
సాక్షి,హైదరాబాద్ : తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TSPSC) తెలంగాణ గ్రూప్-1 పరీక్ష ఫలితాలు విడుదలయ్యాయి. అభ్యర్థి లాగిన్‌లో ప్రొవిజనల్ మార్కులు చూసుకునే అవకాశం ఉంది.
మొత్తం 563 పోస్టులకుగానూ గత ఏడాది అక్టోబర్‌లో జరిగిన మెయిన్స్‌కు 21,093 మంది అభ్యర్థులు హాజరయ్యారు,అభ్యర్థులు సాధించిన మార్కుల ఆధారంగా 1:2 నిష్పత్తిలో మెరిట్ జాబితా సిద్ధం చేసేందుకు కమిషన్ తుది పరిశీలన నిర్వహిస్తోంది. ఇక రేపు గ్రూప్-2 అభ్యర్థుల జనరల్ ర్యాంకింగ్ లిస్ట్, 14న గ్రూప్-3 పరీక్ష జనరల్ ర్యాంకింగ్ జాబితాను రిలీజ్ చేయనున్నారు.
ఫలితాల విడుదల షెడ్యూల్
మార్చి 10 - గ్రూప్-1 ఫలితాల విడుదల, ప్రొవిజినల్ మార్కుల వెల్లడింపు.
మార్చి 11 - గ్రూప్-2 జనరల్ ర్యాంకింగ్ జాబితా విడుదల.
మార్చి 14 - గ్రూప్-3 జనరల్ ర్యాంకింగ్ జాబితా విడుదల.
మార్చి 17 - హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ తుది ఫలితాల ప్రకటన.
మార్చి 19 - ఎక్స్‌టెన్షన్ ఆఫీసర్ తుది ఫలితాల విడుదల.
అభ్యర్థుల ధ్రువీకరణ పత్రాల పరిశీలన గ్రూప్-1 ఫలితాల విడుదల అనంతరం చేపట్టనున్నారు.
గతేడాది అక్టోబర్‌లో మెయిన్స్
తెలంగాణ గ్రూప్-1 మెయిన్స్ పరీక్షలను అక్టోబర్ 21 నుంచి అక్టోబర్ 27వ తేదీ వరకూ తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ మెయిన్స్ పరీక్షలను నిర్వహించింది. గ్రూప్-1 మెయిన్స్ పరీక్షల్ని అధికారులు పకడ్బందీగా నిర్వహించారు. ఉమ్మడి హైదరాబాద్,రంగారెడ్డి జిల్లాలో 46 పరీక్ష కేంద్రాలను కేటాయించారు. 2011 సంవత్సరం తర్వాత గ్రూప్-1 మెయిన్స్ పరీక్షల కోసం తెలంగాణ ప్రభుత్వం బయోమెట్రిక్ కోసం ప్రత్యేక సిబ్బందిని నియమించింది. పరీక్ష కేంద్రాలు, పరిసర ప్రాంతాల్లో సీసీ కెమెరాలను ఏర్పాటు చేసింది. పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలు చేసింది.హైదరాబాద్,రంగారెడ్డి,మేడ్చల్ కేంద్రాల్లో ఐపీఎస్ అధికారాలకు బాధ్యతలు అప్పగించింది.
Comments
Please login to add a commentAdd a comment