waragal
-
సంక్రాంతి అల్లుడు మిస్సింగ్
సాక్షి, వరంగల్: పాలకుర్తి మండలం బొమ్మర గ్రామంలో సంక్రాంతి పండుగకు అత్తారింటికి వచ్చిన అల్లుడు అదృశ్యమయ్యారు. అత్తారింట్లో నుంచి బుధవారం రాత్రి స్నేహితులు ఫోన్ చేస్తున్నారని, వారితో మాట్లాడి వస్తానంటూ భార్యకు చెప్పి వెళ్లాడు. రాత్రి 8:30 గంటలకు భార్య ఫోన్ చేయగా ఫోన్ స్విచ్ ఆఫ్ వచ్చింది.ఇంట్లో నుంచి వెళ్లి 42 గంటలవుతున్నా కానీ యువకుడి ఆచూకీ లభించలేదు. గత ఏడాది డిసెంబర్ 26న వివాహం జరగ్గా, యువకుడి భార్య, బంధువులు ఆందోళనకు గురవుతున్నారు. గురువారం మధ్యాహ్నం పాలకుర్తి పోలీస్ స్టేషన్లో భార్య ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు పలు కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు.కొడుకుపై తండ్రి ఫిర్యాదు వరంగల్: ఆస్తులు పంచుకొని తన బాగోగులు చూసుకోవడం లేదని కొడుకుపై ఓ తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేసిన ఘటన వరంగల్ జిల్లాలో చర్చనీయాంశంగా మారింది. వర్ధన్నపేట మండలం దమ్మన్నపేట దొడ్లకుంటకు చెందిన గుజ్జల రాజిరెడ్డికి చెందిన 15 ఎకరాల భూమిలో కుమారుడు వినయ్ రెడ్డి ఏడెకరాల భూమి రాయించుకున్నాడు. ఇటీవల తల్లి అనారోగ్యంతో మరణించగా తండ్రి రాజిరెడ్డి జీవనం ప్రశ్నార్ధకంగా మారింది.ఇదీ చదవండి: మంగళూరు బ్యాంకులో దోపిడీ.. ఉద్యోగులను గన్‌తో బెదిరించి..ఆలనా పాలనా చూసుకునే కొడుకే తనను ఇబ్బందులకు గురి చేస్తున్నాడని.. అలాంటి వాడికి తాను కష్టపడి సంపాదించిన భూమిని తనకు అప్ప చెప్పాలని పోలీసు, రెవెన్యూ శాఖ అధికారులకు తండ్రి రాజిరెడ్డి ఫిర్యాదు చేశాడు. కుమారుడు వినయ్ రెడ్డి నుండి తనను కాపాడాలని తన వల్ల ప్రాణహాని ఉందని రాజిరెడ్డి పోలీసుల వద్ద వాపోయాడు. వృద్ధాప్యంలో ఉన్న తనకు న్యాయం చేసి ఆదుకోవాలని పోలీసుల వద్ద రాజిరెడ్డి అని 63 ఏళ్ల వృద్ధుడు కన్నీటి పర్యంతమయ్యాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. -
వరంగల్ కేఎంసీలో ర్యాగింగ్!
ఎంజీఎం: వరంగల్ కాకతీయ మెడికల్ కళాశాల(కేఎంసీ)ను ర్యాగింగ్ భూతం వెంటాడుతోంది. ఈ కళాశాలలో పీజీ వైద్యవిద్య చదువుతున్న ప్రీతి మృతి చెందిన విషయాన్ని ఇప్పుడిప్పుడే మరిచిపోతున్న క్రమంలో మరో ఘటన వెలుగులోకి వచ్చింది. కేఎంసీలో రాజస్తాన్‌కు చెందిన మనోహర్ ఎంబీబీఎస్ మొదటి సంవత్సరం చదువుతున్నాడు. ఈ నెల 14న కళాశాల లైబ్రరీలో అర్ధరాత్రి ఒంటి గంట వరకు చదువుకుని హాస్టల్ గదికి బయలుదేరాడు. ఈ క్రమంలో ఓ సీనియర్ విద్యార్థి పుట్టినరోజు వేడుకలు జరుపుకుంటున్న 15 మంది విద్యార్థుల కళ్లు మనోహర్‌పై పడ్డాయి. అతడిని దగ్గరికి పిలిచి మద్యం తాగించి, నృత్యాలు చేయించారు. సీనియర్లు ఎంతకీ వదలకుండా వేధిస్తుండగా ఎదురుతిరిగాడు. దీంతో అతడిని వారు దారుణంగా చితకబాదారు. ఈ ఘటనపై బాధిత విద్యార్థి ఈ నెల 15న తల్లిదండ్రుల సహాయంతో ప్రిన్సిపాల్‌కు, మట్టెవాడ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఎంజీఎం ఆస్పత్రిలో అడ్మిట్ ర్యాగింగ్ ఘటనలో గాయపడ్డ మనోహర్‌ను వెంటనే ఎంజీఎం ఆస్పత్రిలో చేర్చారు. ర్యాగింగ్ విషయాన్ని ప్రిన్సిపాల్ మోహన్‌దాస్ డీఎంఈకి వివరించగా కళాశాల అంతర్గత కమిటీతో విచారణ చేపట్టారు. 10 మంది విద్యార్థులు ర్యాగింగ్‌కు పాల్పడినట్లు విచారణలో నిర్ధారించారని విశ్వసనీయ వర్గాల సమాచారం. సదరు విద్యార్థులను సంవత్సరంపాటు సస్పెండ్ చేసేందుకు సిద్ధమవుతున్న తరుణంలో కేఎంసీ అధికారులపై ఒత్తిళ్లు మొదలైనట్లు తెలుస్తోంది. ఘటనపై అంతర్గత విచారణ చేస్తున్నామని, ర్యాగింగ్ జరిగినట్లు రుజువైతే ఆ విద్యార్థులపై చర్యలు తీసుకుంటామని ప్రిన్సిపాల్ తెలిపారు. -
వరంగల్: కాంగ్రెస్‌లో కుమ్ములాటలు.. ఎవరికి వారే.. యమునా తీరే
సాక్షి ప్రతినిధి, వరంగల్: కాంగ్రెస్ పార్టీలో ముఖ్యనాయకులు, నేతల తీరు మారడం లేదు. ‘ఎవరికీ వారే.. యమునా తీరే’లా ఉంది సీనియర్ల పరిస్థితి. టీపీసీసీ, క్రమశిక్షణ సంఘం దృష్టికి వెళ్లినా మార్పులేకపోగా.. రోజురోజుకూ వివాదాలు పెరుగుతున్నాయి. ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ కాంగ్రెస్‌లో కుమ్ములాటలు ముదిరి పాకాన పడుతున్నాయి. ఉమ్మడి వరంగల్ జిల్లాలోని పలు నియోజకవర్గాల్లో ఆ పార్టీలో అంతర్గత ప్రజాస్వామ్యం ఎక్కువై గొడవలకు దారి తీస్తోంది. వరంగల్ పశ్చిమ నియోజకవర్గంలో మొదలైన పరస్పర బహిష్కరణల ప్రకటనల పర్వం ఇప్పుడు జనగామ నియోజకవర్గం వరకు పాకింది. సుమారు తొమ్మిదేళ్లుగా అధికారానికి దూరంగా ఉంటున్నా.. పార్టీ కార్యక్రమాలపై సరిగా దృష్టి సారించని కొందరు.. అధిష్టానం సూచనలు, నిర్ణయాలను పెడచెవిన పెడుతున్నారు. వారిని కట్టడి చేయడంలో అధిష్టానం సైతం ఉదాసీనంగా వ్యవహరిస్తున్న నేపథ్యంలో ఆ పార్టీ నేతల మధ్య ఉన్న అంతర్గత విబేధాలు తారస్థాయికి చేరుతున్నాయి. కాంగ్రెస్‌లో హీటెక్కిన పాలిటిక్స్.. ● ములుగు నియోజకవర్గం మినహా మెజార్టీ అసెంబ్లీ నియోజకవర్గాల్లో గ్రూపు విబేధాలు రోజు రోజుకూ పెరుగుతున్నాయి. వర్ధన్నపేటలో నమిండ్ల శ్రీనివాస్ ఇన్చార్జ్గా వ్యవహరిస్తుండగా పార్లమెంట్ ఎన్నికల్లో వరంగల్ ఎంపీగా పోటీ చేసి ఓడిపోయిన దొమ్మాటి సాంబయ్య, మాజీ ఎంపీ సిరిసిల్ల రాజయ్యలు దృష్టి పెట్టినట్లు ఆ పార్టీ వర్గాల్లో ప్రచారం ఉంది. ● స్టేషన్‌ఘన్‌పూర్ విషయానికి వస్తే గతంలో అక్కడ పోటీ చేసిన సింగాపురం ఇందిర టికెట్ ఆశిస్తుండగా, దొమ్మాటి సాంబయ్య, సిరిసిల్ల రాజయ్యల పేర్లు కూడా వినిపిస్తున్నాయి. ● పరకాల, భూపాలపల్లిలనుంచి ఇనుగాల వెంకట్రాంరెడ్డి, గండ్ర సత్యనారాయణరావుల పేర్లుండగా. రెండో టికెట్ కోసం పరకాలపై కొండా సురేఖ దంపతులు చేస్తున్న ప్రయత్నాలు ఆగలేదన్న చర్చ ఉంది. దీంతో పరకాలలో ఇనుగాల వెంకట్రాంరెడ్డి, కొండా సురేఖ దంపతుల మధ్య గ్రూపుల వైరం సాగుతూనే ఉంది. ● మహబూబాబాద్ నుంచి మురళీనాయక్, బెల్లయ్యనాయక్, మాజీ కేంద్ర మంత్రి బలరాం నాయక్‌లు, డోర్నకల్ నుంచి రాంచంద్రనాయక్, నెహ్రునాయక్లు పోటాపోటీగా అధిష్టానంపై ఒత్తిడి చేస్తున్నట్లు ప్రచారం. ● పాలకుర్తి నుంచి గత ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయి ఇప్పుడక్కడ ససేమిరా అంటున్న జంగా రాఘవరెడ్డి.. వరంగల్ పశ్చిమ నియోజకవర్గం టికెట్ దాదాపుగా నాయిని రాజేందర్‌రెడ్డి ఖరారైనట్లేనన్న ప్రచారం జరుగుతున్నా తాను సైతం పోటీలో ఉంటానంటున్నారు. ● వరంగల్ తూర్పు, నర్సంపేటల నుంచి కొండా సురేఖ, దొంతి మాధవరెడ్డిల పేర్లుండగా, పాలకుర్తిలో ఎవరన్నది ఇంకా తేలడం లేదు. కొనసాగుతున్న బహిష్కరణల పర్వం.. వరంగల్ పశ్చిమ నియోజకవర్గంలో డీసీసీ అధ్యక్షుడు నాయిని రాజేందర్‌రెడ్డి, డీసీసీబీ మాజీ చైర్మన్ జంగా రాఘవరెడ్డిల నడుమ వైరం మొదలైంది. చినికి చినికి గాలివానగా మారిన రాజకీయవైరం టీపీసీసీ క్రమశిక్షణ కమిటీ వరకు వెళ్లింది. చివరకు ప్రెస్‌మీట్ ఏర్పాటు చేసిన నాయిని రాజేందర్‌రెడ్డి, డీసీసీబీ మాజీ చైర్మన్ జంగా రాఘవరెడ్డిని పార్టీనుంచి తొలగిస్తూ అధిష్టానానికి లేఖ రాశారు. ఆ మరుసటి రోజే పోటీగా మీడియా సమావేశం ఏర్పాటు చేసిన రాఘవరెడ్డి తనను బహిష్కరించే అధికారం నాయినికి లేదని కౌంటర్ ఇచ్చారు. టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి పాదయాత్ర సమయంలో ఈ వివాదం చోటుచేసుకోగా ఇటీవల సీఎల్పీ నేత భట్టి విక్రమార్క పీపుల్స్‌మార్చ్ సందర్భంగా పునరావృతం కాలేదు. దీంతో పరిస్థితి చక్కబడిందని భావిస్తున్న సమయంలో జనగామ కాంగ్రెస్‌లో కయ్యం మొదలైంది. పీసీసీ మాజీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్యయ్య వర్సెస్ మాజీ ఎమ్మెల్యే కొమ్మూరి ప్రతాపరెడ్డిల వర్గాల మధ్య విభేధాలు తారస్థాయికి చేరాయి. కొమ్మూరి ప్రతాపరెడ్డిని పార్టీనుంచి సస్పెండ్ చేస్తున్నట్లు గురువారం విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి జనగామ డీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ పేరిట ప్రకటన చేశారు. దీని వెనుక పొన్నాల లక్ష్మయ్య హస్తం ఉందని, అసలు డీసీసీ వర్కింగ్ కమిటే లేనప్పుడు సస్పెండ్ చేసే అధికారం ఎక్కడిదంటున్న కొమ్మూరి వర్గీయులు మరో ప్రెస్మీట్లో కౌంటర్ ఇచ్చారు. ఆ తర్వాత పొన్నాల లక్ష్మయ్య, కొమ్మూరి ప్రతాపరెడ్డిలు పోటాపోటీగా మీడియా సమావేశాల్లో ఘాటైన వ్యాఖ్యలు చేసుకున్నారు. శుక్రవారం జనగామ జిల్లా తరిగొప్పుల మండలం అబ్దుల్‌నాగారంలో భట్టి విక్రమార్క పాదయాత్రకు స్వాగతం పలికే సందర్భంగా ఇద్దరు నాయకులు, వారి అనుచరుల మధ్య ఘర్షణ చోటుచేసుకోగా పోలీసులు చెదరగొట్టారు. -
వరంగల్ ఎంజీఎంలో దారుణ పరిస్థితులు
-
EV Charging Points: దేశానికే ఆదర్శం.. హైదరాబాద్
రెండు నెలల క్రితం కిచెన్ రూమ్‌లో స్కూటర్ ఫోటో నెట్లో హల్చల్ చేసింది. బెంగళూరికి చెందిన ఓ ఐటీ ప్రొఫెషనల్ తన ఎలక్ట్రిక్ స్కూటర్ ఛార్జింగ్ పెట్టుకునేందుకు ఎక్కడా చోటు లేక కిచెన్‌కి తీసుకొచ్చాడు. ఒక్క బెంగళూరే కాదు అనేక నగరాల్లో ఇంచుమించు ఇదే పరిస్థితి. కానీ ఈ తరహా పరిస్థితి తలెత్తకుండా జాగ్రత్త పడుతోంది హైదరాబాద్. ముందుగానే హ్యాపెనింగ్ సిటీ పేరు తెచ్చుకున్న హైదరాబాద్ ట్రెండ్‌కి తగ్గట్టుగా మారడంలో ఇతర నగరాల కంటే ముందు వరుసలో ఉన్నారు ఇక్కడి ప్రజలు. ఎలక్ట్రిక్ వాహనాలు వాడాలంటూ ప్రభుత్వం చెబుతున్న సూచనలకు తగ్గట్టుగా రెడీ అవుతున్నారు. తమ అపార్ట్మెంట్లలో ఎలక్ట్రిక్ వాహనాల ఛార్జింగ్ పాయింట్లు ఏర్పాటు చేయాలంటూ విద్యుత్ శాఖను సంప్రదిస్తున్నారు. గేటెట్‌లో ఛార్జింగ్ స్టేషన్లు నగరంలో పలు అపార్ట్మెంట్లు ఇప్పటికే ఎలక్ట్రిక్ ఛార్జింగ్ పాయింట్లు ఏర్పాటు చేస్తున్నాయి. ఇక నగరంలో ప్రముఖ గేటెడ్ కమ్యూనిటీగా ఉన్న మైహోం గ్రూప్‌కి చెందిన భుజా, అవతార్లలో ఇప్పటికే ఈవీ ఛార్జింగ్ స్టేషన్లు ఏర్పాటు చేశారు. ఇక్కడ ఒక యూనిట్ కరెంటుకి రూ. 6.50 వంతున ఛార్జ్ చేస్తున్నారు. ఇదే బాటలో ఉన్నాయి ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న మరిన్ని అపార్ట్మెంట్లు, గేటెడ్ కమ్యూనిటీస్. మధ్యలో అంటే కష్టం ఇక ఇప్పటికే నిర్మాణం పూర్తి చేసుకున్న అపార్ట్మెంట్లలో కొత్తగా ఛార్జింగ్ స్టేషన్ల నిర్మాణం చేపట్టడం కష్టంగా మారింది. దీంతో ఈవీ వెహికల్స కోసం కొత్తగా పవర్ అవుట్లెట్లను ఇస్తున్నారు. వీటికే ప్రత్యేకంగా మీటర్లు కేటాయిస్తున్నారు. సదరు ఆపార్ట్‌మెంట్‌లో ఈవీలు ఉపయోగించేవారు వీటి బాధ్యతలను తీసుకుంటున్నారు. ‘పెరుగుతున్న పెట్రోలు ధరలతో ఎలక్ట్రిక్ వెహికల్స్ కొనేవారి సంఖ్య ఒక్కసారిగా ఊపందుకుంది. కానీ మా అపార్ట్మెంట్లో ఈవీ ఛార్జింగ్ స్టేషన్ నిర్మించే స్థలం లేదు. అందుకే పార్కింగ్ ఏరియాలోనే పవర్ అవుట్లెట్లు ఏర్పాటు చేశాం’ అని గచ్చిబౌలికి చెందని ఓ ఆపార్ట్మెంట్ సోసైటీ సభ్యులు తెలిపారు. ఇతర ప్రాంతాల్లో ఈవీ వెహికల్స్‌కి హెడ్‌క్వార్టర్స్‌గా పేరొందిన బెంగళూరులో ఛార్జింగ్ స్టేషన్ల సమస్య ఎక్కువగా ఉంది. అక్కడ అపార్ట్మెంట్ సోసైటీలు, ఈవీ వెహికల్స్ యజమానులకు మధ్య తరుచుగా ఈ విషయంపై వాగ్వాదాలు చోటు చేసుకుంటున్నాయి. ఈ విషయంలపై అక్కడ స్థానిక కోర్టుల్లో కేసులు సైతం నడుస్తున్నాయి. బెంగళూరుతో పాటు ముంబై, ఢిల్లీలలోనూ ఈ తరహా సమస్యలు వస్తున్నాయి. అలాంటి పరిస్థితి రాకముందే హైదరాబాద్‌లో అపార్ట్మెంట్లు క్రమంగా ఈవీ వెహికల్స్ తగ్గట్టుగా మారుతున్నాయి. ముఖ్యంగా ఐటీ సంస్థలు ఎక్కువగా ఉండే నగర పశ్చిమ ప్రాంతంలో ఈ మార్పు వేగంగా చోటు చేసుకుంటోంది. వరంగల్, కరీంనగర్ ఎలక్ట్రిక్ వాహనాల వాడకాన్ని ప్రోత్సహించేందుకు ఇప్పటికే రిజిస్ట్రేషన్, రోడ్ ట్యాక్స్‌ల నుంచి తెలంగాణ ప్రభుత్వం మినహాయింపులు ఇచ్చింది. నగరంలో ఉన్న ఐటీ కంపెనీల్లో ఛార్జింగ్ స్టేషన్ల ఏర్పాటుకు కసరత్తు ప్రారంభించింది. వీటితో పాటు రాష్ట్ర వ్యాప్తంగా 140 పబ్లిక్ ఎలక్ట్రిక్ ఛార్జింగ్ స్టేషన్లు నిర్మించేందుకు టెండర్లు పిలిచింది తెలంగాణ ప్రభుత్వం. ఇందులో 120 ఛార్జింగ్ స్టేషన్లు హైదరాబాద్‌లో రానుండగా, కరీంనగర్, వరంగల్ నగరాల్లో 10 వంతున ఈవీ ఛార్జింగ్ స్టేషన్లు ఏర్పాటు చేయనున్నారు. -
సీ4సీ చాలెంజ్‌కు 2 నగరాలు ఎంపిక
సాక్షి, హైదరాబాద్: సైకిల్ ఫర్ ఛేంజ్(సీ4సీ) చాలెంజ్ కార్యక్రమం స్టేజీ–1 కింద హైదరాబాద్, వరంగల్ నగరాలు సహా దేశంలోని 25 నగరాలు, పట్టణాలను కేంద్ర ప్రభుత్వం ఎంపిక చేసింది. నగరాలు, పట్టణాల్లో సైక్లింగ్‌ను ప్రోత్సహించడానికి కేంద్ర గృహ, పట్టణాభివృద్ధి శాఖ ఆధ్వర్యంలోని స్మార్ట్ సిటీస్ మిషన్ సీ4సీ చాలెంజ్‌కు శ్రీకారం చుట్టింది. కోవిడ్–19 మహమ్మారి నేపథ్యంలో ప్రజారోగ్యానికి మేలు చేయడానికి సైక్లింగ్‌ను ప్రోత్సహించాలని, దీని వల్ల నగరాల్లో కాలుష్యం సైతం తగ్గుతుందని ఈ నిర్ణయం తీసుకుంది. దేశ వ్యాప్తంగా ఉన్న 107 నగరాలు ‘సీ4సీ’చాలెంజ్‌కు రిజిస్ట్రర్ కాగా, తొలి విడత కింద ఎంపిక చేసిన 25 నగరాల పేర్లను కేంద్ర పట్టణాభివృద్ధి మంత్రిత్వ శాఖ గురువారం ప్రకటించింది. రాష్ట్ర పురపాలక శాఖ ఈ చాలెంజ్‌ను ప్రతిష్టాత్మకంగా తీసుకుని ప్రత్యేకంగా సైక్లింగ్ ట్రాక్‌లను ఏర్పాటు చేయ డంతో హైదరాబాద్, వరంగల్ నగరాల ఎంపికకు దోహదపడింది. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్(జీహెచ్ఎంసీ) పరిధిలో ఈ కార్యక్ర మానికి హెచ్ఎండీఏ, హైదరాబాద్ యూనిఫైడ్ మెట్రోపాలిటన్ ట్రాన్స్పోర్ట్ అథారిటీ (హుమ్టా)లు సాంకేతిక సహాయం అందిస్తున్నాయి. పోలీసు శాఖ సహకారంతో ఇప్పటికే కేబీఆర్పార్క్, నెక్లెస్ రోడ్డులో సైక్లింగ్ ట్రాక్‌లు ఏర్పాటు చేశారు. ట్రాఫిక్ లేని విధులు, సైకిల్ అద్దె సదుపాయాలు, సైక్లింగ్ ట్రైనింగ్ వంటి కార్యక్రమాలను సీ4సీ కింద ఎంపికైన నగరాల్లో అమలు చేయనున్నారు. ఈ 25 నగరాల్లో ఏడు నగరాలను స్టేజీ–2 కింద ఎంపిక చేసి కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ త్వరలో ప్రకటించనుంది. స్టేజీ–2 కింద ఎంపికైన ఏడు నగరాల్లో సైక్లింగ్ మౌలిక సదుపాయాల కల్పనకు రూ.కోటి చొప్పున మంజూరు చేయనుంది. నర్చరింగ్ నెబర్హుడ్ చాలెంజ్‌కు హైదరాబాద్, వరంగల్ ఎంపిక పట్టణ ప్రాంతంలో 0–5 ఏళ్ల బాలబాలికలకు సురక్షితమైన, మెరుగైన సదుపాయాలు కలిగిన పరిసరాలను అందించడమే లక్ష్యంగా కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ ‘నర్చరింగ్ నెబర్ హుడ్’ చాలెంజ్ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. దీని కింద హైదరాబాద్, వరంగల్ నగరాలుసహా దేశంలోని మొత్తం 25 నగరాలు, పట్టణాలు ఎంపికయ్యాయి. 63 నగరాలు ఈ చాలెంజ్‌లో పోటీపడ్డాయి. తొలి విడత కింద ఎంపికైన 25 నగరాలకు 6 నెలలపాటు చాలెంజ్ అమలుకు అవసరమైన సాంకేతిక సహకారాన్ని అందించనున్నారు. ఈ నగరాల్లోని టాప్ 10 నగరాలకు 2 ఏళ్లపాటు సాంకేతిక సహకారాన్ని కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ అందించనుంది. -
పోలీసులకు బాడీ వార్న్ కెమెరాలు
సాక్షి, మహబూబాబాద్: ఎక్కడ ఏ నేరం జరిగినా నిందితులను పట్టుకునేందుకు సీసీ కెమెరాల పుటేజీపై ఆధారపడిన పోలీసుల చేతికి ఇప్పుడు మరో ఆయుధం వచ్చింది. ఈ మేరకు సిబ్బంది శరీరాని(చొక్కా)కి అమర్చే కెమెరాలు అందుబాటులోకి వచ్చాయి. మహబూబాబాద్ జిల్లా కేంద్రం బేతోలు శివారులో మంగళవారం బాడీ వార్న్ కెమెరాలను ఎస్పీ నంద్యాల కోటిరెడ్డి ప్రారంభించి మాట్లాడారు. ఎక్కడైనా వాహనదారులు నిబంధనలు ఉల్లంఘించినా, వారి నుంచి సిబ్బంది డబ్బు తీసుకున్నా ఈ బాడీ కెమెరాల ద్వారా ఉన్నత అధికారులకు సమాచారం చేరుతుందని తెలిపారు. ఎప్పటికప్పుడు సెంట్రల్ సర్వర్‌కు వీడియో చిత్రాలు అందించే ఈ ఆధునిక కెమెరాలను ఉపయోగపడుతాయని చెప్పారు. ఏమిటీ కెమెరా.. ఎలా పనిచేస్తుంది? ఇప్పటి వరకు సీసీ కెమెరాలు, పెన్ కెమెరాల పేర్లు మాత్రమే మనం విన్నాం. బాడీ వార్న్ కెమెరాలంటే విధి నిర్వహణలో ఉన్న పోలీసు తన ఒంటికి ఓ ఆధునిక కెమెరాలను పెట్టుకుని ఉంటాడు. బాడీ వార్న్ కెమెరాను ధరించిన పోలీసు నిల్చున్న ప్రాంతంలో ఎక్కడెక్కడ ఏం జరుగుతుంది? ఏ వాహనదారుడు ఏ రూట్లో వెళ్లాలి? అందుకు విరుద్ధంగా ఎక్కడ వెళ్తున్నాడు? అక్రమ పార్కింగ్ ఎక్కడెక్కడ జరుగుతోంది? అన్న పూర్తి వివరాలను వీడియో చిత్రీకరించి, సెంట్రల్ సర్వర్‌కు పంపుతుంది. ఈ ఆడియో, వీడియోలను ఎప్పటికప్పుడు సంబంధిత పోలీసు స్టేషన్, ట్రాఫిక్ కంట్రోల్ రూంకు చేరడంతో సెంట్రల్ సర్వర్‌లో డేటా భద్రంగా ఉంటుంది. మెయిన్ సర్వర్‌లో ఈ డేటాను తొలగించడం ఎవరికి సాధ్యపడదు. అంతేకాకుండా సిబ్బంది ఎక్కడ, ఎలా పనిచేస్తున్నారన్నది కూడా ఉన్నతాధికారులు తెలుసుకోవచ్చు. కేవలం 140 గ్రాముల బరువుతో ఉన్న ఈ కెమెరా ఇంటర్నల్ 8 జీబీ, ఎక్స్టర్నల్ 32 జీబీతో మొత్తం 40 జీబీ సామర్థ్యంతో, ఎనిమిది గంటల బ్యాకప్ బ్యాటరీ, హెచ్డీ క్వాలిటీతో వీడియోను చిత్రీకరించడం బాడీ వార్న్ కెమెరాల ప్రత్యేకతలు. కాగా, బాడీ కెమెరాల ప్రారంభ కార్యక్రమంలో ఏఆర్ డీఎస్పీలు రేల జనార్దన్‌రెడ్డి, శశిధర్, టౌన్ సీఐ సుంకరి రవికుమార్, డీసీఆర్బీ సీఐ రమేష్‌కుమార్, ఐటీకోర్ సీఐ బి.రాజయ్య, టౌన్, ట్రాఫిక్ ఎస్సైలు సీహెచ్.అరుణ్‌కుమార్, సిరిసిల్ల అశోక్‌కుమార్, టౌన్, ట్రాఫిక్ సిబ్బంది పాల్గొన్నారు. -
ఇచ్చారు.. తీసుకున్నారు..!
సాక్షి, మహబూబాబాద్ రూరల్: మహబూబాబాద్ జిల్లాలోని కేసముద్రం మండలం తాళ్లపూసపల్లి గ్రామంలో గురువారం స్థానిక పోస్టాఫీసు వద్ద ఆసరా పింఛన్ లబ్ధిదారులకు డబ్బులు చెల్లించారు. ఆ వెంటనే పోస్టాఫీసు పక్కనే గ్రామ పంచాయతీ ఉద్యోగి ఒకరు కూర్చొని గ్రామ పంచాయతీ పన్నులను వసూలు చేశారు. రాష్ట్ర ప్రభుత్వం పింఛన్లు ఇచ్చే సమయంలో ఎలాంటి పన్నులు వసూలు చేయొద్దని గతంలోనే స్పష్టమైన ఆదేశాలు జారీచేసింది. అయినప్పటికీ గ్రామ పంచాయతీ అధికారులు అందుకు విరుద్ధంగా ఇలా పన్నులు వసూలు చేయడం గమనార్హం. -
అరణ్యంలో.. అగ్గి
సాక్షి, భూపాల్పల్లి: వేసవి ఇలా ప్రారంభమైందో లేదో అప్పుడే అడవిలో మంటలు చెలరేగుతున్నాయి. గురువారం ములుగు జిల్లా తాడ్వాయి మండలంలోని గంగారం, తాడ్వాయి అడవుల్లో నిప్పు రగులుకుని వృక్షాలు, జీవరాసులు దగ్ధమయ్యాయి. మంటలు అలాగే కొనసాగుతున్నాయి. తాడ్వాయి నుంచి గంగారం, పస్రా నుంచి తాడ్వాయి, ఏటూరునాగారం వరకు ఉన్న అడవుల్లో మంటలు చెలరేగినట్లు స్థానికులు తెలిపారు. పశువుల కాపరులు చుట్ట, బీడీలు కాల్చిన అగ్గిపుల్లను అడవుల్లో వేయడం వల్లే ఇలాంటి సంఘటనలు జరుగుతున్నట్లు ప్రజలు చెబుతున్నారు. ఉడుములు, పాములు, కుందేళ్లు మంటల్లో కాలి బూడిదైనట్లు జంతు ప్రేమికులు వెల్లడించారు. అలాగే వన్య ప్రాణులైన జింకలు, దుప్పులు, మేకలు, కనుజులు, కొండముచ్చులు, తదితర జంతువులు మంటల వేడికి, పొగకు తట్టుకోలేక పరుగులు పెట్టి దాహానికి అలమటించాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. వేసవిలో అడవుల సంరక్షణ కోసం అటవీశాఖ అధికారులు నిప్పు నివారణకు ఫైర్ లైన్లు ఏర్పాటు చేసినా ఫలితం లేకుండాపోతుంది. -
నేడు జిల్లాకు కేటీఆర్
సాక్షి, వరంగల్: టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా ఎన్నికై సిరిసిల్ల ఎమ్మెల్యే కే. తారక రామారావు మొదటి సారిగా నేడు ఉమ్మడి జిల్లాలో పర్యటించనున్నారు. కేటీఆర్ రాకతో పార్టీ శ్రేణుల్లో సందడి నెలకొంది. దీంతో హనుమకొండ, జనగామలో కార్యకర్తల సమావేశాలు నిర్వహించి కార్యకర్తలు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. కేటీఆర్ జిల్లాలో పర్యటనలో భాగంగాముందుగా హనుమకొండ బాలసముద్రంలో టిఆర్ఎస్ జిల్లా పార్టీ కార్యాలయానికి శంకుస్థాపన చేస్తారు. అనంతరం వరంగల్ అర్బన్, రూరల్ జిల్లాల ముఖ్య కార్యకర్తలతో కేడీసీ కాలేజీలో జరగనున్న భారీ బహిరంగా సభలో పాల్గొని ప్రసంగిస్తారు. పెంబర్తి నుంచి వరంగల్ వరకు కేటీఆర్‌కు ఘనంగా స్వాగతం పలకడానికి భారీ ఏర్పాట్లు చేస్తున్న పార్టీ శ్రేణులు. మడికొండ నుండి భారీ బైక్ ర్యాలీతో స్వాగతం కోసం ఏర్పాట్లు చేస్తున్నపార్టీ కార్యకర్తరలు. -
వరగల్ వెస్ట్ టికెట్ నాకే ఇవ్వాలని కోరా ; నాయిని రాజేంద్రర్రెడ్డి
-
చట్టాలు.. శిక్షలు
సాక్షి, వరంగల్:ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రభుత్వాన్ని ఎన్నుకోవడానికి ఎన్నికలే ప్రధాన భూమిక. ఈ ఎన్నికల నియమావళిని రూపొందించి పకడ్బందీగా అమలు చేయడానికి ఎన్నికల కమిషన్ పనిచేస్తుంది. ఎన్నికల నియమావళిని ఎవరు అతిక్రమించినా చట్టం తన పని తాను చేస్తుంది. ఎన్నికల సమయంలో ప్రజాప్రాతినిథ్య చట్టంలోని నిబంధనల ప్రకారం ఎక్కువగా కేసులు నమోదు చేస్తుంటారు. ఈ చట్టంలో అనేక సెక్షన్లు ఉన్నప్పటికీ ఎక్కువగా ఎన్నికల సమయంలో కొన్నింటిని ఎక్కువగా నిబంధనలు అతిక్రమించిన పార్టీలు, వ్యక్తులపైన ప్రయోగిస్తుంటారు. ఇటీవల ఓ స్వచ్ఛంద సంస్థ వీటిని కరపత్రం రూపంలో ముద్రించగా అర్బన్ జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్‌పాటిల్ దానిని విడుదల చేశారు. ఆ చట్టాలేంటో ...వాటికేసే శిక్షలేంటో...ఓసారి పరిశీలిద్దాం.. 123 - ఆర్పీ యాక్ట్ లంచగొండితనం, అనుచిత ఒత్తిడి, మతం, జాతి, కులం, సంఘం లేదా భాషా ప్రాతిపాదికపై వర్గాల పౌరుల మధ్య ద్వేషాన్ని çశత్రుత్వాన్ని పెంపొందించుట లేక ప్రయతించుట శిక్షకు అర్హులు. 125 - ఆర్పీ యాక్ట్ ఎన్నికల సందర్భంగా వివిధ వర్గాల మధ్య శత్రుత్వాన్ని పెంపొందించినట్లయితే మూడు సంవత్సరాలు జైలు శిక్ష లేదా జరిమానా లేదా రెండూ అమలు చేయొచ్చు. 125అ - ఆర్పీ యాక్ట్ తప్పుడు సమాచారం ఇచ్చినందుకు ఆరు నెలల జైలు శిక్ష లేదా జరిమానా లేదా రెండూ అమలుకు అర్హులు. 126 - ఆర్పీ యాక్ట్ ఎన్నికల సమయానికి 48 గంటల ముందు బహిరంగంగా సభలు నిర్వహించినా శిక్ష అర్హులే. అందుకు రెండు సంవత్సరాల జైలు శిక్ష లేదా జరిమానా లేదా రెండూ అమలు చేయొచ్చు. 127 - ఆర్పీ యాక్ట్ ఎన్నికల సమావేశం సందర్భంగా ఎటువంటి అల్లర్లు జరిపినా ఏ పోలీస్ అధికారి అయినా యూఎస్ 42 సీఆర్పీసీ ప్రకారం ఆ వ్యక్తులను అరెస్ట్ చేయొచ్చు. అందుకు ఆరు నెలల జైలు శిక్ష లేదా రెండు వేల జరిమానా లేదా రెండూ అమలు చేయొచ్చు. 127అ - ఆర్పీ యాక్ట్ ఎవరైనా తన పేరు, చిరునామా లేకుండా ఎన్నికల కరపత్రాలు, పోస్టర్లు ముద్రిస్తే ఆరు నెలల జైలు శిక్ష లేదా రెండు వేల రూపాయల జరిమానా లేదా రెండూ అమలు చేయొచ్చు. 128 - ఆర్పీ యాక్ట్ బహిరంగంగా ఓటేస్తే 3 నెలల జైలు లేదా జరిమానా లేదా రెండూ అమలుకు అవకాశం. 129 - ఆర్పీ యాక్ట్ ఎన్నికలకు సంబంధించిన అధికారులు లేదా పోలీసులు పోటీచేసే అభ్యర్థికి సహకరించిన లేదా ప్రభావం కలిగించుట శిక్షా అర్హులు. అందుకు మూడు నెలల జైలు లేదా జరిమానా లేదా రెండూ అమలు చేయొచ్చు. 130 - ఆర్పీ యాక్ట్ పోలింగ్ స్టేషన్‌కు 100 మీటర్ల లోపల ప్రచారం చేయకూడదు. ఒక వేళ ప్రచారం చేస్తే రూ.250 జరిమానా విధిస్తారు. 131 - ఆర్పీ యాక్ట్ పోలింగ్ స్టేషన్‌కు దగ్గరలో నియమాలకు వ్యతిరేకంగా ఎటువంటి ప్రచారం చేసినా ఏ పోలీస్ అధికారి అయినా ఆ సామగ్రిని స్వాధీనం చేసుకోవచ్చు. అందుకు మూడు నెలల జైలు లేదా జరిమానా లేదా రెండూ అమలు చేయొచ్చు. 132 - ఆర్పీ యాక్ట్ ఓటేసే సమయంలో నియమ నిబంధనలు పాటించని వారికి మూడు నెలల జైలు శిక్ష లేదా జరిమానా లేదా రెండూ అమలు చేయొచ్చు. 133 - ఆర్పీ యాక్ట్ ఎన్నికల సందర్భంగా ప్రజలకు పోలింగ్ బూత్ వద్దకు చేరవేసేందుకు అక్రమంగా వాహనాలు సమకూర్చుకొనుట లేదా అద్దెకు తీసుకొనుట శిక్షార్హులు. అందుకు మూడు నెలల జైలు శిక్షా లేదా జరిమానా లేదా రెండూ అమలు చేయొచ్చు. 134 - ఆర్పీ యాక్ట్ ఎన్నికల సందర్భంగా అధికార దుర్వినియోగం చేస్తే శిక్షా అర్హులే. అందుకు రూ.500 వరకు జరిమానా వేయవచ్చు. 134అ - ఆర్పీ యాక్ట్ ప్రభుత్వ ఉద్యోగి ఎన్నికల ఏజెంట్‌గా గానీ, పోలింగ్ ఏజెంట్‌గా గానీ లేదా ఓట్ల లెక్కింపు సందర్భంగా ఏజెంట్‌గా వ్యవహరించినా శిక్షకు అర్హులు. అందుకు మూడు నెలల జైలు శిక్ష లేదా జరిమానా లేదా రెండూ అమలు చేయొచ్చు. 134ఆ - ఆర్పీ యాక్ట్ పోలింగ్ స్టేషన్ పరిసర ప్రాంతాలకు మార ణాయుధాలు కలిగి వెల్లుట నిషేధం.అతిక్రమించి వెళితే రెండు నెలల జైలు శిక్షా లేదా జరిమానా లేదా రెండూ అమలు చేయొచ్చు. 135 - ఆర్పీ యాక్ట్ పోలింగ్ స్టేషన్ నుంచి బ్యాలెట్ పత్రం (ఈవీఎం) అపహరించినా శిక్ష పడుతుంది. సంవత్సరం జైలు శిక్ష లేదా రూ.500 జరిమానా లేదా రెండూ అమలు చేయొచ్చు. 135అ - ఆర్పీ యాక్ట్ పోలింగ్ బూత్ స్వాధీన పరుచుట, ప్రభుత్వ ఉద్యోగి అయి ఉండి ఈ నేరం చేస్తే శిక్ష పడుతుంది. అందుకు సంవత్సరం తగ్గకుండా ఐదేళ్ల వరకు జైలు శిక్ష లేదా రూ.500 జరిమానా లేదా రెండూ అమలుచేయొచ్చు. 135ఆ - ఆర్పీ యాక్ట్ ప్రభుత్వ ఉద్యోగులకు ఎన్నికల రోజు వేతనపు సెలవుగా మంజూరు చేసినా శిక్ష. అందుకు ఐదు వేల రూపాయల వరకు జరిమానా విధించవచ్చు. 135ఇ - ఆర్పీ యాక్ట్ పోలింగ్ రోజు, కౌంటింగ్ రోజు మద్యం అమ్ముట, పంచిపెట్టుట నేరం. అందుకు ఆరు నెలల జైలు శిక్ష లేదా రెండు వేల రూపాయల వరకు జరిమానా లేదా రెండూ అమలు చేయొచ్చు. -
లారీల సమ్మె ఉధృతం
ఖిలా వరంగల్: తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ లారీ యనమానులు చేపట్టిన సమ్మె ఆదివారం నాటికి మూడో రోజుకు చేరుకుంది. ఆలిండియా, తెలంగాణ లారీ ఓనర్స్ అసోసియేషన్ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు వరంగల్ జిల్లా, వరంగల్ లోకల్, ఓరుగల్లు లోకల్ లారీ ఓనర్స్ అసోసియేషన్ల సంయుక్త ఆధ్వర్యంలో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా సమ్మె ఉధృతం చేశారు. దీంతో ఎక్కడి వాహనాలు అక్కడే నిలిచిపోయాయి. నిత్యావసరాల సరుకుల తప్పా సిమెంట్, ఐరన్, బొగ్గు, ఎరువులు, వ్యవసాయ ఉత్పత్తులు, ఇతర సరుకుల రవాణా నిలిచిపోయింది. జిల్లాలో 3వేల లారీలు నిలిచిపోగా ఇతర రాష్ట్రాలకు చెందిన సుమారు 4 వేల లారీలు సరుకులతోనే రహదారులపై నిలిచిపోయాయి. తరచూ పన్నులను పెంచుతున్న కారణంగా వాహనాలను నడపలేని పరిస్థితి ఏర్పడిందని ఆవేదనను వ్యక్తం చేస్తున్నారు. పలు చోట్ల రాస్తారోకోలు.. వరంగల్ లోకల్ లారీ అసోసియేషన్ అధ్యక్షుడు వేముల భూపాల్ ఆధ్వర్యంలో ఆదివారం పలు చోట్ల «రాస్తారోకోలు, ధర్నాలు, భిక్షాటన కార్యక్రమాలు చేపట్టారు. నర్సంపేట, ములుగురోడ్డు, కరీంనగర్, హైదరాబాద్, ఖమ్మం ప్రధాన రహదారుల్లో జిల్లా మీదుగా వెళ్తున్న వివి«ధ రాష్ట్రాల లారీలను అడ్డుకుని ఖాళీ స్థలాలకు తరలిస్తున్నారు. విషయం తెలుసుకున్న ఇంతేజార్ గంజ్ పోలీసులు లారీల పార్కింగ్ స్థలానికి చేరుకుని నిలిచిపోయిన లారీలను పంపించి వేముల భూపాల్‌తోపాటు మధుసూదన్‌రావును అరెస్టు చేసి, సొంతపూచి కత్తుపై విడుదల చేశారు. కాగా ఆందోళనలను తీవ్ర తరం చేస్తామని రాష్ట్ర వర్కింగ్ కమిటీ మెంబర్ జె. మధుసూదన్‌రావు తెలిపారు. వరంగల్ లోకల్ లారీ అసోసియేషన్ ప్రధాన కార్యాలయంలో అధ్యక్షుడు వేముల భూపాల్ ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. కలెక్టర్ స్పందించి అసోసియేషన్ బాధ్యులను చర్చలకు ఆహ్వానించి తమ సమస్యలను పరిష్కరించాలని, లేదంటే ని త్యావసర సరుకులను సైతం అడ్డుకుంటామన్నారు. సమస్యలుపరిష్కరించే వరకు కొనసాగిస్తా మని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో లారీ ఓనర్లు మోహన్, శ్రీహరి, సతీష్, రాజు, ముంతా జ్, ఉస్సేన్, రాజీరెడ్డి పాల్గొన్నారు. -
తెలంగాణ భాషను నిలిపేదే జానపద సాహిత్యం
డాక్టర్ భాస్కరయోగి హన్మకొండ కల్చరల్ : తెలంగాణ భాష, యాసను మహోన్నతంగా నిలిపేదే జానపద సాహిత్యమని హైదరాబాద్‌కు చెందిన డాక్టర్ పి.భాస్కరయోగి అన్నారు. వరంగల్‌లోని పోతన విజ్ఞానపీఠంలో శనివారం సాయంత్రం తెలంగాణ జానపద సాహిత్యంపై ప్రసంగం జరిగింది. నమిలికొండ నారాయణరావు స్మారకోపన్యాసంలో భాగంగా ఏర్పాటు చేసిన కార్యక్రమానికి పోతన విజ్ఞానపీఠం కార్యదర్శి నమిలికొండ బాలకిషన్‌రావు అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా భా స్కరయోగి మాట్లాడుతూ తెలంగాణ ప్రాంత అస్థిత్వాన్ని, సహజత్వాన్ని తెలిపేదే తెలంగాణ జానపద సాహిత్యమన్నారు. ఇక్కడి జానపదుల జనజీవనం, ఆచారాలు, పండుగలు, ఉత్సవాలు, నమ్మకాలు, శ్రామికజీవనం, కుటుంబవ్యవస్థ అన్నీ వారికి వస్తువులని తెలిపారు. తెలంగాణ జనజీవన lసంస్కృతి ఈ సాహిత్యంలో ప్రతిబింబిస్తుందన్నారు. ఇలాంటి సాహిత్యాన్ని భావితరాలకు అందించాలని కోరారు. అనంతరం దూపకుంట కాకతీయ కళాసమితి ఆధ్వర్యంలో జానపద గీతాలాపన నిర్వహించారు. కార్యక్రమంలో సాహితీవేత్త గన్నమరాజు గిరిజామనోహర్‌బాబు, కేయూ తెలుగుశాఖ ఆచార్య బన్న అయిలయ్య, నాగిళ్ల రామశాస్త్రి, ఆచార్య ఎంవీ రంగారావు, వరిగొండ కాంతారావు, వీఆర్ విద్యార్థి, పల్లె నాగేశ్వర్రావు, పోతన విజ్ఞానపీఠం మేనేజర్ జేఎన్ శర్మ, కుందావజ్జుల కృష్ణమూర్తి, మారేడోజు సదానందచారి, మల్లికార్జున్, పాంచాలరాయ్, వీరాచారి, రఘురామయ్య, గోకులరాణి, బాలాజీ, శ్రీనివాసాచారి పాల్గొన్నారు. -
ఏఎన్ఆర్ లేరు.. జ్ఞాపకాలు ఉన్నాయ్..
పాకాల, రామప్పలో షూటింగ్‌కు వచ్చిన అక్కినేని వరద బాధితుల సహాయార్థం విరాళాల సేకరణకు కూడా.. నాగేశ్వర్రావు మృతితో విషాదంలో అభిమానులు నాగేశ్వర్రావు బుధవారం తెల్లవారుజామున అనారోగ్యంతో కన్నుమూయడాన్ని జిల్లా ప్రజలు జీర్ణించుకోలేకపోతున్నారు. ఏఎన్ఆర్తో ఉన్న అనుబంధాన్ని ఆయన అభిమానులు గుర్తుచేసుకుంటున్నారు. పోచమ్మమైదాన్ / హన్మకొండ కల్చరల్, న్యూస్‌లైన్ : నటసామ్రాట్ డాక్టర్ అక్కినేని నాగేశ్వర్రావు మృతి చెందిన విషయం తెలియగానే జిల్లాలోని ఆయన అభిమానుల్లో విషాదం నెలకొంది. బుధవారం తెల్లవారుజాము నుంచే టీవీల్లో స్క్రోలింగ్ రావడంతో అభిమానులు టీవీలకు అతుక్కుపోయారు. అలాగే, చాలా మంది హుటాహుటీన అక్కినేని పార్థివ దేహాన్ని చూసేందుకు హైదరాబాద్ బయలుదేరారు. ఈ సందర్భంగా పలువురు ‘న్యూస్‌లైన్’తో మాట్లాడుతూ నాగేశ్వర్రావుతో తమ అనుబంధం, జిల్లాకు వచ్చినప్పటి జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు. వరంగల్‌లో ఏఎన్ఆర్ గుర్తులు.. వరంగల్‌లోని సుశీల్(అప్పటి నవీన్), న టరాజ్(అప్పటి దుర్గ కళామందిర్) సినిమా థియేటర్ ప్రారంభోత్సవానికి ఏఎన్ఆర్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. రోజులు మారాయి సినిమా 100 రోజులు ప్రదర్శించిన సందర్భగా సునీల్ (అప్పటి రాజేశ్వరి) థియేటర్లో జరిగిన ఉత్సవాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆజంజాహి మిల్లు గ్రౌండ్ నుంచి సునీల్ థియేటర్ వరకు ఎండ్ల బండ్లతో ఊరేగింపు నిర్వహించారు. ఇదే కార్యక్రమంలో అభిమాన సంఘం అధ్యక్షుడు పోలెపాక మాణిక్యం తాను రూపొందించిన కళాతపస్వి అనే సావనీర్‌ను ఏఎన్ఆర్కు బహూకరించారు. దివిసీమ ఉప్పెన వరద బాధితులను ఆదుకునేందుకు ఎన్ఐటీ(అప్పటి ఆర్ఈసీ)లో ఓ సాంస్కృతిక కార్యక్రమంలో ఎన్టీఆర్‌తో కలిసి పాల్గొన్న ఏఎన్ఆర్ నగరంలో జోలెతో తిరుగుతూ విరాళాలు సేకరించారు. కేయూలో విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమంతో పాటు ఆర్ట్స్ కళాశాలలో జరిగిన కార్యక్రమాల్లో పాల్గొన్నారు. సినిమా చిత్రీకరణలు అక్కినేని నాగేశ్వర్రావు నటించిన పలు సినిమాల షూటింగ్ వరంగల్‌లో జరిగింది. నర్సంపేట సమీపంలోని పాకాల చెరువు వద్ద చక్రధర్ సినిమాలోని సంతలో కుండలు అమ్మే సన్నివేశంతో పాటు ఓ ఫైట్‌ను చిత్రీకరించారు. అలాగే, 1966లో ఆదుర్తి సుబ్బారావు దర్శకత్వంలో ఆత్మగౌరవం సినిమా షూటింగ్‌ను రామప్పలో చిత్రీకరించగా, నాగేశ్వర్రావు హాజరయ్యారు. ఈ సందర్భంగా పద్మశ్రీ నేరెళ్ల వేణుమాధవ్ వరంగల్ వాసేనని తెలుసుకుని ఓరోజు షూటింగ్ పూర్తయ్యాక అర్ధరాత్రి వెళ్లి కలిశారు. 1968లో అభిమాన సంఘం ఏర్పాటు... వరంగల్‌కు చెందిన పలువురు 1968లో ఏఎన్ఆర్ ఆర్ట్స్ అసోసియేషన్ పేరిట అభిమాన సంఘాన్ని ఏర్పాటు చేశారు. తొలుత సినిమాల విడుదల సందర్భంగా సంబరాలు నిర్వహించగా, ఏఎన్ఆర్ సూచన మేరకు సేవా కార్యక్రమాలు చేపట్టేవారు. ప్రతీ పుట్టిన రోజు వేడుకలకు వరంగల్ అభిమానులను హైదరాబాద్ పిలిచే అక్కినేని.. 2012లో అన్నపూర్ణ స్టూడియోలో ఏర్పాటుచేసిన గెట్ టూ గెదర్‌కు పలువురు ఇక్కడి నుంచి వెళ్లారు. చిత్రసీమకు తీరని లోటు తెలుగు సినీరంగానికి విశిష్ట సేవలు అందించిన అక్కినేని నాగేశ్వరరావు మరణం చిత్ర రంగానికి తీరని లోటు. అందరు అభిమానులతో పాటు నేను కూడా ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నా. నా జీవితంలో ఎన్నో సందర్భాల్లో అక్కినేని నాగేశ్వరావును కలవడం, ఆయనతో కలిపి పలు కార్యక్రమాల్లో పాల్గొనడం మరిచిపోలేని అనుభూతి. - పొన్నాల లక్ష్మయ్య, రాష్ట్ర మంత్రి ‘దేవదాసు’పై వ్యాసాన్ని మెచ్చుకున్నారు.. నేను నల్లగొండ జిల్లాలో లెక్చరర్‌గా, డ్రమెటిక్ క్లబ్ ఇన్చార్జ్గా ఉన్నప్పుడు 1966లో నిర్వహించిన నాటికల పోటీలకు అక్కినేని నాగేశ్వరరావు ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. అలా గే, 1987లో అమెరికా నుంచి వచ్చిన నా మిత్రుడు అక్కినేనిని చూడాలని అనడంతో వెళ్లి మాట్లాడాము. 2002లో నేను నంది అవార్డు కమిటీలో మెంబర్‌గా బాధ్యతలు నిర్వహించి నప్పుడు చివరి రోజున ఆయనే వచ్చి మా అందరినీ కలిసి మాట్లాడి వెళ్లారు. నేను దేవదాసు చిత్రంపై రాసిన వ్యాసాలను 2011లో నేరెళ్ల వేణుమాధవ్‌తో కలిసి వెళ్లి చూపిస్తే చాలా బాగున్నాయని మెచ్చుకున్నారు. -అంపశయ్య నవీన్, కేంద్రసాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత 1953 నుంచి స్నేహితులం.. 1953 నుంచి నాగేశ్వర్రావుతో స్నేహం ఉంది. నేనంటే విపరీతమైన అభిమానం చూపించేవారు. ఎంతో క్రమశిక్షణ కలిగిన ఆయన సహృదయులు కూడా. ముక్కుసూటి మనిషి. నిష్పక్షపాతంగా మాట్లాడేవారు. తనకు తెలియనివారు పలకరిస్తే తెలిసినట్లు నటించకుండా ఎవరు, ఏమిటని ఆరా తీసేవారు. - పద్మశ్రీ నేరెళ్ల వేణుమాధవ్ అక్కినేనితో 45 ఏళ్ల అనుబంధం.. నా అభిమాన నటుడు ఏఎన్ఆర్ మృతిని తట్టుకోలేకపోతున్నా. ఉదయం నాలుగు గంటల కే బల్దియా ఉద్యోగి వచ్చి విషయం చెప్పగానే కూలబడిపోయాను. అక్కినేనితో నాకు 45 ఏళ్ల అనుబంధం ఉంది. హైదరాబాద్‌లోని ఆయన ఇంటికి వెళ్లినప్పుడల్లా కిచెన్‌తో సహా మొత్తం తిప్పి చూపించేవారు. అలాగే, ఆయన సినిమాలు విడుదల కాగానే నా స్పందన ను లెటర్ ద్వారా తెలియజేస్తే మళ్లీ తిరుగు ఉత్తరం రాసేవారు. శ్రీవారి ముచ్చట్లు సినిమా లో సైడ్‌లాక్‌లు పెద్దగా ఉండడంతో బాగా లేదని చెప్పగా.. ఆ తర్వాత సాధారణంగా మార్చుకున్నారు. అప్పుడు ఎంతో సంతోషం కలిగింది. వరంగల్ నుంచి ఎవరైనా వెళ్లి కలిస్తే మాణిక్యం తెలుసా అని అడిగేవారు. నన్ను మా ఇంట్లో వాళ్లందరూ ఏఎన్ఆర్ అనే పిలుస్తారు. ఆయనపై మూడు సావనీర్లు తీశాను. - పోలెపాక మాణిక్యం, ఏఎన్ఆర్ అభిమాన సంఘం జిల్లా అధ్యక్షుడు వనప్రేమికుడు అక్కినేని.. డోర్నకల్, న్యూస్‌లైన్ : అక్కినేని నాగేశ్వర్రావుకు మొక్కలు, చెట్లు, పూలంటే చాలా ఇష్టమని, వన ప్రేమికుడనే మాటకు ఆయన నిజమైన ఉదాహరణ అని ఖమ్మం జిల్లా గార్ల మండలం బుద్దారం గ్రామానికి చెందిన భాగం నాగార్జునచౌదరి తెలిపారు. డోర్నకల్ పక్కనే ఉన్న బుద్దారానికి చెందిన నాగార్జున ప్రస్తుతం హైదరాబాద్‌లోని అన్నపూర్ణ స్టుడియోలో లైటింగ్ విభాగంలో మేనేజర్‌గా పనిచేస్తుండగా, ఆయన తండ్రి సూర్యనారాయణ నాగేశ్వర్రావు వద్ద గతంలో పనిచేశారు. సూర్యనారాయణ 1955లో తండ్రితో గొడవ పెట్టుకుని ఇంటి నుంచి మద్రాస్‌కు వెళ్లారు. అక్కడ అక్కినేనిని కలవగా తన ఇంట్లో పనికి పెట్టుకున్నారు. ఆ తర్వాత అక్కినేని కుటుంబం హైదరాబాద్‌కు వచ్చి అన్నపూర్ణ స్టూడియోను స్థాపించగా, అందులో గార్డెన్ సూపర్వైజర్గా పనిచేశారు. నాగేశ్వర్రావు కుమారుడు, సినీ హీరో నాగార్జును పాఠశాలకు తీసుకువెళ్లడం, మధ్యాహ్నం భోజనం తినిపించడం వంటి పనులు కూడా సూర్యనారాయణ చేసేవారు. కొంతకాలానికి అక్కడ పనిమానేసి వచ్చిన ఆయన 1994లో తన కుమారుడు నాగార్జున చౌదరిని హీరో నాగార్జున వద్ద పనికి చేర్చారు. కాగా, సూర్యనారాయణ మూడేళ్ల క్రితం అనారోగ్యంతో మృతి చెందారు. ఇదిలా ఉండగా అక్కినేని నాగేశ్వర్రావు కన్నుమూసిన నేపథ్యంలో నాగార్జున చౌదరి విలేకరులతో మాట్లాడుతూ తనతో పాటు తన తండ్రికి అక్కినేని కుటుంబంతో ఉన్న అనుబంధాన్ని వివరించారు.