TRS Working President
-
అతడే ఒక సైన్యం.. స్టార్‌గా కేటీఆర్
సాక్షి, సిటీబ్యూరో : గ్రేటర్ ఎన్నికల ప్రచారంలో టీఆర్ఎస్ తరపున..పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ స్టార్ అట్రాక్షన్‌గా నిలిచారు. ప్రచార పర్వంలో అన్నీ తానై విస్తృత ప్రచారం నిర్వహించారు. అభ్యర్థులకు అండగా నిలిచి గెలుపుపై భరోసా కల్పించారు. అభివృద్ధి, సంక్షేమం ఎజెండాతో దూసుకెళ్లిన కేటీఆర్..తన ఎన్నికల ప్రచారాన్ని ఆదివారం సాయంత్రం సికింద్రాబాద్ నియోజకవర్గంలోని శాంతినగర్‌లో ముగించారు. చివరి రోజు జుమ్మేరాత్‌బజార్, పాటిగడ్డలో నిర్వహించిన రోడ్డు షోల్లో బీజేపీ ముఖ్యనేతలపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. నగరంలో వారం రోజుల పాటు ఆయన విరామం లేకుండా 15 నియోజకవర్గాలు, 33 ప్రాంతాల్లో రోడ్‌షోలు, సభలు, సమావేశాలు నిర్వహించారు. ప్రతిచోటా కేటీఆర్‌కు జనం నీరాజనాలు పలికారు. ఉదయం వేళల్లో సామాజిక సంఘాలు, డెలవప్మెంట్ ఫోరంలతో ప్రత్యేక భేటీలు నిర్వహించిన ఆయన..సాయంత్రం వేళల్లో రోడ్డు షోల్లో పాల్గొన్నారు. మొత్తంగా వంద డివిజన్ల ఓటర్లను తన సభల ద్వారా కలుసుకున్నారు. మంత్రులు, ఎంపీ, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలంతా డివిజన్లకు పరిమితం కాగా ప్రచార వ్యూహం, ప్రతిపక్షాలపై విమర్శల దాడి వంటి అంశాల్లో కేటీఆర్ కీలకంగా నిలిచారు. (హైదరాబాద్ పేరు మార్చేస్తే... బంగారం వస్తదా?) అభివృద్ధి ఎజెండాతో ముందుకు... జీహెచ్ఎంసీ ఎన్నికల్లో నగర ఓటర్లు అరాచక వాదానికి కాకుండా అభివృద్ధి, సంక్షేమానికి ఓటేయ్యాలంటూ కేటీఆర్ ప్రతి సభలో పేర్కొన్నారు. ఈ ఎన్నికల్లో ప్రధాన ప్రత్యర్థిగా అవతరించిన బీజేపీ దూకుడుగా వెళుతూ ఎంఐఎంతో పాటు టీఆర్ఎస్ను ఇరుకుపెట్టే యత్నాలను చేసింది. అయితే కేటీఆర్ ఎప్పటికప్పుడు బీజేపీ విమర్శలను సమర్థవంతంగా తిప్పికొట్టగలిగారని పార్టీ శ్రేణులు పేర్కొంటున్నాయి. ముఖ్యంగా వరద సహాయం నిలిపివేత, పాతబస్తీపై సర్జికల్ స్ట్రైక్స్ విషయంలో బీజేపీని నిలువరించే ప్రయత్నం చేసిన కేటీఆర్, ట్యాంక్‌బండ్‌పై పీవీ, ఎన్టీఆర్ఘాట్లపై ఎంఐఎం చేసిన ఆరోపణలపై కూడా స్పందించారు. ఎంఐఎం తీరును తప్పుబట్టి తమ ఓటు బ్యాంక్‌కు గండిపడకుండా చేసుకోగలిగారని పార్టీ నేతలు పేర్కొంటున్నారు. -
‘ప్రభుత్వాస్పత్రులకు నిధులు కేటాయించాలి’
సాక్షి, హైదరాబాద్: ఆరేళ్లుగా ప్రభుత్వా స్పత్రులకు నిధులు కేటాయించకపోవడం వల్లే ప్రస్తుత కోవిడ్ పరిస్థితుల్లో ప్రజలు బలవుతున్నారని యువ తెలంగాణ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ రాణీ రుద్రమ అన్నారు. ఆదివారం ఇక్కడ పార్టీ కేంద్ర కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడారు. శాశ్వత ప్రాతిపదికన వైద్య, ఆరోగ్య శాఖలో నియామకాలు చేపట్టి ఆస్పత్రుల్లో మౌలిక వసతుల కల్పనకు నిధులు కేటాయించాలని డిమాండ్ చేశారు. -
సంపూర్ణ ఆరోగ్యంతో ఉన్నాను: కేటీఆర్
సాక్షి, హైదరాబాద్ : టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, రాష్ట్ర ఐటీ, పురపాలకశాఖ మంత్రి కేటీఆర్ ఆరోగ్యంపై సోషల్ మీడియాలో పలు వార్తలు వస్తున్నాయి. సోమవారం ఆయన సిరిసిల్లా జిల్లా పర్యటన సందర్భంగా కొంత ఇబ్బందికరంగా కనిపించారని కొంతమంది ఆయన అభిమానులు ట్విటర్లో పోస్టులు పెట్టారు.‘కరోనాపై యుద్ధం చేస్తున్న కేటీఆర్ కొంత అనారోగ్యంతో బాధపడుతున్నట్లు కనిపించారు’ అంటూ ఓ నెటిజన్ ట్వీట్ చేశారు. ఈ క్రమంలోనే తన ఆరోగ్యంపై వస్తున్న ప్రచారంపై కేటీఆర్ స్పందించారు. తాను సంపూర్ణ ఆరోగ్యంతో ఉన్నానని తన ట్విటర్ ఖాతా ద్వారా ప్రకటించారు. అయితే ఎప్పటి నుంచో తాను స్పల్ప కోల్డ్ అలర్జీతో బాధపడుతున్నానని, అదేమీ తనకు సమస్య కాలేదని చెప్పారు. తన ఆరోగ్యంపై ఎవరూ ఆందోళన చెందాల్సి అవసరంలేదని కేటీఆర్ తన అభిమానులకు తెలిపారు. ఇక సిరిసిల్ల పర్యటన సందర్భంగా ఎవరినైనా ఇబ్బందులకు గురిచేసి ఉంటే క్షమించాలని కేటీఆర్ కోరారు. ఈ మేరకు ట్విటర్లో ఓ పోస్ట్ చేశారు. కాగా రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండలం బద్దెనపల్లి శివారులోని టెక్స్టైల్ పార్కులో రూ.14.50 కోట్ల వ్యయంతో చేపట్టిన సెంట్రల్ లైటింగ్, శిక్షణ కేంద్రం, పరిపాలనా భవనం, క్యాంటీన్ భవనాలను సోమవారం ఆయన ప్రారంభించిన విషయం తెలిసిందే. (బ్రాండ్ సిరిసిల్ల కావాలి) var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_1401284236.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
నేటి నుంచి కేటీఆర్ ప్రచారం
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పూర్తిస్థాయి ఎన్నికల ప్రచారంలోకి దిగుతున్నారు. సొంత నియోజకవర్గం సిరిసిల్ల నుంచి బుధవారం ప్రచారం మొదలుపెడుతున్నారు. సికింద్రాబాద్, మల్కాజ్గిరి, చేవెళ్ల, నల్లగొండ, మహబూబాబాద్, భువనగిరి, కరీంనగర్లో కేటీఆర్ ప్రచారం నిర్వహించనున్నారు. మార్చి 27 నుంచి ఏప్రిల్ 9 వరకు కేటీఆర్ ప్రచార షెడ్యూల్ ఖరారైంది. టీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డి ఈ మేరకు మంగళవారం కేటీఆర్ ప్రచార షెడ్యూల్ విడుదల చేశారు. సికింద్రాబాద్, మల్కాజ్గిరి, చేవెళ్ల లోక్‌సభ సెగ్మెంట్ల పరిధిలోని అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లోనూ కేటీఆర్ రోడ్ షోలు నిర్వహించనున్నా రు. పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డి, హైదరాబాద్ మేయర్ బొంతు రామ్మోహన్ రోడ్ షో నిర్వహణ ప్రక్రియను సమన్వయం చేయనున్నారు. లోక్‌సభ ఎన్నికల్లో 16 సీట్లలో గెలుపే లక్ష్యంగా టీఆర్ఎస్ ప్రయత్నిస్తోంది. అన్ని స్థానాల్లో భారీ ఆధిక్యంతో గెలుపు కోసం సీఎం కేసీఆర్, కేటీఆర్ పూర్తిస్థాయిలో ప్రచారం నిర్వహించాలని నిర్ణయించారు. టీఆర్ఎస్ ఇప్పటి వరకు గెలుచుకోని సికింద్రాబాద్, మల్కాజ్గిరి, నల్లగొండ సెగ్మెంట్లపై ప్రత్యేకంగా దృష్టి సారించింది. తాను టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా బాధ్యతలు చేపట్టిన తర్వాత జరుగుతున్న మొదటి ఎన్నికలు కావ డంతో కీలక నియోజకవర్గాలపై స్వయంగా కేటీఆర్ దృష్టి సారించారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రచార ప్రక్రియ ను సమన్వయం చేస్తూనే ఏడు లోక్‌సభ నియోజకవర్గాల్లో ప్రచారం నిర్వహించనున్నారు. ముఖ్యంగా నల్లగొండ, సికింద్రాబాద్, మల్కాజ్గిరి, చేవెళ్ల సెగ్మెంట్లలో అసెంబ్లీ ఎన్నికల తరహాలో ప్రచారం నిర్వహించేలా షెడ్యూల్‌ను రూపొందించుకున్నారు. కేటీఆర్ ప్రచార షెడ్యూల్ ఇదీ... ► మార్చి 27న సిరిసిల్ల నియోజకవర్గం ముస్తాబాద్ నుంచి ప్రచారం ప్రారంభిస్తారు. ఆ రోజు స్థానికం గా జరగనున్న పార్టీ కార్యక్రమాల్లో పాల్గొంటారు. ► మార్చి 29న సిరిసిల్ల నియోజకవర్గం ఎల్లారెడ్డిపేట, వీరన్నపల్లె మండలాల్లో స్థానిక సమావేశాల్లో పాల్గొంటారు. సాయంత్రం 6 గంటలకు కరీంనగర్లో రోడ్‌షో నిర్వహించి అక్కడే బహిరంగ సభకు హాజరవుతారు. ► మార్చి 30న ఉదయం నర్సంపేట, ములుగు నియోజక వర్గాల్లో బహిరంగ సభలో పాల్గొంటారు. సాయంత్రం 5 గంటల నుంచి తాండూరు, వికారాబాద్‌లో రోడ్ షోల్లో పాల్గొంటారు. ► మార్చి 31న సిరిసిల్ల నియోజకవర్గం గంభీరావుపేటలో స్థానిక కార్యక్రమాలకు హాజరవుతారు. సాయంత్రం 5 గంటల నుంచి పరిగి, చేవెళ్లలో రోడ్‌షోలు నిర్వహిస్తారు. ► ఏప్రిల్ 1న సాయంత్రం ఐదున్నర గంటల నుంచి ఎల్బీనగర్, మహేశ్వరం నియోజకవర్గాల్లో రోడ్ షోలో పాల్గొంటారు. ► ఏప్రిల్ 2న సిరిసిల్లలో స్థానికంగా నిర్వహించే కార్యక్రమాలకు హాజరవుతారు. సాయంత్రం ఐదున్నర గంటల నుంచి ఉప్పల్, మల్కాజ్గిరి రోడ్ షోలో పాల్గొంటారు. ► ఏప్రిల్ 3న మధ్యాహ్నం 12 గంటలకు హుజూర్‌నగర్‌లో జరుగనున్న బహిరంగ సభలో పాల్గొంటారు. సాయంత్రం ఐదున్నర గంటల నుంచి సికింద్రాబాద్ కంటోన్మెంట్, మేడ్చల్‌లో రోడ్ షో నిర్వహిస్తారు. ► ఏప్రిల్ 4న మధ్యాహ్నం 12 గంటలకు ఇబ్రహీంపట్నంలో బహిరంగ సభకు హాజరవుతారు. సాయంత్రం ఐదున్నర గంటల నుంచి అంబర్‌పేట, ముషీరాబాద్‌లో రోడ్ షో నిర్వహిస్తారు. ► ఏప్రిల్ 5న ఉదయం 10 గంటలకు కోదాడలో జరగనున్న బహిరంగ సభలో ప్రసంగిస్తారు. సాయంత్రం ఐదు గంటల నుంచి సికింద్రాబాద్, సనత్‌నగర్‌లో రోడ్‌షోలో పాల్గొంటారు. ► ఏప్రిల్ 6న సాయంత్రం జూబ్లీహిల్స్, ఖైరతాబాద్, నాంపల్లి నియోజక వర్గాల్లో రోడ్ షో నిర్వహిస్తారు. ► ఏప్రిల్ 7న ఉదయం 10 గంటలకు మహబూబ్‌నగర్, జడ్చర్ల, షాద్‌నగర్‌లలో జరగనున్న బహిరంగ సభల్లో పాల్గొంటారు. సాయంత్రం ఐదున్నర నుంచి రాజేంద్రనగర్, శేరిలింగంపల్లిలో రోడ్ షోలు నిర్వహిస్తారు. ► ఏప్రిల్ 8న ఇల్లందు, పినపాక నియోజకవర్గాల్లో వేర్వేరుగా జరగనున్న బహిరంగ సభలకు హాజరవుతారు. సాయంత్రం ఐదున్నర గంటల నుంచి కూకట్పల్లి, కుత్బుల్లాపూర్ సెగ్మెంట్లలో రోడ్‌షోలో పాల్గొంటారు. ► ఏప్రిల్ 9న నల్లగొండలో రోడ్ షో నిర్వహించి ప్రచారం పూర్తి చేస్తారు. లోక్‌సభ బాధ్యుల మార్పు... లోక్‌సభ ఎన్నికల టీఆర్ఎస్ బాధ్యుల విషయంలో స్వల్ప మార్పులు జరిగాయి. మొదట నల్లగొండ లోక్‌సభకు నూకల నరేశ్‌రెడ్డి, ఖమ్మం లోక్‌సభకు తక్కళ్లపల్లి రవీందర్‌రావుకు పార్టీ బాధ్యతలు అప్పగించారు. తాజాగా వీరిద్దరి సెగ్మెంట్లను పరస్పరం మార్చుతూ టీఆర్ఎస్ అధిష్టానం నిర్ణయం తీసుకుంది. దీంతో రవీందర్రావు నల్లగొండ లోక్‌సభకు, నరేశ్‌రెడ్డికి ఖమ్మం లోక్‌సభ సెగ్మెంట్ బాధ్యతలను అప్పగించారు. -
రేవంత్ రెడ్డిని ఎంతపెట్టి కొన్నారు: కేటీఆర్
సాక్షి, హైదరాబాద్: టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డిపై టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు రేగా కాంతారావు, ఆత్రం సక్కులను కేసీఆర్ ఎంతకు కొన్నారో చెప్పాలని నిన్న ఉత్తమ్ ప్రశ్నించిన విషయం తెలిసిందే. ఆయన వ్యాఖ్యలపై కేటీఆర్ ఘాటుగా స్పందించారు. తమ పార్టీ నుంచి గెలిచిన ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డిని అసెంబ్లీ ఎన్నికల ముందు మీరు (కాంగ్రెస్) ఎంతకు కొన్నారని కౌంటర్ ప్రశ్న వేశారు. టీడీపీ నుంచి గెలిచిన రేవంత్ రెడ్డిని ఎంతకు కొన్నారని, తమ పార్టీకి చెందిన ఎమ్మెల్సీలు భూపతి రెడ్డి, యాదవ రెడ్డిలను ఎంతకు కొనుగోలు చేశారో ఉత్తమ్ చెప్పాలని తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. యూపీలో ఆదివారం రాహుల్ సమక్షంలో కాంగ్రెస్‌లో చేరిన బీజేపీ ఎంపీ సావిత్రిబాయి పూలేను ఎంత డబ్బులు పెట్టి కొన్నారని ప్రశ్నించారు. వీటన్నింటిపై ఉత్తమ్ సమాధానం ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. (ఎంత చెల్లించి మా ఎమ్మెల్యేలను కొన్నారు: ఉత్తమ్) రాజకీయాల్లో పార్టీలు మారడం కొత్తేమి కాదని, పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించింది కాంగ్రెస్ పార్టీనే అని కేటీఆర్ విమర్శించారు. వైఎస్సార్సీపీకి చెందిన 22 ఎమ్మెల్యేలను చంద్రబాబు నాయుడు కొనుగోలు చేసినప్పుడు ఉత్తమ్ ఎక్కడపోయారని ప్రశ్నించారు. సీఎం కేసీఆర్ గిరిజనుల సంక్షేమ కోసం అమలు చేస్తున్న కార్యక్రమాలకు ఆకర్షితులై కాంగ్రెస్‌కు చెందిన ఇద్దరు ఎమ్మెల్యేలు తమ పార్టీలో చేరుతున్నారని కేటీఆర్ వెల్లడించారు. తమ నాయకత్వంలో బలం లేదని, ఉత్తమ్ కుమార్‌ను మార్చాలని కాంగ్రెస్ ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి నిన్న చేసిన వ్యాఖ్యలను ఆయన గుర్తుచేశారు. మీ నాయకత్వంలో సమర్థత లేక తమపై నిందలు వేయడం సరికాదని కేటీఆర్ అన్నారు. -
జవాన్ల కుటుంబాలకు కేటీఆర్ విరాళం
సాక్షి, హైదరాబాద్: పూల్వామా ఉగ్రదాడిలో అమరులైన జవాన్లకు టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నివాళి అర్పించారు. జవాన్ల మరణం తనను ఎంతో కలచివేసిందని, ప్రజలను కాపాడే కర్తవ్యంలో మరణించిన వారికి తమ రాష్ట్ర ముఖ్యమంత్రి తరఫున నివాళి అర్పిస్తున్నట్లు ఆయన తెలిపారు. దాడిలో మరణించిన జవాన్ల కుటుంబాలకు ప్రగాఢ సానూభూతికి వ్యక్తం చేస్తూ.. తన వ్యక్తిగతంగా రూ.25 లక్షల విరాళం ఇస్తున్నట్లు కేటీఆర్ ప్రకటించారు. ఈ మేరకు బంజారాహీల్స్‌లోని సీఆర్పీఎఫ్ సధరన్ హెడ్ క్వార్టర్స్‌లో ఐజీపీ రాజుకు చెక్కును అందచేశారు. తన స్నేహితులు మరో 25 లక్షలు ఇచ్చారని, మొత్తం 50 లక్షల రూపాయలను అమర జవాన్ల కుటుంబాలకు విరాళంగా కేటీఆర్ చెల్లించారు. టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా, ఎమ్మెల్యేగా తాను ఇక్కడికి రాలేదని సాధారణ భారత పౌరుడిగా మాత్రమే వచ్చినట్లు తెలిపారు. భద్రతా బలగాల సేవల వల్లనే దేశ ప్రజలంతా క్షేమంగా ఉంటున్నారని, వారి త్యాగాలను ఎన్నటికీ మరువలేవని అభిప్రాయపడ్డారు. ఈ సందర్భంగా పుల్వామా ఉగ్రదాడిలో అసువులుబాసిన జవాన్లకు రెండు నిమిషాలు మౌనం పాటించి నివాళి అర్పించారు. దాడిలో గాయపడిన సైనికులు త్వరగా కోలుకోవాలని ఆయన ఆకాంక్షించారు. -
16 ఎంపీ సీట్లివ్వండి.. ఢిల్లీని శాసిద్దాం
సాక్షి, హైదరాబాద్: ‘పార్లమెంటు ఎన్నికల్లో సీఎం కేసీఆర్‌కు 16 సీట్లివ్వండి. మనం ఢిల్లీని శాసిద్దాం’అని టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపునిచ్చారు. సోమవారం తెలంగాణ భవన్లో జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. ‘దేశంలో బీజేపీ, కాంగ్రెస్‌లకు మేజిక్ ఫిగర్ వచ్చే అవకాశాల్లేవు. మనకు 16 ఎంపీ సీట్లు వస్తే కేంద్రంలో చక్రం తిప్పే అవకాశం లభిస్తుంది. ఇందుకోసం కార్యకర్తలు తీవ్రంగా కృషి చేయాలి. మొన్నటి ఎన్నికల్లో టీఆర్ఎస్ సాధించింది మామూలు విజయం కాదు. ప్రధాని, ఆరుగురు సీఎంలు, 11 మంది కేంద్రమంత్రులు ప్రచారం చేసినా ప్రజలు మాత్రం బీజేపీకి 103 స్థానాల్లో డిపాజిట్ రాకుండా చేశారు. రాహుల్ గాంధీ వంటి జాతీయ నాయకుల మాటలను కూడా తెలంగాణ ప్రజలు విశ్వసించలేదు. కేసీఆర్‌కే పట్టం కట్టారు’అని పేర్కొన్నారు. ట్రక్కు గుర్తు అడ్డురాకుండా ఉండుంటే.. టీఆర్ఎస్ మరో 11 స్థానాలు ఖాతాలో చేరేవన్నారు. ఉత్తమ్, జానారెడ్డిలు మంత్రులుగా ఉన్నప్పటికీ.. ఏనాడూ నల్లగొండ జిల్లాలో ఫ్లోరోసిస్, సాగునీటి సమస్యలపై దృష్టి సారించలేదని కేటీఆర్ ధ్వజమెత్తారు. అప్పటి సీఎం కిరణ్‌కుమార్ రెడ్డి చిత్తూరు జిల్లాకు వేల కోట్ల రూపాయలను తాగునీటి కోసం తరలించినా జానా, ఉత్తమ్ పదవులు పట్టుకుని వేలాడారని మండిపడ్డారు. నెలరోజుల్లో మిషన్ భగీరథ పూర్తయి ఇంటింటికి తాగునీరు రాబోతుందని, త్వరలోనే జిల్లాలో ఫ్లోరోసిస్భూతం కనుమరుగవుతుందని ఆయన స్పష్టం చేశారు. కేసీఆర్ సీఎం అయిన తర్వాతే 3,400 తండాలు గ్రామ పంచాయతీలు అయ్యాయి. 12 వేలకు పైచిలుకు గ్రామపంచాయతీలుంటే అందులో 25% గిరిజనులే సర్పంచ్‌లు కాబోతున్నారు. వీలైనంత వరకు ఏకగ్రీవాల కోసం ప్రయత్నించాలని కేటీఆర్ పిలుపునిచ్చారు. పార్టీలో చేరిన కోరుకంటి తెలంగాణ భవన్లో టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెం ట్ కేటీఆర్ సమక్షంలో రామగుండం ఇండిపెం డెంట్ ఎమ్మెల్యే కోరుకంటి చందర్ టీఆర్ఎస్లో చేరారు. ఈ కార్యక్రమానికి మాజీ ఎమ్మెల్యే సోమారపు సత్యనారాయణ, ప్రభుత్వ సలహాదా రు వివేక్ హాజరయ్యారు. ‘చందర్కి ఏ అవసరమొచ్చినా నేను సహకరిస్తా’అని కేటీఆర్ అన్నారు. అనంతరం చందర్ మాట్లాడుతూ.. తనను టీఆర్ఎస్లో మళ్లీ చేర్చుకున్నందుకు సంతోషంగా ఉందని భావోద్వేగానికి గురయ్యారు. నాగార్జున సాగర్‌కు చెందిన భగవాన్ నాయక్, లక్ష్మారెడ్డి, అబ్బాస్‌లు కూడా టీఆర్ఎస్లో చేరారు. రామగుండంకు మెడికల్ కాలేజీ ‘రామగుండంలో కాంగ్రెస్ గెలవకపోవటం మన అదృష్టం. మన సోదరుడు గెలవటం సంతోషం. చందర్‌కు సతీవియోగం కలిగిన రోజే నేను సోమారపు ప్రచారానికి వచ్చాను. చాలా బాధ పడ్డాను. విభేదాలు పక్కన బెట్టి సోమారపుతో కలిసి పనిచేయాలని చందర్‌కు సూచించారు. రామగుండంలో మెడికల్ కాలేజ్ ఏర్పాటు చేసి హామీ నిలబెట్టుకుంటాం. చందర్, సత్యనారాయణకు కలిసి లక్ష పైన ఓట్లు వచ్చాయి. వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లోనూ ఈ ఓట్లు మనకు పడాలి మీ నియోజక వర్గ బాధ్యతలు నేను వ్యక్తిగతంగా తీసుకుంటా’అని పేర్కొన్నారు. శివసాయికి చేయూత పోలియో వ్యాధితో రెండు కాళ్లు దెబ్బతిన్న రామగుండం నియోజకవర్గానికి చెందిన బాలుడు శివసాయికి టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ భరోసా ఇచ్చారు. తెలంగాణ భవన్లో కేటీఆర్‌ను ఎమ్మెల్యే చందర్‌తో పాటు కలిసిన శివసాయి తన గోడును వెళ్లబోసుకున్నాడు. బాలుడి దయనీయ స్థితికి స్పందించిన కేటీఆర్ తక్షణమే శివసాయిని ఆస్పత్రిలో చేర్పించాలని గ్రేటర్ హైదరాబాద్ టీఆర్ఎస్ నేత కట్టెల శ్రీనివాస్ యాదవ్‌ని ఆదేశించారు. బాలుడి వైద్యానికయ్యే ఖర్చును భరిస్తానంటూ భరోసా ఇచ్చారు. -
హార్వర్డ్ సదస్సుకు కేటీఆర్
సాక్షి, హైదరాబాద్: టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కె.తారక రామారావుకు మరో అరుదైన గౌరవం దక్కింది. హార్వర్డ్ యూనివర్సిటీ ప్రతిష్టాత్మకంగా నిర్వహించే హార్వర్డ్ ఇండియా వార్షిక కాన్ఫరెన్స్‌కు హాజరుకావాల్సిందిగా కేటీఆర్‌కు వర్సిటీ ఆహ్వానం పంపింది. ఫిబ్రవరి 16, 17 తేదీల్లో అమెరికాలోని మసాచుసెట్స్‌లో జరగనున్న ఈ సదస్సుకు పలు దేశాల ప్రముఖులు హాజరుకానున్నారు. సమకాలీన భారతదేశం ఎదుర్కొంటున్న అనేక సవాళ్లు, వివిధ అభివృద్ధి అంశాలపై 2 రోజులపాటు సమావేశంలో చర్చిం చనున్నారు. సుమారు 1000 మంది విద్యావేత్తలు, విద్యార్థులు పాల్గొననున్నారు. ‘ఇండియా ఎట్ ఇన్ఫ్లెక్షన్ పాయింట్’ అనే థీమ్ ఆధారంగా సాగనున్న ఈ సమావేశంలో ప్రత్యేక వక్తగా హాజరై ప్రసంగించాల్సిందిగా కేటీఆర్‌ను సదస్సు నిర్వాహకులు కోరారు. ఆ సంఘాలకు గుర్తింపు లేదు: కేటీఆర్ తన పేరు మీద ఏర్పాటు చేస్తున్న సంఘాలు, యువసేనలు, అభిమాన సంఘాలకు తన వైపు నుంచి ఎలాంటి మద్దతు లేదని కేటీఆర్ స్పష్టం చేశారు. పార్టీ, తనపై అభిమానం ఉంటే టీఆర్ఎస్, దాని అనుబంధ సంఘాలతో కలసి పనిచేయాలని సూచించారు. -
ఎక్కువ గ్రామాలు ఏకగ్రీవం కావాలి
సాక్షి, సిరిసిల్ల: ఎక్కువ పంచాయతీలు ఏకగ్రీవం కావాలని టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కె.తారకరామారావు కోరారు. గురువారం రాజన్న సిరిసిల్ల జిల్లాకేంద్రంలో నిర్వహించిన నియోజకవర్గస్థాయి పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. సిరిసిల్ల నియోజకవర్గంలో ఏకగ్రీవమైన గ్రామపంచాయతీలకు ప్రభుత్వం అందించే రూ.10 లక్షలతో పాటు సొంతంగా ఎమ్మెల్యే గ్రాంట్ల నుంచి మరో రూ.15 లక్షలు ఇచ్చి ప్రోత్సహిస్తామని, దీంతో ఏకగ్రీవమయ్యే గ్రామపంచాయతీల అభివృద్ధికి తక్షణమే రూ.25 లక్షలు ఖాతాల్లో పడ్డట్లేనని చెప్పారు. ‘సిరిసిల్లలో పోటీ మనలో మనకే ఉంటది. అందరూ మనవాళ్లే. నియోజకవర్గాల్లో అత్యధిక స్థానాలు ఏకగ్రీవమవ్వాలి. సర్పంచ్ పదవి ఏకగ్రీవానికి పార్టీ మండల అధ్యక్షులు చొరవ తీసుకోవాలి.. రాజీపడిన వారికి ఎంపీటీసీ, జెడ్పీటీసీ, సింగిల్‌విండో, నామినేటెడ్ పదవుల్లో అవకాశాలు కల్పిస్తాం’అని కేటీఆర్ భరోసా ఇచ్చారు. గంభీరావుపేట మండలం లక్ష్మీపూర్ తండా గ్రామపంచాయతీలో సర్పంచ్‌గా ఏకగ్రీవమైనట్లు ప్రకటించుకున్న మంజులనాయక్ను కేటీఆర్ సభలో అభినందించారు. లేకుంటే వంద సీట్లు గ్యారంటీ 2014లోనూ ఒంటరిగానే పోటీ చేసిన టీఆర్ఎస్కు ప్రజలు 63 సీట్లు ఇచ్చారని కేటీఆర్ చెప్పారు. ఈసారి ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రకటనలతో వందల కోట్లు ఖర్చు చేసినప్పటికీ టీఆర్ఎస్కు 88 సీట్లు రావడం కేసీఆర్ పాలనాదక్షతకు నిదర్శమన్నారు. రాష్ట్రంలో ట్రక్కు గుర్తు వల్ల 1,65,000 ఓట్లు పక్కదారి పట్టాయని, వాటితో కలుపుకుంటే రాష్ట్రంలో 50% ప్రజలు తమకు మద్దతు తెలిపారని అన్నారు. టీఆర్ఎస్ కోల్పోయిన వాటిలో పది సీట్లు కేవలం 4 వేల లోపు ఓట్లతో ఓటమి చెందామని, సరిగ్గా అభ్యర్థించి ఉంటే వంద స్థానాలు గెలిచేవాళ్లమని వివరించారు. ప్రజల ఆశలకు అనుగుణంగా పనిచేయాల్సి ఉందని చెప్పారు. కేసీఆర్ ఆలోచనలైన రైతుబంధు, రైతుబీమా పథకాలు దేశవ్యాప్తంగా ఆదర్శంగా మారడం ప్రతీ తెలంగాణ బిడ్డకు గర్వకారణమన్నారు. ఇదే స్ఫూర్తితో పంచాయతీ నుంచి పార్లమెంట్ దాకా గులాబీ జెండా ఎగురవేయాలని కోరారు. అడ్డం పడుతవ్ అన్నరు.. ‘దేశ చరిత్రలో ఇప్పటి వరకు ముందస్తు ఎన్నికలకు వెళ్లిన ఎన్టీఆర్, వాజ్‌పేయి, ఇందిరాగాంధీ, చంద్రబాబు ఎవరూ కూడా గెలువలే. మీరు కూడా అడ్డం పడుతరని చాలామంది అన్నరు. కానీ తెలంగాణ ప్రజలు చరిత్రను తిరగరాసిన్రు. లక్షల మంది పార్టీ కార్యకర్తలు కష్టపడితే 88 మంది ఎమ్మెల్యేలం గెలిచినం. ఈ గెలుపు టీఆర్ఎస్ కార్యకర్తలకే అంకితం’అని కేటీఆర్ చెప్పారు. ఈ సమావేశంలో టెస్కాబ్ చైర్మన్ కొండూరి రవీందర్రావు, టీఆర్ఎస్ నేతలు బస్వరాజు సారయ్య, గూడూరి ప్రవీణ్ పాల్గొన్నారు. గుంపుగా వచ్చి గల్లంతయ్యారు దేశంలోని చిన్నాపెద్ద నేతలంతా గుంపుగా వచ్చి గల్లంతయ్యారని, ముఖ్యమంత్రి కేసీఆర్ ఒకే ఒక్కడిగా నిలబడ్డారని టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిం డెంట్, సిరిసిల్ల ఎమ్మెల్యే కె.తారకరామారావు అన్నారు. లక్షల మంది టీఆర్ఎస్ కార్యకర్తలు, తమ ప్రభుత్వం చేసిన సంక్షేమంపై ఉన్న విశ్వాసమే ఆ ధీమాకు కారణమన్నారు. దేశంలోని ఉద్దండులంతా ఒక్కటిగా వచ్చినా ప్రజలు కులమతాలకు అతీతంగా టీఆర్ఎస్కు 75% స్థానాలతో మెజార్టీని ఇచ్చారని చెప్పారు. ప్రధాని మోదీ, అమిత్‌షా, ఆరు రాష్ట్రాల సీఎంలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అంతా కలసి వందల సంఖ్యలో తరలివచ్చినా బీజేపీకి డిపాజిట్ కూడా దక్కలేదని ఎద్దేవా చేశారు. రాహుల్‌గాంధీ, చంద్రబాబునాయుడు కలసి సభలు పెట్టి తమపై దుష్ప్రచారం చేసినా ప్రజలు నమ్మలేదన్నారు. ఆరోగ్యం బాగాలేని సోనియాను కూడా ప్రచారానికి రప్పించి ఆమెను ఇబ్బంది పెట్టారని అన్నారు. ఎంపీగా వినోద్‌ను గెలిపించుకుందాం ‘మన ఎంపీ వినోద్‌కుమార్ అంత మంచి మనిషి మనకు దొరకడు. సిరిసిల్ల, కరీంనగర్ నుంచి పార్లమెంట్ దాకా ఏ పని కావాలో చేసుకొస్తడు. తన స్వార్థం కోసం కాకుండా నియోజకవర్గం కోసం పనిచేస్తడు. ఈ ఎన్నికల తర్వాత వచ్చేవి పార్లమెంట్ ఎన్నికలే కాబట్టి మళ్లీ వినోద్‌కుమార్‌ను ఎంపీగా గెలిపించుకోవడానికి మనమంతా కృషిచేయాలే’అని కేటీఆర్ చెప్పారు. దీంతో పార్లమెంట్ ఎన్నికల్లో కరీంనగర్ నియోజకవర్గ ఎంపీ అభ్యర్థిగా మళ్లీ వినోద్‌కుమారే పోటీ చేయనున్నారని కేటీఆర్ స్పష్టం చేశారు. -
తలసానికి మెజారిటీ తగ్గడం బాధగా ఉంది: కేటీఆర్
సాక్షి, హైదరాబాద్ : 2009లో చావునోట్లో తలపెట్టి మరీ.. తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన నాయకుడు సీఎం కేసీఆర్ అని టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే తారకరామారావు అన్నారు. టీఆర్ఎస్ సనత్‌నగర్ నియోజకవర్గ కార్యకర్తల స్థాయి సమావేశం జలవిహార్‌లో బుధవారం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన కేటీఆర్ మాట్లాడుతూ.. కేసీఆర్ ధన్యజీవి అని మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ అభినందించిన విషయాన్ని గుర్తుచేశారు. ఐదు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, కేంద్రమంత్రులు, ప్రధానమంత్రి, రాహుల్ గాంధీ ఇలా ఎంతోమంది నేతలు వచ్చి తెలంగాణలో ప్రచారం చేసినా.. ప్రజలు కేసీఆర్‌కే పట్టం కట్టారని పేర్కొన్నారు. ప్రజల కోసం నిర్విరామంగా కృషి చేసే మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్‌కు ఈసారి మెజారిటీ తగ్గడం తనకు బాధ కలిగించిందన్నారు. ‘నిత్యం ప్రజల్లోనే ఉండే తలసానికి భారీ మెజారిటీ వచ్చి ఉండేది. కానీ, రాష్ట్రంలో, హైదరాబాద్ నగరంలో లక్షల సంఖ్యలో ఓట్లు గల్లంతు అయ్యాయి. మొత్తం 22 లక్షల ఓట్లు గల్లంతయ్యాయి. ఎన్నికల సంఘం ఆ తప్పును తిరిగి సవరించుకుంటోంది. ఈవీఎంలను తప్పుబట్టే ప్రతిపక్షాలకు, బుర్ర తుప్పుపట్టిందని కేటీఆర్ ఎద్దేవా చేశారు. ప్రతి గెలుపు నుంచి ఓటమి నుంచి పాఠాలు, గుణపాఠాలు నేర్చుకోవాలని, అంతేకానీ, ఓటు వేయని ప్రజలను ప్రశ్నించే హక్కు ఎవరికీ ఉండదని ఆయన హితవు పలికారు. -
ఇట్లు.. మీ విధేయులు
సాక్షి, హైదరాబాద్: అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయంతో రెండోసారి అధికారంలోకి వచ్చిన టీఆర్ఎస్.. పార్టీ నేతలకు పదవుల పంపకంపై దృష్టి పెడు తోంది. ఫిబ్రవరి, మార్చిలో జరగనున్న శాసన మండలి ఎన్నికల నుంచే ఈ ప్రక్రియను ప్రారంభిం చాలని భావిస్తోంది. టీఆర్ఎస్లో మొదటి నుంచి పని చేస్తున్న వారికి, పార్టీ విధేయులకు, అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ గెలుపు కోసం పని చేసిన వారికి ఎమ్మెల్సీలుగా అవకాశం ఇవ్వాలని నిర్ణయించింది. రాజీనామాల కారణంగా మండలిలో ఇప్పటికే 4 స్థానాలు ఖాళీ అయ్యాయి. పదవీ కాలం ముగుస్తుండటంతో మార్చిలో మరో తొమ్మిది స్థానాలు ఖాళీ అవుతున్నాయి. ఈ ఖాళీ స్థానాల్లో అవకాశం కోసం టీఆర్ఎస్ నేతలు చాలా మంది పోటీపడుతున్నారు. టీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌కు తమ మనసులోని కోరికను చెప్పుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. వర్కింగ్ ప్రెసిడెంట్ కె.తారకరామారావును కూడా కలసి పార్టీ కోసం తాము చేసిన పనులను వివరించి అవకాశం ఇవ్వాలని కోరుతున్నారు. రాష్ట్ర శాసనమండలిలో మొత్తం 40 స్థానాలున్నాయి. ఎమ్మెల్యేల కోటా 14, స్థానిక సంస్థల కోటా 14, గవర్నర్ కోటా 6, ఉపాధ్యాయుల కోటా 3, పట్టభద్రుల కోటా 4 స్థానాలు ఉన్నాయి. ప్రతి రెండేళ్లకు ఒకసారి మూడింట్లో రెండో వంతు స్థానాలు ఖాళీ అవుతాయి. కేంద్ర ఎన్నికల సంఘం వీటికి ఎన్నికలు నిర్వహిస్తుంది. మార్చిలో 9 స్థానాలు ఖాళీ అవుతున్నాయి. అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి ఎమ్మెల్యేలు అయిన ముగ్గురు ఎమ్మెల్సీలతోపాటు టీఆర్ఎస్లో నుంచి కాంగ్రెస్‌లో చేరిన మరో ఎమ్మెల్సీ రాజీనామా చేశారు. ఇలా మొత్తం 13 ఎమ్మెల్సీ స్థానాలు ఖాళీ అవుతున్నాయి. ప్రస్తుతం ఉన్న ఎమ్మెల్యేల సంఖ్య ప్రకారం... ఎమ్మెల్యే కోటాలోని ఒక స్థానం మినహా అన్ని అధికార పార్టీకే దక్కనున్నాయి. ఎన్నికల వరకు ప్రతిపక్ష ఎమ్మెల్యేల సంఖ్య ఇంకా తగ్గితే అన్ని టీఆర్ఎస్ గెలుచుకునే పరిస్థితి ఉంటుంది. అయితే టీఆర్ఎస్లో ఎమ్మెల్సీ స్థానాలు ఆశించే వారి సంఖ్య సైతం భారీగానే ఉంది. ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీలుగా ఉన్న హోం మంత్రి మహమూద్ అలీ (టీఆర్ఎస్), మహమ్మద్ సలీం (టీఆర్ఎస్), టి.సంతోశ్‌కుమార్ (టీఆర్ఎస్), మహమ్మద్ షబ్బీర్‌అలీ (కాంగ్రెస్), పొంగులేటి సుధాకర్‌రెడ్డి (కాంగ్రెస్) పదవీకాలం మార్చి ఆఖరుతో ముగుస్తోంది. అసెంబ్లీ ఎన్నికల్లో ఎమ్మెల్యేగా ఎన్నికైన మైనంపల్లి హనుమంతరావు (టీఆర్ఎస్) రాజీనామాతో ఖాళీ అయిన ఎమ్మెల్సీ స్థానం సైతం ఎమ్మెల్యే కోటాలోనిదే. ఇలా ఆరు ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. ప్రస్తుత ఎమ్మెల్యేల సంఖ్య ప్రకారం ప్రకారం వీటిలో ఐదు స్థానాలను టీఆర్ఎస్ గెలుచుకునే పరిస్థితి ఉంది. పదవీకాలం ముగుస్తున్న ముగ్గురు టీఆర్ఎస్ ఎమ్మెల్సీలకు ఆ పార్టీ అధిష్టానం మళ్లీ అవకాశం ఇవ్వాలని భావిస్తోంది. వీరితోపాటు టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ రాజకీయ సలహాదారు శేరి సుభాశ్‌రెడ్డికి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తక్కళ్లపల్లి రవీందర్‌రావుకు టీఆర్ఎస్ కొత్తగా ఇచ్చే అవకాశం కనిపిస్తోంది. అలాగే తెలంగాణ ఉద్యమం, 2014 వరకు టీఆర్ఎస్ ఉమ్మడి జిల్లా అధ్యక్షులుగా పని చేసిన అందరికీ ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, రాష్ట్ర స్థాయి కార్పొరేషన్లు దక్కాయి. వరంగల్ ఉమ్మడి జిల్లా అధ్యక్షుడిగా వ్యవహరించిన రవీందర్‌రావుకు ఈసారి ఎమ్మెల్సీ అవకాశం ఇవ్వాలని టీఆర్ఎస్ భావిస్తున్నట్లు తెలిసింది. అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి ఎమ్మెల్యేలు అయిన కారణంగా మైనంపల్లి హనుమంతరావు (టీఆర్ఎస్), పట్నం నరేందర్‌రెడ్డి (టీఆర్ఎస్), కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి (కాంగ్రెస్) రాజీనామా చేశారు. ఎన్నికలకు ముందు టీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్‌లో చేరిన కొండా మురళీధర్‌రావు (టీఆర్ఎస్) సైతం ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేశారు. పట్నం నరేందర్‌రెడ్డి రాజీనామాతో ఖాళీ అయిన రంగారెడ్డి జిల్లా స్థానిక సంస్థల కోటా స్థానానికి మాజీ మంత్రి పట్నం మహేందర్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే ఎం.సుధీర్‌రెడ్డి, క్యామ మల్లేశ్, కంజర్ల చంద్రశేఖర్‌రెడ్డి పోటీ పడుతున్నారు. కె.రాజగోపాల్‌రెడ్డి రాజీనామాతో ఖాళీ అయిన నల్లగొండ స్థానిక సంస్థల స్థానం నుంచి తేరా చిన్నపరెడ్డి, శానంపూడి సైదిరెడ్డి, వేనేపల్లి చందర్రావు పోటీ చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు. కొండా మురళీధర్‌రావు రాజీనామాతో ఖాళీ అయిన వరంగల్ ఉమ్మడి జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానం ఖాళీ అయ్యింది. టీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డి పేరును అధిష్టానం ఈ స్థానానికి పరిశీలిస్తోంది. శ్రీనివాస్‌రెడ్డికి ఎమ్మెల్యే కోటాలో అవకాశం కల్పిస్తే ఇతర పేర్లను పరిశీలించే అవకాశం ఉంది. హైదరాబాద్ స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ ఎం.ఎస్.ప్రభాకర్‌రావు (టీఆర్ఎస్) పదవీకాలం మార్చి ఆఖరుతో ముగుస్తోంది. టీఆర్ఎస్ అధిష్టానం ఈ స్థానంలో ఎం.ఎస్.ప్రభాకర్‌రావుకు మళ్లీ అవకాశం కల్పించనుంది. కరీంనగర్, మెదక్, ఆదిలాబాద్, నిజామాబాద్ ఉమ్మడి జిల్లాల పట్టభద్రుల నియోజకవర్గం ఎమ్మెల్సీ కె.స్వామిగౌడ్ (టీఆర్ఎస్) పదవీకాలం మార్చితో ముగుస్తోంది. శాసనమండలి చైర్మన్‌గా ఉన్న స్వామిగౌడ్‌కు ఇదే స్థానంలో పోటీ చేసే అవకాశం కల్పించనుంది. స్వామిగౌడ్‌కు ఎమ్మెల్యే కోటాలో అవకాశం కల్పిస్తే ఇక్కడ కరీంనగర్ మేయర్ రవీందర్‌సింగ్, గ్రూప్–1 అధికారుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు మామిండ్ల చంద్రశేఖర్గౌడ్లలో ఒకరిని టీఆర్ఎస్ బరిలో దింపే అవకాశం ఉంది. కరీంనగర్, మెదక్, ఆదిలాబాద్, నిజామాబాద్ ఉమ్మడి జిల్లాల ఉపాధ్యాయ నియోజకవర్గం ఎమ్మెల్సీ పాతూరి సుధాకర్‌రెడ్డి (టీఆర్ఎస్) పదవీకాలం మార్చిలో ముగుస్తోంది. టీఆర్ఎస్ అధిష్టానం ఈ స్థానంలో మరోసారి పాతూరికే అవకాశం ఇవ్వాలని భావిస్తోంది. వరంగల్, నల్లగొండ, ఖమ్మం ఉమ్మడి జిల్లాల ఉపాధ్యాయ నియోజకవర్గం ఎమ్మెల్సీ పూల రవీందర్ (స్వతంత్ర) పదవీకాలం మార్చిలో ముగుస్తోంది. పూల రవీందర్ అధికార పార్టీకి అనుబంధంగానే కొనసాగుతున్నారు. ఈ నేపథ్యంలో ఆయనకే టీఆర్ఎస్ మద్దతు తెలిపే అవకాశం ఉంది. -
నేడు జిల్లాకు కేటీఆర్
సాక్షి, వరంగల్: టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా ఎన్నికై సిరిసిల్ల ఎమ్మెల్యే కే. తారక రామారావు మొదటి సారిగా నేడు ఉమ్మడి జిల్లాలో పర్యటించనున్నారు. కేటీఆర్ రాకతో పార్టీ శ్రేణుల్లో సందడి నెలకొంది. దీంతో హనుమకొండ, జనగామలో కార్యకర్తల సమావేశాలు నిర్వహించి కార్యకర్తలు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. కేటీఆర్ జిల్లాలో పర్యటనలో భాగంగాముందుగా హనుమకొండ బాలసముద్రంలో టిఆర్ఎస్ జిల్లా పార్టీ కార్యాలయానికి శంకుస్థాపన చేస్తారు. అనంతరం వరంగల్ అర్బన్, రూరల్ జిల్లాల ముఖ్య కార్యకర్తలతో కేడీసీ కాలేజీలో జరగనున్న భారీ బహిరంగా సభలో పాల్గొని ప్రసంగిస్తారు. పెంబర్తి నుంచి వరంగల్ వరకు కేటీఆర్‌కు ఘనంగా స్వాగతం పలకడానికి భారీ ఏర్పాట్లు చేస్తున్న పార్టీ శ్రేణులు. మడికొండ నుండి భారీ బైక్ ర్యాలీతో స్వాగతం కోసం ఏర్పాట్లు చేస్తున్నపార్టీ కార్యకర్తరలు. -
సిరిసిల్లలో రామన్న
-
టీఆర్ఎస్ను అజేయశక్తిగా తీర్చిదిద్దుతా: కేటీఆర్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్)ని అజేయ శక్తిగా తీర్చిదిద్దుతానని, రాష్ట్రంలో 100 ఏళ్లు నిలిచిపోయేలా పార్టీని పటిష్ట పరుస్తానని ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారాక రామారావు పేర్కొన్నారు. సోమవారం పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా పదవీబాధ్యతలు స్వీకరణ అనంతరం తెలంగాణ భవన్ వద్ద పార్టీ శ్రేణులను ఉద్దేశించి ఆయన ప్రసంగించారు. ‘‘నన్ను ఆశీర్వదించడానికి వచ్చిన అభిమానులకు, కార్యకర్తలకు, నాయకులకు పేరుపేరునా కృతజ్ఞతలు. మన పార్టీ అధ్యక్షుడు, సీఎం కేసీఆర్‌ను రాష్ట్రంలోని అన్ని మతాలు, వర్గాలు, కులాల ప్రజలు ఎన్నికల్లో అఖండ మెజారిటీతో ఆశీ ర్వదించారు. ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లాలన్న కాంక్షతో స్పష్టమైన తీర్పు ఇచ్చారు. ఈ క్రమంలో రాష్ట్రంలోని 4కోట్ల మంది ప్రజలకు అభివృద్ధి, సంక్షేమ పథకాలను అందించే పనిలో కేసీఆర్ నిమగ్నమై ఉండాల్సిన సమయం ఆసన్నమైంది. కాబట్టి, టీఆర్ఎస్ అంటే భవిష్యత్తులో ‘తిరుగులేని రాజకీయ శక్తి’గా మలచాలన్న సంకల్పంతో పెద్దలు కేసీఆర్ వర్కింగ్ ప్రెసిడెంట్ బాధ్యతను నాకు అప్పజెప్పారు. మీ అందరి ఆశీస్సులతో, మీలో ఒకడిగా తెలంగాణలోని అన్ని వర్గాలకు అండగా ఉంటూ ముందుకు సాగుతూ పార్టీని అజేయశక్తిగా మలుస్తా. ఈ క్రమంలో మీ అందరి ఆశీర్వాదాన్ని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. నన్ను ఆశీర్వదించడానికి విచ్చేసిన నా అన్నదమ్ములు, అక్కచెల్లెళ్లకు శిరస్సు వంచి పాదాభివందనం చేస్తు న్నా. మీ ఆశీర్వాదంతో కేసీఆర్ నాపై పెట్టిన బాధ్యతను నెరవేర్చేందుకు ప్రయత్నిస్తా. 100 ఏళ్లపాటు టీఆర్ఎస్ ప్రజల సేవలో నిమగ్నమయ్యే విధంగా సంస్థాగతంగా పటిష్ట కార్యచరణ రూపొందిస్తా. పార్టీని బలోపేతం చేస్తా. పార్టీ కార్యాలయాలు నిర్మించి పార్టీ శిక్షణ కార్యక్రమాలు చేపడతా. ప్రభుత్వం, ప్రజలకు మధ్య వారధిగా పార్టీని నిర్మిస్తా. ఈ క్రమంలో భగవంతుడు నాకు ఇచ్చిన శక్తినంతా ధారపోస్తానని హామీ ఇస్తున్నా. నన్ను ఆశీర్వదించడానికి వచ్చిన వారందరికీ వినమ్రంగా పేరుపేరునా మరోసారి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నా’’అని కేటీఆర్ పేర్కొన్నారు. పెద్దల ఆశీర్వాదంతో... అంతకుముందు కేటీఆర్ బాధ్యతల స్వీకరణ కార్యక్రమం అట్టహాసంగా సాగింది. తొలుత ప్రగతి భవన్ లో కేటీఆర్ తల్లిదండ్రుల తరఫు పెద్దల ఆశీర్వాదం తీసుకున్నారు. నిజామాబాద్ ఎంపీ కవిత సోదరుడు కేటీఆర్‌కు తిలకం దిద్దారు. ‘టీఆర్ఎస్లో క్రియాశీలకమైన పాత్ర పోషించబోతున్న నా ప్రియమైన సోదరుడికి శుభాకాంక్షలు’అని ట్వీట్ చేశారు. అనంతరం కేటీఆర్ ప్రగతి భవన్ నుంచి బయలుదేరగా భారీగా తరలివచ్చిన పార్టీ నేతలు, కార్యకర్తలతో సందడి మొదలైంది. బోనాలు, బతుకమ్మలు, కోలాటాలు, ఒగ్గుడోలు, పులివేషాలు, డప్పులు, గుస్సాడీ, కొమ్ముకొయ్యలు, చిందుయక్షగానాల ప్రదర్శనలతోపాటు బంజరాహిల్స్‌లోని బసవతారకం కేన్సర్ ఆస్పత్రి నుంచి తెలంగాణ భవన్ వరకు టీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలు చేపట్టిన భారీ ర్యాలీ మధ్య కేటీఆర్ తెలంగాణ భవన్‌కు చేరుకున్నారు. రాష్ట్రం నలుమూలల నుంచి భారీగా తరలివచ్చిన టీఆర్ఎస్ శ్రేణులతో కేన్సర్ ఆస్పత్రి నుంచి తెలంగాణ భవన్ మధ్య మార్గం కిక్కిరిసిపోయింది. ‘కేసీఆర్ నాయకత్వం వర్ధిల్లాలి... కేటీఆర్ జిందాబాద్’ నినాదాలతో ఆ ప్రాంతం మార్మోగింది. తెలంగాణ భవన్‌కు చేరుకున్న కేటీఆర్ ముందుగా తెలంగాణ తల్లి, ప్రొఫెసర్ జయశంకర్ విగ్రహాలకు పూలమాలలు వేశారు. తెలంగాణ భవన్లో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన చాంబర్లోకి వెళ్లారు. టీఆర్ఎస్ ముఖ్య నేతలు, కార్యకర్తల కోలాహలం, వేదపండితుల ఆశీర్వచనాల మధ్య ఉదయం 11.55 గంటలకు టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా బాధ్యతలు స్వీకరించారు. కార్యక్రమంలో హోంమంత్రి మహమూద్ అలీ, ముఖ్యనేతలు తన్నీరు హరీశ్‌రావు, తలసాని శ్రీని వాస్‌యాదవ్, జీహెచ్ఎంసీ మేయర్ బొంతు రామ్మోహన్, టి.పద్మారావుగౌడ్, కడియం శ్రీహరి, దానం నాగేందర్, పల్లా రాజేశ్వర్‌రెడ్డి, జి.జగదీశ్‌రెడ్డి, పోచారం శ్రీనివాస్‌రెడ్డి, సి.లక్ష్మారెడ్డి, ఎర్రబెల్లి దయాకర్‌రావు, ఆరూరి రమేశ్, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, గుత్తా సుఖేందర్‌రెడ్డి, కె.ఆర్.సురేశ్‌రెడ్డి, తుమ్మల నాగేశ్వర్రావు, పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డి, తక్కళ్లపల్లి రవీందర్రావు, మరికొందరు ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, పలు కార్పొరేషన్ల చైర్మన్లు, టీఆర్ఎస్ కార్యవర్గ ముఖ్యులు పాల్గొన్నారు. కేటీఆర్‌కు వారంతా శుభాకాంక్షలు తెలిపారు. నేడు సిరిసిల్లకు కేటీఆర్... టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ హోదాలో కేటీఆర్ తొలిసారిసొంత నియోజకవర్గమైన సిరిసిల్లకు మంగళవారం వెళ్లనున్నారు. భారీ మెజార్టీతో మరోసారి ఎమ్మెల్యేగా గెలిపించిన నియోజకవర్గ ప్రజలకు కృతజ్ఞతలు తెలుపనున్నారు. కేటీఆర్ జిల్లాల పర్యటన ఖరారైంది. ఎన్నికల్లో టీఆర్ఎస్ ను గెలిపించిన ప్రజలకు కృతజ్ఞతలు తెలిపేందుకు అన్ని జిల్లాల్లో సభలు నిర్వహించనుంది. బుధవారం వరంగల్‌లో ఈ సభ జరగనుంది. అన్ని జిల్లాల్లోనూ ఈ సభలు నిర్వహించనున్నారు. కేటీఆర్ ఈ పర్యటనల్లోనే అన్ని జిల్లాల్లో టీఆర్ఎస్ కార్యాలయాల నిర్మాణానికి శంకుస్థాపన చేయనున్నారు. -
బాధ్యతలు స్వీకరించిన కేటీఆర్
సాక్షి, హైదరాబాద్: టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా మాజీ మంత్రి, సిరిసిల్ల ఎమ్మెల్యే కే.టీ రామారావు బాధ్యతలు స్వీకరించారు. ముందుగా నిర్ణయించిన సమయం ప్రకారం తెలంగాణ భవన్లో ఈరోజు (సోమవారం) ఉదయం 11:56 నిమిషాలకు ఆయన బాధ్యతలు చేపట్టారు. నగరంలోని బసవతారం ఆసుపత్రి నుంచి తెలంగాణ భవన్ వరకు భారీ ర్యాలీగా చేరుకున్న కేటీఆర్‌కు పార్టీ శ్రేణులు ఘన స్వాగతం పలికాయి. దాదాపు 20వేలకు పైగా పార్టీ కార్యకర్తలు, అభిమానులు తెలంగాణ భవన్ వద్దకు తరలివచ్చారు. గిరిజన సాంప్రదాయ నృత్యాలు, బతుకమ్మ ఆటలతో టీఆర్ఎస్ కార్యాలయంలో పండగ వాతావరణం నెలకొంది. ఈ కార్యక్రమానికి నూతనంగా ఎన్నికైన ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు, పార్టీ నేతలు పెద్ద ఎత్తున హాజరైయ్యారు. -
‘కేటీఆర్‌కు సహకరిస్తాం’
సాక్షి, హైదరాబాద్: టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా కేటీఆర్ ఎంపికవడం కార్యకర్తల్లో ఉత్సాహాన్ని నింపిందని, యువ నేతకు తమ సహాయ సహకారాలు ఉంటాయని టీఆర్ఎస్ నేత తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. సోమవారం కేటీఆర్ బాధ్యతలు స్వీకరించనున్న నేపథ్యంలో సీనియర్ నేతలు తలసాని, దానం నాగేందర్, జీహెచ్ఎంసీ మేయర్ బొంతు రామ్మోహన్ ఏర్పాట్లను పరిశీలించారు. అనంతరం వారు మీడియాతో మాట్లాడుతూ.. సోమవారం ఉదయం 10 గంటలకు బసవతారకం రౌండ్ టేబుల్ స్కూల్ నుంచి తెలంగాణ భవన్‌కు కార్యకర్తల ర్యాలీ ఉంటుందని తెలిపారు. అనంతరం కేటీఆర్ తెలంగాణ తల్లి, ప్రొఫెసర్ జయశంకర్ విగ్రహాలకు పూలమాల వేసి 11.55కి తెలంగాణ భవన్లో టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా బాధ్యతలు స్వీకరిస్తారని వారు వెల్లడించారు. -
తెలంగాణం... గులాబీ వనం
సాక్షి, హైదరాబాద్ : రాష్ట్రంలో వరుసగా రెండోసారి అధికారం చేపట్టిన తెలంగాణ రాష్ట్ర సమితిని తిరుగులేని రాజకీయశక్తిగా మార్చేందుకు ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు ప్రత్యేక కార్యాచరణ సిద్ధం చేశారు. అన్ని ఎన్నికల్లోనూ పార్టీ భారీ ఆధిక్యంతో గెలవాలనే లక్ష్యంతో ముందుకెళ్లనున్నారు. టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా శుక్రవారం నియమితులైన వెంటనే కేటీఆర్ పార్టీ బలోపేతంపై పూర్తిస్థాయిలో దృష్టి సారించారు. గ్రామస్థాయి నుంచి రాష్ట్రస్థాయి వరకు పార్టీ వ్యవస్థను పటిష్ట పరిచే ప్రణాళికను రచించారు. ఇందులో భాగంగానే శనివారం టీఆర్ఎస్ రాష్ట్ర కార్యవర్గ సమావేశం నిర్వహించారు. టీఆర్ఎస్లో గత సంప్రదాయానికి భిన్నంగా ప్రధాన కార్యదర్శులందరితో మాట్లాడించారు. పార్టీ ఎలా ఉంటే బాగుంటుందో చెప్పాలని అడిగారు. ఇన్నాళ్లూ పార్టీని పట్టించుకోలేదని ఇక నుంచి కార్యకర్తలను, నాయకులను నిత్యం పార్టీతో మమేకమయ్యేలా చూడాలని పలువురు సూచించారు. అందరి సూచనలను పరిగణనలోకి తీసుకుంటామని, దేశంలోనే పటిష్టమైన పార్టీగా టీఆర్ఎస్ను తీర్చిదిద్దుతామని కేటీఆర్ వారికి హామీ ఇచ్చారు. ప్రభుత్వానికి మార్గదర్శనం చేసేలా పార్టీని రూపొందిస్తామన్నారు. ప్రజలకు, ప్రభుత్వానికి మధ్య వారధిగా పార్టీని మార్చాలని... రాష్ట్రంలోని ప్రతి కుటుంబాన్నీ పార్టీకి దగ్గర చేసేలా కార్యక్రమాలు ఉండాలని సూచించారు. 16 ఎంపీ సీట్లపై గురి... దేశ రాజకీయాల్లో గుణాత్మక మార్పు లక్ష్యంగా ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటుకు శ్రీకారం చుట్టిన టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ బీజేపీ, కాంగ్రెసేతర పార్టీలతో కలసి కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే లక్ష్యం తో ఉన్నారు. రాష్ట్రంలోని అన్ని లోక్‌సభ సీట్లను గెలిస్తేనే ఫెడరల్ ఫ్రంట్ నినాదం విజయవంతం అవుతుందని భావిస్తున్నారు. హైదరాబాద్ లోక్ సభ స్థానంలో ఎంఐఎం గెలుపు ఖాయమని... మిగిలిన 16 సీట్లనూ గెలుచుకోవాలని లక్ష్యంగా పెట్టుకుంది. 2014 ఎన్నికల్లో పార్టీ 11 ఎంపీ సీట్లను గెలుచుకోగా..కాంగ్రెస్, టీడీపీ, వైఎస్సార్సీపీకి చెందిన ముగ్గురు ఎంపీలు టీఆర్ఎస్లో చేరారు. వచ్చే లోక్‌సభ ఎన్నికల కోసం వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కార్యాచరణ ప్రారంభించారు. ఒక్కో లోక్‌సభ సెగ్మెంట్‌కు ఒక ప్రధాన కార్యదర్శితోపాటు ముగ్గురు కార్యదర్శులను, పార్టీ ఎమ్మెల్యేలు, ఎన్నికల్లో ఓడిన అభ్యర్థులను ఇన్చార్జులుగా నియమిస్తున్నారు. జిల్లా కార్యాలయాలకు శంకుస్థాపన... టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా బాధ్యతలు చేపట్టిన అనంతరం కేటీఆర్ 2 వారాలపాటు అన్ని జిల్లాల్లో పర్యటించనున్నారు. హైదరాబాద్, రంగారెడ్డి మినహా 29 జిల్లాల్లో టీఆర్ఎస్ కార్యాలయాల భవన నిర్మాణాలకు స్వయంగా శంకుస్థాపన చేయనున్నారు. ఇందులో భాగంగా ఈ నెల 20న వరంగల్, జనగామలలో పార్టీ కార్యాలయాలకు శంకుస్థాపన చేయనున్నారు. లోక్‌సభ ఎన్నికల్లోపే అన్ని భవనాల నిర్మాణం పూర్తి చేసేలా కార్యాచరణ రూపొందించారు. ఆధునిక సాంకేతిక వ్యవస్థతో ఈ కార్యాలయాల నిర్మాణం జరగనుంది. సమష్టిగా ముందుకు... టీఆర్ఎస్ అందరిదీ అనే భావన కల్పించేలా వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వ్యూహాలు సిద్ధం చేశారు. ప్రజాప్రతినిధులతో సమానంగా పార్టీ కమిటీల్లోని వారికి ప్రా« దాన్యత ఉండేలా మార్పులు చేయా లని భావిస్తున్నారు. ఎన్నికలప్పుడు మాత్రమే కాకుండా ఏడాది పొడవునా శ్రేణులను మమేకం చేసేలా కార్యక్రమాలు రూపొందిస్తున్నారు. ఎలాంటి సవాళ్లు ఎదురైనా ఎదు ర్కొని విజయాలు సాధించేలా పార్టీ శ్రేణులకు శిక్షణ కల్పించనున్నారు. ప్రతిష్టాత్మకంగా పంచాయతీ ఎన్నికలు... గ్రామస్థాయిలోని పార్టీ శ్రేణులకు పదవులు అందించగల సర్పంచ్ ఎన్నికలనూ ప్రతిష్టాత్మకంగా తీసుకుంటోంది. పంచాయతీ ఎన్నికల్లో రాష్ట్రంలో ఉన్న 12,751 పంచాయతీల్లోనూ పార్టీ మద్దతుదారులే విజయం సాధించేలా కార్యాచరణ చేపడుతోంది. వీలైనన్ని పంచాయతీలు ఏకగ్రీవంగా ఎన్నికయ్యేలా వ్యూహాలు రచిస్తోంది. ఓటర్ల నమోదు కార్యక్రమాన్ని దీనికి అనుగుణంగా మార్చుకోవాలని నిర్ణయించింది. ఈ నెల 26 నుంచి జనవరి 6 వరకు టీఆర్ఎస్ నేతలు ఓటర్ల నమోదు ప్రక్రియలో కీలకంగా వ్యవహరించాలని పార్టీ నిర్ణయించింది. పంచాయతీ ఎన్నికల తర్వాత సభ్యత్వ నమోదు చేపట్టనుంది. ఈ ఎన్నికల తర్వాత సహకార సంఘాల ఎన్నికలు జరగనుండటంతో వాటిలోనూ టీఆర్ఎస్ మద్దతుదారులే విజయం సాధించేలా వ్యూహాలు రచిస్తున్నారు. 2013లో జరిగిన సహకార సంఘాల ఎన్నికల్లో ఒక్క కరీంనగర్ ఉమ్మడి జిల్లాలో మాత్రమే టీఆర్ఎస్ మద్దతుదారులు చెప్పుకోదగిన స్థానాలను గెలుచుకున్నారు. అయితేఈసారి అన్ని డీసీసీబీలు, ప్రాథమిక సహకార సంఘాల్లోనూ టీఆర్ఎస్ మద్దతుదారులు గెలిచే లక్ష్యంతో కేటీఆర్ ఉన్నారు. నేడు అట్టహాసంగా బాధ్యతల స్వీకరణ... తెలంగాణ రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్‌గా కల్వకుంట్ల తారక రామారావు సోమవారం ఉదయం 11.55 గంటలకు పూర్తిస్థాయిలో బాధ్యతలు చేపట్టనున్నారు. తెలంగాణ భవన్లో అట్టహాసంగా ఈ కార్యక్రమం జరగనుంది. ఉదయం 10 గంటలకు బసవతారకం కేన్సర్ ఆస్పత్రి నుంచి తెలంగాణ భవన్ వరకు పార్టీ శ్రేణులు ర్యాలీగాఆయన్ను తీసుకురానున్నాయి. ఇందులో దాదాపు 300 మంది కళాకారులు ఒగ్గుడోలు, కోలాటం, పులివేషాలు, బతుకమ్మ, బోనాలు, డప్పులు, గుస్సాడీ, కొమ్ముకొయ్యలు, చిందు యక్షగానాల ప్రదర్శనలు నిర్వహించనున్నారు. గ్రీవెన్స్ సెల్... ప్రజాసమస్యలపై ప్రభుత్వానికి ఎప్పటికప్పుడు సలహాలు, సూచనలు ఇచ్చేలా తెలంగాణ భవన్లో ప్రత్యేకంగా ప్రజా ఫిర్యాదుల విభాగం (పబ్లిక్ గ్రీవెన్స్ సెల్) ఏర్పాటు చేయాలని కేటీఆర్ నిర్ణయించారు. ప్రజలెవరైనా తమ సమస్యలపై పార్టీ సభ్యులను ఆశ్రయిస్తే వాటిని పరిష్కరించేలా అధికారిక వ్యవస్థకు, ఎమ్మెల్యేలకు నివేదించేలా ఈ వ్యవస్థ పనిచేయనుంది. -
అన్ని ‘పంచాయతీ’లను గెలవాలి
ప్రత్యేక చాంబర్... టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా కె.తారక రామారావు సోమవారం ఉదయం 11.56 గంటలకు బాధ్యతలు స్వీకరించనున్నారు. కేటీఆర్ కోసం తెలంగాణభవన్‌లో ప్రత్యేకంగా చాంబర్‌ను ఏర్పాటు చేశారు. వచ్చే ఆరేడు నెలల్లో గ్రామపంచాయతీ, సహకార, లోక్‌సభ, స్థానిక సంస్థల ఎన్నికలు వరుసగా ఉన్న నేపథ్యంలో తెలంగాణభవన్ కేంద్రంగా కేటీఆర్ పూర్తిస్థాయిలో పార్టీ కార్యక్రమాలు నిర్వహించనున్నారు. రెండువారాల్లో అన్ని జిల్లాల్లో పర్యటించనున్నారు. టీఆర్ఎస్ కమిటీలతో ప్రత్యేక సమావేశాలు నిర్వహించనున్నారు. సాక్షి, హైదరాబాద్: గ్రామపంచాయతీ ఎన్నికలపై తెలంగాణ రాష్ట్ర సమితి గురి పెట్టింది. అన్ని గ్రామపంచాయతీలను గెలిచేలా వ్యూహం రచిస్తోంది. గ్రామపంచాయతీ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకోవాలని టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కె.తారకరామారావు పార్టీ రాష్ట్ర కార్యవర్గసభ్యులు, బాధ్యులకు స్పష్టం చేశారు. ఏకగ్రీవంగా ఎన్నికయ్యే ప్రతి గ్రామపంచాయతీకి రూ.పది లక్షల గ్రాంట్ వస్తుందని, వీలైనన్ని పంచాయతీలకు ఏకగ్రీవ ఎన్నికలు జరిగేలా ప్రయత్నించాలని సూచించారు. వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అధ్యక్షతన తొలిసారి ఆ పార్టీ రాష్ట్ర కార్యవర్గ సమావేశం శనివారం తెలంగాణ భవన్లో జరిగింది. టీఆర్ఎస్ను సంస్థాగతంగా బలోపేతం చేసే ప్రక్రియపై కేటీఆర్ ఈ సమావేశంలో ప్రసంగిం చారు. 2006 నుంచి ఇప్పటిదాకా టీఆర్ఎస్లో తన రాజకీయ అనుభవాలను వివరించారు. డిసెంబర్ 26 నుండి జనవరి 6వ తేదీ వరకు ఓటర్ల నమోదు కార్యక్రమాన్ని చేపడుతున్నట్లు ప్రకటించారు. రాష్ట్రస్థాయి నేతలందరూ ఈ కార్యక్రమాల్లో పాల్గొనాలని ఆదేశించారు. ఈ ప్రక్రియకు పదిరోజుల గడువున్న నేపథ్యంలో అందరూ గట్టిగా పనిచేయాలన్నారు. పంచాయతీ ఎన్నికల తర్వాత ఫిబ్రవరిలో టీఆర్ఎస్ సభ్యత్వ నమోదు, బీమా నమోదు ప్రక్రియ పూర్తి చేయాలని చెప్పారు. మార్చి నుంచి లోక్‌సభ ఎన్నికలకు పూర్తిస్థాయిలో సిద్ధంగా ఉండాలన్నారు. ప్రతి లోక్సభస్థానానికి ఒక ప్రధాన కార్యదర్శిని, ముగ్గురు కార్యదర్శులను ఇన్‌చార్జీలుగా నియమిస్తామని, అసెంబ్లీ నియోజకవర్గాలకు ఎమ్మెల్యేలు ఇన్చార్జీలు గా ఉంటారని తెలిపారు. జిల్లాల్లో టీఆర్ఎస్ కార్యాలయాల నిర్మాణాలను వేగంగా పూర్తి చేసుకోవాలని సూచించారు. తెలంగాణభవన్‌లో ప్రజల ఫిర్యాదు విభాగం(పబ్లిక్ గ్రీవెన్స్ సెల్)ను ఏర్పాటు చేస్తామని చెప్పారు. ప్రజల సమస్యలను పరిష్కరించేందుకు ఈ విభాగం పనిచేస్తుందని తెలిపారు. టీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి పల్లా రాజేశ్వర్‌రెడ్డి రాష్ట్ర కార్యవర్గ సమావేశం వివరాలను మీడియాకు వివరించారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఎమ్మెల్యేలుగా ఎన్నికైన ముఠా గోపాల్, సుంకే రవిశంకర్, మైనంపల్లి హనుమంతరావు, పట్నం నరేందర్‌రెడ్డి, బండ్ల కృష్ణమోహన్‌రెడ్డిలను టీఆర్ఎస్ రాష్ట్ర స్థాయి పదవుల నుంచి ఉపసం హరిస్తూ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. టీఆర్ఎస్లో వైరా ఎమ్మెల్యే చేరిక వైరాలో స్వతంత్ర అభ్యర్థిగా గెలిచిన లావుడ్య రాములునాయక్ శనివారం టీఆర్ఎస్లో చేరారు. సీఎం కేసీఆర్‌ను ప్రగతిభవన్‌లో కలిశారు. అనంతరం రాములునాయక్ తన అనుచరులతో కలసి టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సమక్షంలో తెలంగాణభవన్‌లో టీఆర్ఎస్లో చేరారు. కేటీఆర్ గులాబీ కండువా కప్పి రాములునాయక్‌ను టీఆర్ఎస్లోకి ఆహ్వానించారు. అనంతరం వైరా నియోజకవర్గం నుంచి వచ్చిన నాయకులను ఉద్దేశించి కేటీఆర్ మాట్లాడారు. ‘ఎన్నికల తర్వాత టీఆర్ఎస్లో మొదటి చేరిక వైరా నుంచి కావడం ఆనందంగా ఉంది. వైరా నియోజకవర్గ అభివృద్ధికి ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తా. తెలంగాణ అంతటా అనుకూల పవనాలు వీచినా ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఫలితాలు నిరాశ కలిగించాయి. రాబోయే రోజుల్లో కష్టపడి పనిచేసి జిల్లావ్యాప్తంగా గులాబీ జెండా ఎగురవేస్తాం. జిల్లాలో ప్రాజెక్టులు పూర్తి చేసి బీడు భూములను సస్యశ్యామలం చేస్తాం. మిషన్ భగీరథ, సాగునీటి ప్రాజెక్టులు, ఇతర ప్రతిష్టాత్మక కార్యక్రమాలు పూర్తయితే టీఆర్ఎస్ అజేయశక్తిగా మారుతుంది. లోక్‌సభ ఎన్నికల్లో పదహారు సీట్లు గెలిచి టీఆర్ఎస్ సత్తా చాటుదాం. ఖమ్మం లోక్‌సభ స్థానాన్ని టీఆర్ఎస్ కైవసం చేసుకునేలా కార్యకర్తలు శ్రమించాలి. బీజేపీ, కాంగ్రెస్ దొందూ దొందే. వచ్చే ఎన్నికల తర్వాత కాంగ్రెస్, బీజేపీలు కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే పరిస్థితి లేదు. కేంద్రంలో ఏ ప్రభుత్వం ఏర్పడాలనేది టీఆర్ఎస్ శాసించాలి. మనం చెబితే ఏర్పడే ప్రభుత్వం ఢిల్లీలో కావాలంటే టీఆర్ఎస్ 16 సీట్లు గెలవాలి. యాచించే స్థితి నుంచి ఢిల్లీలో శాసించే స్థితికి తెలంగాణ ఎదగాలి. బీజేపీకి సంఖ్యాబలం ఉండబట్టే బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ ఏర్పాటు చేయాలన్న డిమాండ్‌ను పెడచెవిన బెట్టింది. కేంద్రంలో మనకు అనుకూల ప్రభుత్వం ఏర్పడితే బయ్యారం లాంటి వాటికి పరిష్కారం దొరుకుతుంది. ఖమ్మంలో అన్ని నియోజక వర్గాలను అభివృద్ధి చేస్తాం. బంగారు తెలంగాణ దిశగా చిత్తశుద్ధితో పని చేస్తాం’అన్నారు. రాములు నాయక్‌ను కండువా కప్పి టీఆర్ఎస్లోకి ఆహ్వానిస్తున్న కేటీఆర్. చిత్రంలో పొంగులేటి -
టీఆర్ఎస్ అంటే.. తిరుగులేని రాజకీయ శక్తి
సాక్షి, హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్)ని తిరుగులేని రాజకీయ శక్తిగా మారుస్తానని ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు తెలిపారు. దేశ రాజకీయాల్లో నిర్ణయాత్మక పాత్ర పోషించేలా టీఆర్ఎస్ను తీర్చిదిద్దేందుకు ప్రయత్నిస్తానని చెప్పారు. అసెంబ్లీ ఎన్నికల యుద్ధంలో గెలిచిన తాము మరో ఆరు నెలల్లో జరగనున్న వరుస ఎన్నికల పోరాటాలనూ గెలుస్తామని ధీమా వ్యక్తం చేశారు. మంత్రివర్గంలో తాను ఉండాలా లేదా అనేది ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయంపై ఆధారపడి ఉంటుందన్నారు. తెలంగాణకు మరో 10–15 ఏళ్లు కేసీఆరే సీఎంగా ఉండాలని తనతోపాటు టీఆర్ఎస్లోని అందరూ కోరుకుంటున్నారన్నారు. హైదరాబాద్ ప్రెస్‌క్లబ్ ఆధ్వర్యంలో శనివారం జరిగిన మీట్ ది ప్రెస్ కార్యక్రమంలో పాల్గొన్న కేటీఆర్ వివిధ అంశాలపై తన అభిప్రాయాలను వెల్లడించారు. ఆ అంశాలు ఆయన మాటల్లోనే... టీఆర్ఎస్కు 98 లక్షల మంది మద్దతు... స్వీయ రాజకీయ అస్తిత్వంతోనే తెలంగాణ ప్రయోజనాలు, ప్రజలు ఆకాంక్షలు నెరవేరుతాయని ప్రొఫెసర్ జయశంకర్ అనేవారు. తెలంగాణ ప్రయోజనాలను కాపాడే పార్టీగా ప్రజలు టీఆర్ఎస్ను గుర్తించారు. రాష్ట్రంలో ఓటు వేసిన 2 కోట్ల మందిలో టీఆర్ఎస్కు 98 లక్షల మంది మద్దతు పలికారు. మా తర్వాత రెండో స్థానంలో ఉన్న కాంగ్రెస్‌కు కేవలం 42 లక్షల మంది మాత్రమే ఓటు వేశారు. వారికి, మాకు ఓట్లలో తేడా 28 శాతం ఉంది. పల్లె, పట్నం, గ్రేటర్ హైదరాబాద్ ప్రాంతాలు, వర్గాలతో సంబంధం లేకుండా అందరూ టీఆర్ఎస్కు మద్దతిచ్చారు. ప్రధాని మోదీ, బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా సహా ఎందరో బీజేపీ ప్రముఖులు తెలంగాణలో ప్రచారం చేశారు. అయినా మేము ముందుగా చెప్పినట్లే ఈ ఎన్నికల్లో బీజేపీకి 103 సీట్లలో డిపాజిట్ రాకుండా ప్రజలు తీర్పు ఇచ్చారు. రాష్ట్రంలో టీఆర్ఎస్ వ్యతిరేకంగా నిశ్శబ్ద విప్లవం వస్తుందని పీసీసీ చీఫ్ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అన్నారు. కాంగ్రెస్ గూబ గుయ్‌మనేలా శబ్ధ విప్లవమే వస్తుందని చెప్పా. రాష్ట్రంలోని అసెంబ్లీ సీట్లలో 80 శాతం టీఆర్ఎస్కు వచ్చాయి. ప్రతి హామీ అమలు చేస్తాం... ఎన్నికల మేనిఫెస్టోలో పేర్కొన్న ప్రతి హామీని తూ.చ. తప్పకుండా అమలు చేస్తాం. ముఖ్యమంత్రి కేసీఆర్ పూర్తిస్థాయిలో పాలన, జాతీయ రాజకీయాల్లో గుణాత్మక మార్పు లక్ష్యంగా ఫెడరల్ ఫ్రంట్ నిర్మాణంపై దృష్టి పెట్టేందుకు నన్ను టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా నియమించారు. 2006 నుంచి టీఆర్ఎస్లో పని చేస్తున్నా. ప్రత్యక్షంగా నాలుగు ఎన్నికలు సహా మొత్తం ఎనిమిది ఎన్నికల్లో ఉన్నా. అన్నింటినీ అర్థం చేసుకొని టీఆర్ఎస్ను బూత్, గ్రామ, మండల స్థాయి నుంచి సంస్థాగతంగా పటిష్ట పరుస్తాం. టీఆర్ఎస్ వందేళ్లపాటు పటిష్టంగా ఉండేలా మార్చే లక్ష్యంతో పని చేస్తాం. రాబోయే 6–7 నెలల్లో జరగనున్న గ్రామ పంచాయతీ, సహకార, లోక్‌సభ, స్థానిక సంస్థల ఎన్నికలను సమర్థంగా ఎదుర్కొనే లక్ష్యంగా ముందుకెళ్తాం. కేంద్రంలో కీలక పాత్ర పోషిస్తాం... రానున్న లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ 150–160 సీట్లకే పరిమితవుతుంది. కాంగ్రెస్‌కు గత ఎన్నికల్లోకంటే రెట్టింపు సీట్లొచ్చినా ఆ సంఖ్య 90 దాటదు. సంకీర్ణ ప్రభుత్వాలే అనివార్యమనే పరిస్థితి ఉన్న ప్రస్తుత పరిస్థితుల్లో వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో టీఆర్ఎస్కు 16 సీట్లు వస్తే దేశ రాజకీయాల్లో నిర్ణయాత్మక శక్తిగా ఉంటుంది. అసెంబ్లీ ఎన్నికల ఆధారంగా చూస్తే తెలంగాణలో ఒక్క ఖమ్మం మినహా 15 లోక్‌సభ సీట్లలో టీఆర్ఎస్కు ఆధిక్యం వచ్చింది. 2019 లోక్‌సభ ఎన్నికల్లో ప్రజలు టీఆర్ఎస్ను 16 సీట్లలో గెలిపిస్తే కేంద్రంలో ఏర్పడే ప్రభుత్వంలో కీలక పాత్ర పోషిస్తాం. దేశ స్థాయిలో నిర్మాణాత్మకంగా వ్యవహరించవచ్చు. తెలంగాణలో అమలు చేసే రైతు బంధు, రైతు బీమా, మిషన్ భగీరథ దేశవ్యాప్తంగా అమలు చేయవచ్చు. తెలంగాణ ప్రాజెక్టులకు జాతీయ హోదా వస్తే 90 శాతం నిధులు కేంద్రమే ఇస్తుంది. మిషన్ భగీరథకు కేంద్రం నుంచి వేల కోట్ల నిధులు తీసుకురావచ్చు. బీజేపీ, కాంగ్రెస్‌లతో సంబంధంలేని సమాఖ్య వ్యవస్థ బలపడే ప్రభుత్వం కేంద్రంలో ఏర్పడాలి. ఇక్కడి పథకాలను దేశమంతటా అమలు చేస్తే దేశం అబ్బురపడుతుంది. దేశానికి కేసీఆర్ నాయకత్వం... రాష్ట్రంలో ఎప్పుడూ ప్రభుత్వ వ్యతిరేక ఓటు ఉంటుంది. టీఆర్ఎస్ విషయంలో మాత్రం ప్రభుత్వ సానుకూల ఓటు పెరిగింది. మాకు ప్రగతిశీల, అభివృద్ధి ఓటు వచ్చింది. అసెంబ్లీ ఎన్నికలు కేసీఆర్ పాలనకు రెఫరెండమని నేను ముందే చెప్పినట్లుగానే ప్రజలు తీర్పిచ్చారు. గత ఎన్నికలతో పోలిస్తే టీఆర్ఎస్కు ఈసారి 5 శాతం ఓటింగ్ పెరిగింది. టీఆర్ఎస్ బలంగా ఉంది కాబట్టే అన్ని ఎన్నికల్లోనూ వరుసగా గెలుస్తోంది. ప్రస్తుత పరిస్థితులకు తగినట్లుగా పార్టీని బూత్ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు పటిష్టం చేస్తాం. టీఆర్ఎస్ అంటే తెలంగాణ రాష్ట్ర సమితి కాదు... తిరుగులేని రాజకీయ శక్తి అనేలా మారుస్తాం. కేసీఆర్ నాయకత్వం దేశానికి అవసరమనే రీతిలో ఉండేలా పార్టీని బలోపేతం చేస్తాం. సర్పంచ్ నుంచి ఎంపీ ఎన్నికల వరకు అన్నింట్లోనూ స్థాయిని బట్టి టీఆర్ఎస్ శ్రేణులకు రాజకీయ అవకాశాలు కల్పించేందుకు ప్రాధాన్యత ఇస్తాం. మా పార్టీలోనే విద్యార్థి నేతలు, న్యాయవాదులు, జర్నలిస్టులు, డాక్టర్లు... ఇలా అందరికీ అసెంబ్లీ ఎన్నికల్లో అవకాశం ఇచ్చాం. ఎక్కువ మంది గెలిచారు. పార్టీలో మహిళల ప్రాధాన్యం పెంచుతాం. ఆ పత్రికలు, టీవీలు ఏదో జరుగుతోందన్నట్లు చూపాయి... కొన్ని పార్టీలు ప్రజాకూటమి పేరుతో ప్రజలులేని కూటమి కట్టాయి. లేనిది ఉన్నట్లు చూపే ప్రయత్నం చేశాయి. రెండు, మూడు పత్రికలు, టీవీలు ఏదో జరుగుతున్నట్లు చూపాయి. ఏదో పోతులూరి తరహాలో జరగబోయేది ఇదే అని చెప్పే ప్రయత్నం చేశాయి. మేం అలాంటి మాయాలో పడలేదు. కాంగ్రెస్ వాళ్లు ఆ మాయలోపడ్డారు. అందుకే ఇంకా ఓటమి నుంచి తేరుకోవట్లేదు. ఓటమిని సమీక్షించుకోకుండా ఇప్పుడు ఈవీఎంలపై పడ్డారు. ఛత్తీస్‌గఢ్, రాజస్తాన్, మధ్యప్రదేశ్‌లలో కాంగ్రెస్ గెలిచిందనే ఇంగితం లేకుండా మాట్లాడుతున్నారు. రాష్ట్రంలో బలమైన ప్రతిపక్షం ఉండకూదని ప్రజలు తీర్పిచ్చారు. ఇప్పుడు పత్రికలు, మీడియా ప్రతిపక్ష పాత్ర పోషించాలి. లగడపాటి రాజగోపాల్ తెలంగాణ ఉద్యమ దెబ్బకు రాజకీయ సన్యాసం తీసుకున్నారు. ఎన్నికల ఫలితాలతో ఇప్పుడు సర్వే సన్యాసం తీసుకున్నారు. వారుసులైనా నిరూపించుకోవాలి.... టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కుమారుడిగానే నాకు మొదట అవకాశం వచ్చింది. 2006 నుంచి నేను ఉద్యమంలో పాల్గొన్నా. 2009లో సిరిసిల్లలో స్వల్ప మెజారిటీతో గెలిచా. ఆ తర్వాత నుంచి నాకు ప్రజామద్దతు పెరుగుతూ వస్తోంది. పార్టీ అవకాశాలు ఇస్తుంది. దాన్ని నిరూపించుకుంటేనే కొనసాగిస్తుంది. గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల సమయంలో టీఆర్ఎస్కు ఇక్కడ ఏమీ లేదు. అయినా భారీ ఆధిక్యంతో సీట్లు గెలుచుకున్నాం. అసెంబ్లీ ఎన్నికల్లోనూ హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లోని 29 స్థానాల్లో 18 గెలుచుకున్నాం. పార్టీలో అవకాశాలు సీనియారిటీ ప్రకారం అనేది ఏమీ ఉండదు. నేను ప్రభుత్వంలో మంత్రిగా ఉండాలా లేదా అనేది ముఖ్యమంత్రి కేసీఆర్ ఇష్టం. మంత్రివర్గ ఏర్పాటు పూర్తిగా సీఎం అభీష్టం మేరకు ఉంటుంది. ప్రభుత్వంలో మహిళలు ఉండే విషయంలోనూ సీఎందే తుది నిర్ణయం. తెలంగాణ రాష్ట్రానికి మరో 10–15 ఏళ్లు కేసీఆరే ముఖ్యమంత్రిగా ఉండాలి. నాతోపాటు మా పార్టీలోని అందరిదీ ఇదే మాట. హైదరాబాద్ నుంచి కూడా జాతీయ రాజకీయాల్లో కీలకపాత్ర పోషించవచ్చు. గతంలో ఎన్టీఆర్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉంటూనే నేషనల్ ఫ్రంట్ చైర్మన్‌గా, పార్లమెంటులో ప్రధాన ప్రతిపక్ష పార్టీగా కీలక పాత్ర పోషించారు. ఏపీలోనూ టీడీపీ నామమాత్రమే... కేంద్రంలో గత 22 ఏళ్లుగా సంకీర్ణ ప్రభుత్వాలే ఉన్నాయి. ఫెడరల్ ఫ్రంట్ కచ్చితంగా విజయవంతమవుతుంది. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు మాత్రం టీడీపీ బలోపేతం కోసం కూటమి కడుతున్నారు. బీజేపీని ఓడించడం లక్ష్యంగా కూటమి కడుతున్నానని అంటున్నారుగానీ అసలు ఉద్దేశం టీడీపీ కోసమే. ఆంధ్రప్రదేశ్‌కు జాతీయ హోదాపై చంద్రబాబు ద్వంద్వ విధానంతో మాట్లాడుతున్నారు. హోదా ఏమైనా సంజీవనా అని గతంలో ఎద్దేవా చేశారు. ఇప్పుడు అయనే హోదా సర్వరోగ నివారణి అంటున్నారు. హోదా విషయంలో చంద్రబాబే గందరగోళంలో ఉండి అందరినీ గందరగోళానికి గురి చేస్తున్నారు. చంద్రబాబును మీడియాలో పెద్దగా చూపుతారుగానీ ఆయన గల్లీ నాయకుడి కంటే అధ్వానం. మొన్న ఎన్నికల్లో రాహుల్ గాంధీతో కలసి నాకన్నా ఎక్కువగా హైదరాబాద్‌లో ప్రచారం చేశారు. 2019 ఎన్నికల తర్వాత దేశ రాజకీయాల్లో, ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో టీడీపీ పాత్ర నామమాత్రమే అవుతుంది. జాతీయ రాజకీయాల్లో మా పాత్ర ఉంటుంది. దీంట్లో భాగంగానే ఆంధ్రప్రదేశ్‌లోనూ మా పాత్ర ఉంటుంది. ఏపీలోనూ ప్రాంతీయ శక్తులే గెలవాలి. చంద్రబాబు, జగన్, పవన్ కల్యాణ్ ఎవురూ శత్రువులు కాదు. ఏపీలో బలమైన ప్రాంతీయ శక్తి గెలవాలని కోరుకుంటున్నాం. ఏది మెరుగైనదో సమయాన్నిబట్టి చెబుతాం. తెలంగాణలో కలపాలంటున్నారు... కేసీఆర్ నేతృత్వంలోని టీఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలు దేశవ్యాప్తంగా ఆకర్షిస్తున్నాయి. ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లా ముథోల్ నియోజకవర్గం సరిహద్దులో మహారాష్ట్రలోని ధర్మాబాద్ నియోజకవర్గం ఉన్నది. ఆ సెగ్మెంట్లోని 40 గ్రామాలను తెలంగాణలో కలపాలని గ్రామ పంచాయతీలు తీర్మానాలు చేశాయి. ఆ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న శివసేన ఎమ్మెల్యే సైతం దీనికి మద్దతు తెలిపారు. తెలంగాణలో అమలు చేస్తున్న ఉచిత విద్యుత్, రైతు బంధు పథకాలు మహారాష్ట్రలో లేవు. అందుకే అక్కడి ప్రజలు కోరుతున్నారు. ఓటు వేయని వారికి అడిగే హక్కు ఉండొద్దు... తెలంగాణ ఎన్నికల్లోనూ పట్టణ ప్రాంత ఓటర్లు ఎక్కువగా ఓటు హక్కు వినియోగించుకోలేదు. గ్రామీణ ప్రజలు భారీగా ఓటు వేశారు. నగర ప్రాంతాల్లోని ఓటింగ్ శాతం దేశవ్యాప్తంగా తక్కువగానే ఉంటోంది. దీనిపై పార్లమెంటులోనూ ఒకసారి చర్చ జరిగింది. నిర్బంధ ఓటు విధానం తేవాలనే ప్రతిపాదన వచ్చింది. అయితే ఓటు హక్కు వినియోగించుకోని వారికి ఫిర్యాదు చేసే అధికారం ఉండకూడదనేది నా అభిప్రాయం. నేతలపై చులకన భావం వద్దు... మనలో కొందరు చేసే చర్యల వల్ల ఏ సినిమాలో చూసినా రాజకీయ నేతలను, మీడియా ప్రతినిధులను హేళనగా చూపిస్తున్నారు. రాజకీయ వ్యవస్థ, పాలనా వ్యవస్థలో ఉన్న మేం ఒళ్లు దగ్గర పెట్టుకొని మాట్లాడాలి. స్థాయికి మించి కొందరు చేసే విమర్శలను, బూతులను ప్రచార సాధనాలు యథాతథంగా ప్రసారం/ప్రచురించడం చేస్తున్నాయి. ఇలాంటివి అందరినీ చులకన చేస్తాయి. ప్రధాని మోదీని, ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీని నేనైనా సరే ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే చేయవద్దు. అలాగే సీఎం స్థాయి వారిపై అనామకులు ఏదిపడితే అది మాట్లాడినా పరిశీలించుకుని ప్రసారం చేయాలి. ప్రత్యక్ష ప్రసారం అంశాలకు సైతం అసెంబ్లీలో మాదిరిగా కొన్ని సెకన్ల అంతరం ఉండే వ్యవస్థ పెడితే బాగుంటుందని నా సూచన. -
కేటీఆర్ చేతిలో స్టీరింగ్
ఇందిరాగాంధీ, ఎన్‌టి రామారావు, అటల్ బిహారీ వాజపేయి, చంద్రబాబు నాయుడు ముందస్తు ఎన్నికలకు వెళ్ళి నిండా మునిగారు. కల్వకుంట్ల చంద్ర శేఖరరావు (కేసీఆర్) మాత్రం విజయం సాధించి చరిత్ర సృష్టించారు. ఎన్ని కలలో గెలుపోటములు సర్వసాధారణం. కానీ తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) అసెంబ్లీ ఎన్నికలలో పోరాడి గెలుపొందిన విధం విశేషమైనది. టీఆర్ఎస్ విజయంపై అధిక సంఖ్యాకులకు అనుమానం లేదు. కొందరు రాజకీయ పరిశీలకులూ, మీడియా ప్రవీణులూ వ్యక్తిగతంగా కేసీఆర్ పట్ల ఆగ్రహం కారణంగా టీఆర్ఎస్ ఓడిపోవాలని కోరుకున్నారు. ఓడిపోతుందని తీర్మానించుకున్నారు. ఆకాంక్షకూ, అంచనాకూ మధ్య సరిహద్దురేఖ చెదిరిపోయి గందరగోళానికి గురైనారు. కేసీఆర్ పట్ల కినుక వహించడానికి తగిన కారణాలు ఉండవచ్చు. ప్రజల ఆలోచనా ధోరణి çపసికట్టడంలో అది అవరోధం కాకూడదు. టీఆర్ఎస్కు అసాధారణ మెజారిటీ లభించడానికి కారణాలు స్పష్టంగా కని పిస్తూనే ఉన్నాయి. కాంగ్రెస్ తప్పిదాలు చేయకుండా ఉంటే ఆ పార్టీకి ఇంత ఘోర పరాజయం ఉండేది కాదు. కేసీఆర్ ఉద్యమ సమయంలో మాట్లాడినట్టు కటువుగా మాట్లాడితేనే ప్రజలు మెచ్చుకుంటారనే భావనతో కాంగ్రెస్ నాయ కులు స్థాయి మరచి టీఆర్ఎస్పైనా, కేసీఆర్‌పైనా పరుషపదజాలం ప్రయోగిం చారు. కేసీఆర్ మాత్రం ఉద్యమభాషకు భిన్నంగా, ఆవేశరహితంగా ప్రజలకు తేలికగా అర్థమయ్యే విధంగా మాట్లాడారు. తనకు కాంగ్రెస్ అందించిన ఆయు ధాలతో సమర్థంగా పోరాడారు. ‘కేసీఆర్ కావాలా, చంద్రబాబు కావాలా?’ అన్న ప్రశ్న ప్రజల హృదయాలను సూటిగా తాకింది. త్యాగాలు చేసిన సాధించుకున్న తెలంగాణపైన అమరావతి ఆధిపత్యం అవాంఛనీయమని భావించిన ఓటర్లు క్యూలు కట్టి మూకుమ్మడిగా కారు బటన్ నొక్కారు. టీఆర్ఎస్ ఖాతాలో 88 స్థానాలు నమోదైనాయి. ఇద్దరు ఇండిపెండెంట్లు టీఆర్ఎస్లో చేరడానికి సంసి ద్ధత వెలిబుచ్చారు. చేర్చుకుంటే కాంగ్రెస్ నుంచి రావడానికి పది మంది సిద్ధంగా ఉన్నారని భోగట్టా. ఫలించిన కేసీఆర్ వ్యూహం ఏ ఫలితం ఆశించి కేసీఆర్ గడువు కంటే ఏడు మాసాల మందుగానే శాసన సభను రద్దు చేయించారో అది దక్కింది. అసెంబ్లీలో తిరుగులేని మెజారిటీ లభించింది. 1983లో, 1994లో ఎన్టిఆర్ కూడా పెద్ద మెజారిటీలు సాధిం చారు. ఈ సారి టీఆర్ఎస్ విజయంలోని విశేషం ప్రతిపక్షానికి చెందిన అతిరథమహారథులు మట్టికరవడం. పీసీసీకి కార్యనిర్వాహక అధ్యక్షులుగా ఉన్నవారు ఎన్నికల బరిలో రాణించలేకపోయారు. పొన్నం ప్రభాకర్, రేవంత్ రెడ్డి ఓడిపోవడమే కాకుండా పాత కరీంనగర్, మహబూబ్‌నగర్ జిల్లాలలో టీఆర్ఎస్ ప్రభంజనాన్ని ఇసుమంతైనా నిలువరించలేకపోయారు. ముఖ్య మంత్రి అభ్యర్థులుగా భావించిన జానారెడ్డి, డికె అరుణ, దామోదర రాజ నరసింహ వంటివారూ పరాజయం పాలైనారు. ఈ స్థాయికి చెందినవారిలో భట్టి విక్రమార్క ఒక్కరే తాను గెలుపొందడమే కాకుండా ఖమ్మం జిల్లాలో కాంగ్రెస్, కూటమి అభ్యర్థుల విజయానికి కారకుడైనారు. వైఎస్ రాజశేఖరరెడ్డి మంత్రి మండలిలో పని చేసిన మహిళలు గీతారెడ్డి, సునీతా లక్షా్మరెడ్డి, అరుణ, సురేఖ ఓడిపోయారు. ఒక్క సబిత మాత్రం గెలిచారు. కూటమికి ప్రచారం చేయడం పేరు మీద చంద్రబాబు మొదటి పాదం ఖమ్మం జిల్లాలోనే మోపినా భయ పడినంత నష్టం కాంగ్రెస్ అభ్యర్థులకు జరగలేదు. చంద్రబాబు ప్రభావం ఇతర జిల్లాలపైన విపరీతంగా పడింది. ప్రజల మనోభావాలతో నిమిత్తం లేకుండా, వారి ఆకాంక్షలనూ, అనుభవాలనూ పట్టించుకోకుండా, చంద్రబాబు పట్ల తెలంగాణలో ఎంతటి వ్యతిరేకత ఉన్నదో అర్థం చేసుకోకుండా కాంగ్రెస్ నాయకత్వం టీడీపీతో, ప్రొఫెసర్ కోదండరామ్ నాయకత్వంలోని తెలంగాణ జన సమితి (టీజెఎస్)తో, సీపీఐతో కలసి కూటమి కట్టి భంగపడింది. చంద్రబాబు పట్ల ప్రజలలో ఉన్న వ్యతిరేకత ఒక్కటే కాదు, టీడీపీతో కాంగ్రెస్ పొత్తు పెట్టుకోవడంలోని అనైతికతను కూడా ఢిల్లీ పెద్దలు పట్టించుకోలేదు. టీడీపీ ప్రతినిధిగా కంభంపాటి రామమోహనరావు ఢిల్లీలో రాహుల్‌గాంధీ కార్యాలయానికి వెళ్ళడం, కాంగ్రెస్ అధిష్ఠానం దూతగా అశోక్ గహ్లోత్ అమరావతికి రావడం, ఆ తర్వాత కాంగ్రెస్ జాబితా ఖరారు కావడం వంటివి అనేక అనుమానాలు రేకెత్తించాయి. ప్రజల ఆలోచనలను ప్రభావితం చేశాయి. టీఆర్ఎస్తో పొత్తుకోసం చంద్రబాబు ప్రయత్నించి విఫలమైన తర్వాతనే కాంగ్రెస్‌తో చేతులు కలపాలని నిర్ణయించుకున్నారనే సంగతి విస్మరించకూడదు. చంద్రబాబుకు టీఆర్ఎస్ అయినా, కాంగ్రెస్ అయినా, బీజేపీ అయినా ఎటు వంటి అభ్యంతరం లేదు. సిద్ధాంతాలూ, సూత్రాలూ, విధానాలతో నిమిత్తం లేకుండా అవకాశవాద కూటములు కట్టే చంద్రబాబు వంటి నాయకుడితో స్నేహం చేస్తే బీజేపీకి ఎటువంటి పరాభవం జరిగిందో కాంగ్రెస్‌కూ అదే అను భవం ఎదురవుతుంది. లోక్‌సభ ఎన్నికలు కొద్ది నెలలోనే జరగబోతున్నాయి. పొత్తుల గురించీ, ఎత్తుల గురించీ, జిత్తుల గురించీ పునరాలోచించుకోవలసిన సమయం, సందర్భం ఇదే. కేటీఆర్‌కి ఉన్నత పదవి ఇదే మంచి సమయం అనుకొన్న కేసీఆర్ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు (వర్కింగ్ ప్రెసిడెంట్)గా కల్వకుంట్ల తారక రామారావు (కేటీఆర్)ను నియమించారు. ఇది కూడా అనూహ్య పరిణామం కాదు. ఇది కేసీఆర్ సమయజ్ఞతకు నిదర్శనం. అసెంబ్లీ ఎన్నికలలో కేసీఆర్ తర్వాత ఎక్కువ సభలలో మాట్లాడిన నాయకుడు కేటీఆర్. గ్రేటర్ హైదరాబాద్‌లో టీఆర్ఎస్ అభ్యర్థులను ఎక్కువ స్థాయిలో గెలిపించిన ఘనత కేటీఆర్‌దే. మరో యువ నాయకుడు హరీష్‌రావు అవిభక్త మెదక్ జిల్లాపైన దృష్టి కేంద్రీకరించి మొత్తం పది స్థానాలలో తొమ్మి దింటిని టీఆర్ఎస్ ఖాతాలో వేయడంతోపాటు మహ బూబ్‌నగర్‌లో రేవంత్‌రెడ్డి, డికె అరుణ వంటి ఉద్దండులను ఓడించే బాధ్యత కూడా జయప్రదంగా నెరవేర్చారు. కేటీఆర్ విద్యాధికుడు, మూడు భాషలలో ప్రతిభావంతమైన వక్త. ఆయనను పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ చేయడాన్ని ఎవ్వరూ ఆక్షేపించజాలరు. కేసీఆర్ చెప్పినట్టు కేటీఆర్ సమర్థుడూ, నమ్మ కస్తుడూ. ఇంతవరకూ నగర ప్రజల మనసులు గెలుచుకున్న కేటీఆర్‌కు పార్టీ నిర్మాణ క్రమంలో పంచాయతీ ఎన్నికలలో, పార్లమెంటు ఎన్నికలలో గ్రామీణ ప్రాంతాలలోని నాయకులతో పరిచయాలు ఏర్పడతాయి. నాయకుడిగా ఎది గేందుకు దోహదం చేస్తాయి. లోక్‌సభ ఎన్నికల తర్వాత జాతీయ స్థాయిలో కేసీఆర్ పోషించవలసిన పాత్ర ఏమైనా నిర్దిష్టంగా ఉంటే హైదరాబాద్‌లో కేటీఆర్‌ని ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చోబెడతార ని జనాభిప్రాయం. హరీష్‌ని అనుమానించకుండా, అవమానించకుండా సముచితమైన ఆదరణ, గౌరవం ఇచ్చినంతవరకూ కేటీఆర్‌కు ఇబ్బంది ఉండదు. పార్టీ అంతా అండగా ఆయన వెంటే నిలబడుతుంది. ఈ సంగతి కేటీఆర్కీ తెలుసు. వివేకంతో వ్యవహరిస్తారు. టీఆర్ఎస్తోనే తన గతం, వర్తమానం, భవిష్యత్తు ముడివడి ఉన్నాయనే స్పృహ హరీష్‌కూ ఉన్నది. ఫెడరల్ ఫ్రంట్ అవకాశాలు ఫలితాలు వెల్లడైన రోజునే మీడియా సమావేశంలో కేసీఆర్ చెప్పినట్టు ఫెడరల్ ఫ్రంట్ అనేది కాంగ్రెస్, బీజేపీల ప్రమేయంలేని మూడో కూటమి. రెండు జాతీయ పార్టీల వల్లా దేశానికి నష్టం జరుగుతున్న మాట వాస్తవమే. కానీ సమాఖ్యస్ఫూర్తి కోసం పోరాడాలని పథక రచన చేస్తున్న ప్రాంతీయ పార్టీలు అంతర్గత ప్రజాస్వామ్యాన్ని ఎంతవరకు పాటిస్తున్నాయనేది ప్రశ్న. స్థానిక సంస్థలకూ, పంచాయతీరాజ్ సంస్థలకూ నిధులనూ, విధులనూ ఏ మేరకు వికేంద్రీకరిస్తున్నాయనేదీ ప్రశ్నే. పైగా కాంగ్రెస్‌కు వచ్చే ఎన్నికలలో ఎంత లేదన్నా వందకు పైగా సీట్లు వస్తాయి. బీజేపీకి రెండువందల కంటే తగ్గక పోవచ్చు. మిగిలిన 245 స్థానాలలో కొత్తగా ఏర్పడబోయే ఫెడరల్ ఫ్రంట్ ఎన్ని గెలుచుకోగలదు? రెండు ప్రాంతీయ పార్టీలు ఉన్న రాష్ట్రాలలోని లోక్‌సభ స్థానాల సంగతి ఏమిటి? ఒక రాష్ట్రం నుంచి ఏదో ఒక ప్రాంతీయ పార్టీ మాత్రమే కొత్త ఫ్రంట్‌లో ఉండగలదు. ఉదాహరణకు టీడీపీ, వైఎస్ఆర్సీపీ ఒకే ఫ్రంట్‌లో ఉండవు. తమిళనాడులోనూ అంతే. కాంగ్రెస్, బీజేపీ కూటములను నిలువ రించడానికి ఫెడరల్ ఫ్రంట్ ఉపకరించవచ్చు. ఏదో ఒక జాతీయ పార్టీ మద్దతు లేకుండా స్వయంగా ప్రభుత్వం ఏర్పాటు చేసే శక్తి ఫ్రంట్‌కు ఉండదు. వీపీ సింగ్ ప్రభుత్వంలాగా బీజేపీ మద్దతునూ, దేవెగౌడ, గుజ్రాల్ లాగా కాంగ్రెస్ బాసటనూ తీసుకొని బలహీన ప్రభుత్వాలను ఏర్పాటు చేయవలసిందే కానీ ప్రాంతీయ పార్టీలు ప్రభుత్వం ఏర్పాటు చేసి నిలదొక్కుకోవడం కష్టం. అయినా సరే, అటువంటి ప్రయత్నం జరగడం మంచిదే. కాంగ్రెస్‌కు కొత్త కళ ఇటువంటి సమయంలో మూడు హిందీ రాష్ట్రాలలో కాంగ్రెస్ అధికారంలోకి రావడం విశేషం. బీజేపీకి 2014లో అత్యధిక స్థానాలు సమకూర్చిన రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాలలో కాంగ్రెస్ పుంజుకున్నది. బలమైన ప్రాంతీయ పార్టీలు లేని రాజస్థాన్, మధ్యప్రదేశ్‌లలో బీజేపీ, కాంగ్రెస్‌ల మధ్యనే ఉంటుంది. మధ్యప్రదేశ్, రాజస్థాన్‌లలో స్వల్ప మెజారిటీతో కాంగ్రెస్ గెలుపొందింది. మాయావతి, అఖిలేశ్ సహకారంతో మధ్యప్రదేశ్‌లో అందలం ఎక్కబోతోంది. పదిహేనేళ్ళు అధికారంలో ఉన్న బీజేపీని చిత్తుగా ఓడించవలసిన కాంగ్రెస్ బొటా బొటి మార్కులతో పాస్ కావడాన్ని ఘనవిజయంగా భావించనక్కరలేదు. ఛత్తీస్‌గఢ్‌లో అనూహ్యంగా కాంగ్రెస్‌కు పెద్ద మెజారిటీ లభించింది. ఛత్తీస్‌గఢ్ తొలి ముఖ్యమంత్రి అజిత్‌జోగీ, మాయావతి కలసి ఏర్పాటు చేసిన కూటమి వల్ల కాంగ్రెస్‌కు చేటు కలుగుతుందని అత్యధికులు ఊహించారు. జోగీ బీజేపీకి నష్టం కలిగించి కాంగ్రెస్‌కు అసంకల్పితంగా ఉపకారం చేశారు. మూడు విడతలు వరుసగా ముఖ్యమంత్రులుగా పని చేసిన శివరాజ్‌సింహ్ చౌహాన్, రమణ్సింగ్ల ఓటమిని అర్థం చేసుకోవచ్చు. పదవీ విరమణ చేసిన తర్వాత చౌహాన్ నవ్వుతూ హాయిగా మాట్లాడటం అభినందించవలసిన విషయం. రాజస్థాన్‌లో చిత్తు చిత్తుగా ఓడిపోతుందని అనుకున్న బీజేపీ గట్టిగా ప్రతిఘటించడం బీజేపీ కార్య కర్తల బలాన్నీ, కాంగ్రెస్ పరిమితులనూ వెల్లడిస్తున్నది. మూడు హిందీ రాష్ట్రా లలో కాంగ్రెస్ విజయం వెనుక టీడీపీ కృషి ఉన్నదంటూ చంద్రబాబు చెప్పు కుంటున్నారు. అది ఆర్థిక ప్రమేయం కావచ్చునంటూ ప్రతిపక్ష నాయకులు ఎద్దేవా చేస్తున్నారు. మూడు రాష్ట్రాలనూ చంద్రబాబు సందర్శించ కుండా కాంగ్రెస్ నెత్తిన పాలు పోశారు. మూడు రాష్ట్రాల ముఖ్యమంత్రుల ఎంపిక విషయంలో రాహుల్‌గాంధీ వ్యవహరించిన తీరు ప్రశంసార్హం. ఇంతవరకూ కాంగ్రెస్ ఏ రాష్ట్రంలో గెలిచినా ఢిల్లీ నుంచి అధిష్ఠానవర్గం దూతలు వెళ్ళడం, ఎంఎల్ఏలతో మాట్లాడటం, అక్కడి నుంచి పార్టీ అ«ధినేతతో ఫోన్లో మాట్లాడి ఆదేశం తీసుకోవడం లేదా ఢిల్లీ వెళ్ళి అంతా నివేదించి ఒక కవరుతో వచ్చి పార్టీ అధినేత నిర్ణయం ప్రకటించడం రివాజు. ఈ సారి ముఖ్యమంత్రి పదవికి పోటీ పడుతున్న అభ్యర్థులను ఢిల్లీకి పిలిపించుకొని సోనియా, రాహుల్, ప్రియాంక (కుటుంబ వ్యవహారమని నిందించవచ్చు) సుదీర్ఘ సమాలోచనలు జరిపి, ముఖ్యమంత్రిగా కమల్‌నాథ్‌ను నిర్ణయించి, పదవి లభించని జ్యోతిరాదిత్య సింధియాను సముదాయించి, సంతృప్తిపరిచి భోపాల్‌కు పంపించారు. కమల్‌నాథ్ సోమవారం ప్రమాణం చేస్తారు. జ్యోతిరాదిత్య ఢిల్లీలోనే రాహుల్‌కు సహాయకుడుగా ఉంటారు. రాజ స్థాన్లో కూడా ఇదే విధమైన రాజీ కుదిరింది. గహ్లోత్ ముఖ్యమంత్రిగా, సచిన్ ఉపముఖ్యమంత్రిగా ప్రమాణం చేస్తారు. పదేళ్ళు ముఖ్యమంత్రిగా పని చేసిన దిగ్విజయ్‌సింగ్ బీజేపీకి అధికారం అప్పగించి పదిహేను సంవత్సరాలు గడచిన తర్వాత మొదటిసారి కాంగ్రెస్ నాయకుడు కమల్‌నా«ద్ ముఖ్యమంత్రి పీఠంపైన కూర్చోబోతున్నారు. ఛత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రిని ఈ రోజు నిర్ణయిస్తారు. ముఖ్య మంత్రి పదవికి నాయకులను నిర్ణయించే క్రమంలో కార్యకర్తల అభిప్రాయాలు కనుక్కునేందుకు కూడా రాహుల్ సర్వే పద్ధతి ప్రవేశపెట్టారు. ఈ ప్రక్రియవల్ల ఎంపికలో జాప్యం జరగవచ్చు. కానీ అందరినీ సంప్రదించారనే సంతృప్తి ఉంటుంది. మూడు రాష్ట్రాలలో విజయం కాంగ్రెస్‌కు ఆక్సిజెన్ అందించింది. రాహుల్ ప్రతిష్ఠ ఎంతో కొంత పెరిగింది. అయినప్పటికీ మోదీకి సమ ఉజ్జీ కాగలరా? ఈ ప్రశ్నకు సమాధానం కోసం 2019 మే వరకూ వేచి ఉండాలి. అప్పుడే తెలంగాణలోనూ నాటకీయమైన పరిణామాలు సంభవించే అవకాశం ఉన్నది. వ్యాసకర్త: కె. రామచంద్రమూర్తి -
ఐటీ నుంచి మేటి స్థాయికి...
సాక్షి, హైదరాబాద్: ఆయన ఆంగ్లంలో అనర్గళంగా మాట్లాడి అందరినీ ఆకట్టుకోగలరు.... అదే సమయంలో రాజకీయ ప్రత్యర్థులపై అచ్చమైన తెలంగాణ యాసలో విమర్శనాస్త్రాలు సంధిస్తూ విరుచుకుపడనూగలరు... నేటి యువతరం మెచ్చే మోడ్రన్ రాజకీయ నాయకుడిగా, సామాన్యులకు నచ్చే మాస్ లీడర్‌గా ఎదిగిన ఆయనే కల్వకుంట్ల తారక రామారావు. టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా కేటీఆర్ నియమితులైన సందర్భంగా ఆయన వ్యక్తిగత, రాజకీయ నేపథ్యం క్లుప్తంగా... అమెరికా కొలువు వదిలి ఉద్యమం వైపు... ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కోసం 2001లో తన తండ్రి కేసీఆర్ తెలంగాణ రాష్ట్ర సమితిని స్థాపించడంతో ఉద్యమంలో తన వంతు పాత్ర పోషించేందుకు కేటీఆర్ 2006లో అమెరికాలో తాను చేస్తున్న ఐటీ ఉద్యోగానికి రాజీనామా చేసి హైదరాబాద్ వచ్చారు. యూపీఏ–1లో కేంద్ర మంత్రిగా కేసీఆర్ 2006లో రాజీనామా చేసి కరీంనగర్ లోక్‌సభ ఉప ఎన్నికల బరిలోకి దిగగా కేటీఆర్ ఆయనకు చేదోడుగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఆ ఎన్నికల్లో కేసీఆర్ 2 లక్షల ఓట్ల మెజారిటీతో గెలిచారు. అనంతరం 2009లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో సిరిసిల్ల నుంచి కేటీఆర్ పోటీ చేసిన తన ప్రత్యర్థిపై 171 ఓట్ల తేడాతో గెలుపొందారు. ప్రత్యేక తెలంగాణ ఏర్పాటు కోసం 2010 జూలైలో కేటీఆర్ సహా 10 మంది టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు రాజీనామా చేయడంతో ఉప ఎన్నికలు అనివార్యమయ్యాయి. ఈ ఉప ఎన్నికల్లో కేటీఆర్ 68,219 ఓట్ల భారీ మెజారిటీతో విజయఢంకా మోగించారు. ప్రత్యేక తెలంగాణ ఉద్యమంలో ఉధృతంగా పాల్గొని పలుమార్లు అరెస్టు అయ్యారు. ఎన్నో ఉద్యమ కేసులను ఎదుర్కొన్నారు. 2014 ఎన్నికల్లో 53 వేల ఓట్ల మెజారిటీతో గెలిచారు. రాష్ట్రానికి పెట్టుబడుల్లో కీలకపాత్ర... తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తర్వాత కేటీఆర్ రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు, పురపాలకశాఖ మంత్రిగా సమర్థంగా పనిచేసి జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందారు. రాష్ట్ర ప్రభుత్వం హైదరాబాద్‌లో ఆతిథ్యమిచ్చిన ప్రపంచ పెట్టుబడిదారుల సదస్సు, ప్రపంచ ఐటీ కాంగ్రెస్ వంటి ప్రతిష్టాత్మక అంతర్జాతీయ సదస్సులను దిగ్విజయంగా నిర్వహించడంలో కేటీఆర్ కీలక పాత్ర పోషించారు. ఆయా సదస్సుల్లో ఆయన చేసిన ప్రసంగాలకు విశేష ఆదరణ లభించింది. దేశ, విదేశాల్లో జరిగిన పారిశ్రామికవేత్తల సదుస్సుల్లో పాల్గొని రాష్ట్రానికి వేల కోట్ల పెట్టుబడులు వచ్చేలా కృషి చేశారు. ఆయన ఆలోచనల నుంచి పుట్టుకొచ్చిన టీ–హబ్ ఐటీ ఇంక్యుబేటర్ వందల సంఖ్యలో స్టార్టప్ కంపెనీల ఏర్పాటుకు ఊతమిచ్చి ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలిచింది. పంచాయతీరాజ్‌శాఖ మంత్రిగా సైతం పని చేసి తనదైన ముద్రవేశారు. కేరళను ఆదర్శంగా తీసుకొని రాష్ట్రంలోని గ్రామ పంచాయతీల్లో పాలనా సంస్కరణలను అమలు చేసేందుకు కృషి చేశారు. 2016 ఫిబ్రవరిలో జరిగిన జీహెచ్ఎంసీ ఎన్నికల్లో టీఆర్ఎస్ ప్రచార బాధ్యతను పూర్తిగా తన భుజాన వేసుకొని 150 స్థానాలకుగాను 99 స్థానాల్లో పార్టీ ఘన విజయం సాధించేలా పనిచేశారు. అలాగే తాజా అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్రవ్యాప్తంగా 50 వరకు ప్రచార సభలు నిర్వహించడం ద్వారా రాష్ట్రంలో టీఆర్ఎస్ రెండోసారి అధికారంలోకి రావడానికి తన వంతు పాత్ర పోషించారు. -
పార్టీని మరింత బలోపేతం చేద్దాం
సాక్షి, హైదరాబాద్: ప్రజల ఆశీర్వాదంతో మరోసారి ఏర్పడిన ప్రభుత్వానికి మంచి మంత్రివర్గం ఉంటుందని టీఆర్ఎస్ అధినేత కె.చంద్రశేఖర్‌రావు అన్నారు. ప్రజలకు, ప్రభుత్వానికి అనుసంధానకర్తలుగా ఉండి పార్టీని మరింత బలోపేతం చేయాలని, పార్టీ బాగుంటేనే అందరం బాగుంటామని అన్నారు. టీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడిగా కేటీఆర్ నియమితులైన నేపథ్యంలో శుక్రవారం తెలంగాణ భవన్లో టీఆర్ఎస్ రాష్ట్ర కార్యవర్గ సమావేశం జరిగింది. ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో టీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్, సెక్రటరీ జనరల్ కె.కేశవరావు పాల్గొన్నారు. రాష్ట్ర కమిటీ బాధ్యులను ఉద్దేశించి కేసీఆర్ ప్రసంగించారు. ఆ విషయాలు ఆయన మాటల్లోనే... ‘తెలంగాణ ప్రజలు మనల్ని మళ్లీ ఆశీర్వదించారు. రాష్ట్రం సాధించినందుకు అప్పుడు, ప్రజలు ఆశించిన పాలన అందించినందుకు ఇప్పుడు అధికారం ఇచ్చారు. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పాలన కొనసాగించాలి. రాష్ట్రంలో మంచి మంత్రివర్గం ఉంటుంది. అన్ని వర్గాలకు ప్రాతినిధ్యం కల్పిస్తాం. పార్టీ సైతం ఇదే రకంగా ఉండాలి. ప్రభుత్వానికి మద్దతుగా పార్టీ నిలవాలంటే మరింత ధృడంగా ఉండాలి. ఉద్యమం, రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఇబ్బందులతో పార్టీని గుర్తించలేకపోయాం. ఈ విషయంలో కొన్ని ఆరోపణ లొచ్చాయి. పని విధానం మార్చుకుందాం. పార్టీ క్షేమంగా ఉంటేనే మనకు మంచిది. ప్రభుత్వం ఏం చేయాలో పార్టీ నిర్ణయించాలి. కేటీఆర్ ప్రతిరోజు మీకు అందుబాటులో ఉంటారు. పార్టీ బలోపేతం కోసం ఏం చేయాలో మీరే నిర్ణయించి నాకు సూచించండి. సంస్థాగతంగా గ్రామస్థాయి నుంచి పార్టీని బలోపేతం చేయాలి. సభ్యత్వ నమోదు, గ్రామ, మండల స్థాయి నుంచి పార్టీ కమిటీలను చేపట్టాలి. జిల్లా కమిటీలు ఉంటే... ఎమ్మెల్యేలు, మంత్రులు, జిల్లా కమిటీలకు మధ్య కొన్ని స్పర్దలు వస్తాయి. పార్టీ నిర్మాణం ఇప్పుడున్నట్లు ఉంటే బాగుంటుందా?, జిల్లా కమిటీలు ఉంటే బాగుంటుందా? అనేది ఆలోచించండి. లోక్‌సభ ఎన్నికల్లో విజయం సాధించాలి. పార్టీ పరంగా ఇప్పుడున్న వ్యవస్థ సరిపోతుందా? ఒక్కో లోక్‌సభకు ఒక ప్రధాన కార్యదర్శి, ఇద్దరు కార్యదర్శులు ఉండాలా? జిల్లా స్థాయిలో, లోక్‌సభ సెగ్మెంట్ స్థాయిలో పార్టీకి ఏ విధానం ఉత్తమమో సూచించండి. రేపు మరోసారి భేటీ అయి అన్ని చర్చించండి. సభ్యత్వ నమోదు విషయంలో బాగా పని చేయాలి. జాతీయ రాజకీయాల్లో భాగస్వామ్యం పంచుకోవాలి. టీఆర్ఎస్ను రాష్ట్ర స్థాయిలో నడిపించేందుకు సమర్థుడు అవసరం. అందుకే కేటీఆర్‌కు పార్టీని అప్పగిస్తున్నాం. మంచి వ్యూహరచన, సమర్థత కలిగిన కేటీఆర్ ఆ బాధ్యతలను చక్కగా నిర్వహిస్తారు’అన్నారు. ప్రగతిభవన్ పాస్‌లు... టీఆర్ఎస్ రాష్ట్ర కమిటీ బాధ్యులకు అన్నింట్లోనూ ప్రాధాన్యత ఇస్తామని కేసీఆర్ చెప్పారు. ‘నేను మీకు అందుబాటులో ఉండేందుకు ప్రయత్నిస్తా. మిమ్మల్ని కలుస్తా. రాష్ట్ర కమిటీ బాధ్యులు ప్రగతిభవన్‌కు వచ్చి నన్ను కలిసేందుకు వీలుగా పాసులు జారీ చేస్తాం. ప్రభుత్వంలో పదవుల భర్తీలో ముందుగా రాష్ట్ర కమిటీ వారినే పరిగణనలోకి తీసుకుంటాం. ఎమ్మెల్సీ, కార్పొరేషన్ చైర్మన్ పదవులతోపాటు హైదరాబాద్‌లో వసతి సదుపాయాలు కల్పించేలా ఏర్పాట్లు చేస్తాం. ప్రజల ఆకాంక్షల విషయంలో ఎప్పటికప్పుడు ప్రభుత్వాన్ని అప్రమత్తం చేసేలా పార్టీ ఉండాలి. విపత్తులతో పంట నష్టం జరిగితే ముందుగా మన పార్టీ వాళ్లే వెళ్లాలి. బాధితులకు భరోసాతో పాటు నష్టం అంచనాలను అధికారులకు ముందుగా మనమే ఇవ్వాలి. మీరంతా క్షేత్రస్థాయిలో తిరగాలి. ప్రభుత్వానికి, పార్టీకి మధ్య అనుసంధానంగా ఉండాలి’అని కేసీఆర్ అన్నారు. అందరి వేదికగా టీఆర్ఎస్: కేటీఆర్ పార్టీలో అందరికీ భాగస్వామ్యం ఉంటుందని టీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ అన్నారు. స్థానిక పరిస్థితుల కారణంగా పార్టీకి ఎవరూ దూరం కావొద్దని... ఇలాంటివి భవిష్యత్తులో జరగకుండా చూసుకుంటామని చెప్పారు. టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ మాట్లాడి వెళ్లిపోయాక కేటీఆర్ ప్రసంగించారు. ‘కొందరు ఎమ్మెల్యేలు నియోజకవర్గంలో అంతా తామే అన్నట్లుగా ఉంటున్నారు. వ్యక్తిగతంగా వాళ్లకు నచ్చని వారిని తొక్కిపెడుతున్నారు. తెలంగాణ ఉద్యమకారులను, కేసీఆర్ అభిమానులను కొన్ని విషయాల్లో దూరం పెడుతున్నారు. పార్టీ విధానాలకు బద్ధులై ఉండే ప్రతి ఒక్కరికీ టీఆర్ఎస్ వేదికగా ఉండాలి. అలా పార్టీని నిర్మిద్దాం. టీఆర్ఎస్లో ఇంత కీలకమైన బాధ్యతలు ఇచ్చినందుకు అధినేత కేసీఆర్‌కు, మీకు ధన్యవాదాలు. టీఆర్ఎస్ విధివిధానాలను ఎప్పటికప్పుడు సమాచార మాధ్యమాలకు చెప్పేందుకు పార్టీ తరుఫున అధికార ప్రతినిధులను నియమిస్తాం. టీవీ చర్చల్లో ఎవరు పడితే వాళ్లు ఏదేదో చెప్పకుండా కొందరిని ఎంపిక చేస్తాం. పార్టీ విధానాలను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాల్సిన బాధ్యత వీరిపై ఉంటుంది’అని అన్నారు. కేటీఆర్ నియామకానికి ఆమోదం... టీఆర్ఎస్ రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షుడిగా కేటీఆర్ నియామకానికి పార్టీ రాష్ట్ర కార్యవర్గం ఆమోదం తెలిపింది. రాష్ట్ర కార్యవర్గం తరుఫున ప్రధాన కార్యదర్శి పల్లా రాజేశ్వర్‌రెడ్డి తీర్మానాన్ని ప్రతిపాదించారు. చప్పట్లతో అందరు ఏకగ్రీవంగా ఆమోదించారు. రాష్ట్ర కమిటీ ధన్యవాద తీర్మానం... ‘కె.తారక రామారావును కార్యనిర్వాహక అధ్యక్షుడిగా నియమించినందుకు టీఆర్ఎస్ రాష్ట్ర కార్యవర్గం కేసీఆర్‌ను ఏకగ్రీవంగా అభినందిస్తోంది. కేటీఆర్ నియామకంతో టీఆర్ఎస్కు యువరక్తం అందించినట్లయింది. తెలంగాణ ఉద్యమంలో పనిచేసి, నాలుగుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికై, మంత్రిగా దేశవిదేశాల్లో తెలంగాణకు ఖ్యాతిని పెంచిన కేటీఆర్ నాయకత్వంలో టీఆర్ఎస్ మరింత నిర్మాణాత్మకంగా, ఉత్సాహపూరితంగా తయారవుతుందనే ఆశాభావంతో కేసీఆర్‌కు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. కేటీఆర్‌కు శుభాకాంక్షలతో బంగారు తెలంగాణ నిర్మాణానికి టీఆర్ఎస్ రాష్ట్ర కమిటీ పునరంకితమవుతుంది’అని తీర్మానించింది. కేసీఆర్‌కు పాదాభివందనం... టీఆర్ఎస్ రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షుడిగా తనను నియమించిన కేసీఆర్‌కు తెలంగాణ భవన్లో కేటీఆర్ పుష్పగుచ్చం ఇచ్చి కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం కేసీఆర్‌కు పాదాభివందనం చేసి ఆశీర్వాదం తీసుకున్నారు. కేసీఆర్‌కు శుభాకాంక్షలు... రెండోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన అనంతరం తొలిసారి జరిగిన టీఆర్ఎస్ కార్యవర్గ సమావేశంలో రాష్ట్ర కమిటీ బాధ్యులు కేసీఆర్‌కు శుభాకాంక్షలు తెలిపారు. నేడు రాష్ట్ర కమిటీ సమావేశం... టీఆర్ఎస్ రాష్ట్ర కార్యవర్గ సమావేశం శనివారం జరగనుంది. పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ఆధ్యర్యంలో తొలిసారి రాష్ట్ర కార్యవర్గం భేటీ కానుంది. పార్టీ బలోపేతంపై ఈ భేటీలో కీలక చర్చలు జరగనున్నాయి. -
రాముడొచ్చాడు
సాక్షి, హైదరాబాద్: గులాబీ దళానికి కొత్తగా యువ సారథి వచ్చారు. తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) తొలి కార్యనిర్వాహక అధ్యక్షుడిగా (వర్కింగ్ ప్రెసిడెంట్) కల్వకుంట్ల తారక రామారావు నియమితులయ్యారు. ఈ మేరకు తన కుమారుడు, సిరిసిల్ల ఎమ్మెల్యే అయిన కేటీఆర్‌కు పగ్గాలు అప్పగిస్తూ టీఆర్ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావు శుక్రవారం కీలక నిర్ణయం తీసుకున్నారు. తెలంగాణ భవన్లో శుక్రవారం మధ్యాహ్నం జరిగిన టీఆర్ఎస్ రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో ఈ నియామకం గురించి కేసీఆర్ వివరించారు. అధినేత నిర్ణయానికి కార్యవర్గం సంపూర్ణ ఆమోదం తెలిపింది. టీఆర్ఎస్లో ఇప్పటివరకు కార్యనిర్వాహక అధ్యక్ష పదవి లేదు. కేటీఆర్‌ను ఈ పదవిలో నియమించడం ద్వారా కేసీఆర్ టీఆర్ఎస్లో కొత్త అధ్యాయానికి తెరతీశారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయం సాధించి రెండోసారి ముఖ్యమంత్రి పదవి చేపట్టిన మర్నాడే కేసీఆర్ ఈ నిర్ణయం తీసుకోవడం గమనార్హం. విధేయత, సమర్థతకు పట్టం... దేశ రాజకీయాల్లో గుణాత్మక మార్పు తెచ్చేందుకు జాతీయ రాజకీయాలపై సీఎం కేసీఆర్ దృష్టి పెట్టారు. ప్రభుత్వపరంగా నీటిపారుదల ప్రాజెక్టుల నిర్మాణంతోపాటు ఎన్నికల్లో ప్రజలకిచ్చిన వాగ్దానాలను తు.చ. తప్పకుండా అమలు చేయాల్సిన బాధ్యత తనపై ఉన్న దృష్ట్యా అత్యంత నమ్మకస్తుడు, సమర్థుడికి పార్టీ బాధ్యతలు అప్పగించాలని భావించి ఈ నిర్ణయం తీసుకున్నారు. తెలంగాణ ఉద్యమానికి రాజకీయ వేదిక ఏర్పాటు చేయాలనే లక్ష్యంతో కేసీఆర్ 2001లో టీఆర్ఎస్ను స్థాపించారు. తెలంగాణ ఉద్యమాన్ని గమ్యానికి చేర్చి ప్రత్యేక రాష్ట్రం సాధించిన టీఆర్ఎస్... తెలంగాణ రాష్ట్రంలో తొలి ప్రభుత్వం ఏర్పాటు చేయడంతోపాటు బంగారు తెలంగాణ నిర్మాణం దిశగా పరిపాలన సాగించింది. ఇటీవలి ఎన్నికల్లో ప్రజలు మరోసారి టీఆర్ఎస్కు భారీ మెజారిటీతో అధికారం అప్పగించడంతో రాష్ట్రంలో అభివృద్ధి కార్యక్రమాలను ముందుకు నడిపించడంతోపాటు జాతీయ రాజకీయాల్లో క్రియాశీల పాత్ర పోషించాలనుకుంటున్న కేసీఆర్‌పై పనిభారం పెరుగుతోంది. ఈ నేపథ్యంలోనే టీఆర్ఎస్ను తాను అనుకున్న విధంగా ముందుకు తీసుకెళ్లే బాధ్యతను, పార్టీలో తాను అత్యంత ఎక్కువగా విశ్వసించే కేటీఆర్‌కు కేసీఆర్ అప్పగించారు. టీఆర్ఎస్ సభ్యత్వ నమోదు కార్యక్రమం నిర్వహించడం, జిల్లాల్లో పార్టీ కార్యాలయాలు నిర్మించడం, సంస్థాగతంగా తిరుగులేని శక్తిగా టీఆర్ఎస్ను తీర్చిదిద్దే బాధ్యతను చేపట్టాల్సిందిగా కేటీఆర్‌కు సూచించారు. దేశంలోనే అతిగొప్ప పార్టీగా టీఆర్ఎస్ను రూపుదిద్దాలనే సంకల్పంతో కేసీఆర్ ఉన్నారు. ఇప్పటివరకు ప్రభుత్వంలో, పార్టీలో ఇచ్చిన బాధ్యతలన్నీ అత్యంత విజయవంతంగా కేటీఆర్ నిర్వహించడంతో ఆయన పనితీరు, నిబద్ధత, దార్శనికత, నాయకత్వ లక్షణాలు చూసి ఆయనకు ఈ బాధ్యతలు అప్పగించారు. కలసి పని చేస్తాం: హరీశ్‌రావు టీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడిగా నియమితుడైన వెంటనే మాజీ మంత్రి కేటీఆర్... సీఎం కేసీఆర్ ఆశీర్వాదం తీసుకున్నారు. అనంతరం టీఆర్ఎస్ సెక్రటరీ జనరల్ కె. కేశవరావు ఇంటికి వెళ్లి ఆయన ఆసీస్సులు అందుకున్నారు. ఆ తర్వాత హోంమంత్రి మహమూద్ అలీ, మాజీ మంత్రి నాయిని నర్సింహారెడ్డి ఇళ్లకు వెళ్లి కలిశారు. అక్కడి నుంచి మాజీ మంత్రి తన్నీరు హరీశ్‌రావు ఇంటికి వెళ్లి మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. టీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడిగా కేటీఆర్‌ను నియమించడంపై హరీశ్‌రావు హర్షం వ్యక్తం చేశారు. కేటీఆర్ తనను కలిసిన అనంతరం హరీశ్ విలేకరులతో మాట్లాడుతూ ‘కేటీఆర్ నన్ను మర్యాదపూర్వకంగా కలిశారు. కేటీఆర్‌ను టీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడిగా నియమించడంపై హర్షం వ్యక్తం చేస్తున్నా. ఉదయమే కేటీఆర్‌కు శుభాకాంక్షలు తెలిపా. కేటీఆర్ భవిష్యత్తులో మరింత మంచి పేరు తెచ్చుకోవాలి. కేసీఆర్‌కు కేటీఆర్ చేదోడు వాదోడుగా ఉండాలని కోరుకుంటున్నా. స్థానిక సంస్థల ఎన్నికల్లో మరింత బాగా పనిచేయాలని కోరుకుంటున్నా. మేమిద్దరం కలసి పని చేస్తాం. ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో మేము కలసి పని చేశాం. రేపు రాష్ట్రాన్ని ముందుకు నడిపించడంలో కూడా కలసి పనిచేస్తాం’అని పేర్కొన్నారు. తెలంగాణ తల్లికి పూలమాల... టీఆర్ఎస్ రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షుడిగా నియమితులైన అనంతరం కేటీఆర్ ముఖ్యనేతల ఆశీర్వాదం తీసుకుని తెలంగాణ భవన్‌కు చేరుకున్నారు. అక్కడి ఆవరణలోని తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాల వేశారు. అలాగే ఆచార్య జయశంకర్ చిత్రపటానికి నివాళుర్పించారు. టీఆర్ఎస్లో కీలక పదవి పొందిన తర్వాత తొలిసారి తెలంగాణ భవన్‌కు చేరుకున్న కేటీఆర్‌కు పార్టీ నేతలు, కార్యకర్తలు భారీగా స్వాగతం పలికారు. డప్పు చప్పుళ్లు, బాణాసంచా మోతలతో తెలంగాణ భవన్ ప్రాంగణం మార్మోగింది. జీహెచ్ఎంసీ మేయర్ బొంతు రామ్మోహన్ ఆధ్వర్యంలో భారీగా స్వాగత కార్యక్రమాన్ని నిర్వహించారు. మాజీ మంత్రులు జగదీశ్వర్‌రెడ్డి, ఇంద్రకరణ్‌రెడ్డి, పోచారం శ్రీనివాస్‌రెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్, ఈటల రాజేందర్, సి.లక్ష్మారెడ్డి, పద్మారావుగౌడ్, వరంగల్ తూర్పు ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్, టీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డి తదితరులు కేటీఆర్‌కు పుష్పగుచ్ఛాలు అందించి శుభాకాంక్షలు తెలియజేశారు. ట్విట్టర్లో శుభాకాంక్షలు... టీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడిగా నియమితులైన కేటీఆర్‌కు హదయపూర్వక శుభాకాంక్షలు తెలుపుతూ హరీశ్‌రావు ట్వీట్ చేశారు. హరీశ్ ట్వీట్‌కు ‘థ్యాంక్స్ బావా’అంటూ కేటీఆర్ రిప్లై ఇచ్చారు. ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ సైతం ట్విట్టర్ ద్వారా కేటీఆర్‌కు అభినందనలు తెలిపారు. ‘టీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడిగా కీలక బాధ్యతలు చేపట్టిన కేటీఆర్‌కు శుభాకాంక్షలు’అని ట్విట్టర్లో పేర్కొన్నారు. ‘టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ నాకు అప్పగించిన వర్కింగ్ ప్రెసిడెంట్ బాధ్యతలను వినయపూర్వకంగా స్వీకరిస్తున్నా. కేసీఆర్ నాయకత్వంపై ప్రజలు చూపిన విశ్వాసాన్ని మరింత పెంచేందుకు శాయశక్తులా కృషి చేస్తా..’ – ట్విట్టర్లో కేటీఆర్ -
మేమిద్దరం కలిసే పనిచేస్తాం: హరీష్ రావు
సాక్షి, హైదారాబాద్: తెలంగాణ రాష్ట్ర సమితి(టీఆర్ఎస్) వర్కింగ్ ప్రెసిడెంట్‌గా ఎన్నికైన కేటీఆర్‌ను హరీష్ రావు మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలియజేశారు. కేటిఆర్‌ను వర్కింగ్ ప్రెసిడెంట్‌గా నియమించడం పట్ల హర్షం వ్యక్తం చేసిన హరీష్ రావు మీడియాతో మాట్లాడుతూ.. కేటీఆర్ భవిష్యత్‌లో ఇంకా మంచి పేరు తెచ్చుకోవాలని ఆశించారు. అదే సమయంలో తామిద్దరం కేసీఆర్‌కు చేదోడు వాదోడుగా ఉంటామన్నారు. ‘వచ్చే స్ధానిక సంస్థల ఎన్నికల్లో మరింత బాగా పనిచేయాలని కోరుకుంటున్నా. మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఇద్దరం కలిసి పనిచేశాం. రేపు రాష్టాన్ని ముందుకు తీసుకుపోవడంలో కూడా ఇద్దరు కలిసి పనిచేస్తాం’ అని హరీష్ రావు అన్నారు. -
కేటీఆర్‌కు హరీష్, ఓవైసీ అభినందనలు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) వర్కింగ్ ప్రెసిడెంట్‌గా ఎన్నికైన సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్‌కు రాష్ట్ర వ్యాప్తంగా అభినందనలు వెల్లువత్తున్నాయి. ఇప్పటికే పలువురు ఎమ్మెల్యేలు, సీనియర్ నేతలు ఆయనకు శుభాకాంక్షలు తెలపగా, తాజాగా సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు ట్విటర్లో అభినందనలు తెలిపారు. ఆయనతో పాటు ఎంఐఎం అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ కూడా కేటీఆర్‌ను అభినందించారు. జాతీయ రాజకీయాలపై కేసీఆర్ దృష్టిసారించేందుకు కేటీఆర్‌కు ఈ బాధ్యతలు అప్పగించినట్లు తెలుస్తోంది.