
సాక్షి, హైదరాబాద్: టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కె.తారక రామారావుకు మరో అరుదైన గౌరవం దక్కింది. హార్వర్డ్ యూనివర్సిటీ ప్రతిష్టాత్మకంగా నిర్వహించే హార్వర్డ్ ఇండియా వార్షిక కాన్ఫరెన్స్‌కు హాజరుకావాల్సిందిగా కేటీఆర్‌కు వర్సిటీ ఆహ్వానం పంపింది. ఫిబ్రవరి 16, 17 తేదీల్లో అమెరికాలోని మసాచుసెట్స్‌లో జరగనున్న ఈ సదస్సుకు పలు దేశాల ప్రముఖులు హాజరుకానున్నారు. సమకాలీన భారతదేశం ఎదుర్కొంటున్న అనేక సవాళ్లు, వివిధ అభివృద్ధి అంశాలపై 2 రోజులపాటు సమావేశంలో చర్చిం చనున్నారు. సుమారు 1000 మంది విద్యావేత్తలు, విద్యార్థులు పాల్గొననున్నారు. ‘ఇండియా ఎట్ ఇన్‌ఫ్లెక్షన్ పాయింట్’ అనే థీమ్ ఆధారంగా సాగనున్న ఈ సమావేశంలో ప్రత్యేక వక్తగా హాజరై ప్రసంగించాల్సిందిగా కేటీఆర్‌ను సదస్సు నిర్వాహకులు కోరారు.
ఆ సంఘాలకు గుర్తింపు లేదు: కేటీఆర్
తన పేరు మీద ఏర్పాటు చేస్తున్న సంఘాలు, యువసేనలు, అభిమాన సంఘాలకు తన వైపు నుంచి ఎలాంటి మద్దతు లేదని కేటీఆర్ స్పష్టం చేశారు. పార్టీ, తనపై అభిమానం ఉంటే టీఆర్‌ఎస్, దాని అనుబంధ సంఘాలతో కలసి పనిచేయాలని సూచించారు.
Comments
Please login to add a commentAdd a comment