చట్టాలు.. శిక్షలు | Law Rules for Elections , Warangal | Sakshi
Sakshi News home page

ఎన్నికల వేళ  అతిక్రమిస్తే శిక్షార్హులు

Published Wed, Nov 7 2018 12:22 PM | Last Updated on Wed, Nov 7 2018 12:23 PM

Law Rules for Elections , Warangal - Sakshi

సాక్షి, వరంగల్‌:ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రభుత్వాన్ని ఎన్నుకోవడానికి ఎన్నికలే ప్రధాన భూమిక. ఈ ఎన్నికల నియమావళిని రూపొందించి పకడ్బందీగా అమలు చేయడానికి ఎన్నికల కమిషన్‌ పనిచేస్తుంది. ఎన్నికల నియమావళిని ఎవరు అతిక్రమించినా చట్టం తన పని తాను చేస్తుంది. ఎన్నికల సమయంలో ప్రజాప్రాతినిథ్య చట్టంలోని నిబంధనల ప్రకారం ఎక్కువగా కేసులు నమోదు చేస్తుంటారు. ఈ చట్టంలో అనేక సెక్షన్లు ఉన్నప్పటికీ ఎక్కువగా ఎన్నికల సమయంలో కొన్నింటిని ఎక్కువగా నిబంధనలు అతిక్రమించిన పార్టీలు, వ్యక్తులపైన ప్రయోగిస్తుంటారు. ఇటీవల ఓ స్వచ్ఛంద సంస్థ వీటిని కరపత్రం రూపంలో ముద్రించగా అర్బన్‌ జిల్లా కలెక్టర్‌ ప్రశాంత్‌ జీవన్‌పాటిల్‌ దానిని విడుదల చేశారు. ఆ చట్టాలేంటో ...వాటికేసే శిక్షలేంటో...ఓసారి పరిశీలిద్దాం..    
123 - ఆర్‌పీ యాక్ట్‌
లంచగొండితనం, అనుచిత ఒత్తిడి, మతం, జాతి, కులం, సంఘం లేదా భాషా ప్రాతిపాదికపై వర్గాల పౌరుల మధ్య ద్వేషాన్ని çశత్రుత్వాన్ని పెంపొందించుట లేక ప్రయతించుట శిక్షకు అర్హులు.
125 - ఆర్‌పీ యాక్ట్‌
ఎన్నికల సందర్భంగా వివిధ వర్గాల మధ్య శత్రుత్వాన్ని పెంపొందించినట్లయితే మూడు సంవత్సరాలు జైలు శిక్ష లేదా జరిమానా లేదా రెండూ అమలు చేయొచ్చు.
125అ - ఆర్‌పీ యాక్ట్‌
తప్పుడు సమాచారం ఇచ్చినందుకు ఆరు నెలల జైలు శిక్ష లేదా జరిమానా లేదా రెండూ అమలుకు అర్హులు.
126 - ఆర్‌పీ యాక్ట్‌
ఎన్నికల సమయానికి 48 గంటల ముందు బహిరంగంగా సభలు నిర్వహించినా శిక్ష అర్హులే. అందుకు రెండు సంవత్సరాల జైలు శిక్ష లేదా జరిమానా లేదా రెండూ అమలు చేయొచ్చు.
127 - ఆర్‌పీ యాక్ట్‌
ఎన్నికల సమావేశం సందర్భంగా ఎటువంటి అల్లర్లు జరిపినా ఏ పోలీస్‌ అధికారి అయినా యూఎస్‌ 42 సీఆర్‌పీసీ ప్రకారం ఆ వ్యక్తులను అరెస్ట్‌ చేయొచ్చు. అందుకు ఆరు నెలల జైలు శిక్ష లేదా రెండు వేల జరిమానా లేదా రెండూ అమలు చేయొచ్చు.
127అ - ఆర్‌పీ యాక్ట్‌
ఎవరైనా తన పేరు, చిరునామా లేకుండా ఎన్నికల కరపత్రాలు, పోస్టర్లు ముద్రిస్తే ఆరు నెలల జైలు శిక్ష లేదా రెండు వేల రూపాయల జరిమానా లేదా రెండూ అమలు చేయొచ్చు.
128 - ఆర్‌పీ యాక్ట్‌
బహిరంగంగా ఓటేస్తే 3 నెలల జైలు లేదా జరిమానా లేదా రెండూ అమలుకు
అవకాశం.
129 - ఆర్‌పీ యాక్ట్‌
ఎన్నికలకు సంబంధించిన అధికారులు లేదా పోలీసులు పోటీచేసే అభ్యర్థికి సహకరించిన లేదా ప్రభావం కలిగించుట శిక్షా అర్హులు. అందుకు మూడు నెలల జైలు లేదా జరిమానా లేదా రెండూ అమలు చేయొచ్చు. 
130 - ఆర్‌పీ యాక్ట్‌
పోలింగ్‌ స్టేషన్‌కు 100 మీటర్ల లోపల ప్రచారం చేయకూడదు. ఒక వేళ ప్రచారం చేస్తే రూ.250 జరిమానా విధిస్తారు.
131 - ఆర్‌పీ యాక్ట్‌
పోలింగ్‌ స్టేషన్‌కు దగ్గరలో నియమాలకు వ్యతిరేకంగా ఎటువంటి ప్రచారం చేసినా ఏ పోలీస్‌ అధికారి అయినా ఆ సామగ్రిని స్వాధీనం చేసుకోవచ్చు. అందుకు మూడు నెలల జైలు లేదా జరిమానా లేదా రెండూ అమలు చేయొచ్చు.
132 - ఆర్‌పీ యాక్ట్‌
ఓటేసే సమయంలో నియమ నిబంధనలు పాటించని వారికి మూడు నెలల జైలు శిక్ష లేదా జరిమానా లేదా రెండూ అమలు చేయొచ్చు.
133 - ఆర్‌పీ యాక్ట్‌
ఎన్నికల సందర్భంగా ప్రజలకు పోలింగ్‌ బూత్‌ వద్దకు చేరవేసేందుకు అక్రమంగా వాహనాలు సమకూర్చుకొనుట లేదా అద్దెకు తీసుకొనుట శిక్షార్హులు. అందుకు మూడు నెలల జైలు శిక్షా లేదా జరిమానా లేదా రెండూ అమలు చేయొచ్చు. 
134 - ఆర్‌పీ యాక్ట్‌
ఎన్నికల సందర్భంగా అధికార దుర్వినియోగం చేస్తే శిక్షా అర్హులే. అందుకు రూ.500 వరకు జరిమానా వేయవచ్చు. 
134అ - ఆర్‌పీ యాక్ట్‌
ప్రభుత్వ ఉద్యోగి ఎన్నికల ఏజెంట్‌గా గానీ, పోలింగ్‌ ఏజెంట్‌గా గానీ లేదా ఓట్ల లెక్కింపు సందర్భంగా ఏజెంట్‌గా వ్యవహరించినా శిక్షకు అర్హులు. అందుకు మూడు నెలల జైలు శిక్ష లేదా జరిమానా లేదా రెండూ అమలు చేయొచ్చు.
134ఆ - ఆర్‌పీ యాక్ట్‌
పోలింగ్‌ స్టేషన్‌ పరిసర ప్రాంతాలకు మార ణాయుధాలు కలిగి వెల్లుట నిషేధం.అతిక్రమించి వెళితే రెండు నెలల జైలు శిక్షా లేదా జరిమానా లేదా రెండూ అమలు చేయొచ్చు. 
135 - ఆర్‌పీ యాక్ట్‌
పోలింగ్‌ స్టేషన్‌ నుంచి బ్యాలెట్‌ పత్రం (ఈవీఎం) అపహరించినా శిక్ష పడుతుంది. సంవత్సరం జైలు శిక్ష లేదా రూ.500 జరిమానా లేదా రెండూ అమలు చేయొచ్చు.
135అ - ఆర్‌పీ యాక్ట్‌
పోలింగ్‌ బూత్‌ స్వాధీన పరుచుట, ప్రభుత్వ ఉద్యోగి అయి ఉండి ఈ నేరం చేస్తే శిక్ష పడుతుంది. అందుకు సంవత్సరం తగ్గకుండా ఐదేళ్ల వరకు జైలు శిక్ష లేదా రూ.500 జరిమానా లేదా రెండూ అమలుచేయొచ్చు. 
135ఆ - ఆర్‌పీ యాక్ట్‌
ప్రభుత్వ ఉద్యోగులకు ఎన్నికల రోజు వేతనపు సెలవుగా మంజూరు చేసినా శిక్ష. అందుకు ఐదు వేల రూపాయల వరకు జరిమానా విధించవచ్చు.
135ఇ - ఆర్‌పీ యాక్ట్‌
పోలింగ్‌ రోజు, కౌంటింగ్‌ రోజు మద్యం అమ్ముట, పంచిపెట్టుట నేరం. అందుకు ఆరు నెలల జైలు శిక్ష లేదా రెండు వేల రూపాయల వరకు జరిమానా లేదా రెండూ అమలు చేయొచ్చు.
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement