results announced
-
జూనియర్ లెక్చరర్, లాబ్ టెక్నీషియన్ పరీక్షల ఫలితాలు విడుదల
సాక్షి,హైదరాబాద్: జూనియర్ లెక్చరర్ పోస్టులు నియామక పరీక్ష తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ విడుదల చేసింది. ఈ మేరకు సోమవారం ఓ ప్రకటనలో పేర్కొంది. ఫలితాలను వెబ్సైట్లో పెట్టినట్లు తెలిపింది. తెలంగాణలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో 1,392 జూనియర్ లెక్చరర్ పోస్టుల భర్తీకి పరీక్ష నిర్వహించారు. ఇక.. సెప్టెంబర్ 12 నుంచి అక్టోబర్ 3 వరకు వివిధ తేదీల్లో కంప్యూటర్ ఆధారితంగా ఈ పరీక్ష నిర్వహించిన విషయం తెలిసిందే. తాజాగా ఈ పరీక్షలో అభ్యర్థులు సాధించిన మార్కుల ఆధారంగా జనరల్ ర్యాంకుల జాబితాను సబ్జెక్టుల వారీగా టీజీపీఎస్సీ విడుదల చేసింది.అదేవిధంగా ల్యాబ్ టెక్నీషియన్ పరీక్ష ఫలితాలను తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ విడుదల చేసింది. రేపు ల్యాబ్ టెక్నీషియన్ల టీజీపీఎస్సీ ముట్టడి నేపథ్యంలో ముందుగానే కమిషన్ ఫలితాలు విడుదల చేసింది. ఫలితాలను వెబ్సైట్లో పెట్టినట్లు తెలిపింది. -
జూన్ 4న సినిమా థియేటర్లలో ఎన్నికల ఫలితాలు
దేశంలో సార్వత్రిక ఎన్నికల ప్రక్రియ ముగింపు దశకు చేరింది. ఎన్నికల్లో భాగంగా ఆఖరి విడత పోలింగ్ శనివారం జరుగనుంది. కేంద్ర పాలిత ప్రాంతం చండీగఢ్‌తో పాటు బిహార్, హిమాచల్‌ప్రదేశ్, జార్ఖండ్, ఒడిశా, పంజాబ్, ఉత్తరప్రదేశ్, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లోని 57 లోక్‌సభ స్థానాలకు నేడు పోలింగ్ జరగనుంది. ఇక అందరి దృష్టి ఎన్నికల ఫలితాలపైనే ఉంది.జూన్ 4న ఓట్ల లెక్కింపుపై అందరి దృష్టి ఉంది. ఈ క్రమంలో జూన్ 1న సాయంత్రం పలు న్యూస్ చానెళ్లు కూడా ఎగ్జిట్ పోల్స్ పేరుతో గణాంకాలను విడుదల చేయనున్నాయి. ఈ తతంగం ముగిసిన తర్వాత జూన్ 4న ఫలితాలు కోసం యావత్ దేశం టీవీలు, ఫోన్లకు అతుక్కుపోతుంది. అయితే, ఎన్నికల ఫలితాలు లైవ్‌లోనే బిగ్ స్క్రీన్‌పై ప్రసారమైతే..? ఆ అనుభూతి ఎలా ఉంటుంది..? ఇప్పుడు మహారాష్ట్రలోని కొన్ని సినిమా థియేటర్లు ఈ ప్లాన్‌నే అమలు చేయబోతున్నాయి. ముంబైలో ఎస్ఎం 5 కళ్యాణ్, సియాన్,నాగ్‌పుర్‌లోని మూవీమ్యాక్స్ ఎటర్నిటీ, కంజూర్‌మార్గ్‌లోని మూవీమ్యాక్స్, థానేలోని ఎటర్నిటీ మాల్, వండర్ మాల్,పుణెలోని మూవీమ్యాక్స్, మీరా రోడ్ ప్రాంతంలోని మూవీమాక్స్ చైన్ ఆఫ్ థియేటర్లు జూన్ 4వ తేదీన ఎన్నికల ఫలితాలను ప్రదర్శిస్తాయి. ఇందుకోసం ఇప్పటికే ఆన్లైన్లో టికెట్ల విక్రయాలు కూడా జరిగిపోయాయి. ఉదయం 9గంటల నుంచి ఆ థియేటర్లలోకి అనుమతిస్తారు. సుమారు 6గంటల పాటు థియేటర్లో ఎన్నికల ఫలితాలను ప్రదర్శిస్తారు. టికెట్ ధర రూ. 99 నుంచి రూ. 300 వరకు ఉంటుంది. బిగ్ స్క్రీన్‌పై ఎన్నికల ఫలితాలు చూడాలని ఆశించేవారి సంఖ్య కాస్త ఎక్కువగానే ఉంది. దీంతో చాలా థియేటర్లు హౌస్‌ఫుల్ అయిపోయాయి. -
బంగ్లా పీఠంపై మళ్లీ హసీనాయే
ఢాకా: బంగ్లాదేశ్ సార్వత్రిక ఎన్నికల్లో అంతా ఊహించినట్టుగానే పాలక అవామీ లీగ్ నెగ్గింది. ఆదివారం పోలింగ్ జరగ్గా రాత్రికల్లా తొలి దశ ఫలితాలు వెలువడ్డాయి. 300 స్థానాలకు గాను ఇప్పటికే 200 చోట్ల నెగ్గి అవామీ లీగ్ మూడింట రెండొంతుల మెజారిటీ సాధించింది. దాంతో ప్రధానిగా షేక్ హసీనా వరుసగా నాలుగోసారి పగ్గాలు చేపట్టనున్నారు. ప్రధాన ప్రతిపక్షం బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీతో పాటు విపక్షాలన్నీ బహిష్కరించిన ఈ ఎన్నికలపై జనం పెద్దగా ఆసక్తి చూపలేదు. దాంతో కేవలం 40 శాతం ఓటింగ్ నమోదైనట్లు ఎన్నికల సంఘం ప్రకటించారు. సాయంత్రం పోలింగ్ ముగియగానే ఓట్ల లెక్కింపు చేపట్టి ఫలితాలు ప్రకటించారు. బంగ్లాదేశ్‌లో 2018 సాధారణ ఎన్నికల్లో 80 శాతానికి పైగా ఓటింగ్ నమోదైంది. ఈసారి అది ఏకంగా సగానికి పడిపోవడం గమనార్హం. మొత్తం 300 నియోజకవర్గాలకు గాను 299 చోట్ల పోలింగ్ నిర్వహించారు. ఒక స్థానంలో అభ్యర్థి మరణించడంతో ఎన్నిక వాయిదా వేశారు. 27 పార్టీల నుంచి 1,500 మందికిపైగా అభ్యర్థులు బరిలో నిలిచారు. 436 మంది స్వతంత్ర అభ్యర్థులుగా పోటీ చేశారు. హసీనా 2009 నుంచి అధికారంలో కొనసాగుతున్నారు. భారత్ పొరుగుదేశం కావడం అదృష్టం ప్రతిపక్ష బంగ్లాదేశ్ నేషనలిస్టు పారీ్ట–జమాత్–ఇ–ఇస్లామీ కూటమికి ప్రజాస్వామ్యం పట్ల విశ్వాసం లేదని ప్రధాని షేక్ హసీనా విమర్శించారు. ఓటు వేసిన అనంతరం ఆమె మీడియాతో మాట్లాడారు. ప్రజలు స్వేచ్ఛగా ఓటు వేసే వాతావరణం కల్పించామని చెప్పారు. భారత్ తమకు అత్యంత నమ్మకమైన మిత్రదేశమని చెప్పారు. భారత్ లాంటి దేశం పొరుగున ఉన్నందుకు తాము చాలా అదృష్టవంతులమని స్పష్టం చేశారు. బంగ్లాదేశ్ స్వాతంత్య్ర ఉద్యమానికి భారత్ ఎంతగానో సహకరించిందని చేశారు. 1975 ఆగస్టులో తన తండ్రిని, తల్లిని, ముగ్గురు సోదరులను, ఇతర కుటుంబ సభ్యులను సైనికాధికారులు దారుణంగా హత్య చేశారని పేర్కొన్నారు. -
APEAP సెట్-2023 ఫలితాలు విడుదల.. సత్తాచాటిన ఏపీ విద్యార్థులు
-
ఏపీ ఈఏపీసెట్ ఫలితాల విడుదల.. డైరెక్ట్ లింక్ ఇదే..
సాక్షి, అమరావతి/అనంతపురం: రాష్ట్రంలోని ఇంజినీరింగ్, వ్యవసాయ, ఫార్మా కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించిన ఏపీఈఏపీ సెట్–2023 ఫలితాలను విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ విడుదల చేశారు. ►ఇంజనీరింగ్‌లో 76.32 శాతం మంది ఉత్తీర్ణత ►అగ్రికల్చర్ 89.65 శాతం మంది ఉత్తీర్ణత ఇంజనీరింగ్‌లో మొత్తం 2,24,724 మందికి గానూ 1,71,514 మంది అభ్యర్థులు క్వాలిఫై అయ్యారు. అగ్రికల్చర్లో 90,573 మందికి గానూ, 81,203 మంది అభ్యర్థులు క్వాలిపై అయ్యారు. ఇంజనీరింగ్ విభాగంలో అత్యధిక మార్కులు సాధించిన టాప్ టెన్ జాబితాలో ఈసారి అంతా బాలురే ఉన్నారు. ఇంజనీరింగ్ విభాగం మొదటి ర్యాంకు158 మార్కులతో ఉమేష్ వరుణ్ అగ్రస్థానంలో ఉన్నారు. తెలంగాణా ఎమ్ సెట్లో కూడా వరుణ్ మూడవ ర్యాంకు సాధించారు. విద్యార్థులకు అభినందనలు:బొత్స ఏపీఈఏపీ సెట్లో ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులకి అభినందనలు తెలిపారు ఏపీ విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ. ప్రతీ విద్యార్ధి గ్లోబల్ స్ధాయికి ఎదగాలన్నది సీఎం వైఎస్ జగన్ ప్రయత్నమని చెప్పారు. విద్యలో ప్రవేశపెట్టిన ప్రతీ సంక్షేమ పథకం విద్యార్దుల మంచి భవిష్యత్ కోసమేనని అన్నారు. దేశంలోనే టాప్ రాష్ట్రంగా ఏపీని ఉంచుతామని విశ్వాసం వ్యక్తం చేశారు. విద్య కోసం వెచ్చించే ప్రతీ రూపాయి రాష్ట్ర అభివృద్ధికే ఉపయోగపడుతుందని చెప్పారు. విద్య పట్ల ప్రతీ ఒక్కరికి శ్రద్ధ పెరిగిందని అన్నారు. గత నెల 15 నుంచి 23 వరకు జరిగిన ప్రవేశ పరీక్షలకు మొత్తం 3,38,739 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగా.. 3,15,297 మంది పరీక్షలకు హాజరయ్యారు. ఇందులో ఎంపీసీ స్ట్రీమ్‌లో 2,38,180 మందికి గాను 2,24,724 మంది, బైపీసీ స్ట్రీమ్‌లో 1,00,559 మందికి గాను 90,573 మంది పరీక్ష రాశారు. కోవిడ్ సమయంలో తొలగించిన ఇంటర్మీడియెట్ వెయిటేజ్ మార్కులను ఈసారి పరిగణలోకి తీసుకుని ఫలితాలను ప్రకటించారు. డైరెక్ట్ లింక్ ఇదే.. ఇంజనీరింగ్ ఫలితాలు అగ్రికల్చర్ ఫలితాలు -
ఉత్తమ ఫలితాలు...అద్భుత ప్రతిభ...
-
ఏపీ ఎడ్ సెట్ ఫలితాలు విడుదల
సాక్షి, విశాఖపట్నం: ఏపీ ఎడ్‌సెట్ ఫలితాలు మంగళవారం విడుదలయ్యాయ విశాఖపట్నంలో ఏపీ ఎడ్ సెట్ ఫలితాలను కన్వీనర్ విశ్వేశ్వర్ రావు విడుదల చేశారు. ఈ ఏడాది ఎడ్ సెట్‌కు 15,638 మంది దరఖాస్తు చేసుకున్నారు. వీరిలో 13,619 మంది పరీక్షకు హాజరయ్యారు. ఎడ్‌సెట్ ఫలితాల్లో 13,428 మంది అంటే.. 98.60 శాతం మంది అభ్యర్థులు అర్హత సాధించినట్టుట్లు కన్వీనర్ విశ్వేశ్వర్రావు వెల్లడించారు. గతేడాది డాటా ప్రకారం 42 వేల సీట్లు అందుబాటులో ఉన్నాయి. కౌన్సెలింగ్ తేదీలను త్వరలోనే ప్రకటించనున్నట్లు ఆంధ్రప్రదేశ్ ఉన్నత విద్యా మండలి పేర్కొంది. చదవండి: దుర్గమ్మకు పట్టువస్త్రాలు సమర్పించిన సీఎం జగన్ -
ఏపీ ఐసెట్, ఈసెట్ ఫలితాలు విడుదల
-
ఏపీ ఐసెట్, ఈసెట్ ఫలితాలు విడుదల
సాక్షి, అమరావతి: ఎంబీఏ, ఎంసీఏ కోర్సులలో ప్రవేశానికి సంబంధించిన ఏపీ ఐసెట్–2021, ఏపీ ఈసెట్ 2021 ఫలితాలు శుక్రవారం విడుదల అయ్యాయి. విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ ఈ ఫలితాలను విడుదల చేశారు. మంగళగిరిలోని ఉన్నత విద్యామండలి కార్యాలయంలో ఉదయం 11కి ఫలితాలను విడుదల చేశారు. ఐసెట్ ఫలితాల్లో 34,789(91.27శాతం) మంది ఉత్తీర్ణత సాధించారు. ఈసెట్ ఫలితాల్లో 29,904 (92.53శాతం) మంది ఉత్తీర్ణులయ్యారు. సెప్టెంబర్ 17, 18 తేదీల్లో ఐసెట్, 19న ఈసెట్ పరీక్షలు నిర్వహించిన విషయం తెలిసిందే. విద్యార్థులు అడ్మిట్ కార్డు నంబర్, పాస్వర్డ్ ఎంటర్ చేసి https://education.sakshi.com/ లో ఫలితాలు చూడవచ్చు. ఈ సందర్భంగా మంత్రి ఆదిమూలపు సురేష్ మాట్లాడుతూ.. రికార్డు స్దాయిలో ఏపీ ఇంజనీరింగ్ సెట్, ఐసెట్ ఫలితాలను ప్రకటిస్తున్నామని మంత్రి ఆదిమూలపు సురేష్ తెలిపారు. ఐసెట్‌కు 42 వేల ధరఖాస్తు చేసుకున్నారని, 38 వేలమంది హాజరవ్వగా, 34789 మంది అర్హత సాధించారని పేర్కొన్నారు. దాదాపు 91 శాతం మంది అర్హత సాధించారని, పరీక్షా ఫలితాలని రేపటి నుంచి విద్యార్దులకి వెబ్సైట్లో అందుబాటులో ఉంచుతామని వెల్లడించారు. అదే విధంగా ఏంబీఏ, ఎంసీఏలలో ప్రవేశాలకి నిర్వహించిన ఐ సెట్ అడ్మిషన్ల ప్రక్రియ త్వరలోనే ప్రారంభిస్తామని మంత్రి తెలిపారు. సెప్టెంబర్ 19న ఏపీ ఇంజనీరింగ్ సెట్ నిర్వహిస్తే పది రోజుల్లోనే ఫలితాలు ప్రకటిస్తున్నామన్నారు. ఇంజనీరింగ్ సెట్ నిర్వహించిన ఆంద్రా యూనివర్సిటీకి అభినందనలు తెలియజేశారు. త్వరలోనే ఇంజనీరింగ్ అడ్మిషన్ల ప్రక్రియ ప్రారంభిస్తామని పేర్కొన్నారు. కాగా త్వరలోనే లాసెట్ ఫలితాలు వెల్లడిస్తామన్నారు. రాష్ట్రంలోని అన్ని పీజీ ప్రవేశాలకి అన్ని యూనివర్సిటీలకి కూడా ఒకే ప్రవేశ పరీక్ష నిర్వహిస్తున్నామని చెప్పారు. ఏపీఈసెట్ ఫలితాలు ఇంజనీరింగ్ కోర్సుల్లో లేటరల్ ఎంట్రీ విధానంలో ప్రవేశాలు కల్పించేందుకు నిర్వహించిన ఏపీఈసెట్–2021 (ఏపీ ఇంజనీరింగ్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్) ఫలితాలు శుక్రవారం విడుదలయ్యాయి. జేఎన్టీయూ(ఏ) ఆధ్వర్యంలో నిర్వహించిన ఏపీఈసెట్ ఫలితాల వెల్లడి కార్యక్రమానికి రాష్ట్ర విద్యా శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్, ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ కె.హేమచంద్రారెడ్డి హాజరు అయ్యారు. ఏపీఈసెట్‌కు మొత్తం 32,318 మంది విద్యార్థులు హాజరు కాగా, మొత్తం 13 బ్రాంచులకు గాను పరీక్ష నిర్వహించారు. హైదరాబాద్ సహా రాష్ట్రవ్యాప్తంగా 48 పరీక్ష కేంద్రాల్లో కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ నిర్వహించారు. ఏపీ ఐసెట్-2021 ఫలితాల కోసం క్లిక్ చేయండి ఏపీ ఈసెట్-2021 ఫలితాల కోసం క్లిక్ చేయండి -
2019 సివిల్ సర్వీసెస్ ఫలితాల విడుదల
సాక్షి, ఢిల్లీ : ప్రతిష్టాతకమైన ఇండియన్ సివిల్ సర్వీసెస్ 2019కి సంబంధించిన తుది ఫలితాలు మంగళవారం యూపీఎస్సీ విడుదల చేసింది. ఈ మేరకు 829 మంది అభ్యర్థులు ప్రతిష్టాకమైన సివిల్ సర్వీసెస్‌కు ఎంపిక అయినట్లు యూపీఎస్సీ ప్రకటించింది. ఇందులో 304 జనరల్, 78 ఈబీసీ, 254 ఓబీసీ, ఎస్సీ 129, ఎస్టీ 67 మంది ఉన్నారు. కాగా సివిల్ సర్వీస్ ఫలితాల్లో ప్రదీప్ సింగ్ మొదటి ర్యాంక్, జతిన్ కిషోర్ రెండవ ర్యాంకు, ప్రతిభా వర్మ మూడవ ర్యాంక్ సాధించారు. కాగా అభ్యర్థులు తమ ఫలితాలను యూపీఎస్సీ వెబ్సైట్లో చూసుకోవచ్చు. సివిల్ సర్వీసెస్ ఫలితాల్లో తెలంగాణ యువకుడు తన సత్తా చాటాడు. రాజన్న సిరిసిల్ల జిల్లా గంబీరావుపేట మండలం భీమునిమల్లారెడ్డిపేటకు చెందిన మంద మకరంద్ ఆలిండియా 110 ర్యాంక్ సాధించాడు. ఈ ర్యాంక్‌తో మకరంద్‌కు ఐఏఎస్ వచ్చే అవకాశం ఉంది. కాగా మకరంద్ తల్లిదండ్రులిద్దరు ప్రభుత్వ ఉపాధ్యాయులు. ప్రస్తుతం మకరంద్ కుటుంబం సిద్దిపేటలో నివాసం ఉంటుంది. -
ఏపీ ఎస్సై ఫలితాలు: మహిళా టాపర్ ప్రజ్ఞ
సాక్షి, అమరావతి: పోలీస్ శాఖలోని వివిధ ఖాళీల భర్తీకి నిర్వహించిన రాత పరీక్షల్లో 333 మంది ఎంపికయినట్లు రాష్ట్ర హోంమంత్రి మేకతోటి సుచరిత తెలిపారు. ఈ పోస్టుల భర్తీకై మొత్తం లక్షా 35 వేల 414 మంది ధరఖాస్తు చేసుకున్నట్లు వెల్లడించారు. కాగా సబ్ ఇన్స్పెక్టర్ ఫలితాలను ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సోమవారం విడుదల చేసిన విషయం తెలిసిందే. అనంతరం పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించిన వారికి సీఎం, హోంమంత్రి శుభాకాంక్షలు తెలిపారు. పోలీస్ శాఖలో ఖాళీల భర్తీకి త్వరలో ప్రత్యేక డ్రైవ్ చేపడుతామని అన్నారు. రాష్ట్రంలోని పోలీస్ శాఖలో ఇంకా 17శాతం వివిధ కేటగిరీల ఖాళీలను భర్తీ చేయాల్సి ఉందన్నారు. ఈ సందర్భంగా సుచరిత మాట్లాడుతూ.. ‘ప్రిలిమినరీ పరీక్ష, ఫిజికల్ ఫిట్ నెస్ పరీక్షల్లో 32 వేల 745 మంది అర్హత సాధించారు. తదుపరి నిర్వహించిన ఫైనల్ రాత పరీక్షలో 333 మంది అభ్యర్ధులు ఎంపికయ్యారు. వారిలో సబ్ ఇన్ స్పెక్టర్ సివిల్ కు 149 మంది, రిజర్వు సబ్ ఇన్ స్పెక్టర్ ఆఫ్ పోలీస్(రిజర్వు) 75 మంది, రిజర్వు సబ్ ఇన్ స్పెక్టర్ ఆఫ్ పోలీస్ (ఎపీ స్పెషల్ పోలీస్) 75 మంది డిప్యూటీ జైలర్లు(పురుష) 10 మంది, డిప్యూటీ జైలర్(మహిళ) 4, స్టేషన్ ఫైర్ అధికారులు 20 మంది మొత్తం 333 మంది ఎంపికయ్యారు. రాత పరీక్షల్లో పరుచూరి మహేశ్ (నెల్లూరు), షేక్ హుస్సేన్ పీరా (కడప), పాలెం రవి కిశోర్(కడప) టాపర్లుగా నిలిచి ముగ్గురూ 255 మార్కులు సాధించారు. మహిళలు 15 వేల 775 మంది పరీక్షలకు దరఖాస్తు చేయగా వారిలో 61 మంది ఎంపికయ్యరూ. కృష్ణా జిల్లాకు చెందిన విశ్వనాధపల్లి ప్రజ్ఞ 224 మార్కులతో మహిళల్లో టాపర్ గా నిలిచారు. ఎంపికైన అభ్యర్ధులను వారి సర్టిఫికేట్లు పరిశీలన అనంతరం త్వరలో శిక్షణకు పంపండం జరుగుతుంది. పోలీస్ శాఖలో ఖాళీల భర్తీకి త్వరలో ప్రత్యేక డ్రైవ్ చేపడుతాం. వాటి భర్తీకి త్వరలో ప్రత్యేక రిక్రూట్మెంట్ డ్రైవ్ ను చేపడతాం. అని హోం మంత్రి సుచరిత వివరించారు. ఏపీ ఎస్సై ఫలితాలు విడుదల -
ఏపీ ఎస్సై ఫలితాలు విడుదల
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ సబ్ఇన్స్పెక్టర్ (ఎస్సై) ఫలితాలను ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సోమవారం విడుదల చేశారు. ఫలితాల కోసం ఎంతోమంది నిరుద్యోగులు నెలల తరబడి ఎదురుచూస్తున్న విషయం తెలిసిందే. వారి అభ్యర్థన మేరకు అసెంబ్లీ ఛాంబర్లో సీఎం జగన్ నేడు ఫలితాలను విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర హోంమంత్రి మేకతోటి సుచరిత, డీజీపీ గౌతమ్ సవాంగ్, ఇంటిలిజెన్స్ చీఫ్ కుమార్ విశ్వజిత్ తదితరులు పాల్గొన్నారు. గత పదినెలలుగా పెండింగ్‌లో ఉన్న పోలీస్ సబ్ ఇన్స్పెక్టర్ పోస్టుల ఫలితాలను సీఎం జగన్ విడుదల చేశారు. 333 సబ్ ఇన్స్పెక్టర్, సివిల్ రిజర్వ్ సబ్ ఇన్స్పెక్టర్ (ఏఆర్, ఏపీఎస్పీ), డిప్యూటీ జైలర్లు, స్టేషన్ ఫైర్ ఆఫీసర్ల ఫలితాలను రాష్ట్రస్థాయి పోలీస్ రిక్రూట్మెంట్ బోర్టు సోమవారం రిలీజ్చేసింది. మొత్తం 1,35,414 మంది అభ్యర్థులకు ఈ పోస్టుల కోసం పోటీపడ్డారు. ప్రిలిమినరీ పరీక్ష, ఫిజికల్ పరీక్షలు, పూర్తయ్యాక అందులో అర్హత పొందిన 32,745 మంది రాత పరీక్షకు హాజరయ్యారు. వీరంతా 149 సబ్ ఇన్స్పెక్టర్, 75 రిజర్వ్ సబ్ ఇన్స్పెక్టర్ (ఏఆర్) పోస్టులకు, 75 ఏపీ స్పెషల్ పోలీస్ విభాగానికి చెందిన రిజర్వ్ సబ్ ఇన్స్పెక్టర్ పోస్టులకు, 10 మంది డిప్యూటీ జైలర్ల, 20 స్టేషన్ ఫైర్ ఆఫీసర్ పోస్టులకు పోటీ పడ్డారు. నెల్లూరుకు చెందిన పరుచూరి రమేష్, కడపకు చెందిన షేక్ హూస్సేన్, రవికిషోర్ 255 మార్కులతో అగ్రస్థానంలో నిలిచారు. 15,775 మంది మహిళా అభ్యర్థులు పోటీపడగా 61 మంది ఎంపిక అయ్యారు. కృష్ణాజిల్లాకు చెందిన ప్రజ్ఞ 224 మార్కులతో టాపర్‌గా నిలిచారు. ధృవ పత్రాలు వెరిఫికేషన్ పూర్తయ్యాక ఎంపికైన వారికి శిక్షణ ఇవ్వనున్నారు. కాగా ఎస్ఐ పోస్టులకు ఎంపికయిన వారికి సీఎం వైఎస్ జగన్ శుభాకాంక్షలు తెలిపారు. -
10లో 9 బాలురవే..
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ఎంసెట్‌లో బాలురు సత్తా చాటారు. ఇంజనీరింగ్ విభాగం టాప్–10 ర్యాంకుల్లో 9 ర్యాంకులను బాలురే సాధించారు. ఇంజనీరింగ్‌లో టాప్ ర్యాంకును ఏపీకి చెందిన కురిశెట్టి రవి శ్రీతేజ కైవసం చేకున్నాడు. ఇంజనీరింగ్ టాప్ 10 ర్యాంకుల్లో ఐదు ర్యాంకులను తెలంగాణ విద్యార్థులు సాధించగా మరో ఐదు ర్యాంకులను ఏపీ విద్యార్థులు సాధించారు. అగ్రికల్చర్, ఫార్మసీ విభాగంలో భూపాలపల్లికి చెందిన ఎంపటి కుశ్వంత్ ఫస్ట్ ర్యాంకు సాధించాడు. ఈ విభాగంలోని టాప్–10 ర్యాంకులను సాధించిన వారిలో ఐదుగురు తెలంగాణ విద్యార్థులు ఉండగా ఏపీ నుంచి నలుగురు విద్యార్థులు ఉన్నారు. తెలంగాణ ఎంసెట్ ఫలితాలను ఆదివారం హైదరాబాద్ జేఎన్టీయూలో ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ తుమ్మల పాపిరెడ్డి విడుదల చేశారు. ఎంసెట్ కమిటీ చైర్మన్ ప్రొఫెసర్ వేణుగోపాల్‌రెడ్డి, ఎంసెట్ కన్వీనర్ ప్రొఫెసర్ యాదయ్యతో కలసి ఫలితాలను ఆయన విడుదల చేశారు. 82.47%.. 93.01%.. ఎంసెట్‌కు మొత్తంగా 2,17,199 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకోగా, అందులో 1,42,210 మంది ఇంజనీరింగ్ విద్యార్థులు, 74,989 మంది అగ్రికల్చర్, ఫార్మసీ విద్యార్థులు ఉన్నారు. అగ్రికల్చర్ పరీక్షలకు 1,31,209 మంది హాజరవగా అందులో 1,08,213 మంది (82.47 శాతం) అర్హత సాధించారు. అగ్రికల్చర్ ఫార్మసీ పరీక్షలకు 68,550 మంది హాజరుకాగా, వారిలో 63,758 మంది (93.01 శాతం) అర్హత సాధించారు. విద్యార్థుల ఎంసెట్ మార్కులకు 75 శాతం వెయిటేజీ, ఇంటర్ మార్కులకు 25 శాతం వెయిటేజీని అమలు చేశారు. ఈ పరీక్షలను ఆన్లైన్లో పలు దఫాలుగా నిర్వహించినందున నార్మలైజేషన్ చేసి విద్యార్థులకు ర్యాంకులను ఖరారు చేశారు. ఈ ఫలితాల్లో ఎంసెట్‌లో అర్హత సాధించిన విద్యార్థుల్లో టాప్–10 ర్యాంకులతోపాటు వివిధ కేటగిరీల్లో టాప్ ర్యాంకులను సాధించిన విద్యార్థుల వివరాలను కూడా ప్రకటించారు. 20 తరువాత కౌన్సెలింగ్ ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ తుమ్మల పాపిరెడ్డి మాట్లాడుతూ ఈ నెల 20 తరువాత ప్రవేశాల కౌన్సెలింగ్ నిర్వహిస్తామన్నారు. ఈసారి జేఎన్టీయూ, ఉస్మానియా, కాకతీయ వర్సిటీల పరిధిలో ఇంజనీరింగ్‌లో 90 వేల వరకే సీట్లు ఉంటాయని తెలిపారు. జేఎన్టీయూ వీసీ ప్రొఫెసర్ వేణుగోపాల్‌రెడ్డి మాట్లాడుతూ తమ వర్సిటీల పరిధిలో గతేడాది 86 వేల సీట్లు ఉండగా ఈసారి 77,500 వరకు సీట్లు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందన్నారు. ఎంసెట్ టాపర్ల అభిప్రాయాలు ఐఐటీలో సీటు సాధిస్తా.. నాకు ఇంటర్లో 985 మార్కులొచ్చాయి. క్రమపద్ధతిలో చదివినందుకు మంచి ర్యాంకు సాధించా. ఏపీ ఎంసెట్‌లో నాలుగో ర్యాంకు వచ్చింది. జేఈఈ మెయిన్స్‌లో 33వ ర్యాంకు వచ్చింది. జేఈఈ అడ్వాన్స్డ్ ఫలితాల కోసం ఎదురు చూస్తున్నా. ఐఐటీలో సీటు సాధిస్తా. – చంద్రశేఖర ఎస్ఎస్ హేతహవ్య, ఎంసెట్ రెండో ర్యాంకు కంప్యూటర్ ఇంజనీర్ అవుతా.. నాకు ఇంటర్లో 981 మార్కులు వచ్చాయి. ఏపీ ఎంసెట్‌లో 28వ ర్యాంకు వచ్చింది. జేఈఈ మెయిన్స్‌లో 117వ ర్యాంకు వచ్చింది. కంప్యూటర్ ఇంజనీర్ కావడం నా లక్ష్యం. – జి.ఆకాశ్‌రెడ్డి, మూడో ర్యాంకు రీసెర్చ్ అంటే ఇష్టం... మా నాన్న నాగవెంకట విశ్వనాథం ప్రైవేటు ఉద్యోగి. అమ్మ ప్రభుత్వ ఉపాధ్యాయురాలు. పదో తరగతిలో 10 పాయింట్లు సాధించా. ఇంటర్‌లోనూ 10 గ్రేడ్ పాయింట్లు వచ్చాయి. ఏపీ ఎంసెట్‌లో 3వ ర్యాంకు, జేఈఈ మెయిన్స్‌లో కూడా 3వ ర్యాంకు వచ్చింది. అడ్వాన్స్డ్ ఫలితాల కోసం చూస్తున్నా. నాకు పరిశోధనలంటే ఇష్టం. – భాను దత్త, ఎంసెట్ ఐదో ర్యాంకు ఐఐటీలో కంప్యూటర్ ఇంజనీరింగ్ చేస్తా... నాన్న శ్రీనివాస్‌కుమార్ రైల్వేలో సీనియర్ టెక్నికల్ ఇంజనీర్, కంప్యూటర్ సైన్స్ ఇంజనీర్ చేయాలనే నా లక్ష్యం. ఇంటర్లో 984 మార్కులు వచ్చాయి. జేఈఈలో 248 ర్యాంకు వచ్చింది. అడ్వాన్స్డ్ ఫలితాల కోసం ఎదురుచూస్తున్నా. – బి.సాయివంశీ, ఎంసెట్ ఆరో ర్యాంకు సివిల్స్ సాధిస్తా... నా తల్లిదండ్రులు ప్రభుత్వ ఉపాధ్యాయులుగా పనిచేస్తున్నారు. భవిష్యత్తులో సివిల్స్‌లో మంచి ఉద్యోగం సంపాదించాలనేది నా లక్ష్యం. జేఈఈ మెయిన్స్‌లో 125వ ర్యాంకు సాధించా. – గౌరిపెద్ది హితేంద్ర కశ్యప్, 8వ ర్యాంకు కార్డియాలజిస్ట్ కావాలనుకుంటున్నా... మా నాన్న వెంకట కిరణ్‌కుమార్ న్యూరో సర్జన్, అమ్మ నాగశ్రీదేవీ గృహిణి. పదో తరగతి, ఇంటర్‌లోనూ 10 గ్రేడ్ పాయింట్లు సాధించా. ఏపీ ఎంసెట్‌లో 107, నీట్లో 1292 ర్యాంకు వచ్చింది. కార్డియాలజిస్ట్ కావాలనేదే నా లక్ష్యం. – ఎం. వెంకటసాయి అరుణ్ తేజ, మూడో ర్యాంకు న్యూరో సర్జన్ కావడమే జీవితాశయం మా నాన్న లక్ష్మీనారాయణ రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. అమ్మ లక్ష్మి టైలరింగ్ చేస్తూ కుటుంబాన్ని పోషిస్తోంది. నీట్లో 55వ ర్యాంకు సాధించా. న్యూరో సర్జన్ కావాలనేది నా ఆశయం. – ఎంపటి కుశ్వంత్, ఫస్ట్ ర్యాంకు న్యూరో సర్జన్ అవుతా... మా నాన్న సూర్యభాస్కర రెడ్డి రైల్వే ఉద్యోగి. అమ్మ విజయశాంతి గృహిణి. పదో తరగతిలో 10 గ్రేడ్ పాయింట్లు, ఇంటర్‌లోనూ 10 గ్రేడ్ పాయింట్లు సాధించా. నీట్లో జాతీయ స్థాయిలో 528 ర్యాంకు, ఏపీ ఎంసెట్‌లో రెండో ర్యాంకు వచ్చింది. న్యూరో సర్జన్ అవుతా. – దాసరి కిరణ్‌కుమార్‌రెడ్డి, రెండో ర్యాంకు -
గుంటూరూలో ఫ్యాన్ ప్రభంజనం
సాక్షి,గుంటూరు : జన హృదయం మురిసింది.. జననేతకు ఘన విజయం కట్టబెట్టింది. టీడీపీ కంచుకోటలను సైతం బద్దలుకొట్టి 15 నియోజకవర్గాల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపించింది. గత ఎన్నికల్లో 12 స్థానాలు సాధించిన టీడీపీని రెండు స్థానాలకే పరిమితం చేసింది. జిల్లా నుంచి ఎన్నికల బరిలో నిలిచిన ముగ్గురు మంత్రులు నారా లోకేష్, ప్రత్తిపాటి పుల్లారావు, నక్కా ఆనందబాబులను ఇంటిదారి పట్టించింది. డబుల్ హ్యాట్రిక్ సాధిస్తాడనుకున్న ధూళిపాళ్ల నరేంద్రకు ఓటమి రుచిచూపింది. స్పీకర్‌గా పనిచేసిన కోడెల శివప్రసాద్, మైనింగ్ మాఫియా కింగ్ యరపతినేని, ఇసుక, మట్టి దోపిడీలతో చెలరేగిన టీడీపీ సిట్టింగ్ ఎమ్మెల్యేలను ఓటమి బాట పట్టించింది. మరోవైపు ఎంపీ స్థానాల్లోనూ వైఎస్సార్ సీపీని విజయ బాటలో నిలిపింది. జననేత వైఎస్ జగన్ ప్రభుత్వంలో అందించే నవరత్నాల సంక్షేమ పాలనకు పూలబాట పరిచింది. జిల్లా ప్రజలు వైఎస్ జగన్మోహన్రెడ్డికి జై కొట్టారు.. అవినీతి, అరాచక పాలనకు ఓటుతో బుద్ధి చెప్పారు. దివంగత మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డిని ముఖ్యమంత్రిని చేసేందుకు 2004లో 19 అసెంబ్లీ నియోజకవర్గాలకు 18 స్థానాలతో జిల్లా ప్రజలు మద్దతు తెలిపిన విషయం తెలిసిందే. 15 ఏళ్ల తరువాత రాజన్న బిడ్డ వైఎస్ జగన్మోహన్రెడ్డిని ముఖ్యమంత్రిని చేసుకునేందుకు జిల్లాలో ఉన్న 17 అసెంబ్లీ స్థానాలకు 15 స్థానాల్లో వైఎస్సార్ సీపీ అభ్యర్థులను గెలిపించి మరోసారి రాజన్న కుటుంబంపై తమ అభిమానం చాటుకున్నారు. 2014లో టీడీపీ అధికారంలోకి వచ్చిన తరువాత గుంటూరు జిల్లాలో రాజధాని నిర్మాణం చేపట్టిన విషయం తెలిసిందే. రాజధాని నియోజకవర్గాలైన మంగళగిరి, తాడికొండ, పెదకూరపాడు నియోజకవర్గాల్లో సైతం టీడీపీ ఓటమి చెందిందంటే ప్రజల్లో టీడీపీపై ఏస్థాయిలో వ్యతిరేకత ఉందో అర్థం చేసుకోవచ్చు. జిల్లాలో టీడీపీకి కంచుకోటలుగా ఉన్న నియోజకవర్గాల్లో సైతం వైఎస్సార్ సీపీ అభ్యర్థులు భారీ మెజార్టీలతో విజయకేతనాలు ఎగురవేశారు. జిల్లాలో ముగ్గురు మంత్రులు, స్పీకర్‌తోపాటు మాజీ మంత్రులు, ముఖ్యనేతలను ప్రజలు మట్టి కరిపించారు. 2014 ఎన్నికల్లో 12 సీట్లు సాధించిన టీడీపీ 2019 ఎన్నికల్లో పది సీట్లు కోల్పోయి రెండు సీట్లకు పరిమితం అయింది. రాజధానిలో ఏదో జరిగిపోతుందంటూ ప్రజలను మభ్యపెట్టాలని చూసిన టీడీపీ అధినేత చంద్రబాబు కుట్రను ప్రజలు తిప్పికొట్టారు. మంగళగిరి నియోజకవర్గంలో టీడీపీ అధినేత చంద్రబాబు తనయుడు, మంత్రి నారా లోకేష్ ఓటమి చెందడం చూస్తుంటే టీడీపీ పై ప్రజలు ఏ స్థాయిలో ఆగ్రహంతో ఉన్నారో అర్థం చేసుకోవచ్చు. జిల్లాలో ఏ ఒక్క నియోజకవర్గంలోనూ జనసేన ప్రభావం కనిపించలేదు. మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి వరుసగా నాలుగోసారి విజయం సాధించారు. ప్రత్తిపాడు నుంచి మేకతోటి సుచరిత, సత్తెనపల్లి నుంచి అంబటి రాంబాబు, నరసరావుపేట ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి, బాపట్ల ఎమ్మెల్యే కోన రఘుపతి, మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి, గుంటూరు తూర్పు ఎమ్మెల్యే షేక్ మొహమ్మద్ ముస్తఫా విజయం సాధించారు. నరసరావుపేట పార్లమెంట్ పరిధిలో క్లీన్ స్వీప్ నరసరావుపేట పార్లమెంట్లో ఉన్న ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు భారీ మెజార్టీలతో ఘన విజయం సాధించారు. ఈ పార్లమెంట్ పరిధిలో చిలకలూరిపేట నుంచి మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు, సత్తెనపల్లి నుంచి స్పీకర్ కోడెల శివప్రసాదరావు, వినుకొండ నుంచి టీడీపీ జిల్లా అధ్యక్షుడు జి.వి.ఆంజనేయులు, గురజాల నుంచి టీడీపీ సీనియర్ ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు, పెదకూరపాడు నుంచి కొమ్మాలపాటి శ్రీధర్ ఘోర పరాజయం చెందారు. నరసరావుపేట, మాచర్ల, వినుకొండ, సత్తెనపల్లి, గురజాల నియోజకవర్గాల్లో వైఎస్సార్ సీపీ అభ్యర్థులు 20 వేలకు పైగా మెజార్టీతో విజయం సాధించారు. నరసరావుపేట ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి 32 వేల భారీ మెజార్టీ సాధించి జిల్లాలోనే అత్యధిక మెజార్టీ సాధించిన ఎమ్మెల్యేగా తన స్థానాన్ని పదిలం చేసుకున్నారు. 2014 ఎన్నికల్లో సైతం వైఎస్సార్ సీపీ అభ్యర్థుల్లో అత్యధిక మెజార్టీతో గెలు పొందిన విషయం తెలిసిందే. వినుకొండ నియోజకవర్గంలో 2014 ఎన్నికల్లో 19,582 మెజార్టీతో విజయం సాధించిన టీడీపీ జిల్లా అధ్యక్షుడు జి.వి.ఆంజనేయులుపై వైఎస్సార్ సీపీ అభ్యర్థి బొల్లా బ్రహ్మనాయుడు 28,700 ఓట్ల భారీ మెజార్టీతో విజయం సాధించడం చూస్తుంటే ఆ నియోజకవర్గంలో వైఎస్సార్ సీపీపై ప్రజలు ఏ స్థాయిలో తమ అభిమానాన్ని చాటుకున్నారో తెలుస్తోంది. చిలకలూరిపేట నియోజకవర్గంలో టీడీపీయేతర పార్టీలకు గతంలో ఎన్నడూ లేని విధంగా 8 వేలకు పైచిలుకు మెజార్టీతో మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావుపై బీసీ మహిళ విడదల రజిని విజయం సాధించడం గమనార్హం. ఆరు సార్లు ఎమ్మెల్యేగా గెలుపొంది, సీనియర్ మంత్రిగా, స్పీకర్‌గా పదవులు చేపట్టిన కోడెల శివప్రసాదరావుపై అంబటి రాంబాబు 21,200 