సాక్షి,హైదరాబాద్: జూనియర్ లెక్చరర్ పోస్టులు నియామక పరీక్ష తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ విడుదల చేసింది. ఈ మేరకు సోమవారం ఓ ప్రకటనలో పేర్కొంది. ఫలితాలను వెబ్‌సైట్‌లో పెట్టినట్లు తెలిపింది. తెలంగాణలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో 1,392 జూనియర్ లెక్చరర్ పోస్టుల భర్తీకి పరీక్ష నిర్వహించారు.
ఇక.. సెప్టెంబర్ 12 నుంచి అక్టోబర్ 3 వరకు వివిధ తేదీల్లో కంప్యూటర్ ఆధారితంగా ఈ పరీక్ష నిర్వహించిన విషయం తెలిసిందే. తాజాగా ఈ పరీక్షలో అభ్యర్థులు సాధించిన మార్కుల ఆధారంగా జనరల్ ర్యాంకుల జాబితాను సబ్జెక్టుల వారీగా టీజీపీఎస్సీ విడుదల చేసింది.
అదేవిధంగా ల్యాబ్ టెక్నీషియన్ పరీక్ష ఫలితాలను తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ విడుదల చేసింది. రేపు ల్యాబ్ టెక్నీషియన్ల టీజీపీఎస్సీ ముట్టడి నేపథ్యంలో ముందుగానే కమిషన్ ఫలితాలు విడుదల చేసింది. ఫలితాలను వెబ్‌సైట్‌లో పెట్టినట్లు తెలిపింది.
Comments
Please login to add a commentAdd a comment