బాలికపై ఇంటర్‌ విద్యార్థి లైంగిక దాడి | Inter student assassination girl | Sakshi
Sakshi News home page

బాలికపై ఇంటర్‌ విద్యార్థి లైంగిక దాడి

Published Mon, Nov 25 2024 5:07 AM | Last Updated on Mon, Nov 25 2024 5:07 AM

Inter student assassination girl

పది రోజుల క్రితం తిరుపతిలో ఘటన

తల్లిదండ్రుల్ని చంపేస్తానని బెదిరించడంతో ఎవరికీ చెప్పని బాలిక

అనారోగ్యంబారిన పడటంతో ఆలస్యంగా వెలుగుచూసిన వైనం

తిరుపతి క్రైమ్‌: ఎనిమిదేళ్ల బాలికపై ఇంటర్‌ వి­ద్యార్థి లైంగిక దాడికి పాల్పడిన ఘటన తిరుప­తిలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసు­లు తెలిపిన వివరాల ప్రకారం.. తిరుపతిలోని ఎంఆర్‌పల్లికి చెందిన ఇంటర్‌ విద్యార్థి బాలాజీ నగర్‌­లోని కాలేజీలో చదువుకుంటూ అక్కడికి దగ్గర్లో ఉన్న అమ్మమ్మ ఇంట్లో ఉండేవాడు. వీరి ఇంటికి సమీ­పంలోనే బాలిక కుటుంబం నివసి­స్తోంది. పదో తరగతి చదువుతున్న బాలిక అన్నతో సన్ని­హి­తంగా ఉంటూ వారింటికి వచ్చిపోతూ ఉండే­వాడు. ప

ది రోజుల కిందట బాలికకు చాక్లెట్లు కొని­స్తానని చెప్పి అమ్మమ్మ ఇంటికి తీసుకు­వెళ్లాడు. ఇంట్లో ఎవరూ లేకపోవడంతో బాలిక నోట్లో గుడ్డలు కుక్కి అఘాయిత్యానికి పాల్పడ్డా­డు. విషయం ఎవరికైనా చెబితే మీ అమ్మానాన్నల్ని చంపేస్తానని బెదిరించడంతో బాలిక ఎవరికీ చెప్పలేదు. అలా బెదిరిస్తూ నాలుగుసార్లు బాలి­కపై అఘాయి­త్యా­నికి పాల్పడ్డాడు. ఇటీవల బాలి­కకు జ్వరం, కడుపు­నొప్పి రావడంతో తల్లిదండ్రు­లు ఆస్పత్రికి తీసు­కెళ్లారు. లైంగికదాడి జరిగినట్లు వైద్యులు గుర్తించడంతో తల్లిదండ్రులు బాలికను ప్రశ్నించగా విష­యం చెప్పింది.

దీంతో తల్లిదండ్రులు ఎస్వీ యూని­వర్సిటీ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో నింది­తుడిని అరెస్టు చేసి పోక్సో కేసు నమోదు­చేశారు. బాలికను వైద్య పరీక్షల నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. కాగా నగరంలో నివసించే రిటైర్డ్‌ డీఎస్పీ ఇంట్లో నిందితుడి అమ్మమ్మ పనిచేస్తుండటంతో అతను పోలీస్‌ స్టేషన్‌ వద్దకు వచ్చి మధ్య­వర్తిత్వం చేయడానికి ప్రయత్నించారు. బాలిక బంధువులు, కుటుంబీకులు దాడిచేసేందుకు ప్రయ­త్నించడంతో అక్కడి నుంచి వెనుదిరిగారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement