పేద విద్యార్థుల భవితకు ‘గురుకుల’ పునాది
డిప్యూటీ సీఎం మహమూద్ అలీ
హైదరాబాద్: వెనకబడిన కులాలు, పేద విద్యార్థుల ఉజ్వల భవితకు గురుకుల పాఠశాలలు పునాది వేయబోతున్నాయని ఉప ముఖ్యమంత్రి మహమూద్ అలీ అన్నారు. తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా సోమవారం 119 మహాత్మా జ్యోతిబా పూలే బీసీ గురుకుల పాఠశాలలు ప్రారంభమయ్యాయి. సరూర్‌నగర్‌లో ఏర్పాటు చేసిన ముషీరాబాద్, అంబర్‌పేట, చాంద్రాయణగుట్ట, గోషామహల్ అసెంబ్లీ నియోజకవర్గాల బీసీ గురుకుల పాఠశాలల వసతి గృహాన్ని మంత్రులు నాయిని నర్సింహారెడ్డి, జోగు రామన్న, ఎమ్మెల్యేలు తీగల కృష్ణారెడ్డి, జి.కిషన్‌రెడ్డితో కలసి ఉపముఖ్యమంత్రి ప్రారంభించారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ.. మైనారిటీలు, బలహీనవర్గాలకు చెందిన పేద విద్యార్థులకు కార్పొరేట్ స్థాయి నాణ్యమైన విద్య అందించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని పేర్కొన్నారు.