Degree Examinations
-
ఓయూ పరీక్షలు వాయిదా..
ఉస్మానియా విశ్వవిద్యాలయం: ఈ నెల 14, 15 తేదీల్లో జరగాల్సిన డిగ్రీ, ఇతర కోర్సుల పరీక్షలను వాయిదా వేసినట్లు ఉస్మానియా విశ్వవిద్యాలయ కంట్రోలర్ ప్రొఫెసర్ శ్రీరామ్ వెంకటేశ్ మంగళవారం ఓ ప్రకటనలో తెలిపారు. వర్షాల నేపథ్యంలో పరీక్షలు వాయిదా వేసినట్లు, ఈ పరీక్షలను తిరిగి నిర్వహించే తేదీలను త్వరలో ప్రకటిస్తామని వెల్లడించారు. అయితే ఈ నెల 16వ తేదీ నుంచి జరిగే పరీక్షలు యథావిధిగా కొనసాగుతాయని స్పష్టం చేశారు. -
రోజుకు 3 పరీక్షలు
సాక్షి, హైదరాబాద్: కరోనా నేపథ్యంలో భౌతిక దూరం పాటిస్తూ డిగ్రీ పరీక్షల నిర్వహణపై ఉన్నత విద్యా మండలి కసరత్తు ప్రారంభించింది. మండలి చైర్మన్ ప్రొఫెసర్ తుమ్మల పాపిరెడ్డి అధ్యక్షతన వైస్ చైర్మన్లు ప్రొఫెసర్ ఆర్.లింబాద్రి, ప్రొఫెసర్ వెంకటరమణ, కార్యదర్శి శ్రీనివాసరావు గురువారం సమా వేశమయ్యారు. పరీక్షల నిర్వహణ ఎలా ఉండాలన్న విషయంపై చర్చించారు. ముం దుగా ఫైనల్ సెమిస్టర్ విద్యార్థులకే పరీక్షలు నిర్వహించాలని, భౌతిక దూరం పాటిం చేలా, విద్యార్థులు ఇబ్బందులు పడకుండా రోజుకు మూడు పరీక్షలు నిర్వహించాలన్న ఆలోచనకు వచ్చింది. ఉదయం, మధ్యా హ్నం, సాయంత్రంలోగా రెండు గంటలకో పరీక్ష నిర్వహించేలా చర్యలు చేపట్టాలని నిర్ణయించింది. ఫైనల్ సెమిస్టర్ విద్యార్థుల పరీక్షలు నిర్వహించాక, వెనువెంటనే ద్వితీయ, ప్రథమ సంవత్సరాలకు సెమిస్టర్, బ్యాక్లాగ్ పరీక్షలను నిర్వహించాలన్న నిర్ణ యానికి వచ్చింది. దీనిపై సమగ్ర ప్రణా ళికతో త్వరలోనే వర్సిటీలకు స్పష్టమైన ఆదే శాలు జారీ చేయాలని భావిస్తోంది. జూన్ 20 నుంచి వర్సిటీలు పరీక్షలను నిర్వహించాలని, పరీక్ష సమయాన్ని రెండు గంటలకే తగ్గించాలని, డిటెన్షన్ రద్దు చేసి విద్యార్థులందరినీ పై సెమిస్టర్‌కు ప్రమోట్ చేయాలని ఇదివరకే విద్యామండలి ఆదేశించింది. అందుకు అనుగుణంగా వర్సిటీలు కసరత్తు చేస్తున్నాయి. పరీక్షలు ఒకేసారి నిర్వహిస్తే భౌతిక దూరం పాటించడం సమస్యగా మారుతుందని గురుకుల విద్యాలయాల కార్యదర్శి లేఖ రాయగా దానిపైనా చర్చించారు. -
సీబీసీఎస్ అమలులో గందరగోళం
సాక్షి, హైదరాబాద్: డిగ్రీలో చాయిస్ బేస్డ్ క్రెడిట్ సిస్టం (సీబీసీఎస్) నిర్వహించడంలో వైస్ చాన్స్లర్లు అనుసరిస్తున్న ఇష్టారాజ్య విధానాలు విద్యార్థులను గందరగోళంలో పడేస్తున్నాయి. ఫలితంగా కొన్ని యూనివర్సిటీల్లో ఇంకా డిగ్రీ వార్షిక పరీక్షలు కొనసాగుతుండగా మరికొన్ని యూనివర్సిటీల్లో కొత్త విద్యా సంవత్సరం ప్రారంభించేందుకు చర్యలు మొదలు పెట్టాయి. కొన్ని యూనివర్సిటీలు అయితే ఇటు పరీక్షలు నిర్వహిస్తూనే.. అటు కొత్త విద్యా సంవత్సర తరగతుల ప్రారంభానికి ప్రకటనలు చేస్తుండటంతో విద్యార్థుల్లో గందరగోళం నెలకొంది. గత విద్యా సంవత్సరంలో సీబీసీఎస్ అమలులో వైఫల్యం కారణంగానే డిగ్రీ పరీక్షలు మే నెలలో మొదలై ఇప్పటికీ పూర్తి కాకుండా జూలై వరకు కొనసాగించే పరిస్థితి నెలకొంది. ఉస్మానియాలో జూలై 8వ తేదీ వరకు, కాకతీయలో జూలై 2 వరకు, తెలంగాణ విశ్వవిద్యాలయంలో జూలై 6 వరకు, పాలమూరు వర్సిటీలో జూన్ 29 వరకు, శాతవాహన వర్సిటీలో జూన్ 24 వరకు, మహాత్మాగాంధీ విశ్వవిద్యాలయంలో జూన్ 22వ తేదీ వరకు 2018–19 విద్యా సంవత్సర డిగ్రీ వార్షిక పరీక్షలు జరగనున్నాయి. ఈ పరీక్షలు పూర్తి కాకుండానే డిగ్రీ ద్వితీయ, తృతీయ సంవత్సర విద్యార్థులకు శాతవాహన, కాకతీయ, ఉస్మానియా, మహా త్మాగాంధీ విశ్వవిద్యాలయాలు జూన్ 17వ తేదీ నుంచి, పాలమూరు విశ్వవిద్యాలయం జూన్ 19వ తేదీ నుంచి, తెలంగాణ వర్సిటీ 26వ తేదీ నుంచి ఈ విద్యా సంవత్సరాన్ని ప్రారంభిస్తున్నట్టు ప్రకటించాయి. దీంతో విద్యార్థులే కాదు.. అధ్యాపకుల్లోనూ గందరగోళం నెలకొంది. విద్యార్థుల్లో అయోమయం.. ఓవైపు పరీక్షలు పూర్తి కాకుండానే యూనివర్సిటీలు మరుసటి విద్యాసంవత్సరం ప్రారంభించబోతున్నట్టు ప్రకటించడం చూసి విద్యార్థులు తీవ్ర అయోమయానికి గురవుతున్నారు. విశ్వవిద్యాలయ అధికారుల అసమర్థత వల్ల మండుటెండల్లో పరీక్షలు రాస్తున్న విద్యార్థులు అసలు పరీక్షలు పూర్తి కాకుండా తరగతులకు ఎలా హాజరవుతారని వారు ప్రశ్నిస్తున్నారు. ఒక విద్యాసంవత్సరం పూర్తి చేసి పరీక్షలు రాసిన విద్యార్థులకు కనీసం రెండు వారాలైనా సెలవులు ఉండాలని ఆ తర్వాతే తరగతులు ప్రారంభించాలని వారు కోరుతున్నారు. పరీక్షల నిర్వహణలో అసమర్థత వల్ల డిగ్రీ పూర్తి చేసిన విద్యార్థులు కేంద్రీయ విశ్వవిద్యాలయాల్లో పీజీ ఎంట్రన్స్ రాయలేకపోయారని, రాష్ట్ర స్థాయిలో నిర్వహించిన ఐసెట్, లాసెట్ లాంటి పరీక్షలకు కూడా పూర్తిస్థాయిలో సన్నద్ధం కాలేకపోయామని, ఫలితంగా నష్టపోవాల్సి వచ్చిందని వాపోతున్నారు. ఈసారి అయినా పక్కా చర్యలు చేపట్టాలి కామన్ అకడమిక్ క్యాలెండర్ అన్ని యూనివర్సిటీల్లో అమలు చేసేలా చూడాలని ఉన్నత విద్యామండలిని మే మొదటి వారంలోనే తెలంగాణ ప్రభుత్వ కళాశాలల గెజిటెడ్ అధ్యాపక సంఘం కోరింది. అయినప్పటికీ ఉన్నత విద్యా మండలి పూర్తిస్థాయిలో శ్రద్ధ కనబరచడం లేదని సంఘం రాష్ట్ర అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు డాక్టర్ సంజీవయ్య, డాక్టర్ కె.సురేందర్‌రెడ్డి ఆరోపించారు. యూనివర్సిటీ అధికారులు కూడా నిర్ణయాలు తీసుకోవడంలో తమకు స్వేచ్ఛ ఉందని, ఎవరి విజ్ఞప్తులను పరిగణనలోకి తీసుకోవాల్సిన అవసరం లేదని నిర్లక్ష్య ధోరణి ప్రదర్శిస్తున్నారని వారు ఆరోపించారు. -
టీడీపీ గురించి రాయండి
ఎస్కేయూ: ఒక వైపు రాష్ట్రంలో ఎన్నికల కోడ్ అమలులో ఉంది. నిబంధనలకు విరుద్ధంగా ఎన్నికలను ప్రభావితం చేసేలా ఎవరు ప్రవర్తించినా కఠిన చర్యలు తీసుకుంటామని ఎన్నికల సంఘం హెచ్చరిస్తోంది. అయితే అనంతపురం ఆర్ట్స్ కళాశాల యాజమాన్యం ఎన్నికల నిబంధనలన్నీ పక్కన పెట్టింది. అటానమస్ హోదా ఉన్న ఆర్ట్స్ కళాశాలకు సొంతంగా ప్రశ్నపత్రాలను రూపకల్పన చేసుకునే అవకాశం ఉంది. ఈ క్రమంలో సోమవారం బీఏ రెండో ఏడాది, నాలుగో సెమిస్టర్, పొలిటికల్ సైన్స్ పరీక్షలో ఏకంగా ‘తెలుగుదేశం పార్టీ’ గురించి రాయమని అడిగారు. దీంతో విద్యార్థులు కంగుతిన్నారు. అధికార పార్టీ గురించి పరీక్షల్లో అడగటమేంటని నివ్వెరపోయారు. పరీక్ష అయిన తరువాత విద్యార్థులు ప్రశ్నపత్రాన్ని సోషల్‌మీడియాలో పోస్ట్ చేశారు. అధికార పార్టీకి ఇంత దాసోహం అవసరమా? అంటూ నెటిజన్లు విమర్శలు గుప్పించారు. బాధ్యతగల అధ్యాపకులు ఇలా ఓ పార్టీ వైపు యువతను ప్రేరేపించే విధంగా ప్రశ్నలు ఎలా అడుగుతారని ప్రశ్నిస్తున్నారు. యథేచ్ఛగా ఎన్నికల కోడ్‌ను ఉల్లంఘిస్తూ ప్రశ్నలు అడిగారని విద్యార్థులు బాహాటంగా విమర్శిస్తున్నారు. -
ప్రయాణమే పరీక్ష!
ఆళ్లగడ్డ: జిల్లాలో ప్రభుత్వ, ఎయిడెడ్, ప్రైవేటు డిగ్రీ కళాశాలలు 110 ఉన్నాయి. ఈ నెల 23 నుంచి డిగ్రీ సెమిస్టర్ –3, సెమిస్టర్ – 5 పరీక్షలు ప్రారంభమవుతున్నాయి. సుమారు 15 వేల మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నారు. అయితే, జంబ్లింగ్ పేరుతో వారికి కిలోమీటర్ల కొలది దూరంలో పరీక్ష కేంద్రాలను కేటాయించారు. చదివే కళాశాలకు పరీక్ష కేంద్రాలు సుమారు 30 నుంచి 70 కి.మీ దూరంలో ఉన్నాయి. అక్కడికి చేరుకోవాలంటే రెండు నుంచి మూడు బస్సులు ఎక్కి దిగాలి. మరి కొన్నింటికి బస్సు సౌకర్యాలు లేవు. ఈ ఇబ్బందులను పరిగణనలోకి తీసుకోకుండా అధికారులు సుదూర ప్రాంతాల్లోని పరీక్షా కేంద్రాలు కేటాయించడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అధికారుల నిర్వాకం..విద్యార్థులకు శాపం డిగ్రీ చదివేవారిలో అనేక మంది గృహిణులు, దివ్యాంగులు, బాలికలు ఉన్నారు. సుమారు 15 రోజుల పాటు ఉదయం 9 గంటలకే సుదూర ప్రాంతాల్లోని కేంద్రాలకు వెళ్లి పరీక్షలు రాయడం వారికి కష్టమవుతుంది. కొన్ని మండలాల్లో డిగ్రీ కళాశాలలు లేకున్నా ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో కేంద్రాలను కేటాయించారు. మరి కొన్న చోట్ల ప్రభుత్వ జూనియర్ కళాశాలలు ఉన్నప్పటికీ డిగ్రీ కళాశాలలు లేవని సాకు చూపుతూ సుదూర ప్రాంతాలకు పంపుతున్నారు. ఇటువంటి చర్యలతో రానున్న కాలంలో డిగ్రీ విద్యకు బాలికలు, వివాహితలు దూరమయ్యే పరిస్థితి నెలకొంది. రాయలసీమ యూనివర్సిటీ అ«ధికారులు స్పందించి దగ్గరలోని కేంద్రాల్లో పరీక్ష రాసే అవకాశం కల్పించాలని విద్యార్థులు, వారి తల్లిదండ్రులు కోరుతున్నారు. అంతదూరం ఎలా వెళ్లేది? జంబ్లింగ్ పేరుతో పరీక్ష కేంద్రం ఆదోనికి కేటాయించారు. మా ఊరు నుంచి అక్కడికి వెళ్లాలంటే సుమారు 30 కి.మీ. వెళ్లాలి. ఉదయం 9 గంటలకే పరీక్ష. అక్కడికి వెళ్లేందుకు బస్సులే ఉండవు. ఆటోల్లో అంత దూరం రోజు వెళ్లి పరీక్షలు రాసి రావడం చాల కష్టం. అందుకే ఇంట్లో వాళ్లు పరీక్షలు రాయొద్దు అంటున్నారు. వరలక్ష్మి, డిగ్రీ ద్వితీయ సంవత్సరం, హŸళగుంద మూడు బస్సులు మారాలి: ఇంటర్ తర్వాత పై చదువులు వద్దు అని కుటుంబ సభ్యులు అడ్డుచెప్పినా పక్క గ్రామంలోనే కదా డిగ్రీ కళాశాల అని చెప్పడంతో సరే అని చేర్పించారు. ఇప్పుడు మా ఊరికి 45 కి. మీ. దూరంలోని ఎర్రగుంట్లలో పరీక్ష కేంద్రం ఇచ్చారు. అక్కడికి పోవాలంటే మూడు బస్సులు మారాలి. రోజు అంతదూరం వెళ్లి రావాలంటే మాలాంటికి వారికి ఇబ్బందే. అధికారులు స్పందించి సమీపంలో కేంద్రాన్ని కేటాయిస్తే బాగుంటుంది. కల్పన, విద్యార్థిని, ఆలమూరు నిబంధనల ప్రకారమే కేటాయించాం ఆళ్లగడ్డ చుట్టపక్కల కళాశాలల్లో చదువుతున్న అభ్యర్థులకు ఆళ్లగడ్డ పట్టణంలో పరీక్ష కేంద్రం కేటాయించేందుకు ప్లేస్ చాలడం లేదు. అందుకే నంద్యాల, ఎర్రగుంట్ల లో కేంద్రాలు కేటాయించాం. పరీక్ష కేంద్రాలకు వెళ్లేందుకు ఇబ్బందిగా ఉంటే విచారించి మార్చేందుకు చర్యలు తీసుకుంటాం. – వెంకటేశ్వర్లు, రాయలసీమ యూనివర్సిటీ పరీక్షల నిర్వహణాధికారి -
డిగ్రీ పరీక్షల్లో జోరుగా మాస్ కాపీయింగ్
► జంబ్లింగ్ విధానంలో లోపించిన పారదర్శకత ► ఇప్పటికే 59 మంది విద్యార్థుల డీబార్ ఎస్కేయూ: డిగ్రీ పరీక్షల్లో జోరుగా మాస్‌కాపీయింగ్ సాగుతోందనడానికి ఇప్పటి వరకూ 59 మంది విద్యార్థులు డీబార్ అయిన విషయమే ఉదాహరణ. మాస్‌కాపీయింగ్‌కు అడ్డుకట్ట వేయాలనే ఉద్దేశంతో ప్రవేశపెట్టిన జంబ్లింగ్ విధానం పారదర్శకంగా అమలు కావడం లేదనే విమర్శలు ఉన్నాయి. కట్టుదిట్టంగా పరీక్షలు నిర్వహిస్తే విద్యార్థులు గణనీయంగా ఫెయిల్ కావడంతో పాటు అడ్మిషన్లు తగ్గుతాయనే ఉద్దేశంతో ప్రయివేటు అనుబంధ కళాశాలలు యాజమాన్యాలు సమ్మతించలేదు. అయితే ప్రభుత్వ డిగ్రీ కళాశాలల అధ్యాపకులు జంబ్లింగ్ విధానంలో ప్రవేశపెట్టకపోతే డిగ్రీ కళాశాలల్లో అడ్మిషన్లు కనుమరుగు అవుతాయని ఎస్కేయూ యాజమాన్యం వద్ద ఏకరువు పెట్టారు. దీంతో ఎట్టకేలకు జంబ్లింగ్ విధానాన్ని అమలు పరిచారు. నిర్వాహణ లోపం... పరీక్షల్లో ఒక ప్రశ్నాపత్రానికి బదులు మరో ప్రశ్నపత్రం పంపడం, జవాబు పత్రాలు కొరత, అనుబంధ కళాశాలలకు సమాచార లోపం, తదితర అంశాలు నిర్వాహణలోపాన్ని ఎత్తిచూపుతున్నాయి. ఫలితంగా యూజీ ఉద్యోగుల పనితీరుపై బహిరంగ విమర్శలు వస్తున్నా యి. యూజీ పరీక్షల వ్యవహారం పూర్తిగా గాడి తప్పింది. దీనిపై యాజమాన్యం సరైన స్థాయిలో స్పం దించడంలేదని, చాలా తేలిగ్గా తీసుకుంటోందనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. గతంలో జరిగిన పరీక్షలకు గైర్హాజరైన వారిని ఉత్తీర్ణత చేయడం, పాస్ అయిన వారిని ఫెయిల్ చేయడం, ఎవరి మార్కులు ఎవరికి కలిపారో తెలియని అనిశ్చితి, తదితర ఘటనలపై విచారణ చేసిన కమిటీలు బాధ్యులపై చర్యలు తీసుకోవాలని చేసిన సిఫార్సులు బుట్టదాఖలయ్యాయి. డిగ్రీ రెండో సెమిస్టర్ పరీక్షల్లోనూ అదేతీరు డిగ్రీ రెండో సెమిస్టర్ పరీక్షలు గురువారం ప్రారంభమయ్యూరుు. ఈ పరీక్షల్లోనూ మాస్ కాపీరుుంగ్ తీరు జోరుగా సాగుతోంది. గురువారం జరిగిన పరీక్షల్లో ఏడుగురు విద్యార్థులు డీబార్ అయ్యూరు. పేరుకే జంబ్లింగ్ విధానం .. ఈ పద్ధతిలో ఒక కళాశాలలోని విద్యార్థులను , మరో కళాశాలకు కాకుండా పలు కళాశాలలకు విభజించి పరీక్ష కేంద్రాలకు పంపాలి. కానీ ఇక్కడ అందుకు భిన్నంగా అమలు చేస్తున్నారు. ఒక కళాశాలల్లోని విద్యార్థులను మరొక కళాశాలలకు మూకుమ్మడిగా పంపుతున్నారు. దీంతో ఇరువురు కళాశాల యాజమాన్యాలు పరస్పర సహకారంతో మాస్‌కాపీయింగ్‌కు యథేచ్ఛగా ప్రోత్సహిస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. -
పీజీ పరీక్షల్లో మాస్ కాపీయింగ్
► ప్రోత్సహిస్తున్న అనుబంధ కళాశాలల సిబ్బంది ► పల్లె కళాశాలలో అడ్డూఅదుపు లేని వైనం ఎస్కేయూ: డిగ్రీ పరీక్షల్లో మాస్ కాపీయింగ్‌ను ప్రోత్సహించిన అనుబంధ కళాశాలల యాజమాన్యాలు మరో అడుగు ముందుకు వేశారుు. తమ పరిధిని విస్తరించుకుని పీజీ పరీక్షల్లో సైతం బరితెగింపు ధోరణిలో మాస్ కాపీయింగ్‌ను అమలు చేస్తున్నారుు. మరోవైపు అనుబంధ పీజీ కళాశాలలు సిబ్బంది కూడా భారీ దందాకు తెరతీశారు. ఒక్కో విద్యార్థి నుంచి రూ.5 వేలు వసూలు చేసుకుని కాపీరుుంగ్కు సహకారం అందిస్తున్నారు. మంగళవారం ఎస్కేయూ క్యాంపస్ కళాశాలల్లో మాత్రం మెస్‌బిల్లులు, కోర్సు ఫీజులు విద్యార్థులు చెల్లించలేదని పరీక్ష నిలిచిపోయింది. అనుబంధ పీజీ కళాశాలల్లో మాత్రం మంగళవారం యథావిధిగా పరీక్షలు జరిగాయి. సెల్ఫ్ సెంటర్లలో ఇష్టారాజ్యం పీజీ అనుబంధ కళాశాలల్లోని విద్యార్థులను సమీపంలోని ప్రభుత్వ కళాశాలల్లోని పరీక్ష కేంద్రంలో పరీక్షలు నిర్వహించాల్సి ఉంది. అయితే సెల్ఫ్ సెంటర్ల పేరుతో అనుమతులు ఇవ్వడంతో చూచిరాత పరీక్షలను తలపించాయి. కదిరిలోని వివేకానంద పీజీ కళాశాల మంత్రి పల్లె రఘనాథరెడ్డికి చెందిన విద్యాసంస్థల్లో ఒకటి. ఇక్కడ మంగళవారం జరిగిన పీజీ నాలుగో సెమిస్టర్ పరీక్షలో విద్యార్థులు నేరుగా సెల్‌ఫోన్ నుంచి మెటీరియల్‌ను డౌన్లోడ్ చేసుకొని రాసుకున్నారు. మరికొంత మంది పుస్తకాలను చూసి చూచిరాత పరీక్షలు రాశారు. ఎస్కేయూ పరీక్షల అధికారులు రెండు తనిఖీ బృందాలను నియమించినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. కళాశాలకు రానక్కర్లేదు ఎస్కేయూ అనుబంధ పీజీ సెంటర్లలో ఇష్టానుసారంగా విధానాలు అమలుచేస్తున్నా, ప్రశ్నించేవారు కరువయ్యారు. అడ్మిషన్ పొందినప్పటి నుంచి విద్యార్థి ఏ ఒక్క రోజు కళాశాలకు రావాల్సిన అవసరం ఉండదు. నేరుగా పరీక్షలకు హాజరై కళాశాలలు నిర్ధేశించిన మొత్తం కడితే విద్యార్థులు చూసిరాయడానికి కావలసిన అన్ని తతంగాలు నడిపిస్తారు. ప్రైవేటు అనుబంధ కళాశాలల్లో పీజీ కోర్సులు ఉన్నట్లు కూడా తెలియవంటే ఏ స్థాయిలో తరగతులు జరుగుతున్నాయో ..అర్థం చేసుకోవచ్చునని పరిశీలకులు అభిప్రాయ పడుతున్నారు. -
డిగ్రీ పరీక్షల్లో గందరగోళం
► ఇన్సూరెన్స్ ప్రశ్నపత్రానికి బదులు అడ్వాన్స్ కార్పొరేట్ అకౌంట్స్ పేపర్ ► పరీక్ష రాయని 130 మంది విద్యార్థులు గుంతకల్లు టౌన్: ఎస్కేయూ డిగ్రీ పరీక్షల్లో జంబ్లింగ్ విధానం ప్రవేశపెట్టడంతో శ్రీ శంకరానంద డిగ్రీ కాలేజి విద్యార్థులను ఎస్కేపీ ప్రభుత్వ, శ్రీశైల భ్రమరాంబిక మహిళా డిగ్రీ కళాశాల్లోని కేంద్రాలకు వేశారు. శనివారం ఉదయం థర్డ్ ఇయర్ విద్యార్థులకు ఇక్కడ పరీక్షలు జరిగాయి. శంకరానంద డిగ్రీ కాలేజికి చెందిన 132 మంది థర్డ్ ఇయర్ బీకాం జనరల్ విద్యార్థులు ఆప్షనల్ సబ్జెక్ట్ అయిన ఇన్సూరెన్స్ సబ్జెక్టు పరీక్ష రాయాల్సి ఉంది. అయితే ప్రభుత్వ డిగ్రీ కాలేజిలో రాసిన 130 మంది, శ్రీశైల భ్రమరాంబిక మహిళా డిగ్రీ కాలేజిలో రాసిన ఇద్దరు విద్యార్థులకు ఇన్సూరెన్స్ ప్రశ్నాపత్రానికి బదులు అడ్వాన్స్ కార్పొరేట్ అకౌంట్స్ పేపర్‌ను అందజేశారు. పరీక్ష పత్రం తారుమారైందని విద్యార్థులు ఇన్విజిలేటర్ల దృష్టికి తీసుకెళ్లారు. వీరు రాయాల్సిన ప్రశ్నపత్రం అసలు రాలేదని అధికారులు తెలుసుకున్నారు. విషయాన్ని ప్రభుత్వ డిగ్రీ కాలేజి ప్రిన్సిపల్ జ్ఞానేశ్వర్ ఎస్కేయూ యూజీ ఎగ్జామినేషన్స్ డీన్, డీప్యూటీ రిజిస్ట్రార్ల దృష్టికి తీసుకె ళ్లారు. వర్సిటీ అధికారులు ప్రశ్నపత్రాన్ని గంటన్నర తర్వాత కాలేజీ ఈ-మెయిల్ అడ్రస్‌కు పంపారు. దీనిని డౌన్లోడ్ చేసి విద్యార్థులకు అందజేసి పరీక్ష నిర్వహించాలని ఆదేశించారు. శ్రీశైల భ్రమరాంబిక డిగ్రీ కాలేజి పరీక్ష కేంద్రంలో నిర్వాహకులు ప్రశ్నపత్రాన్ని డౌన్లోడ్ చేసుకుని ఇద్దరు విద్యార్థులతో పరీక్ష రాయించారు. అయితే ప్రభుత్వ డిగ్రీ కాలేజీ పరీక్ష కేంద్రంలో అప్పటికే 130 విద్యార్థులు ఆన్సర్‌షీట్లను ఇన్విజిలేటర్లకు ఇచ్చేసి బయటికి వచ్చేశారు. పరీక్ష రాసేందుకు మరింత సమయాన్ని కేటాయిస్తామని, పరీక్షకు హాజరుకావాలని విద్యార్థులకు ప్రిన్సిపల్ సూచించారు. అయితే మధ్యాహ్నం తాము తిరిగి సప్లిమెంటరీ పరీక్ష రాయాల్సి ఉందని, ఆ పరీక్ష ఎలా రాయాలని వారు ప్రిన్సిపల్‌తో గొడవకు దిగారు. తమకు న్యాయం చేయాలని అరగంట పాటు బైఠాయించారు. ప్రిన్సిపల్ వెంటనే డిప్యూటీ రిజిస్ట్రార్ నాయక్‌తో మాట్లాడారు. ఇన్సూరెన్స్ పరీక్షను మళ్లీ నిర్వహిస్తామని, ఆ తేదీని పత్రికల ద్వారా ప్రకటిస్తామని హామీ ఇవ్వడంతో వారు ఆందోళన విరమించారు. ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి ఆంజనేయులు, డివిజన్ అధ్యక్ష, కార్యదర్శులు మహేష్, అబ్దుల్‌బాసిద్, టీఎన్ఎస్ఎఫ్ నాయకులు రంగా, శివ పరీక్షను మళ్లీ నిర్వహించాలని పట్టుబట్టారు. మా తప్పేమీ లేదు.. యూజీ పరీక్షల విభాగం అధికారులు ఇన్సూరెన్స్ ప్రశ్నపత్రాన్ని మాకు పంపలేదు. గతంలో అయితే ఫలానా విద్యార్థి ఈ పరీక్ష రాస్తున్నాడు..ఆ సబ్జెక్టుకు సంబంధించి ప్రశ్నపత్రాలు ఇన్ని పంపాలని ఇండెంట్ పెట్టేవాళ్లం. కానీ ఇప్పుడంతా ఆన్లైన్. ఇందులో తమ తప్పేమీ లేదు. విద్యార్థులెవ్వరూ ఆందోళన చెందనక్కర్లేదు. పరీక్షను తిరిగి నిర్వహిస్తామని యూనివర్సిటీ అధికారులు హామీ ఇచ్చారు - డాక్టర్ జ్ఞానేశ్వర్, ప్రభుత్వ డిగ్రీ కాలేజి ప్రిన్సిపల్ -
ఆరోపణలు ఉన్నా...
► రెగ్యులర్ రిజిస్ట్రార్ గా శివశంకర్ ► వీసీ కనుసన్నల్లోనే నియామకం ► ఆగ్రహం వ్యక్తం చేస్తున్న విద్యార్థి సంఘాలు నెల్లూరు (టౌన్): వడ్డించేవాడు మనోడైతే బంతి చివర కూర్చొన్న అన్ని సమకూరతాయన్న చందంగా తయారైంది విక్రమ సింహపురి యూనివర్సిటీలో పరిస్థితి. ఇన్చార్జి రిజిస్ట్రార్ శివశంకర్‌పై అనేక అవినీతి ఆరోపణలు వెలువెత్తుతున్నా ఆయననే శాశ్వత రిజిస్ట్రారుగా నియమిస్తూ పాలకమండలి పచ్చజెండా ఊపింది. అధికార పార్టీ అండ కూడా తోడవ్వడంతో ఆయనకు ఎదురే లేకుండాపోయింది. రిజిస్ట్రార్ అంటే వర్సిటీలో గుమస్తా నుంచి ప్రొఫెసర్ల వరకు పొసగడం లేదు. పా లకమండలి నియామకంతోనైనా వర్సిటీ ప్రక్షాళన జరగుతుందని ఆశపడ్డ వారికి భంగపాటు తప్పడం లేదు. ఆక్కడ జరిగే పైరవీలకు వారు తలొగ్గారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఈనెల 14న వీఎస్‌యూ రిజిస్ట్రార్‌గా శివశంకర్‌ను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. దీంతో అవినీతి ఆరోపణలు ఉన్న వారిని రిజిస్ట్రార్‌గా నియమించి విద్యావ్యవస్థను అపహాస్యం చేస్తున్నారని విద్యార్థి సంఘాల నాయకులు మండిపడుతున్నారు. ఏది ఏమైనా రిజిస్ట్రార్ అవినీతిపై తమ ఉద్యమం ఆపేదిలేదని విద్యార్థి సంఘాలు స్పష్టం చేస్తున్నాయి. ఆరోపణలు ఎన్నో... వర్సిటీ ఇన్చార్జి రిజిస్ట్రార్‌గా శివశంకర్ హ యాం లో అవకతవకలు జరిగినట్లు ఆరోపణలు వెల్లువెత్తాయి. గతంలో డిగ్రీ పరీక్షల మూల్యాంకనం విషయంలో వర్సిటీ ఉద్యోగులు, రిజిస్ట్రార్ల మధ్య వివాదం నెలకొంది. వారంరోజులుగా పైగా విధులు బహిష్కరించి ఆందోళనలు నిర్వహించారు. ఇరువర్గాలతో ఎమ్మెల్సీ సోమిరెడ్డి, ఎమ్మెల్యే శ్రీధరరెడ్డిలు సంప్రదింపులు జరిపారు. రిజిస్ట్రార్ అవినీతిపై విచారణ జరిపించాలని లేఖ రాస్తానని వీసీ ఒప్పుకోవడంతో ఉద్యోగుల చేత ఆందోళన విరమింప చేశారు. నేటికీ లేఖ రాయలేదు. డిగ్రీ పరీక్షల నిర్వహణలో అవకతవకలతో పాటు కార్పొరేట్ కళాశాలల దగ్గర భారీగా వసూళ్లకు పాల్పడి ర్యాంకులు ఇచ్చారని విద్యార్థి సం ఘాలు ఆరోపిస్తున్నాయి. అప్పట్లో హడావుడిగా విచారణ సంఘాన్ని ఏర్పాటు చేశారు. కమిటీ నివేదిక ఇచ్చిన ప్రకారం రమణారెడ్డి, మురళీమోహన్, డిప్యూటీ రిజిస్ట్రార్లకు మెమోలు జారీచేశారు. రిజిస్ట్రార్ ఆదేశాలు ప్రకారం మాత్రమే చేశామని వారు చెప్పడంతో వెనక్కుతగ్గారు. డిగ్రీ మూల్యాంకనం విషయంలో రెండు కళాశాలలు అక్రమాలకు పాల్పడిట్లు ధ్రువీకరించారు. నేటికి వాటిపై చర్యలు లేవు. హాస్టల్ భోజ నం, క్రీడల నిధుల్లో రూ.40 లక్షల మేర రిజి స్ట్రార్ అవినీతికి పాల్పడ్డారంటూ విద్యార్థి సంఘాలు రోడ్డెక్కాయి. రిజిస్ట్రార్‌కు అనుకూలంగా పాలకమండలి రిజిస్ట్రార్ సొంతవారిని పాలకమండలిలో నియమించుకున్నారని విద్యార్థి నాయకులు ఆరోపిస్తున్నారు. పాలకమండలి సభ్యుడిగా నియమించా ల్సి వస్తుందని ప్రిన్సిపాల్ మురగయ్యను బదిలీ చేసి అనుకూలంగా ఉండే వెంకటరావును నియమించారన్న ఆరోపణలున్నాయి. రానున్నరోజు ల్లో పాలకమండలి అవినీతికి అండగా నిలుస్తుం దా లేక ప్రక్షాళన చేస్తుందాఅనేది వేచిచూడాల్సిందే. -
మాస్ కాపీయింగ్‌పై అప్రమత్తం
ఎచ్చెర్ల : డిగ్రీ పరీక్షల్లో మాస్ కాపీరుుంగ్ పట్ల ఆరోపణలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో పరిశీ లకులు అప్రమత్తంగా ఉండాలని డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ యూనివర్శిటీ ఎగ్జామినేషన్స్ డీన్ ప్రొఫెసర్ తమ్మినేని కామరాజు సూచించారు. వర్శిటీ పరీక్షల నిర్వహణ కార్యాలయంలో శుక్రవారం ఆయన మాట్లాడారు. ఈ నెల 17తో డిగ్రీ చివరి ఏడాది పరీక్షలు పూర్తవుతాయని తెలిపారు. ఈ నెల 21 నుంచి రెండో ఏడాది, మొదటి ఏడాది బ్యాక్లాగ్ విద్యార్థుల పరీక్షలు ప్రారంభమవుతాయని చెప్పారు. రెండో ఏడాది పరీక్షలకు 12,965 మంది హాజరు కానున్నారని, మొదటి సెమిస్టర్ ఇయర్ ఎండ్ బ్యాక్లాగ్ విద్యార్థులు 8437 మంది విద్యార్థులు హాజరు కానున్నారని తెలిపారు. ఆరోపణలు ఉన్న కేంద్రాలపై ప్రత్యేక నిఘా పెట్టామని చెప్పారు. ప్రత్యేక స్క్వాడ్ బృందాలు సైతం పరీక్ష కేంద్రాలను పర్యవేక్షిస్తున్నాయని పేర్కొన్నారు. -
మూల్యాంకనంలో న్యాయనిర్ణేతలుగా వ ్యవహరించాలి: కడారు వీరారెడ్డి
శాతవాహన యూనివర్సిటీ: మూల్యాంకనంలో న్యాయ నిర్ణేతలుగా వ్యవహరించాలని శాతవాహన వీసీ ఆచార్య కడారు వీరారెడ్డి అన్నారు. శాతవాహన యూనివర్సిటీ పరిధిలోని డిగ్రీ పరీక్షలు రాసిన విద్యార్థుల జవాబు పత్రాల మూల్యాంనం బుధవారం ఆయన ప్రారంభించారు. మూల్యాంకనం కోసం ఇచ్చిన సమయూన్ని అసిస్టెంట్ ఎగ్జామినర్స్, చీఫ్ ఎగ్జామినర్స్ విధిగా పాటించాలని అన్నారు. మార్కులు జమచేయడంలో, పేజీలు తప్పించి లెక్కిస్తే విద్యార్థులకు అన్యాయం జరుగుతుందని.. తప్పిదాలు జరగ కుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. సమయపాలన పాటించనివారిపై చర్యలు తప్పవని హెచ్చరించారు. అధ్యాపకులు చేసే మూల్యాంకనం విద్యార్థుల భవిష్యత్ అనే విషయాన్ని మరవరాదని అన్నారు. సెల్‌ఫోన్ మాట్లాడడం నిషేధమని చెప్పారు. అధిక మార్కులు సాధించడానికి కొందరు కోడ్స్, కొండ గుర్తులు వాడుతున్నట్లు గతంలో జరిగిందని.. అలాంటివి ఉంటే సంబంధిత పత్రాల గురించి కంట్రోలర్ దృష్టికి తీసుకెళ్లాలని సూచించారు. అలాంటి కళాశాలలపై కఠిన చర్యలకు వెనకాడమని అన్నారు. జిల్లాలోని అనేక మంది విద్యార్థులు గ్రామీణ ప్రాంతాలు, తెలుగు మాధ్యమం నుంచి వచ్చారని.. అలాంటి విద్యార్థులు రాసిన జవాబులను చదవాలని, పూర్తిగా పనికి రాని వాటిగా పరిగణించరాదని హితవు పలికారు. సీసీ కెమెరాల్లో మూల్యాంకన తీరును రికార్డు చేస్తున్నామన్నారు. మూల్యాంకన ప్రక్రియ పూర్తి అయ్యేవరకు సీసీ కెమెరాలు 24 గంటలు పని చేస్తాయని, అధ్యాపకులు జాగ్రత్తగా ఉండాలని అన్నారు. వర్సిటీ రిజిస్ట్రార్ ఆచార్య ఎం.కోమల్‌రెడ్డి, పరీక్షల నియంత్రణాధికారి ఆచార్య టి.భరత్, అదనపు పరీక్షల నియంత్రణాధికారి దాస్యం సేనాధిపతి పాల్గొన్నారు.