నా చావుకు కళాశాల యాజమాన్యమే కారణం
=మలుపు తిరిగిన ఆత్మహత్య కేసు
=సూసైడ్‌నోట్‌లో విద్యార్థిని వేదన
పెనమలూరు, న్యూస్‌లైన్ : కానూరులోని ఓ కార్పొరేట్ కళాశాలలో నాలుగు రోజుల క్రితం విద్యార్థిని ఆత్మహత్య ఘటన మలుపు తిరిగింది. తన మరణానికి కారణం కాలేజీలో ఒత్తిడి, అనారోగ్యం అని పేర్కొంటూ ఆమె రాసిన సూసైడ్‌నోట్ గురువారం దొరికింది. దీనిపై న్యాయ వి చారణ చేయాలని మృతురాలి తండ్రి డిమాండ్ చేస్తున్నారు. కానూరులోని కార్పొరేట్ కళాశాలలో ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతున్న గుత్తికొండ విద్య ఈ నెల 23న ఉరివేసుకుని మృ తి చెందింది. చిల్లకల్లులో ఉంటున్న తల్లిదండ్రుల వద్ద నుంచి వచ్చిన రెండురోజులకే ఆమె చనిపోవటంతో కుటుంబసభ్యులు అనుమానం వ్యక్తం చేశారు.
కాలేజీ హాస్టల్‌లో ఉన్న ఆమె వస్తువులు తీసుకు వెళ్లటానికి తండ్రి పూర్ణచంద్రరావు, బంధువులు గురువారం వచ్చారు. ఆమె పుస్తకాలు సర్దుతుండగా నోట్‌బుక్‌లో రాసిన రెండు పేజీల సూసైడ్ నోట్ కనిపించింది. ‘నేను మెంటల్‌గా చాలా టార్చర్ ఫేస్ చేస్తున్నాను, భవిష్యత్తును ఎదుర్కొనే ధైర్యం లేదు. ర్యాంక్ రాకపోతే మిమ్ములను బాధ పెట్టడం ఇష్టంలేదు. నాలాంటి చాలామంది ఆడపిల్లలు కాలేజీలో ఉండలేక వారిలో వారే ఏడుస్తున్నారు.
నా తల లో ఏదో పెద్ద గడ్డ ఉన్నట్లు ఉంది. చాలా నొప్పి గా ఉంది. బాగా చదువుతున్న అక్కను మంచి యూనివర్శిటీలో చదివించండి. నేను చచ్చి పో దామని డిసైడ్ అయ్యాను. నా చావుకు కాలేజీ యా జ మాన్యమే కారణం’ అని అం దులో ఉంది. దీనిపై మృతురాలి తండ్రి ఫిర్యాదు మేరకు సీఐ ధర్మేంద్ర వచ్చి సూసైడ్ నోట్‌ను స్వాధీనం చేసుకున్నారు.
ఈ సందర్భంగా విద్య తండ్రి పూర్ణచంద్రరావు మీ డియాతో మాట్లాడుతూ కా లేజీ యాజమాన్యం వైఖ రితోనే తన కుమార్తె చనిపోయిందని అన్నారు. తమకున్న సమాచారం ప్రకారం విద్య చనిపోయినప్పుడు సూసైడ్ నోట్ ఆమె చేతిలో ఉందని, దానిని కాలేజీ యా జమాన్యం దాచిందని ఆరోపించారు. సూసైడ్ నోట్ పోలీసులకు చిక్కకుండా యాజమాన్యం జాగ్రత్తలు తీసుకుందని, ఈ ఘటనపై న్యాయ విచారణ చేయాలని డిమాండ్ చేశారు.