మియాపూర్ కార్పొరేట్ కాలేజీలో దారుణం | inter student suicide in a corporate college | Sakshi
Sakshi News home page

మియాపూర్ కార్పొరేట్ కాలేజీలో దారుణం

Published Tue, Oct 18 2016 5:51 PM | Last Updated on Mon, Sep 4 2017 5:36 PM

inter student suicide in a corporate college

హైదరాబాద్: నగరంలోని మియాపూర్లో ఉన్న ఓ కార్పొరేట్ కాలేజీలో దారుణం జరిగింది. మంగళవారం కాలేజీలో ఇంటర్ విద్యార్థిని పెట్రోల్ పోసుకుని ఆత్మహత్య చేసుకుంది.

మృతురాలిని నిజామాబాద్కు చెందిన సాత్వికగా గుర్తించారు. తీవ్ర ఒత్తిడి కారణంగానే ఈ అమ్మాయి ఆత్మహత్యకు పాల్పడిందని సహ విద్యార్థులు చెప్పారు. సాత్విక మృతదేహాన్ని గాంధీ ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సివుంది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement