని అడ్డంకులు లేకుండా అమల్లోకి తీసుకొచ్చింది. ఏది ఏమైనా ఈ పరీక్షలు కచ్చితంగా ఎటువంటి అవకతవకల్లేకుండా జరిగితే గ్రామీణ విద్యార్థులకు వరంగా మారనుంది. -
డిగ్రీ పరీక్షల్లో జోరుగా మాస్ కాపీయింగ్
► జంబ్లింగ్ విధానంలో లోపించిన పారదర్శకత ► ఇప్పటికే 59 మంది విద్యార్థుల డీబార్ ఎస్కేయూ: డిగ్రీ పరీక్షల్లో జోరుగా మాస్‌కాపీయింగ్ సాగుతోందనడానికి ఇప్పటి వరకూ 59 మంది విద్యార్థులు డీబార్ అయిన విషయమే ఉదాహరణ. మాస్‌కాపీయింగ్‌కు అడ్డుకట్ట వేయాలనే ఉద్దేశంతో ప్రవేశపెట్టిన జంబ్లింగ్ విధానం పారదర్శకంగా అమలు కావడం లేదనే విమర్శలు ఉన్నాయి. కట్టుదిట్టంగా పరీక్షలు నిర్వహిస్తే విద్యార్థులు గణనీయంగా ఫెయిల్ కావడంతో పాటు అడ్మిషన్లు తగ్గుతాయనే ఉద్దేశంతో ప్రయివేటు అనుబంధ కళాశాలలు యాజమాన్యాలు సమ్మతించలేదు. అయితే ప్రభుత్వ డిగ్రీ కళాశాలల అధ్యాపకులు జంబ్లింగ్ విధానంలో ప్రవేశపెట్టకపోతే డిగ్రీ కళాశాలల్లో అడ్మిషన్లు కనుమరుగు అవుతాయని ఎస్కేయూ యాజమాన్యం వద్ద ఏకరువు పెట్టారు. దీంతో ఎట్టకేలకు జంబ్లింగ్ విధానాన్ని అమలు పరిచారు. నిర్వాహణ లోపం... పరీక్షల్లో ఒక ప్రశ్నాపత్రానికి బదులు మరో ప్రశ్నపత్రం పంపడం, జవాబు పత్రాలు కొరత, అనుబంధ కళాశాలలకు సమాచార లోపం, తదితర అంశాలు నిర్వాహణలోపాన్ని ఎత్తిచూపుతున్నాయి. ఫలితంగా యూజీ ఉద్యోగుల పనితీరుపై బహిరంగ విమర్శలు వస్తున్నా యి. యూజీ పరీక్షల వ్యవహారం పూర్తిగా గాడి తప్పింది. దీనిపై యాజమాన్యం సరైన స్థాయిలో స్పం దించడంలేదని, చాలా తేలిగ్గా తీసుకుంటోందనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. గతంలో జరిగిన పరీక్షలకు గైర్హాజరైన వారిని ఉత్తీర్ణత చేయడం, పాస్ అయిన వారిని ఫెయిల్ చేయడం, ఎవరి మార్కులు ఎవరికి కలిపారో తెలియని అనిశ్చితి, తదితర ఘటనలపై విచారణ చేసిన కమిటీలు బాధ్యులపై చర్యలు తీసుకోవాలని చేసిన సిఫార్సులు బుట్టదాఖలయ్యాయి. డిగ్రీ రెండో సెమిస్టర్ పరీక్షల్లోనూ అదేతీరు డిగ్రీ రెండో సెమిస్టర్ పరీక్షలు గురువారం ప్రారంభమయ్యూరుు. ఈ పరీక్షల్లోనూ మాస్ కాపీరుుంగ్ తీరు జోరుగా సాగుతోంది. గురువారం జరిగిన పరీక్షల్లో ఏడుగురు విద్యార్థులు డీబార్ అయ్యూరు. పేరుకే జంబ్లింగ్ విధానం .. ఈ పద్ధతిలో ఒక కళాశాలలోని విద్యార్థులను , మరో కళాశాలకు కాకుండా పలు కళాశాలలకు విభజించి పరీక్ష కేంద్రాలకు పంపాలి. కానీ ఇక్కడ అందుకు భిన్నంగా అమలు చేస్తున్నారు. ఒక కళాశాలల్లోని విద్యార్థులను మరొక కళాశాలలకు మూకుమ్మడిగా పంపుతున్నారు. దీంతో ఇరువురు కళాశాల యాజమాన్యాలు పరస్పర సహకారంతో మాస్‌కాపీయింగ్‌కు యథేచ్ఛగా ప్రోత్సహిస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. -
డిగ్రీ పరీక్షల్లో గందరగోళం
► ఇన్సూరెన్స్ ప్రశ్నపత్రానికి బదులు అడ్వాన్స్ కార్పొరేట్ అకౌంట్స్ పేపర్ ► పరీక్ష రాయని 130 మంది విద్యార్థులు గుంతకల్లు టౌన్: ఎస్కేయూ డిగ్రీ పరీక్షల్లో జంబ్లింగ్ విధానం ప్రవేశపెట్టడంతో శ్రీ శంకరానంద డిగ్రీ కాలేజి విద్యార్థులను ఎస్కేపీ ప్రభుత్వ, శ్రీశైల భ్రమరాంబిక మహిళా డిగ్రీ కళాశాల్లోని కేంద్రాలకు వేశారు. శనివారం ఉదయం థర్డ్ ఇయర్ విద్యార్థులకు ఇక్కడ పరీక్షలు జరిగాయి. శంకరానంద డిగ్రీ కాలేజికి చెందిన 132 మంది థర్డ్ ఇయర్ బీకాం జనరల్ విద్యార్థులు ఆప్షనల్ సబ్జెక్ట్ అయిన ఇన్సూరెన్స్ సబ్జెక్టు పరీక్ష రాయాల్సి ఉంది. అయితే ప్రభుత్వ డిగ్రీ కాలేజిలో రాసిన 130 మంది, శ్రీశైల భ్రమరాంబిక మహిళా డిగ్రీ కాలేజిలో రాసిన ఇద్దరు విద్యార్థులకు ఇన్సూరెన్స్ ప్రశ్నాపత్రానికి బదులు అడ్వాన్స్ కార్పొరేట్ అకౌంట్స్ పేపర్‌ను అందజేశారు. పరీక్ష పత్రం తారుమారైందని విద్యార్థులు ఇన్విజిలేటర్ల దృష్టికి తీసుకెళ్లారు. వీరు రాయాల్సిన ప్రశ్నపత్రం అసలు రాలేదని అధికారులు తెలుసుకున్నారు. విషయాన్ని ప్రభుత్వ డిగ్రీ కాలేజి ప్రిన్సిపల్ జ్ఞానేశ్వర్ ఎస్కేయూ యూజీ ఎగ్జామినేషన్స్ డీన్, డీప్యూటీ రిజిస్ట్రార్ల దృష్టికి తీసుకె ళ్లారు. వర్సిటీ అధికారులు ప్రశ్నపత్రాన్ని గంటన్నర తర్వాత కాలేజీ ఈ-మెయిల్ అడ్రస్‌కు పంపారు. దీనిని డౌన్లోడ్ చేసి విద్యార్థులకు అందజేసి పరీక్ష నిర్వహించాలని ఆదేశించారు. శ్రీశైల భ్రమరాంబిక డిగ్రీ కాలేజి పరీక్ష కేంద్రంలో నిర్వాహకులు ప్రశ్నపత్రాన్ని డౌన్లోడ్ చేసుకుని ఇద్దరు విద్యార్థులతో పరీక్ష రాయించారు. అయితే ప్రభుత్వ డిగ్రీ కాలేజీ పరీక్ష కేంద్రంలో అప్పటికే 130 విద్యార్థులు ఆన్సర్‌షీట్లను ఇన్విజిలేటర్లకు ఇచ్చేసి బయటికి వచ్చేశారు. పరీక్ష రాసేందుకు మరింత సమయాన్ని కేటాయిస్తామని, పరీక్షకు హాజరుకావాలని విద్యార్థులకు ప్రిన్సిపల్ సూచించారు. అయితే మధ్యాహ్నం తాము తిరిగి సప్లిమెంటరీ పరీక్ష రాయాల్సి ఉందని, ఆ పరీక్ష ఎలా రాయాలని వారు ప్రిన్సిపల్‌తో గొడవకు దిగారు. తమకు న్యాయం చేయాలని అరగంట పాటు బైఠాయించారు. ప్రిన్సిపల్ వెంటనే డిప్యూటీ రిజిస్ట్రార్ నాయక్‌తో మాట్లాడారు. ఇన్సూరెన్స్ పరీక్షను మళ్లీ నిర్వహిస్తామని, ఆ తేదీని పత్రికల ద్వారా ప్రకటిస్తామని హామీ ఇవ్వడంతో వారు ఆందోళన విరమించారు. ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి ఆంజనేయులు, డివిజన్ అధ్యక్ష, కార్యదర్శులు మహేష్, అబ్దుల్‌బాసిద్, టీఎన్ఎస్ఎఫ్ నాయకులు రంగా, శివ పరీక్షను మళ్లీ నిర్వహించాలని పట్టుబట్టారు. మా తప్పేమీ లేదు.. యూజీ పరీక్షల విభాగం అధికారులు ఇన్సూరెన్స్ ప్రశ్నపత్రాన్ని మాకు పంపలేదు. గతంలో అయితే ఫలానా విద్యార్థి ఈ పరీక్ష రాస్తున్నాడు..ఆ సబ్జెక్టుకు సంబంధించి ప్రశ్నపత్రాలు ఇన్ని పంపాలని ఇండెంట్ పెట్టేవాళ్లం. కానీ ఇప్పుడంతా ఆన్లైన్. ఇందులో తమ తప్పేమీ లేదు. విద్యార్థులెవ్వరూ ఆందోళన చెందనక్కర్లేదు. పరీక్షను తిరిగి నిర్వహిస్తామని యూనివర్సిటీ అధికారులు హామీ ఇచ్చారు - డాక్టర్ జ్ఞానేశ్వర్, ప్రభుత్వ డిగ్రీ కాలేజి ప్రిన్సిపల్ -
ఈసారీ జంబ్లింగ్ వాయిదా
ఇంటర్ ప్రాక్టికల్ పరీక్షలు ఏ కాలేజీకి ఆ కాలేజీలోనే.. ఉన్నత స్థాయి సమీక్షలో నిర్ణయం {పైవేటు యాజమాన్యాల ఒత్తిడే కారణమా? హైదరాబాద్: ఇంటర్మీడియట్ ప్రాక్టికల్ పరీక్షల్లో జంబ్లింగ్ విధానం అమలు చేయవద్దని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. సోమవారం సచివాలయంలో ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి అధ్యక్షతన జరిగిన సమీక్షలో ఈ నిర్ణయం తీసుకున్నారు. దీంతో వచ్చే ఫిబ్రవరి 3 నుంచి 24వ తేదీ వరకు ఈ ప్రాక్టికల్ పరీక్షలను ఏ కాలేజీ విద్యార్థులకు ఆయా కాలేజీల్లోనే నిర్వహిస్తారు. ఇంటర్ ప్రాక్టికల్ పరీక్షల నిర్వహణలో జంబ్లింగ్ విధానం అమ లు చేస్తామని, ఒక కాలేజీ విద్యార్థులకు ఆ కాలేజీలో కాకుండా వేరే కాలేజీలో నిర్వహించే లా (ప్రాక్టికల్ పరీక్ష కేంద్రాల జంబ్లింగ్) చర్యలు చేపడతామని ఏటా విద్యాశాఖ మంత్రులు ముందుగా ప్రకటిస్తూనే ఉన్నారు. కార్పొరేట్, ప్రైవేటు విద్యా సంస్థల ఒత్తిడి తలొగ్గి జంబ్లింగ్ అమలు వాయిదా వేస్తూనే ఉన్నారు. 2014, 2015 వార్షిక పరీక్షల సమయంలో ఇదే జరిగింది. తాజాగా ఈ సారి కూడా జంబ్లింగ్ అమలును వాయిదా వేశారు. దీంతో కార్పొరేట్, ప్రైవేటు విద్యా సంస్థలు తమ విద్యార్థులకు ఇష్టారాజ్యంగా ప్రాక్టికల్ మార్కులు వేసుకునే అవకాశం ఉంది. అయితే ప్రభుత్వ, ప్రైవేటు కాలేజీల మధ్య పోటీ వాతావరణంలో విద్యార్థులు నష్టపోయే పరిస్థితి ఉన్నందున జంబ్లింగ్‌ను వాయిదా వేసినట్లు కడియం శ్రీహరి పేర్కొన్నారు. ఒక్క మార్కు తేడాతోనూ ఎంసెట్‌లో ర్యాంకులు మారిపోయే పరిస్థితి ఉందన్నారు. ప్రభుత్వ విద్యార్థులకు నష్టం వాటిల్లే ప్రమాదముండడంతోపాటు ప్రైవేటు యాజమాన్యాలు కూడా జంబ్లింగ్‌ను వాయిదా వేయాలని కోరడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. -
ఇక ముందుగానే గుర్తింపు
* అఫిలియేషన్లపై జేఎన్టీయూహెచ్ ఇన్చార్జి వీసీ శైలజారామయ్యార్ * వచ్చే ఏడాది నుంచి అమలుకు చర్యలు * అఫిలియేషన్ల ప్రక్రియను నిష్పక్షపాతంగా వ్యవహరించాం * తనిఖీ బృందాలను జంబ్లింగ్ విధానంలో ఎంపిక చేశాం సాక్షి, హైదరాబాద్: వచ్చే ఏడాది నుంచి కాలేజీలకు అనుబంధ గుర్తింపు ఇచ్చే ప్రక్రియను ముందుగానే పూర్తి చేసేందుకు చర్యలు చేపడతామని జేఎన్టీయూహెచ్ ఇన్చార్జి వైస్ చాన్స్‌లర్ శైలజారామయ్యార్ వెల్లడించారు. వీలైతే మే నెలలోనే ఇది పూర్తయ్యేలా చూస్తామన్నారు. శుక్రవారం ఉన్నత విద్యా మండలి కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడారు. కాలేజీలకు అనుబంధ గుర్తింపు ఇచ్చే విషయంలో ఎలాంటి తప్పిదాలకు అవకాశం లేదని, జేఎన్‌టీయూహెచ్‌పై వస్తున్న కథనాలు అవాస్తమని స్పష్టంచేశారు. లోపాలపై కాలేజీలకూ ఒకటికి రెండుసార్లు తెలిపి సరిదిద్దుకోవాలని చెప్పామన్నారు. సరిదిద్దుకున్న కాలేజీలు, కోర్సులకు గుర్తింపు ఇచ్చామన్నారు. గుర్తింపు పొందిన కాలేజీల జాబితాలను వెబ్సైట్లో ఉంచామన్నారు. ఒక కాలేజీకి సీట్లు పెంచడం, మరో కాలేజీకి తగ్గించడమేమీ లేదని, నిబంధనలు, తనిఖీల నివేదికల ప్రకారమే గుర్తింపు ఇచ్చామన్నారు. తనిఖీ బృందాలను, కాలేజీలనూ జంబ్లింగ్ విధానంలో ఎంపిక చేశామన్నారు. అఫిలియేషన్లూ ఆన్లైన్లోనే: రమణరావు వచ్చే ఏడాది నుంచి అఫిలియేషన్ల ప్రక్రియనూ ఆన్లైన్లోనే చేపడతామని జేఎన్టీయూ రిజిస్ట్రార్ ఎన్వీ రమణరావు తెలిపారు. వచ్చే ఏడాది నుంచి తనిఖీ బృందాల నివేదికలను ఆన్లైన్లో పెట్టి, ఆ అంశాల ఆధారంగానే ఆన్లైన్లోనే గుర్తింపు ఇవ్వడం, లేదా నిరాకరించడం చేసేలా ఏర్పాట్లు చేస్తున్నామన్నారు.