TSPSC Group 2 results released : తెలంగాణ గ్రూప్‌-2 ఫలితాలు విడుదల | TSPSC Announced Group 2 Mains Results On March 11th 2025, Check More Details Inside | Sakshi
Sakshi News home page

TS Group 2 Results: తెలంగాణ గ్రూప్‌-2 ఫలితాలు విడుదల

Published Tue, Mar 11 2025 2:59 PM | Last Updated on Tue, Mar 11 2025 4:50 PM

TSPSC announced group 2 mains result on March 10, 2025

సాక్షి,హైదరాబాద్‌: తెలంగాణ గ్రూప్‌-2 ఫలితాలు విడుదలయ్యాయి. జనరల్‌ ర్యాంకింగ్‌తో పాటు కీ విడుదలైంది. ఓఎంఆర్‌ షీట్‌ను సైతం టీఎస్‌పీఎస్సీ వెబ్‌సైట్‌లో పెట్టింది. 

ప్రభుత్వ శాఖల్లోని ఖాళీల భర్తీకి నిర్వహించిన గ్రూప్‌-2 పరీక్ష ఫలితాలను టీజీపీఎస్సీ కొద్ది సేపటిక్రితమే విడుదల చేసింది. 783 పోస్టుల భర్తీకి 2022లో గ్రూప్‌-2 నోటిఫికేషన్‌ విడుదలకాగా, ఈ గ్రూప్-2 పరీక్షకు మొత్తం 5.57 లక్షల మంది అభ్యర్థులు ద‌ర‌ఖాస్తు చేసుకున్నారు. డిసెంబర్‌ 15,16న జరిగిన ఈ పరీక్షలను సుమారు 2.5లక్షల మంది రాశారు.  33 జిల్లాల్లో 1,368 పరీక్ష కేంద్రాల్లో నిర్వహించారు.  

గ్రూప్-2 ప‌రీక్షల‌ ఇలా..
టీఎస్‌పీఎస్సీ గ్రూప్-2లో మొత్తం నాలుగు పేపర్లు ఉంటాయి. డిసెంబరు 15వ తేదీ ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు పేపర్-1.. అదే రోజు మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు పేపర్-2 పరీక్షలను నిర్వహించింది. అలాగే డిసెంబరు 16వ తేదీన ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వ‌ర‌కు పేపర్-​3 ప‌రీక్ష‌ను ,మధ్యాహ్నం 3:00 గంటల నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు  పేప‌ర్‌-4 పరీక్ష నిర్వహించింది.

TSPSC Group 2 results released : తెలంగాణ గ్రూప్‌-2 ఫలితాలు విడుదల

 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement