ఓ కార్పొరేట్ కాలేజీలో సిబ్బంది విద్యార్థులపై ఇష్టరీతిన వ్యవహరించారు.
గుంటూరు: ఓ కార్పొరేట్ కాలేజీలో సిబ్బంది ఇష్టరీతిన వ్యవహరించారు. పేరేచర్లలోని ప్రైవేట్ కాలేజీ విద్యార్థులు భోజనం బాగోలేదని ఫిర్యాదు చేసినందుకు సిబ్బంది వారిని చితకబాదారు. కాలేజీ సిబ్బంది దాడితో పలువురు విద్యార్థులకు గాయాలయ్యాయి. మేడికొండూరు పోలీసులను ఆశ్రయించి బాధిత విద్యార్థులు జరిగిన విషయంపై ఫిర్యాదుచేశారు.