సాక్షి, హైదరాబాద్ : టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, రాష్ట్ర ఐటీ, పురపాలకశాఖ మంత్రి కేటీఆర్ ఆరోగ్యంపై సోషల్ మీడియాలో పలు వార్తలు వస్తున్నాయి. సోమవారం ఆయన సిరిసిల్లా జిల్లా పర్యటన సందర్భంగా కొంత ఇబ్బందికరంగా కనిపించారని కొంతమంది ఆయన అభిమానులు ట్విటర్‌లో పోస్టులు పెట్టారు.‘కరోనాపై యుద్ధం చేస్తున్న కేటీఆర్ కొంత అనారోగ్యంతో బాధపడుతున్నట్లు కనిపించారు’ అంటూ ఓ నెటిజన్ ట్వీట్ చేశారు. ఈ క్రమంలోనే తన ఆరోగ్యంపై వస్తున్న ప్రచారంపై కేటీఆర్ స్పందించారు. తాను సంపూర్ణ ఆరోగ్యంతో ఉన్నానని తన ట్విటర్ ఖాతా ద్వారా ప్రకటించారు. అయితే ఎప్పటి నుంచో తాను స్పల్ప కోల్డ్ అలర్జీతో బాధపడుతున్నానని, అదేమీ తనకు సమస్య కాలేదని చెప్పారు.
తన ఆరోగ్యంపై ఎవరూ ఆందోళన చెందాల్సి అవసరంలేదని కేటీఆర్ తన అభిమానులకు తెలిపారు. ఇక సిరిసిల్ల పర్యటన సందర్భంగా ఎవరినైనా ఇబ్బందులకు గురిచేసి ఉంటే క్షమించాలని కేటీఆర్ కోరారు. ఈ మేరకు ట్విటర్‌లో ఓ పోస్ట్ చేశారు. కాగా రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండలం బద్దెనపల్లి శివారులోని టెక్స్‌టైల్ పార్కులో రూ.14.50 కోట్ల వ్యయంతో చేపట్టిన సెంట్రల్ లైటింగ్, శిక్షణ కేంద్రం, పరిపాలనా భవనం, క్యాంటీన్ భవనాలను సోమవారం ఆయన ప్రారంభించిన విషయం తెలిసిందే. (బ్రాండ్ సిరిసిల్ల కావాలి)
Comments
Please login to add a commentAdd a comment