సాక్షి, హైదరాబాద్: పేదలు, మధ్యతరగతి ప్రజల సంక్షేమమే తమ ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు. మూసీ ప్రక్షాళనపై విపక్షాలు ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. మూసీ రివర్ ఫ్రంట్ కార్పొరేషన్ తెచ్చిందే బీఆర్‌ఎస్ ప్రభుత్వమని తెలిపారు. మూసీలో అక్రమ కట్టడాలు గుర్తించాలని గతంలో కేసీఆర్ ఆదేశించలేదా అని ప్రశ్నించారు. మూసీని కాలుష్య రహితంగా చేయాలని కేసీఆర్ చెప్పలేదా అని మండిపడ్డారు. గతంలో బీఆర్‌ఎస్ నేతలు చేసిన పనులు మర్చిపోయినట్లున్నారని సెటైర్లు వేశారు.
ఈ మేరకు మంత్రి మంగళవారం హైదరాబాద్‌లో మాట్లాడుతూ.. 2021లో మూసీపై కేసీఆర్ ప్రభుత్వం సమావేశాలు పెట్టిందని తెలిపారు. మూసీకి 50 మీటర్ల దూరంలో బఫర్ జోన్‌ను నిర్ణయించారన్నారు. మాస్టర్ ప్లాన్ పూర్తి చేయాలని హైదరాబాద్, రంగారెడ్డి జిల్లా కలెక్టర్లను ఆదేశించారని ప్రస్తావించారు. బీఆర్‌ఎస్ హయాంలోనే మూసీకి సరిహద్దులను ఫిక్స్ చేశారని గుర్తు చేశారు. ఇప్పుడు మూసీ ప్రక్షాళన ఎందుకని బీఆర్‌ఎస్ వాళ్లు ప్రశ్నిస్తున్నారని అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment