సాక్షి,హైదరాబాద్ : తెలంగాణ గ్రూప్-1 మెయిన్స్‌లో కాపీయింగ్ కలకలం రేపుతోంది. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మండలం మంగల్ పల్లి సీవీఆర్ ఇంజినీరింగ్ కళాశాలలో గ్రూప్-1 మెయిన్స్ పరీక్ష జరిగింది. అయితే పరీక్షలో కాపీయింగ్ చేస్తూ మహిళా అభ్యర్థి ఇస్లవత్ లక్ష్మి పట్టుబడ్డారు.
చీర కొంగులో చిట్టీలు అతికించుకొచ్చిన అభ్యర్థి పరీక్ష జరిగే సమయంలో కాపీయింగ్‌కు పాల్పడ్డారు. అయితే కాపియింగ్‌కు పాల్పడే సమయంలో పోలీసులు అధిపులోకి తీసుకున్నారు.మహబూబ్ నగర్‌లో ఎస్‌జీటీ టీచర్‌గా పనిచేస్తున్న ఇస్లావత్ లక్ష్మీపై టీజీపీఎస్‌ఈ నిబంధనల ప్రకారం అధికారులు చర్యలు తీసుకోనున్నారు.
27 వరకు గ్రూప్-1 మెయిన్స్ పరీక్షలు
తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ గ్రూప్ -1 మెయిన్స్ పరీక్షలు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. అక్టోబర్ 21న ప్రారంభమైన పరీక్షలు అక్టోబర్ 27 వరకు కొనసాగనున్నాయి. ఈ పరీక్షల నిర్వహణ కోసం హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ మల్కాజ్‌గిరి జిల్లాల్లో 46 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. అందులో రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మండలం మంగల్‌పల్లిలో సీవీఆర్ ఇంజనీరింగ్ కాలేజ్ కూడా ఉంది.
Comments
Please login to add a commentAdd a comment