డిగ్రీ పరీక్షల్లో జోరుగా మాస్ కాపీయింగ్
► జంబ్లింగ్ విధానంలో లోపించిన పారదర్శకత
► ఇప్పటికే 59 మంది విద్యార్థుల డీబార్
ఎస్కేయూ: డిగ్రీ పరీక్షల్లో జోరుగా మాస్‌కాపీయింగ్ సాగుతోందనడానికి ఇప్పటి వరకూ 59 మంది విద్యార్థులు డీబార్ అయిన విషయమే ఉదాహరణ. మాస్‌కాపీయింగ్‌కు అడ్డుకట్ట వేయాలనే ఉద్దేశంతో ప్రవేశపెట్టిన జంబ్లింగ్ విధానం పారదర్శకంగా అమలు కావడం లేదనే విమర్శలు ఉన్నాయి. కట్టుదిట్టంగా పరీక్షలు నిర్వహిస్తే విద్యార్థులు గణనీయంగా ఫెయిల్ కావడంతో పాటు అడ్మిషన్లు తగ్గుతాయనే ఉద్దేశంతో ప్రయివేటు అనుబంధ కళాశాలలు యాజమాన్యాలు సమ్మతించలేదు.
అయితే ప్రభుత్వ డిగ్రీ కళాశాలల అధ్యాపకులు జంబ్లింగ్ విధానంలో ప్రవేశపెట్టకపోతే డిగ్రీ కళాశాలల్లో అడ్మిషన్లు కనుమరుగు అవుతాయని ఎస్కేయూ యాజమాన్యం వద్ద ఏకరువు పెట్టారు. దీంతో ఎట్టకేలకు జంబ్లింగ్ విధానాన్ని అమలు పరిచారు.
నిర్వాహణ లోపం...
పరీక్షల్లో ఒక ప్రశ్నాపత్రానికి బదులు మరో ప్రశ్నపత్రం పంపడం, జవాబు పత్రాలు కొరత, అనుబంధ కళాశాలలకు సమాచార లోపం, తదితర అంశాలు నిర్వాహణలోపాన్ని ఎత్తిచూపుతున్నాయి. ఫలితంగా యూజీ ఉద్యోగుల పనితీరుపై బహిరంగ విమర్శలు వస్తున్నా యి. యూజీ పరీక్షల వ్యవహారం పూర్తిగా గాడి తప్పింది. దీనిపై యాజమాన్యం సరైన స్థాయిలో స్పం దించడంలేదని, చాలా తేలిగ్గా తీసుకుంటోందనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. గతంలో జరిగిన పరీక్షలకు గైర్హాజరైన వారిని ఉత్తీర్ణత చేయడం, పాస్ అయిన వారిని ఫెయిల్ చేయడం, ఎవరి మార్కులు ఎవరికి కలిపారో తెలియని అనిశ్చితి, తదితర ఘటనలపై విచారణ చేసిన కమిటీలు బాధ్యులపై చర్యలు తీసుకోవాలని చేసిన సిఫార్సులు బుట్టదాఖలయ్యాయి.
డిగ్రీ రెండో సెమిస్టర్ పరీక్షల్లోనూ అదేతీరు
డిగ్రీ రెండో సెమిస్టర్ పరీక్షలు గురువారం ప్రారంభమయ్యూరుు. ఈ పరీక్షల్లోనూ మాస్ కాపీరుుంగ్ తీరు జోరుగా సాగుతోంది. గురువారం జరిగిన పరీక్షల్లో ఏడుగురు విద్యార్థులు డీబార్ అయ్యూరు.
పేరుకే జంబ్లింగ్ విధానం ..
ఈ పద్ధతిలో ఒక కళాశాలలోని విద్యార్థులను , మరో కళాశాలకు కాకుండా పలు కళాశాలలకు విభజించి పరీక్ష కేంద్రాలకు పంపాలి. కానీ ఇక్కడ అందుకు భిన్నంగా అమలు చేస్తున్నారు. ఒక కళాశాలల్లోని విద్యార్థులను మరొక కళాశాలలకు మూకుమ్మడిగా పంపుతున్నారు. దీంతో ఇరువురు కళాశాల యాజమాన్యాలు పరస్పర సహకారంతో మాస్‌కాపీయింగ్‌కు యథేచ్ఛగా ప్రోత్సహిస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి.