సాక్షి, హైదరాబాద్: గ్రూప్ 2 వాయిదా వేసే యోచనలో తెలంగాణ సర్కార్ ఉన్నట్లు సమాచారం. నిరుద్యోగుల నుంచి నిరసన వ్యక్తం కావడం తో వాయిదాపై ప్రభుత్వం ఆలోచన చేస్తోంది. శుక్రవారం సాయంత్రం ప్రొఫెసర్ హరగోపాల్, కోదండరాం, ఆకునూరి మురళితో సీఎం రేవంత్ సమీక్ష నిర్వహించనున్నారు. సాయంత్రం గ్రూప్-2 వాయిదాపై ప్రకటన చేసే అవకాశం ఉంది.
గ్రూప్-2 పరీక్షను ఆగస్టులో నిర్వహించాల్సి ఉండగా, డీఎస్సీ పరీక్షలు పూర్తయిన వెంటనే గ్రూప్ 2 పరీక్షలు ఉండడం, పరీక్షలు వాయిదా వేయాలని అభ్యర్థుల నుంచి విజ్ఞప్తులు వస్తుండడంతో గ్రూప్-2ను వాయిదా వేయాలని ప్రభుత్వం భావిస్తోంది. 783 గ్రూప్ 2 పోస్టుల భర్తీకి 2022 డిసెంబర్ లో టీఎస్పీఎస్సీ నోటిఫికేషన్ రిలీజ్ చేసిన చేసింది. కానీ వివిధ కారణాలతో పలుమార్లు వాయిదా పడిన సంగతి తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment