
కే. తారక రామారావు
సాక్షి, వరంగల్: టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా ఎన్నికై సిరిసిల్ల ఎమ్మెల్యే కే. తారక రామారావు మొదటి సారిగా నేడు ఉమ్మడి జిల్లాలో పర్యటించనున్నారు. కేటీఆర్ రాకతో పార్టీ శ్రేణుల్లో సందడి నెలకొంది. దీంతో హనుమకొండ, జనగామలో కార్యకర్తల సమావేశాలు నిర్వహించి కార్యకర్తలు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. కేటీఆర్ జిల్లాలో పర్యటనలో భాగంగాముందుగా హనుమకొండ బాలసముద్రంలో టిఆర్ఎస్ జిల్లా పార్టీ కార్యాలయానికి శంకుస్థాపన చేస్తారు.
అనంతరం వరంగల్ అర్బన్, రూరల్ జిల్లాల ముఖ్య కార్యకర్తలతో కేడీసీ కాలేజీలో జరగనున్న భారీ బహిరంగా సభలో పాల్గొని ప్రసంగిస్తారు. పెంబర్తి నుంచి వరంగల్ వరకు కేటీఆర్‌కు ఘనంగా స్వాగతం పలకడానికి భారీ ఏర్పాట్లు చేస్తున్న పార్టీ శ్రేణులు. మడికొండ నుండి భారీ బైక్ ర్యాలీతో స్వాగతం కోసం ఏర్పాట్లు చేస్తున్నపార్టీ కార్యకర్తరలు.
Comments
Please login to add a commentAdd a comment