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. పెదకూరపాడు నియోజకవర్గంలో కొమ్మాలపాటి శ్రీధర్‌పై వైఎస్సార్ సీపీ అభ్యర్థి నంబూరు శంకరరావు 14 వేల ఓట్ల మెజార్టీతో విజయం సాధించాడు. మాచర్లలో వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి 23 వేల పైచిలుకు మెజార్టీతో గెలుపొంది నాల్గోసారి వరుసగా విజయం సాధించి తన పట్టు నిలుపుకొన్నారు. గుంటూరు పార్లమెంట్లో ఆరు స్థానాల్లో ఘన విజయం గుంటూరు పార్లమెంట్లో ఏడు అసెంబ్లీ స్థానాలకు వైఎస్సార్ సీపీ ఆరు అసెంబ్లీ స్థానాలు కైవసం చేసుకుంది. చంద్రబాబు తనయుడు, మంత్రి నారా లోకేష్ మంగళగిరి నుంచి పోటీ చేసి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి చేతిలో ఘోర పరాజయం చెందారు. పొన్నూరులో వరుసగా ఐదు సార్లు గెలిచి డబుల్ హ్యాట్రిక్ సాధిస్తాడనుకున్న టీడీపీ సీనియర్ ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్రపై వైఎస్సార్ సీపీ అభ్యర్థి కిలారి వెంకటరోశయ్య విజయం సాధించారు. ప్రత్తిపాడు నియోజకవర్గంలో మాజీ మంత్రి డొక్కా మాణిక్య వరప్రసాద్‌పై వైఎస్సార్ సీపీ అభ్యర్థి మేకతోటి సుచరిత 7,221 మెజార్టీతో గెలిపారు. మాజీ మంత్రి, తెనాలి సిట్టింగ్ ఎమ్మెల్యే ఆలపాటి రాజేంద్రప్రసాద్‌పై వైఎస్సార్ సీపీ అభ్యర్థి అన్నాబత్తుని శివకుమార్ 17 వేలకు పైగా చిలు మెజార్టీ గెలుపొందారు. గత ఎన్నికల్లో 19,759 ఓట్ల భారీ మెజార్టీతో గెలుపొందిన ఆలపాటి రాజా ఈ ఎన్నికల్లో ఓటమి పాలవడం గమనార్హం. గుంటూరు ఈస్ట్ ఎమ్మెల్యే షేక్ మొహమ్మద్ ముస్తఫా 24 వేల ఓట్ల భారీ మెజార్టీతో గెలుపొందారు. రాజధాని ప్రాంతమైన తాడికొండ నియోజకవర్గంలో టీడీపీ అభ్యర్థి తెనాలి శ్రావణ్‌కుమార్‌పై వైఎస్సార్ సీపీ అభ్యర్థి ఉండవల్లి శ్రీదేవి 4,500 మెజార్టీతో విజయం సాధించారు. మొట్టమొదటిసారి అసెంబ్లీలోకి.. జిల్లాలో వైఎస్సార్ సీపీ తరుపున పోటీ చేసిన ఎనిమిది మంది మొట్టమొదటిసారిగా అసెంబ్లీలోకి అడుగు పెట్టనున్నారు. పొన్నూరు నుంచి కిలారి వెంకటరోశయ్య, తెనాలి నుంచి అన్నాబత్తుని శివకుమార్, తాడికొండ నుంచి ఉండవల్లి శ్రీదేవి, పెదకూరపాడు నుంచి నంబూరు శంకరరావు, వినుకొండ నుంచి బొల్లా బ్రహ్మనాయుడు, గురజాల నుంచి కాసు మహేష్‌రెడ్డి, వేమూరు నుంచి మేరుగ నాగార్జున, చిలకలూరిపేట నుంచి విడదల రజని తొలిసారిగా అసెంబ్లీలోకి అడుగు పెట్టనున్నారు. టీడీపీ తరఫున గుంటూరు వెస్ట్ నుంచి పోటీ చేసిన మద్దాళి గిరి మొట్టమొదటిసారిగా అసెంబ్లీలో అడుగు పెట్టబోతున్నారు. కౌంటింగ్ మధ్యలోనే బయటకు జారుకున్న టీడీపీ అభ్యర్థులు జిల్లాలో 17 నియోజకవర్గాలకు 15 చోట్ల వైఎస్సార్ సీపీ అభ్యర్థులు ఘన విజయం సాధించడంతో టీడీపీ సీనియర్ నేతలు కంగుతిన్నారు. టీడీపీకి బలమైన మండలాలు, గ్రామాల్లో సైతం వైఎస్సార్ సీపీకి స్పష్టమైన ఆధిక్యత కనిపించడంతో టీడీపీ సీనియర్లు సైతం మూడు నాలుగు రౌండ్ల తరువాత కౌంటింగ్ కేంద్రాలను వదిలి వెళ్లిపోయారు. గురజాల మండలంలో వైఎస్సార్ సీపీకి 4,500 లకు పైగా మెజార్టీ రావడంతో ఐదో రౌండ్‌కే కౌంటింగ్ కేంద్రం నుంచి వెళ్లిపోయారు. పెదకూరపాడు ఎమ్మెల్యే కొమ్మాలపాటి శ్రీధర్, వినుకొండ ఎమ్మెల్యే జి.వి.ఆంజనేయులు, మాచర్ల, నరసరావుపేట ఎమ్మెల్యే అభ్యర్థులు అంజిరెడ్డి, అరవిందబాబు సైతం మధ్యలోనే కౌంటింగ్ కేంద్రాల నుంచి ఇంటి దారిపట్టారు. రౌండ్ రౌండ్‌కూ ఉత్కంఠ జిల్లాలోని చిలకలూరిపేట, మంగళగిరి, పొన్నూరు, తాడికొండ నియోజకవర్గాల ఓట్ల లెక్కింపు ఉత్కంఠ భరితంగా సాగింది. ప్రతి రౌండ్‌కూ మెజార్టీ మారుతుండటంతో అభ్యర్థులతోపాటు కౌంటింగ్ ఏజెంట్లు, ప్రజలు సైతం టెన్షన్‌కు గురయ్యారు. మొదటి నుంచి స్పష్టమైన మెజార్టీ దిశగా దూసుకు పోయిన వైఎస్సార్ సీపీ మంగళగిరి పట్టణంలో వెనుకంజ పడింది. అక్కడి నుంచి ప్రతి రౌండ్‌కు నువ్వా నేనా అన్నట్లు పోటీ జరిగినప్పటికీ ఎట్టకేలకు 5,217 ఓట్ల మెజార్టీతో వైఎస్సార్ సీపీ అభ్యర్థి ఆళ్ల రామకృష్ణారెడ్డి విజయం సాధించారు. పొన్నూరు నియోజకవర్గంలో సైతం మొదటి నుంచి వైఎస్సార్ సీపీ ఆధిక్యం కనబర్చినప్పటికీ ఎనిమిదో రౌండ్ నుంచి అక్కడ సైతం పోటీ నువ్వా నేనా అన్నట్లు సాగింది. ఎట్టకేలకు 1,043 ఓట్ల మెజార్టీతో విజయం సాధించాడు. చిలకలూరిపేట నియోజకవర్గం అయితే మొదటి నుంచి టీడీపీ, వైఎస్సార్ సీపీ అభ్యర్థుల మధ్య పోటీ నువ్వా నేనా అన్నట్లుగా సాగింది. చిలకలూరిపేట పట్టణంలో వైఎస్సార్ సీపీ అభ్యర్థి విడదల రజనికి స్పష్టమైన మెజార్టీ రావడంతో 8 వేల పై చిలుకు మెజార్టీతో విజయం సాధించారు. తాడికొండ నియోజకవర్గంలో సైతం మొదటి నుంచి టీడీపీ అధిక్యం చూపుతూ వచ్చినప్పటికీ ఫిరంగిపురం మండలంలో వైఎస్సార్ సీపీ భారీ ఆధిక్యం రావడంతో వైఎస్సార్ సీపీ అభ్యర్థి ఉండవల్లి శ్రీదేవి విజయ బావుటా ఎగురవేశారు. మూడో రౌండ్లోనే వెనుతిరిగిన యరపతినేని పిడుగురాళ్ల: సార్వత్రిక ఎన్నికల్లో గురజాల వైఎస్సార్ సీపీ అభ్యర్థి కాసు మహేష్‌రెడ్డి సిట్టింగ్ ఎమ్మెల్యే, టీడీపీ అభ్యర్థి యరపతినేని శ్రీనివాసరావుపై ఘనవిజయం సాధించారు. గత నెల 11వ తేదీన జరిగిన సార్వత్రిక ఎన్నికల ఓట్ల లెక్కింపు నల్లపాడులోని లయోలా హైస్కూల్ ప్రాంగణంలో గురువారం నిర్వహించారు. మొదటి రౌండ్ నుంచి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి కాసు మహేష్‌రెడ్డికి మెజార్టీ వస్తుండటంతో టీడీపీ అభ్యర్థి యరపతినేని శ్రీనివాసరావు అవాక్కయ్యారు. గురజాల మండలం నుంచి ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది. ఈ డలంలోనే ఎక్కువ పట్టు ఉందని ఆశించిన యరపతినేనికి గురజాల ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. వైఎస్సార్ సీపీ అభ్యర్థి కాసుకే పట్టం కట్టడంతో ఓటమి తప్పదని భావించిన యరపతినేని మూడో రౌండ్లోనే కౌంటింగ్ కేంద్రం నుంచి వెనుతిరిగారు. కౌంటింగ్ ప్రారంభించే ముందు ఎంతో హుందాగా ఉన్న యరపతినేని మొదటి రెండు మూడు రౌండ్లకే పరాజయం పాలవుతానని భావించి ఈ ప్రాంతంలో ఉండటానికి ముఖం చెల్లక వెనుతిరిగారు. ప్రజల రుణం తీర్చుకోవడమే లక్ష్యం : నందిగం సురేష్ బాపట్ల: ప్రజల రుణం తీర్చుకోవడమే లక్ష్యంగా శ్రమిస్తానని బాపట్ల పార్లమెంటు స్థానం నుంచి గెలిచిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నందిగం సురేష్ అన్నారు. ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం ప్రాంగణంలో ఆయన గురువారం మీడియాతో మాట్లాడారు. తమ పార్టీ కోసం పని చేసిన ప్రతి ఒక్కరినీ గుర్తుంచుకుంటామని, మాటలు చెప్పటంకాదు, ప్రజలకు మంచిచేసి చూపిస్తామని అన్నారు. పేద ప్రజలకు నిత్యం అందుబాటులో ఉండటంతోపాటు నిరుద్యోగ సమస్యను పరిష్కారించేందుకు కృషి చేస్తానని చెప్పారు. ఢిల్లీలో కాకుండా బాపట్ల పార్లమెంటు నియోజకవర్గ గల్లీలోనే తిరుగుతానని చెప్పారు. బాపట్ల అసెంబ్లీ నుంచి 19,509 ఓట్లు మెజార్టీ బాపట్ల అసెంబ్లీ నుంచి బాపట్ల పార్లమెంటు అభ్యర్థి నందిగం సురేష్‌కు 19,509 ఓట్ల మెజార్టీ వచ్చింది. మొత్తం 15 రౌండ్లులో లెక్కింపు నిర్వహించారు. మొత్తం నందిగం సురేష్‌కు 79,708 ఓట్లు, టీడీపీ అభ్యర్థి శ్రీరామ్ మాల్యాద్రికి 60,199 ఓట్లు వచ్చాయి. ప్రతి రౌండ్లోనూ నందిగం సురేష్ అధిక్యతను ప్రదర్శించారు. నందిగం సురేష్‌ను ఎమ్మెల్యే అభ్యర్థి కోన రఘుపతి అభినందించారు. వైఎస్సార్ సీపీ నుంచి ముగ్గురు మహిళా ఎమ్మెల్యేలు గుంటూరు జిల్లాలో వైఎస్సార్ సీపీ ముగ్గురు మహిళలను అసెంబ్లీ స్థానాల నుంచి పోటీలో నిలపగా తెలుగుదేశం పార్టీ ఒక్క మహిళకు కూడా టిక్కెట్టు ఇవ్వకపోవడం గమనార్హం. వైఎస్సార్ సీపీ తరఫున ప్రత్తిపాడు నుంచి పోటీ చేసిన మేకతోటి సుచరిత, మాజీ మంత్రి డొక్కా మాణిక్య వరప్రసాద్‌పై విజయం సాధించగా, తాడికొండ నుంచి పోటీచేసిన ఉండవల్లి శ్రీదేవి సిట్టింగ్ ఎమ్మెల్యే తెనాలి శ్రావణ్‌కుమార్‌పై విజయం సాధిం చారు. తొలి రౌండ్ నుంచి ఉత్కంఠ భరితంగా సాగిన చిలకలూరిపేట నుంచి బీసీ మహిళ విడదల రజిని మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావుపై ఘన విజయం సాధించారు. -
జేఈఈ మెయిన్ ఫలితాలు విడుదల
న్యూఢిల్లీ: ఎన్ఐటీ, ట్రిపుల్ ఐటీ, కేంద్ర ప్రభుత్వ ఆర్థిక సహకారంతో కొనసాగే ఇతర జాతీయ స్థాయి సాంకేతిక విద్యా కాలేజీల్లో ప్రవేశాల కోసం ఈ నెల 2న నిర్వ హించిన జేఈఈ మెయిన్ ఫలితాలు నేడు (గురువారం) విడుదలయ్యాయి. ఈ పరీక్షకు తెలంగాణ వ్యాప్తంగా 65 వేల మంది విద్యార్థులు హాజరు కాగా, ఆంధ్రప్రదేశ్ నుంచి దాదాపు 78 వేల మంది హాజరయ్యారు. ఈ నెల 28 నుంచి మే 2 వరకు మెయిన్‌లో అర్హత సాధించిన టాప్ 2.20 లక్షల మంది నుంచి జేఈఈ అడ్వాన్స్‌డ్‌కు దరఖాస్తులను స్వీకరించనున్నారు.