Group1 Mains
-
group-1 : ఎగ్జామ్‌లో కాపీ..చీరకొంగులో చిట్టీలు..పట్టుబడ్డ అభ్యర్థి
సాక్షి,హైదరాబాద్ : తెలంగాణ గ్రూప్-1 మెయిన్స్‌లో కాపీయింగ్ కలకలం రేపుతోంది. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మండలం మంగల్ పల్లి సీవీఆర్ ఇంజినీరింగ్ కళాశాలలో గ్రూప్-1 మెయిన్స్ పరీక్ష జరిగింది. అయితే పరీక్షలో కాపీయింగ్ చేస్తూ మహిళా అభ్యర్థి ఇస్లవత్ లక్ష్మి పట్టుబడ్డారు.చీర కొంగులో చిట్టీలు అతికించుకొచ్చిన అభ్యర్థి పరీక్ష జరిగే సమయంలో కాపీయింగ్‌కు పాల్పడ్డారు. అయితే కాపియింగ్‌కు పాల్పడే సమయంలో పోలీసులు అధిపులోకి తీసుకున్నారు.మహబూబ్ నగర్లో ఎస్జీటీ టీచర్‌గా పనిచేస్తున్న ఇస్లావత్ లక్ష్మీపై టీజీపీఎస్ఈ నిబంధనల ప్రకారం అధికారులు చర్యలు తీసుకోనున్నారు. 27 వరకు గ్రూప్-1 మెయిన్స్ పరీక్షలుతెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ గ్రూప్ -1 మెయిన్స్ పరీక్షలు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. అక్టోబర్ 21న ప్రారంభమైన పరీక్షలు అక్టోబర్ 27 వరకు కొనసాగనున్నాయి. ఈ పరీక్షల నిర్వహణ కోసం హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాల్లో 46 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. అందులో రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మండలం మంగల్‌పల్లిలో సీవీఆర్ ఇంజనీరింగ్ కాలేజ్ కూడా ఉంది. -
గ్రూప్-1 డిమాండ్లపై ప్రభుత్వం అప్రమత్తం.. నేడు కీలక ప్రకటన
-
ఏపీ: గ్రూప్-1 ఇంటర్వ్యూలపై హైకోర్టు స్టే
సాక్షి, అమరావతి: గ్రూప్-1 ఇంటర్వ్యూ ప్రక్రియపై ఆంధ్రప్రదేశ్ హైకోర్టు స్టే విధించింది. ఇంటర్వ్యూను నాలుగు వారాలపాటు నిర్వహించకూడదని న్యాయస్థానం తీర్పు వెలువరించింది. గ్రూప్-1 మెయిన్స్ పరీక్షల జవాబు పత్రాలను డిజిటల్ విధానంలో వాల్యుయేషన్ చేయడాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్‌పై విచారణ చేపట్టిన హైకోర్టు ఈ మేరకు బుధవారం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. షెడ్యూల్ ప్రకారం రేపటి నుంచి ఇంటర్వ్యూలు జరగాల్సి ఉండగా హైకోర్టు తీర్పుతో వాయిదా పడింది. నాలుగు వారాల్లో కౌంటర్ దాఖలు చేయాలని ఏపీ పబ్లిక్ కమిషన్‌ను ఆదేశించింది. కాగా గ్రూప్-1 మెయిన్స్ పరీక్షల నిర్వహణలో అక్రమాలు జరిగాయని హైకోర్టులో పిటిషన్ దాఖలైన విషయం తెలిసిందే. నిబంధనల ప్రకారం పరీక్షలు జరగలేదని పిటిషనర్ తరపు న్యాయవాది వాదనలు వినిపించారు. డిజిటల్ వాల్యూయేషన్ గురించి చివరి దశలో చెప్పారన్నారు. అయితే నిబంధనల ప్రకారమే గ్రూప్-1 పరీక్షలు జరిగాయని, వాల్యూయేషన్ గురించి ముందుగా చెప్పాల్సిన అవసరం లేదని ప్రభుత్వం తరపున వ్యాయవాది వాదనలు హైకోర్టుకు తెలిపారు. ఇక ఇరు వాదనలు విన్న హైకోర్టు మంగళవారం తీర్పును రిజర్వ్‌లో ఉంచింది. గ్రూప్-1 ఇంటర్వ్యూ ప్రక్రియపై స్టే విధిస్తూ ఇవాళ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. చదవండి: అందరికీ అభినందనలు తెలియజేస్తున్నా: సీఎం జగన్ -
ఆగస్టు 17 నుంచి గ్రూప్1 మెయిన్స్
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో గ్రూప్1–2016 నోటిఫికేషన్‌కు సంబంధించి మెయిన్స్ పరీక్షలు ఆగస్టు 17వ తేదీ నుంచి నిర్వహించాలని ఏపీపీఎస్సీ నిర్ణయించింది. ఈమేరకు ఏపీపీఎస్సీ కార్యదర్శి వైవీఎస్టీ సాయి ఒక ప్రకటన విడుదల చేశారు. మొత్తం ఆరు పేపర్లుంటాయి. ఒక్కో పేపర్‌ను 150 మార్కులకు నిర్వహిస్తారు. ఉదయం 10 నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు ఈ పరీక్షలు జరుగుతాయి. 17న జనరల్ ఇంగ్లిష్, 19న పేపర్–1, 21న పేపర్–2, 23న పేపర్ 3, 26న పేపర్ 4, 28న పేపర్–5 పరీక్షలుంటాయి. జూనియర్ లెక్చరర్ల (ఎకనమిక్స్) సవరణ జాబితా విడుదల ఇలా ఉండగా ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో ఎకనమిక్స్ లెక్చరర్ పోస్టుల భర్తీకి 2011లో పరీక్షలు నిర్వహించి ఇంటర్వూ్యలు కూడా పూర్తిచేసిన నోటిఫికేషన్లో న్యాయస్థానం ఆదేశాలను అనుసరించి సవరణ జాబితాను ఏపీపీఎస్సీ శుక్రవారం రాత్రి విడుదల చేసింది. మొదటి ఎంపికకు సంబంధించి ట్రిబ్యునల్ ఇచ్చిన ఆదేశాల మేరకు 96 మందికి మే 1 నుంచి ఇంటర్వూ్యలు నిర్వహించి 95 మందితో తాజా జాబితాను విడుదల చేశారు. 19నుంచి డిçప్యూటీ సర్వేయర్లు, డ్రాఫ్ట్స్మెన్ల సర్టిఫికెట్ల పరిశీలన అసిస్టెంటు అర్కిటెక్చరల్ డ్రాఫ్ట్స్‌మెన్, సర్వేయర్, డిప్యూటీ సర్వేయర్ పోస్టులకు సంబంధించి అర్హత సాధించిన అభ్యర్ధుల ధ్రువపత్రాల పరిశీలన ఈనెల 19వ తేదీనుంచి నిర్వహించనున్నట్లు ఏపీపీఎస్సీ శనివారం ప్రకటించింది. ఈనెల 21వరకు మొత్తం 297 మంది ధ్రువపత్రాల పరిశీలన ఉంటుంది. తేదీల వారీగా ఉదయం మధ్యాహ్నం వేళల వారీగా పరిశీలనకు రావలసిన ఆయా అభ్యర్ధుల జాబితాను ఏపీపీఎస్సీ వెబ్సైట్లో పొందుపరిచింది.