మంచిర్యాల సిటీ, న్యూస్‌లైన్ : పదో తరగతి వరకు విద్యాశాఖ ఆధ్వర్యంలో నవోదయ, కేజీబీవీ, ఆశ్రమ, గురుకుల, ఎయిడెడ్ పాఠశాలల్లో పేద విద్యార్థులకు ఉచితం వసతులతోపాటు చదువును అందిస్తోంది. దీనికి తోడుగా విద్యార్థి జీవితాన్ని మలుపుతిప్పేది ఇంటర్మీడియెట్ విద్య కూడా కావడంతో ప్రభుత్వ విద్యాసంస్థల్లో పదోతరగతి చదివి ఉత్తీర్ణులైన విద్యార్థులకు కార్పొరేట్ కళాశాలల్లో ఉచితంగా చదువు చెప్పించడానికి విద్యాశాఖ తాజాగా ఆదేశాలు జారీ చేసింది.
ఇందుకు 2014-2015 విద్యాసంవత్సరానికి సంబంధించిన జీవో.ఎంఎస్.సంఖ్య. 235. ఎస్.డ బ్ల్యూ,(ఎడ్యుకేషన్-2), తేదీ: 28-03-2011 ద్వారా ఉత్తర్వులు జారీ చేసింది. జిల్లాలో అర్హులైన వారిలో నుంచి 260 మంది విద్యార్థులకు కార్పొరేట్ కళాశాలల్లో ఇంటర్ చదువుతోపాటు ఎంసెట్ శిక్షణ, వసతి కూడా ఉచితంగా లభిస్తుంది. విద్యార్థుల ఎంపిక, కళాశాలల్లో ప్రవేశం, ఫీజుల చెల్లింపు సౌకర్యాలను ఏర్పర్చడానికి సాంఘిక సంక్షేమ శాఖ అధికారులు బాధ్యత వ హిస్తారు. హైదరాబాద్‌లోని చైతన్య, నారాయణ, శ్రీగాయత్రి వంటి కార్పొరేట్ కళాశాలల్లో చేరడానికి కూడా దరఖాస్తు చేసుకోవచ్చు.
దరఖాస్తుల స్వీకరణ
ఈనెల 5వ తేదీ నుంచి 14వ తేదీ వరకు పదో తరగతి ఉత్తీర్ణులైన విద్యార్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి. తెలంగాణ రాష్ట్రంలోని పది జిల్లాలోని విద్యార్థికి నచ్చిన కార్పొరేట్ కళాశాలలో చేరడానికి దరఖాస్తు చేసుకోడానికి అవకాశం ఉంది. పదో తరగతిలో విద్యార్థి సాధించిన ప్రతిభ ఆధారంగా ఈ నెల 16తేదీన అధికారులు కళాశాలను ఎంపిక చేసి ప్రవేశం కల్పిస్తారు.
అర్హులు
ప్రభుత్వ సంక్షేమ, ఆశ్రమ, కేజీబీవీ పాఠశాలల్లో చదివిన వారికి 50 శాతం, రెసిడెన్సియల్, ప్రభుత్వ ఉన్నత పాఠశాలల్లో చదివిన విద్యార్థులకు 20 శాతం, జిల్లా పరిషత్, ఎయిడెడ్ పాఠశాలల్లో చదివిన వారికి 25 శాతం, అత్యుత్తమ ప్రైవేటు పాఠశాలల్లో చదివిన వారికి 5 శాతం చొప్పున సీట్లు కేటాయిస్తారు. బీసీ, ఈబీసీ, మైనార్టీ విద్యార్థుల తలితండ్రుల వార్షికాదాయం రూ.లక్ష, ఎస్సీ, ఎస్టీ విద్యార్థుల తల్లిదండ్రుల ఆదాయం రూ.2 లక్షల వరకు ఉండాలి. పదో త రగతిలో సాధించిన ప్రగతి కూడా పరిగణలోకి తీసుకొని ఎంపిక చేస్తారు.
దరఖాస్తు విధానం
ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోడానికి ముందు విద్యార్థి కులం, ఆదాయం, ఆధార్‌కార్డు, ఐఈడీ, రేషన్ కార్డు, పదో తరగతి గ్రేడింగ్, పదో తరగతి హాల్‌టికెట్టు, పుట్టిన తేదీ, తల్లిదండ్రుల చిరునామా వివరాలను సిద్ధం చేసుకోవాలి. వీటి ఆధారాలతో ఆన్‌లైన్‌లో దర ఖాస్తు చేసుకోడానికి వీలు క లుగుతుంది.
పేద విద్యార్థులకు ఉచిత విద్య
Published Wed, Jun 4 2014 2:01 AM | Last Updated on Sat, Sep 2 2017 8:16 AM
Advertisement