కార్పొరేట్ కళాశాలలో రెచ్చిపోయిన లెక్చరర్
నల్లకుంట: నగరంలోని ఓ కార్పొరేట్ కళాశాలలో తరగతుల పునః ప్రారంభమైన రోజే జూనియర్ లెక్చరర్ ఓ విద్యార్థి పట్ల అమానుషంగా ప్రవర్తించాడు. పేపర్లు కింద పడేశాడంటూ ఆగ్రహంతో ఊగిపోయిన సదరు లెక్చరర్ అతణ్ణి చెప్పుతో చితక బాదాడు. అంతటితో ఆగకుండా తలను గోడకేసి కొట్టిన సంఘటన నల్లకుంట పోలీస్‌స్టేషన్ పరిధిలో సోమవారం జరగ్గా మంగళవారం వెలుగు చూసింది. బాధిత విద్యార్థి రాహుల్, అతని బంధువులు కె.ఆంజనేయులు, మనోజ్‌కుమార్, టీఆర్‌ఎస్ నగర ప్రధాన కార్యదర్శి సురేందర్‌గౌడ్‌ల కథనం ప్రకారం వివరాలు
ఇలా...
హబ్సిగూడకు చెందిన కె.వెంకటనారాయణ, శ్రీలలిత దంపతుల కుమారుడు కె.రాహుల్(17) నల్లకుంట మెయిన్ రోడ్డులోగల నారాయణ జూనియర్ కళాశాలలో ఇంటర్ (ఎంపీసీ) మొదటి సంవత్సరంలో చేరాడు. సోమవారం తరగతులు ప్రారంభం కావడంతో రాహుల్ ఉద యం 9 గంటలకు కళాశాలకు వచ్చాడు. మొద టి రోజే కళాశాలకు అరగంట ఆలస్యంగా రావడంతో అతణ్ణి తరగతిలోకి వెళ్లనీయకుండా ఓ అధ్యాపకుడు రెండు గంటలపాటు బయటే కూర్చోబెట్టారు.
ఆ తరువాత తరగతి గదిలోకి వెళ్లిన రాహుల్ అక్కడ టేబుల్‌పై ఉన్న పేపర్లు కిందపడి ఉండగా వాటిని తీసి టేబుల్‌పై పెట్టా డు. అదే సమయంలో గదిలోకి వచ్చిన సునిల్ పురువార్ అనే లెక్చరర్ ‘నా పేపర్లు కింద పడేస్తావా?’ అంటూ కోపంతో రాహుల్‌పై చేయిచేసుకున్నాడు. అంతటితో ఆగకుం డా చెప్పుతో కొట్టి తలను గోడకేసి బాదాడు. మరో తరగతి గదిలోకి తీసుకు వెళ్లి విద్యార్థుల ముందు మరోమారు విచక్షణా రహితంగా కొట్టాడు. దీంతో తోటి విద్యార్థులు భయంతో వణికిపోయారు.
సాయంత్రం ఇంటికి వెళ్లిన రాహుల్ విషయా న్ని తల్లిదండ్రులకు చెప్పాడు. దీంతో మంగళవారం ఉదయం విద్యార్థి తల్లిదండ్రులు, బంధువులు కళాశాల వద్దకు చేరుకుని ఆందోళనకు దిగారు. విషయం తెలుసుకున్న నల్లకుంట ఇన్‌స్పెక్టర్ జయపాల్‌రెడ్డి కళాశాల వద్దకు చేరుకుని పరిస్థితిని చక్కదిద్దారు. ఆ తరువాత ప్రిన్సి పాల్ తన కార్యాలయంలో సీఐతోపాటు విద్యా ర్థి తల్లిదండ్రులు, బంధువులు, విద్యార్థిపై చేయిచేసుకున్న లెక్చరర్‌తో చర్చలు జరిపారు. సదరు లెక్చరర్‌తో క్షమాపణ చెప్పించారు.
సదరు లెక్చరర్‌ను ఉద్యోగంలో నుంచి తొలగి స్తున్నట్టు ప్రిన్సిపాల్ ప్రకటించడంతో గొడవ సద్దుమణిగింది. విద్యార్థిపై దాడి జరిగిన విషయాన్ని తెలుసుకున్న ఏబీవీపీ రాష్ర్ట కార్యవర్గ సభ్యుడు శ్రీకాంత్ కళాశాల వద్దకు చేరుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సదరు లెక్చరర్‌ను ఇతర బ్రాంచ్‌ల్లో ఎక్కడా తీసుకోకూడదని యాజమాన్యాన్ని డిమాండ్ చేశారు.