Junior Lecturer
-
జూనియర్ లెక్చరర్, లాబ్ టెక్నీషియన్ పరీక్షల ఫలితాలు విడుదల
సాక్షి,హైదరాబాద్: జూనియర్ లెక్చరర్ పోస్టులు నియామక పరీక్ష తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ విడుదల చేసింది. ఈ మేరకు సోమవారం ఓ ప్రకటనలో పేర్కొంది. ఫలితాలను వెబ్సైట్లో పెట్టినట్లు తెలిపింది. తెలంగాణలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో 1,392 జూనియర్ లెక్చరర్ పోస్టుల భర్తీకి పరీక్ష నిర్వహించారు. ఇక.. సెప్టెంబర్ 12 నుంచి అక్టోబర్ 3 వరకు వివిధ తేదీల్లో కంప్యూటర్ ఆధారితంగా ఈ పరీక్ష నిర్వహించిన విషయం తెలిసిందే. తాజాగా ఈ పరీక్షలో అభ్యర్థులు సాధించిన మార్కుల ఆధారంగా జనరల్ ర్యాంకుల జాబితాను సబ్జెక్టుల వారీగా టీజీపీఎస్సీ విడుదల చేసింది.అదేవిధంగా ల్యాబ్ టెక్నీషియన్ పరీక్ష ఫలితాలను తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ విడుదల చేసింది. రేపు ల్యాబ్ టెక్నీషియన్ల టీజీపీఎస్సీ ముట్టడి నేపథ్యంలో ముందుగానే కమిషన్ ఫలితాలు విడుదల చేసింది. ఫలితాలను వెబ్సైట్లో పెట్టినట్లు తెలిపింది. -
పలువురికి ప్రభుత్వ ఉద్యోగాల జాక్‌పాట్
సిరిసిల్ల/ఉస్మానియాయూనివర్సిటీ/జన్నారం/చందుర్తి(వేములవాడ)/కోరుట్ల/మేడిపల్లి/మెట్పల్లి రూరల్: 4..3..2..4..2.. ఏ కార్పొరేట్ కళాశాల విద్యార్థులో సాధించిన ర్యాంకులు కావివి. ఒక్కొక్కరు నాలుగేసి..మూడేసి.. రెండేసి చొప్పున సాధించిన ప్రభుత్వోద్యోగాలు ఇవి. రాజన్నసిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలం నిజామాబాద్‌కు చెందిన దుగ్గు మనీషా నాలుగు ప్రభుత్వోద్యోగాలకు ఎంపికైంది. ఇప్పటికే గురుకుల పాఠశాల, గురుకుల కళాశాలల్లో టీజీటీ, పీజీటీ అధ్యాపకురాలిగా, ఉపాధ్యాయినిగా ఎంపికైంది. తాజాగా గురువారం వెలువడిన జూనియర్ లెక్చరర్ ఫలితాల్లో రాష్ట్రస్థాయిలో 5వ ర్యాంకు సాధించింది. గురువారం మధ్యాహ్నం వెల్లడైన డిగ్రీ లెక్చరర్ ఫలితాల్లో ఎంఏ సోషల్ విభాగంలో 12వ ర్యాంకు సాధించింది. అలాగే ఓయూ క్యాంపస్‌లోని ఈఎంఎంఆర్‌సీ నైట్‌వాచ్‌మన్ ప్రవీణ్ మూడు ప్రభుత్వ ఉద్యోగాలు సాధించాడు. ఇటీవల ప్రకటించిన గురుకుల విద్యాలయాల్లో టీజీటీ, పీజీటీ, జూనియర్ లెక్చరర్ ఉద్యోగాలు సాధించాడు. రాజన్నసిరిసిల్ల జిల్లా చందుర్తి మండలం ఆశిరెడ్డిపల్లికి చెందిన అంచ అర్చన అలియాస్ వనజ.. ఇటీవల వెలువడిన ప్రభుత్వ గురుకుల పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇంగ్లిష్ టీచర్ ఫలితాల్లో ఉద్యోగం సాధించింది. గురువారం వెలువడిన ప్రభుత్వ గురుకుల జూనియర్ లెక్చరర్ (ఇంగ్లిష్) ఫలితాల్లోనూ ఎంపికైంది. జగిత్యాల జిల్లా మేడిపల్లి మండలం దేశాయిపేటకు చెందిన నాగుల నరేశ్ నాలుగు ప్రభుత్వ ఉద్యోగాలకు ఎంపికయ్యాడు. కేంద్ర ప్రభుత్వం జాతీయస్థాయిలో నిర్వహించిన ఈఎంఆర్ఎస్ పీజీటీ ఇంగ్లిష్ ఉపాధ్యాయుడిగా ఎంపికయ్యాడు. ఇటీవల నిర్వహించిన గురుకుల ప్రభుత్వ ఉద్యోగాల్లో ప్రతిభ చూపి టీజీటీ, పీజీటీ ఉద్యోగాలతోపాటు జూనియర్ ఇంగ్లిష్ లెక్చరర్ ఉద్యోగానికి ఎంపికయ్యాడు. మరోవైపు జగిత్యాల జిల్లా మెట్పల్లి మండలం సత్తక్కపల్లికి చెందిన కొడిమ్యాల పావని 17 రోజుల వ్యవధిలోనే రెండు ప్రభుత్వ ఉద్యోగాలు సాధించింది. ఫిబ్రవరి 13న పీజీటీ ఫలితాల్లో రాష్ట్రస్థాయిలో 41వ ర్యాంకు సాధించింది. జూనియర్ లెక్చరర్ (మ్యాథమెటిక్స్)లో రాష్ట్రస్థాయిలో 139వ ర్యాంకు సాధించి, ఉద్యోగానికి ఎంపికైంది. -
నెలాఖరులోగా గురుకుల పోస్టుల భర్తీ!
సాక్షి, హైదరాబాద్: గురుకుల విద్యా సంస్థల్లో ఉద్యోగాల భర్తీ ప్రక్రియ వేగవంతమైంది. ఇప్పటికే గురుకుల డిగ్రీ కాలేజీలు, గురుకుల జూనియర్ కాలేజీల్లోని ఫిజికల్ డైరెక్టర్, లైబ్రేరియన్ ఉద్యోగాలతోపాటు గురుకుల పాఠశాలల్లో ఫిజికల్ డైరెక్టర్, లైబ్రేరియన్, పోస్టు గ్రాడ్యుయేట్ టీచర్ (పీజీటీ) పోస్టులను భర్తీ చేశారు. మరో 7వేల ఉద్యోగాలకు సంబంధించిన ప్రక్రియను తెలంగాణ గురుకుల విద్యాసంస్థల నియామకాల బోర్డు (టీఆర్‌ఈఐఆర్‌బీ) వేగిరం చేసింది. ఈ నెలాఖరులోగా అన్ని కేటగిరీల్లో ఉద్యోగాలకు అర్హులైన అభ్యర్థులను ఎంపిక చేసేలా కసరత్తు చేస్తోంది. ఈ క్రమంలో డిగ్రీ కాలేజీల్లోని 793 లెక్చరర్ ఉద్యోగాలు, జూనియర్ కాలేజీల్లో 1,924 జూనియర్ లెక్చరర్ ఉద్యోగాలకు సంబంధించి 1ః2 నిష్పత్తిలో వేర్వేరుగా ప్రాథమిక ఎంపిక జాబితాలను విడుదల చేసింది. ఈ నెల 19వ తేదీ నుంచి ధ్రువపత్రాల పరిశీలన, అభ్యర్థులకు డెమో పరీక్షలను నిర్వహించేలా ప్రణాళిక సిద్ధం చేసింది. దీనిపై సంక్షిప్త సందేశాలు, ఫోన్ కాల్ ద్వారా అభ్యర్థులకు సమాచారం అందిస్తున్నారు. చివరివారంలో టీజీటీ అభ్యర్థుల జాబితా.. గురుకులాల్లో భర్తీ చేస్తున్న 9వేల ఉద్యోగాల్లో అత్యధికంగా 4,020 ఉద్యోగాలు ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్(టీజీటీ) కేటగిరీలోనివే. ఈ ఉద్యోగాలపైనే ఎక్కువ మంది అభ్యర్థులు ఆశలు పెట్టుకున్నారు. అర్హత జాబితాల కోసం వేచిచూస్తున్నారు. ఈ పోస్టులకు సంబంధించి ఈనెల 20వ తేదీ తర్వాత సబ్జెక్టుల వారీగా 1ః2 నిష్పత్తిలో అభ్యర్థుల ప్రాథమిక జాబితాలను టీఆర్‌ఈఐఆర్‌బీ విడుదల చేయనుంది. 24వ తేదీ నుంచి అభ్యర్థుల ధ్రువపత్రాల పరిశీలన నిర్వహించేలా అధికారులు కార్యాచరణ సిద్ధం చేశారు. 26వ తేదీకల్లా పరిశీలన పూర్తిచేసి తుది జాబితాలను విడుదల చేయాలని భావిస్తున్నారు. మొత్తంగా 4,020 టీజీటీ, 1,924 జూనియర్ లెక్చరర్, 793 డిగ్రీ లెక్చరర్ పోస్టులు కలిపి 6,737 ఉద్యోగాలను నెలాఖరులో భర్తీ చేయనున్నారు. ఎల్బీ స్టేడియం వేదికగా ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించి సీఎం ఆధ్వర్యంలో అభ్యర్థులకు నియామక పత్రాలు అందజేసే అవకాశం ఉందని సమాచారం. -
తెలంగాణ మొత్తం తిరగాల్సిందే..
