సాక్షి, హైదరాబాద్ : 2008 జూనియర్ లెక్చరర్ పోస్టుల భర్తీలో నష్టపోయిన తెలంగాణకు చెందిన 21మంది అభ్యర్థులకు ఎట్టకేలకు న్యాయం జరిగింది. తాజాగా వీరందరికి ఇంటర్ విద్యాశాఖ శుక్రవారం పోస్టింగ్‌లు ఇచ్చింది. 2008లో నోటిఫికేషన్ విడుదల చేసిన ఏపీపీఎస్సీ 2011లో ఈ పరీక్షను నిర్వహించింది. ఇందులో ఎకనామిక్స్ పోస్టులకు సంబంధించిన రాత పరీక్షల జవాబులను మరొక సబ్జెక్టు కీతో మూల్యాంకనం చేయటంతో 77 ప్రశ్నలకు జవాబులు తప్పుగా వచ్చాయి. దీంతో అభ్యర్థులు అనేక ఆందోళనలు చేపట్టిన తర్వాత ఏపీపీఎస్సీ సరైన కీతో మూల్యాంకనం చేసింది. అనంతరం మెరిట్ లిస్టు ఆధారంగా ఇంటర్వ్యూలు నిర్వహించి పోస్టింగ్‌లు ఇచ్చింది.
Comments
Please login to add a commentAdd a comment