
‘క్లియర్ టెల్లిజెన్స్’ సెంటర్‌ను ప్రారంభిస్తున్న మంత్రి శ్రీధర్‌బాబు, కంపెనీ ప్రతినిధులు
పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు వెల్లడి
క్లియర్‌టెల్లిజెన్స్ ఇండియా డెలివరీ అండ్ ఆపరేషన్స్ సెంటర్ ప్రారంభం
సాక్షి, హైదరాబాద్: ఉగాది తర్వాత ఏఐ సిటీ నిర్మాణానికి మహేశ్వరంలో భూమిపూజ చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు మంత్రి శ్రీధర్‌బాబు చెప్పా రు. మాదాపూర్‌లోని ఐటీసీ కోహినూర్‌లో శుక్రవారం క్లియర్‌టెల్లిజెన్స్ ఇండియా డెలివరీ అండ్ ఆపరేషన్స్ కేంద్రాన్ని ఆయన లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ భావితరాల అవసరాలకు అనుగుణంగా, సుస్థిరాభివృద్ధి లక్ష్యంగా తమ ప్రభుత్వం కృషి చేస్తోందని మంత్రి పేర్కొన్నారు. ఫ్యూచర్ సిటీలోనే 200 ఎకరాల్లో ఏఐ సిటీని నిర్మిస్తున్నట్లు వివరించారు.
అంతర్జాతీయ ప్రమాణాలతో ఏఐ సిటీ నిర్మితం అవుతుందని.. ఈ సిటీలో పెట్టుబడులు పెట్టేందుకు ఇప్ప టికే టెక్ దిగ్గజ సంస్థలు ఆసక్తి వ్యక్తం చేశాయని మంత్రి తెలిపారు. ఏఐ, డేటా ఇంజనీరింగ్, బిజినెస్ ఇంటెలిజెన్స్, క్లౌడ్ సొల్యూషన్స్ తదితర రంగాల్లో సేవలు అందించే క్లియర్ టెల్లిజెన్స్ సంస్థ తమ భారత శాఖను హైదరాబాద్‌లో ఏర్పాటు చేయడంపై శ్రీధర్‌బాబు హర్షం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో క్లియర్ టెల్లిజెన్స్ సీఈఓ ఓవెన్ ఫ్రివోడ్, మేనేజింగ్ పార్ట్‌నర్ అనిల్ భరాడ్వా, డైరెక్టర్ మురళి తదితరులు పాల్గొన్నారు.