సాక్షి ప్రతినిధి, నిజామాబాద్: ఏళ్ల తరబడి ఎదురు చూపుల తరువాత విడుదలైన నోటిఫికేషన్ల ప్రకా రం ఉద్యోగాలు సాధించేందుకు సిద్ధమవుతున్న నిరుద్యోగ అభ్యర్థులు ఆయా పోటీ పరీక్షలు రాసేందుకు అష్టకష్టాలు పడాల్సిన పరిస్థితి నెలకొంది. ఆగస్టు 1 నుంచి 23వ తేదీ వరకు ‘తెలంగాణ రెసి డెన్షియల్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ రిక్రూట్మెంట్ బోర్డు’ఆధ్వర్యంలో గురుకులాల్లో డిగ్రీ లెక్చరర్, జూనియర్ లెక్చరర్, పీజీటీ, టీజీటీ, పీఎల్, ఆర్ట్స్, క్రాఫ్ట్స్, మ్యూజిక్, ఫిజికల్ డైరెక్టర్.. తదితర 9 రకాల ఉద్యోగాలకు ఆన్లైన్ విధానంలో పరీక్షలు నిర్వహించనున్నారు. ఈ క్రమంలో ఈ నెల 24 నుంచి హాల్‌టికెట్లను ఆన్లైన్లో పెట్టారు. అయితే ఇప్పటికీ పలువురు అభ్యర్థులకు కొన్ని పరీక్షల హాల్‌టికెట్లను వెబ్సైట్లో చూపించడం లేదు. కొన్ని డౌన్లోడ్ కావటం లేదు. కొందరికి మాత్రం కొన్ని పరీక్షల హాల్‌టికెట్లు డౌన్లోడ్ అయ్యాయి. ఇదిలా ఉంటే.. హాల్‌టికెట్లు చూసి పలువురు అభ్యర్థులు గగ్గోలు పెడుతున్నారు. జేఎల్, డీఎల్, టీజీటీ, పీజీటీ, పీఎల్ పరీక్షలకు పేపర్–1 (జనరల్ స్టడీస్), పేపర్–2 (మెథడాలజీ), పేపర్–3 (సబ్జెక్టు) ఉన్నాయి. పరీక్షలు రాసే విషయంలో అభ్యర్థులకు కేటాయించిన కేంద్రాలు చూస్తే కళ్లు తిరిగే పరిస్థితి ఉందని అంటున్నారు. మూడు పేపర్లకు మూడు జిల్లాలు.. మంచిర్యాలకు చెందిన నికిత అనే అభ్యర్థి టీజీటీకి దరఖాస్తు చేయగా, ఆమెకు పేపర్–1 హైదరాబాద్‌లో, పేపర్–2 మంచిర్యాలలో, పేపర్–3కి వరంగల్‌లో సెంటర్లు ఇచ్చారు. అలాగే నిజామాబాద్‌కు చెందిన రమాదేవి నిజామాబాద్‌లో పరీక్ష కేంద్రం ఆప్షన్ ఇవ్వగా, ఆమెకు పేపర్–1 రంగారెడ్డి జిల్లా, పేపర్–2 మేడ్చల్, పేపర్–3కి కరీంనగర్ జిల్లాలో సెంటర్లు ఇచ్చారు. ఖమ్మంకు చెందిన బిందుకు పేపర్–1 ఖమ్మంలో, పేపర్–2 కొత్తగూడెంలో, పేపర్–3కి సత్తుపల్లిలో సెంటర్లు ఇచ్చారు. ఈ పరీక్షలను ఆగస్టు 4, 14, 22 తేదీల్లో రాయాల్సి ఉంది. ఇక్కడే మరో పెద్ద సమస్య వచ్చిపడింది. వీళ్లు టీజీటీతోపాటు పీజీటీ, డిగ్రీ లెక్చరర్, జేఎల్ పరీక్షలకు కూడా దరఖాస్తు చేశారు. ఈ పరీక్షల కేంద్రాలు ఏయే జిల్లాల్లో కేటాయిస్తారో తెలియక ఆందోళన చెందుతున్నారు. తెలంగాణలో సగం జిల్లాల్లో తిరగాల్సిన పరిస్థితి.. మొత్తం 9 విభాగాల పరీక్షల్లో కీలకమైన పీజీటీ, టీజీటీ, డిగ్రీ లెక్చరర్, జూనియర్ లెక్చరర్ పరీక్షలకు మూడు చొప్పున పేపర్లకు పరీక్ష రాయాల్సి ఉంది. అయితే ఈ పరీక్షలు ఒక క్రమ పద్ధతి ప్రకారం నిర్వహించడం లేదని విమర్శలు వస్తున్నాయి. టీజీటీ పరీక్షలు ఆగస్టు 4, 14, 22 తేదీల్లో ఉన్నాయి. కాగా, ఈ పరీక్షలు రాసే అభ్యర్థులు.. ఆగస్టు 9, 10, 16, 19, 21 తేదీల్లో పీజీటీ, డిగ్రీ లెక్చరర్, జూనియర్ లెక్చరర్ పరీక్షలు రాయాల్సి ఉంది. వీరికి టీజీటీ తరహాలోనే వివిధ జిల్లాల్లో పరీక్ష కేంద్రాలు కేటాయిస్తే ఉత్తర తెలంగాణ నుంచి దక్షిణ తెలంగాణ వరకు వందల కిలోమీటర్ల మేర ఆగస్టు నెలంతా ప్రయాణాలు చేయాల్సిన పరిస్థితి ఉంటుందని అంటున్నారు. భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో గర్భిణులు, బాలింతలు, చిన్నపిల్లలు ఉన్న మహిళా అభ్యర్థులు నరకయాతన పడాల్సిన పరిస్థితులు కల్పించారని మండిపడుతున్నారు. ఒక అభ్యర్థి ఇలా పోటీ పరీక్షలు రాసేందుకు వివిధ జిల్లాలు తిరగాలంటే రూ. వేలల్లో ఖర్చు చేయాల్సి ఉంటుంది. దీంతో అభ్యర్థులు గగ్గోలు పెడుతున్నారు. -
టీఎస్పీఎస్సీ ఇష్టానుసారం పరీక్ష నిర్వహించడం సరికాదు: హైకోర్టు
సాక్షి, హైదరాబాద్: ఎస్పీఎస్సీలో పేపర్ లీక్ వ్యవహారం హాట్ టాపిక్‌గా మారిన విషయం తెలిసిందే. ఇదే సమయంలో జూనియర్ లెక్చరర్(జేఎల్) పరీక్ష ప్రశ్నపత్రంపై తెలంగాణ హైకోర్టు కీలక ఉత్తర్వులు జారీ చేసింది. జూనియర్ లెక్చరర్ పేపర్-2 ప్రశ్నపత్రం తెలుగులోనూ ఇవ్వాలని కోర్టు ఆదేశించింది. పేపర్-2 ఇంగ్లీష్‌లోనే ఇవ్వాలన్న టీఎస్పీఎస్సీ నిర్ణయంపై హైకోర్టు విచారణ చేపట్టింది. ఈ సందర్బంగా పేపర్-2 ప్రశ్నపత్రం ఇంగ్లీష్, తెలుగులో కూడా ఇవ్వాలని టీఎస్పీఎస్సీని హైకోర్టు ఆదేశించింది. టీఎస్పీఎస్సీ ఇష్టానుసారం పరీక్షలు నిర్వహించడం సరికాదని హైకోర్టు స్పష్టం చేసింది. -
వ్యాన్ డ్రైవర్‌తో జూనియర్ లెక్చరర్ ప్రేమ పెళ్లి, చివరకు..
సాక్షి, నెల్లూరు (క్రైమ్): ప్రేమించి పెళ్లి చేసుకుని ఏడాది గడవకముందే అత్తింటి వేధింపులకు తాళలేక వివాహిత ఆత్మహత్య చేసుకుంది. ఈ విషాద సంఘటన నెల్లూరు నగరం ఎన్టీఆర్ నగర్ చర్చి వీధిలో చోటుచేసుకుంది. సేకరించిన సమాచారం ప్రకారం.. ప్రకాశం జిల్లా ఉలవడపాడు మండలం చాకిచర్ల గ్రామానికి చెందిన జె.లక్ష్మికి మానస (28), మౌనిక, మహేంద్ర ముగ్గురు పిల్లలు. ఆమె కూలి పనులు చేసుకుంటూ పిల్లలను ఉన్నత చదువులు చదివించింది. పెద్ద కుమార్తె మానస పద్మావతి విశ్వవిద్యాలయంలో ఎమ్మెస్సీ ఆర్గానిక్ కెమిస్ట్రీ పూర్తి చేసింది. ఆ తర్వాత ధనలక్ష్మిపురంలోని నారాయణ విద్యా సంస్థలో జూనియర్ లెక్చరర్‌గా చేరారు. నెల్లూరు రూరల్ మండలం మాదరాజగూడూరుకు చెందిన మానికల చినబాబు అక్కడే వ్యాన్ డ్రైవర్‌గా పని చేస్తున్నాడు. మానస, చినబాబు నడమ ఏర్పడిన స్నేహం కాస్తా ప్రేమగా మారింది. ఏడాది కిందట వీరు వివాహం చేసుకున్నారు. మాదరాజగూడూరులో కాపురం పెట్టారు. ఈ విషయం తెలుసుకున్న మానస తల్లి మాదరాజ గూడూరు చేరుకుని తన కుమార్తెను బాగా చూసుకోమని అల్లుడు చినబాబుకు విన్నవించి వెళ్లింది. వివాహమైన కొంతకాలం నుంచే అత్తింటి వారు కట్నం కోసం ఆమెను వేధించడం ప్రారంభించారు. భర్త సైతం వారికి వత్తాసు పలకడంతో మనస్పర్థలు చోటుచేసుకున్నాయి. కొద్ది నెలల అనంతరం చినబాబు, మానస నెల్లూరు రామ్‌నగర్‌కు మకాం మార్చారు. రెండు నెలల కిందట అక్కడి నుంచి ఎన్టీఆర్ నగర్ చర్చి వీధిలోని ఓ ఇంట్లో అద్దెకు దిగారు. మానస తన ఉద్యోగాన్ని మానేసి ఏపీ సెట్‌కు సిద్ధమవుతోంది. చినబాబు యాక్టింగ్ డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. ఈ క్రమంలో ఈనెల రెండో తేదీ సాయంత్రం దంపతుల నడుమ చిన్నపాటి ఘర్షణ జరిగింది. చినబాబు ఇంటి వెనుక వైపునున్న గదిలో ఉండగా మానస తన గదిలోకి వెళ్లి ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. కాసేపు తర్వాత చినబాబు తలుపులు తట్టినా తీయకపోవడంతో కిటీకీలో నుంచి చూడగా మానస ఉరేసుకుని వేలాడుతూ కనిపించింది. స్థానికులతో కలిసి తలుపులు పగులగొట్టి లోనికి వెళ్లి చూడగా అప్పటికే మానస మృతి చెంది ఉంది. ఈ విషయంపై స్థానికులు గురువారం అర్ధరాత్రి బాలాజీనగర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. శుక్రవారం ఉదయం మానస తల్లి నెల్లూరుకు చేరుకుని కన్నీటి పర్యంతమైంది. బాలాజీనగర్ ఇన్స్పెక్టర్ జి.మంగారావు తన సిబ్బందితో వచ్చి మృతదేహాన్ని పరిశీలించారు. తహసీల్దార్ వచ్చి మృతదేహానికి శవపంచనామా చేశారు. భర్త, అత్తమామ, ఆడబిడ్డలు తన కుమార్తె మృతికి కారణమని మానస తల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. మృతురాలి భర్త, అత్తింటి వారిపై కేసు నమోదు చేశారు. మృతదేహాన్ని శవ పరీక్ష కోసం జీజీహెచ్‌కు తరలించారు. ఇన్స్పెక్టర్ మంగారావు కేసు దర్యాప్తు చేస్తున్నారు. చదవండి: బైక్ పైన రాలేదని భార్య గొంతుకొసిన భర్త.. -
కాకినాడ జెఎన్టీయూలో ముదురుతున్న వివాదం
-
ఆ 21 మందికి పోస్టింగ్‌లు
సాక్షి, హైదరాబాద్ : 2008 జూనియర్ లెక్చరర్ పోస్టుల భర్తీలో నష్టపోయిన తెలంగాణకు చెందిన 21మంది అభ్యర్థులకు ఎట్టకేలకు న్యాయం జరిగింది. తాజాగా వీరందరికి ఇంటర్ విద్యాశాఖ శుక్రవారం పోస్టింగ్‌లు ఇచ్చింది. 2008లో నోటిఫికేషన్ విడుదల చేసిన ఏపీపీఎస్సీ 2011లో ఈ పరీక్షను నిర్వహించింది. ఇందులో ఎకనామిక్స్ పోస్టులకు సంబంధించిన రాత పరీక్షల జవాబులను మరొక సబ్జెక్టు కీతో మూల్యాంకనం చేయటంతో 77 ప్రశ్నలకు జవాబులు తప్పుగా వచ్చాయి. దీంతో అభ్యర్థులు అనేక ఆందోళనలు చేపట్టిన తర్వాత ఏపీపీఎస్సీ సరైన కీతో మూల్యాంకనం చేసింది. అనంతరం మెరిట్ లిస్టు ఆధారంగా ఇంటర్వ్యూలు నిర్వహించి పోస్టింగ్‌లు ఇచ్చింది. -
కార్పొరేట్ కళాశాలలో రెచ్చిపోయిన లెక్చరర్
నల్లకుంట: నగరంలోని ఓ కార్పొరేట్ కళాశాలలో తరగతుల పునః ప్రారంభమైన రోజే జూనియర్ లెక్చరర్ ఓ విద్యార్థి పట్ల అమానుషంగా ప్రవర్తించాడు. పేపర్లు కింద పడేశాడంటూ ఆగ్రహంతో ఊగిపోయిన సదరు లెక్చరర్ అతణ్ణి చెప్పుతో చితక బాదాడు. అంతటితో ఆగకుండా తలను గోడకేసి కొట్టిన సంఘటన నల్లకుంట పోలీస్‌స్టేషన్ పరిధిలో సోమవారం జరగ్గా మంగళవారం వెలుగు చూసింది. బాధిత విద్యార్థి రాహుల్, అతని బంధువులు కె.ఆంజనేయులు, మనోజ్‌కుమార్, టీఆర్ఎస్ నగర ప్రధాన కార్యదర్శి సురేందర్గౌడ్ల కథనం ప్రకారం వివరాలు ఇలా... హబ్సిగూడకు చెందిన కె.వెంకటనారాయణ, శ్రీలలిత దంపతుల కుమారుడు కె.రాహుల్(17) నల్లకుంట మెయిన్ రోడ్డులోగల నారాయణ జూనియర్ కళాశాలలో ఇంటర్ (ఎంపీసీ) మొదటి సంవత్సరంలో చేరాడు. సోమవారం తరగతులు ప్రారంభం కావడంతో రాహుల్ ఉద యం 9 గంటలకు కళాశాలకు వచ్చాడు. మొద టి రోజే కళాశాలకు అరగంట ఆలస్యంగా రావడంతో అతణ్ణి తరగతిలోకి వెళ్లనీయకుండా ఓ అధ్యాపకుడు రెండు గంటలపాటు బయటే కూర్చోబెట్టారు. ఆ తరువాత తరగతి గదిలోకి వెళ్లిన రాహుల్ అక్కడ టేబుల్‌పై ఉన్న పేపర్లు కిందపడి ఉండగా వాటిని తీసి టేబుల్‌పై పెట్టా డు. అదే సమయంలో గదిలోకి వచ్చిన సునిల్ పురువార్ అనే లెక్చరర్ ‘నా పేపర్లు కింద పడేస్తావా?’ అంటూ కోపంతో రాహుల్‌పై చేయిచేసుకున్నాడు. అంతటితో ఆగకుం డా చెప్పుతో కొట్టి తలను గోడకేసి బాదాడు. మరో తరగతి గదిలోకి తీసుకు వెళ్లి విద్యార్థుల ముందు మరోమారు విచక్షణా రహితంగా కొట్టాడు. దీంతో తోటి విద్యార్థులు భయంతో వణికిపోయారు. సాయంత్రం ఇంటికి వెళ్లిన రాహుల్ విషయా న్ని తల్లిదండ్రులకు చెప్పాడు. దీంతో మంగళవారం ఉదయం విద్యార్థి తల్లిదండ్రులు, బంధువులు కళాశాల వద్దకు చేరుకుని ఆందోళనకు దిగారు. విషయం తెలుసుకున్న నల్లకుంట ఇన్స్పెక్టర్ జయపాల్‌రెడ్డి కళాశాల వద్దకు చేరుకుని పరిస్థితిని చక్కదిద్దారు. ఆ తరువాత ప్రిన్సి పాల్ తన కార్యాలయంలో సీఐతోపాటు విద్యా ర్థి తల్లిదండ్రులు, బంధువులు, విద్యార్థిపై చేయిచేసుకున్న లెక్చరర్‌తో చర్చలు జరిపారు. సదరు లెక్చరర్‌తో క్షమాపణ చెప్పించారు. సదరు లెక్చరర్‌ను ఉద్యోగంలో నుంచి తొలగి స్తున్నట్టు ప్రిన్సిపాల్ ప్రకటించడంతో గొడవ సద్దుమణిగింది. విద్యార్థిపై దాడి జరిగిన విషయాన్ని తెలుసుకున్న ఏబీవీపీ రాష్ర్ట కార్యవర్గ సభ్యుడు శ్రీకాంత్ కళాశాల వద్దకు చేరుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సదరు లెక్చరర్‌ను ఇతర బ్రాంచ్‌ల్లో ఎక్కడా తీసుకోకూడదని యాజమాన్యాన్ని డిమాండ్ చేశారు. -
2,908 జేఎల్ పోస్టుల భర్తీకి గ్రీన్‌సిగ్నల్
-
2,908 జేఎల్ పోస్టుల భర్తీకి గ్రీన్‌సిగ్నల్
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో 2,908 జూనియర్ లెక్చరర్ పోస్టుల భర్తీకి ప్రభుత్వం ఆమోద ముద్ర వేసింది. దీనికి సంబంధించిన ఫైలుపై మంగళవారం సీఎం కిరణ్ సంతకం చేసినట్లు తెలిసింది. 4,523 ఖాళీగా ఉన్న జూనియర్ లెక్చరర్ పోస్టుల భర్తీకి ఆర్థికశాఖ 132 జీవో ద్వారా గతంలోనే ఆమోదం తెలిపింది. అయితే ఆ ఖాళీ లన్నింటినీ భర్తీ చేస్తే కాంట్రాక్టు లెక్చరర్లు అందరినీ తొలగించాల్సి వస్తుందన్న ఆందోళనలు వ్యక్తమయ్యా యి. ఆ ఖాళీలన్నీ భర్తీ చేయవద్దని కాంట్రాక్టు లెక్చరర్లు డిమాండ్ చేశారు. దీంతో అన్నింటినీ ఒకేసారి కాక దశలవారీగా భర్తీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో భాగంగా మొదట 2,908 పోస్టుల భర్తీకి చర్యలు చేపట్టింది. ఇందులో 2,262 జూనియర్ లెక్చరర్(జనరల్) ఉండగా, 646 వొకేషనల్ లెక్చరర్ పోస్టులు ఉన్నాయి. దీనిపై సెకండరీ విద్యాశాఖ త్వరలోనే ఉత్తర్వులు జారీ చేయనుంది. తర్వాత ఇంటర్మీడియెట్ విద్యాశాఖ ఖాళీలకు సంబంధించిన రోస్టర్ పాయింట్లను ఏపీపీఎస్సీకి అందజేయనుంది. అనంతరం వివిధ పోస్టులతోపాటు ఈ పోస్టుల భర్తీకి ఏపీపీఎస్సీ నోటిఫికేషన్ జారీ చేయనుంది. -
అబలలపై ఆగని ఆరాచకాలు
రాష్ర్టంలో శుక్రవారం వేర్వేరు ప్రాంతాల్లో దారుణాలు జరిగాయి. కర్నూలులో ఓ మహిళా లెక్చరర్ హత్యకు గురి కాగా, అనంతపురం జిల్లా ధర్మవరంలో వేధింపులు భరించలేక ఓ యువతి ఆత్మహత్యకు పాల్పడింది. భయంతో నిందితులిద్దరూ ఆత్మహత్యాయత్నానికి పాల్పడగా.. వారిలో ఒకరు ప్రాణాలొదిరారు. ఇదే జిల్లాలో శిక్షణ కోసం వచ్చిన ఓ కానిస్టేబుల్ గుండెపోటుతో మరణించాడు. తిరుపతిలో ఓ బీటెక్ విద్యార్థిని, కృష్ణా జిల్లా నూజివీడులో మరో విద్యార్థి బలవన్మరణం చెందారు. మహిళా లెక్చరర్ దారుణ హత్య కర్నూలు, న్యూస్‌లైన్: ఓ మహిళా లెక్చరర్‌ను దారుణ హత్య చేశారు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. విద్యానగర్‌లో నివాసముంటున్న మధుమతి స్థానిక ప్రభుత్వ పాఠశాలలో టీచర్‌గా పనిచేస్తోంది. ఈమె రెండో కూతురు హిమబిందు ఓ ప్రైవేట్ కళాశాలలో జూనియర్ లెక్చరర్‌గా పనిచేస్తుండేది. అదే కళాశాలలో కడపజిల్లాకు చెందిన బలరామ్, వెంకటేష్ కూడా జూనియర్ లెక్చరర్లుగా పనిచేసేవారు. కొంతకాలంగా వారు వేధింపులకు గురిచేస్తున్నారని హిమబిందు తల్లికి చెప్పడంతో డిసెంబర్ 29న ఉద్యోగాన్ని మాన్పించారు. జనవరి 1వ తేదీన బలరాం పేరుతో హిమబిందు సెల్‌కు ఒక మెసేజ్ వెళ్లింది. కళాశాలకు చెందిన సిబ్బంది మొత్తం విందు ఏర్పాటు చేసుకుంటున్నామని ఆమెను ఆహ్వానించారు. బెలూం గుహలకు వెళ్తున్నట్లు కుటుంబ సభ్యులకు చెప్పి వెళ్లిన ఆమె.. ఉదయం 7.30 గంటల సమయంలో బయటకు వెళ్లి రాత్రి 9 గంటల వరకు కూడా ఇంటికి రాలేదు. దీంతో కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కాగా, నంద్యాల-గిద్దలూరు రహదారిలోని సర్వ నరసింహస్వామి దేవాలయం సమీపంలో గత నెల 7వ తేదీన మహిళ మృతదేహం బయటపడింది. బలరామ్ సెల్‌కు వచ్చిన ఫోన్ నెంబర్ల ఆధారంగా కూపీ లాగిన పోలీసులు తమదైన శైలిలో విచారించారు. దీంతో అసలు విషయం బయటపడింది. హిమబిందును హత్య చేసినట్లు నేరం అంగీకరించడంతో శుక్రవారం బలరామ్‌తో పాటు వెంకటేష్‌ను అదుపులోకి తీసుకున్నారు. ఘటనా స్థలానికి వెళ్లి పరిశీలించారు. ఆమెకు సంబంధించిన బట్టలతో పాటు కొన్ని ఆనవాళ్లను కూడా సేకరించారు. వేధింపులతో యువతి ఆత్మహత్య ధర్మవరం, న్యూస్‌లైన్: ప్రేమ వేధింపులకు ఓ యువతి ఆత్మహత్య చేసుకుంది. ఈ విషయం తెలియగానే వేధించిన యువకుడు, అతనికి సహకరించిన స్నేహితుడు పురుగుమందు తాగి ఆత్మహత్యకు యత్నించారు. చికిత్స పొందుతూ స్నేహితుడు మృతి చెందగా, నిందితుడు ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్నాడు. అనంతపురం జిల్లా తాడిమర్రి మండల కేంద్రానికి చెందిన నరసింహులు, కృపావతి దంపతుల రెండో కుమార్తె వాణి ప్రియదర్శిని (21) అనంతపురంలోని ఓ ప్రైవేట్ కళాశాలలో బీఈడీ చేస్తోంది. కొంతకాలంగా గ్రామానికి చెందిన రవిచంద్ర ప్రేమిస్తున్నానంటూ ఆమె వెంటపడేవాడు. మానసిక ఒత్తిడిని భరించలేక బుధవారం సాయంత్రం ఆమె విషపు గుళికలు మిం గింది. వెంటనే కుటుంబ సభ్యులు ఆస్పత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న రవిచంద్ర తిరుపతికి పారిపోయాడు. కాగా, చికిత్స పొందుతూ వాణి గురువారం మృతిచెందింది. ఇది తెలుసుకున్న రవిచంద్ర భయంతో అదేరోజు పురుగుమందు తాగాడు. అతడిని తిరుపతిలోని బంధువులు ప్రభుత్వాసుపత్రిలో చేర్పించారు. ప్రస్తుతం అతని పరిస్థితి విషమంగా ఉంది. ఇదిలా ఉండగా.. వాణికి వరుసకు తమ్ముడు, రవిచంద్రకు స్నేహితుడు అయిన హరీష్‌కుమార్‌ను నిలదీయడం తో అతనూ విషగుళికలు మింగాడు. బత్తలపల్లి ఆర్డీటీ ఆస్పత్రిలో చేర్చగా.. చికిత్స పొందుతూ శుక్రవారం తెల్లవారుజామున మృతిచెందాడు. రవిచంద్రపై తాడిమర్రి పోలీసులు నిర్భయ చట్టం కింద కేసు నమోదు చేశారు. కేసు దర్యాప్తులో ఉంది.