బస్సుల కోసం విద్యార్థుల రాస్తారోకో | students protest | Sakshi
Sakshi News home page

బస్సుల కోసం విద్యార్థుల రాస్తారోకో

Jul 26 2016 8:21 PM | Updated on Nov 9 2018 4:46 PM

ఆర్టీసీ బస్సుల సంఖ్య పెంచి సమయానుకూలంగా నడపాలని డిమాండ్‌ చేస్తూ పెద్ద గుండవెల్లి విద్యార్థులు ఏబీవీపీ ఆధ్వర్యంలో సిద్దిపేట–తిమ్మాపూర్‌ రహదారిపై రాస్తారోకో చేపట్టారు.

దుబ్బాక: ఆర్టీసీ బస్సుల సంఖ్య పెంచి సమయానుకూలంగా నడపాలని డిమాండ్‌ చేస్తూ పెద్ద గుండవెల్లి విద్యార్థులు మంగళవారం ఏబీవీపీ ఆధ్వర్యంలో సిద్దిపేట–తిమ్మాపూర్‌ రహదారిపై రాస్తారోకో చేపట్టారు. సకాలంలో బస్సులు రాకపోవడంతో తాము తరగతులకు హాజరుకాలేకపోతున్నామని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయమై పలు మార్లు ఆర్టీసీ అధికారులకు విన్నవించినా పట్టించుకోవడం లేదన్నారు. అనంతరం దుబ్బాక డిపో వద్దకు వచ్చి వినతి పత్రం అందజేశారు.  కార్యక్రమంలో ఏబీవీపీ నాయకులు దొడ్ల శ్రీకాంత్, గూడ శ్రీకాంత్, రాజు, పర్శరాములు, దిలీప్, అజయ్, మహేశ్, రాజు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement